పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16478

  1. శ్రీ శ్రీ గురించి మూడు మాటలు… గురించి ప్రసాద్ అభిప్రాయం:

    11/21/2012 7:18 pm

    ఆ ఇద్దరూ ఒక్కరే. కవులూ, వ్యక్తులూ వేరు, వేరు కారు. ఉపాధ్యాయులూ, వ్యక్తులూ వేరు వేరు కారు. రాజకీయ నాయకులూ, వ్యక్తులూ వేరు వేరు కారు. నాస్తికులూ, వ్యక్తులూ వేరు వేరు కారు. ఇక మార్క్సిస్టు విషయం లోనూ అంతే. అన్నీ ఒకరే. ఆ ఇద్దరూ, నిజానికి, ఒక్కరే. అవసరం కోసం వేసుకునే రెండు వేర్వేరు ముసుగులు మాత్రమే.

    శ్రీశ్రీ చెప్పినట్లు (అచ్చు ఇవే మాటలు కాక పోవచ్చు), “వ్యక్తులూ, వారి జీవితాలూ వారి వారి సొంతం. పబ్లిక్‌ లోకి వస్తే, ఏమన్నా అడుగుతాం, ఏమన్నా అంటాం.”

    “నీవు నేర్పిన విద్యే నీరజాక్షీ” అనే సామెత గుర్తొస్తుంది.

    ఉపసంహారం: ఈ నెల “విపుల” మాస పత్రికలో, వేంపల్లి షరీఫ్‌ రాసిన, “గోళ్ళు” అనే కధ చదవండి, ఆసక్తి వుంటే.

    — ప్రసాద్

    [This post was edited – Eds.]

  2. తిరణాల గురించి తః తః అభిప్రాయం:

    11/21/2012 4:14 pm

    ‘కొబ్బరి నూనెల ఆడ పిల్లలు
    చుట్టూ గాలిలో గేలాలెన్నో”

    కాసేపు మీరూ ఒక కొబ్బరి నూనె ఆడ పిల్లై రాశారు ఇంద్రాణీ. చాలా అందంగా ఉంది. ఇంతకు ముందొక సారి ఈమాటలొ మీ కవిత చదివి ‘ గరిక పేని ఏనుగును కట్టేయగల కవయిత్రి ఇంద్రాణి’ అని నా అభిప్రాయం చెప్పినట్టు గుర్తు. ఇప్పుడూ అంతే.
    అభినందనలతొ
    తః తః

  3. టి. జి. కమలాదేవి గురించి తః తః అభిప్రాయం:

    11/21/2012 4:05 pm

    ‘పొన్న పూవుల మాల’ నూర్జహాన్ ని [ఆవాజ్ దే?] గుర్తుకు తెచ్చింది. చంద్రబాబు గారి గొంతు కూడా కొంచం వేరేగా ధ్వనించింది.*

    శ్రీనివాస్, మీరు ఆమెకు మంచి నివాళి రచించారు. మరో మంచి లలిత గీతం “అందమైన ఈ చంద్ర నౌకలో” ఆమె ముసునూరి వేంకట రమణ మూర్తి తొ కలిసి పాడారన్నట్టు గుర్తు. దాన్ని గూడా జత చేయడానికి వీలవుతుందా?

    నమస్కారాలతొ.
    తః తః

    * ఇలాంటప్పుడు రోహిణీ ప్రసాద్ లేని లోటు తెలుస్తోంది.

  4. రుక్మిణీ కళ్యాణం గురించి పంతుల గోపాల కృష్ణ అభిప్రాయం:

    11/21/2012 1:52 pm

    కర్ణ పేయంగా సాగే గౌతమరావు గారి పద్యపఠనం గురించి ఇంతకు ముందు విన్నాను గాని, వారి పద్య పఠనం వినే భాగ్యం ఇప్పుడు ఇక్కడే కలిగింది. ఇందుకు మీకు, శ్రీ రమణ గారికీ ధన్యవాదాలు.

  5. తెలుగు భాష వయస్సెంత? గురించి Raghavulu Regandla అభిప్రాయం:

    11/20/2012 9:48 am

    నమస్సుమాంజలి. తెలుగు వారు తెలిసికొనవలసిన యెన్నో విషయాలు తెలియజీసినందుకు కృతజ్ఞతలు. ప్రాచీన భాషగా గుర్తింపబడటానికి యెందుకు అంత అవస్థలు పడవలసి వచ్చిందో కూడా తెలియ జేయగలరని కోరుచున్నాను.

  6. శ్రీ శ్రీ గురించి మూడు మాటలు… గురించి p. nagesh అభిప్రాయం:

    11/19/2012 11:44 am

    శ్రీశ్రీని వ్యక్తిగా శ్రీశ్రీని కవిగా వేరుచేసి చూడలేని కొంతమంది రచయితలని, విమర్శకులనీ చూస్తే నాకు ‘గురువింద గింజ పగడం కథ’ గుర్తుకొచ్చి పగలబడి నవ్వాలనిపిస్తుంది. –నగేష్

  7. నువ్వూ – కాలం గురించి satish అభిప్రాయం:

    11/19/2012 7:00 am

    చాలా బాగుంది సార్ మీ కవిత. మీ కవిత చదివిన నాకే ఇంత ఉత్సాహంగా ఉంటే రాసేటపుడు మీ ఉత్సాహం కొలవటానికి కొలమానం ఉంటుందా. కవిత అంటే ఏమిటో తెలియని నా లాంటి వారిని సైతం కదిలించిన మీ కవితా శైలిని పొగడడానికి నాకు పదాలు రావటం లేదు. నా అభిమానం తెలపటానికి ఇంతకన్నా ఏమి రాయాలో ఎలా రాయాలొ అర్ధం కావటం లేదు.

  8. స్వప్నభంగం గురించి raavooji అభిప్రాయం:

    11/18/2012 10:53 am

    అంతరంగం గూర్చి బాగా చెప్పారు. అక్షయ పాత్ర అంటూ ఆఖరి అక్షరం అయిపోయిందన్నారు. అక్షయానికి అర్థం ఏమిటొ? కాగితం అనేది కలం కళ్ళలో కదలాడే గతం అంటే బాగుండేది. రచయత భావం ప్రస్ఫుటం కాలేదు!

    రావూజి, అమలాపురం.

  9. నువ్వూ – కాలం గురించి raavooji అభిప్రాయం:

    11/18/2012 10:18 am

    అరటి ఆకు నుంచి రాలిన నీటి బొట్టుల్లాంటి జన్మ తీసుకున్నామని
    మట్టి పిడత లో సాంభ్రాణి పొగ లాగా పైకి పోయేవాళ్ళమని
    కాలం కట్టే చీరలు తెలుపు నలుపు మనం పడే కష్టసుఖాలని
    సముద్రపుటొడ్డున ఇసుకరేణువు జీవితం చిన్నదని
    మంచులో తడిసిన పట్టాలు జీవిత గమనాన్ని
    ఆకులురాలిన చెట్టుకొమ్మ వృద్దాప్యాన్ని

    చాలా హృద్యంగా చెప్పారు మూలా వారు ధన్యవాదములు.

    రావూజీ, అమలాపురం

  10. టి. జి. కమలాదేవి గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    11/15/2012 2:32 am

    “కలగన్నానే తీయని కలగన్నానే” అన్న మరొక పాట జోడింపబడింది.