ముళ్ళపూడి వెంకట రమణ
(28 జూన్ 1931 – 24 ఫిబ్రవరి 2011
సాక్షి, ముత్యాలముగ్గు, రాజాధిరాజు, అందాలరాముడు, బుద్ధిమంతుడు, గోరంత దీపం, స్నేహం, వంశవృక్షం, రాధాకళ్యాణం – ఇలా ఎన్నో బాపూ చిత్రాలకు మాటలద్దిన మాంత్రికుడు. బుడుగు, సీగాన పెసూనాంబ, అప్పుల అప్పారావు, కాంట్రాక్టరు, రాధా గోపాళం, రెండుజెళ్ళ సీత – ఇలా ఎన్నో పాత్రలకు జన్మ నిచ్చి మాటలు పోసి పెంచి సజీవులను, చిరంజీవులను చేసిన వాక్య బ్రహ్మ, ఋణానందలహరి భాష్యకారుడు, అర్ధబాపూ అయిన శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ పెన్ను మూశారు. వారికి మా శ్రద్ధాంజలి.
- ఈమాట ప్రచురణ నియమాలలో ఒక చిన్న మార్పు ప్రవేశపెడుతున్నాం.
- పలుకుబడి – తెలుగు పదాలపై సురేశ్ కొలిచాల కొత్త శీర్షిక ప్రారంభం.
- ఒక కథ చెప్పిన కథ; కనకప్రసాద్ కవిత, వ్యాసం, శబ్ద సాహిత్యం; సత్య పెట్లూరి మొదటి కథ కాలనీ భోగి; ఇంద్రాణి, దమయంతి, ఉదయకళ, రవిశంకర్, కృష్ణదేశికాచార్యుల కవితలు, వేలూరి వేంకటేశ్వరరావు, గొర్తి బ్రహ్మానందంల కథలూ, ఇతర శీర్షికలు, వ్యాసాలు – ఈ సంచికలో మీకోసం.