‘చందమామ’ పత్రికను అధికరించిన శ్రీ రోహిణీప్రసాద్ గారి స్మరణీయమైన జ్ఞాపకమంజరిని ఈరోజే చూశాను. సుగృహీతనామధేయుని తనయులైనందున ఎవరికీ తెలియరాని ఎన్నో విషయాలను మనస్సుకు హత్తుకొనేట్లు నెమరువేసుకొన్నారు. అయితే, పత్రికకు అద్భుతమైన ఆ పేరును పెట్టిన మహనీయుని పేరును కూడా స్మరించి ఉంటే బాగుండేదని అనిపించింది. ఆ విషయమైన ఆసక్తి కలవారు ‘మాలిక పత్రిక’లో వచ్చిన ఈ వ్యాసంలోని ‘వర్ణాదేశం’ అన్న నాలుగవ అంశాన్ని చూడవలసినదిగా విన్నపం:
ఇక, వ్యాసం మూడవ పేరాలో ప్రస్తావింపబడిన సర్ ఆర్థర్ కోనన్ డాయిల్ రచించిన రెండు షెర్లాక్ హోమ్స్ అపరాధ పరిశోధన నవలానువాదాల ప్రస్తావన ఉన్నది. ఆ రెండింటిలోనూ గ్రంథకర్తల పేరు లేని మాట నిజమే. అవి 1953-‘54 () ప్రాంతాల ‘ఆంధ్రజ్యోతి’లో మొదట ధారావాహికంగా ప్రకటితమైన తర్వాత గ్రంథరూపాన్ని తాల్చాయి. వాటిలో ‘నేరపరిశోధన’ మొదటి సంపుటం 1955 ఫిబ్రవరిలో చందమామ పబ్లికేషన్స్ పుస్తక శాఖ పక్షాన బి.ఎన్.కె ప్రెస్సులో అచ్చయింది. మొత్తం 14 కథల సంక్షిప్తానువాదం. ఆ సంపుటం శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి రచన అని, రచనాశైలి శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి కృతిత్వానికే సన్నిహితం అని ఇప్పటి నా అవగాహన. ‘నేరపరిశోధన’ రెండవ సంపుటం రచన శ్రీ కొడవటిగంటి వారిదేమో నాకు తెలియదు. అయితే, ఆ సమాచారాన్ని సాధికారంగా చెప్పగల శ్రీయుతులు కొడవటిగంటి కుటుంబరావు గారు, దాసరి సుబ్రహ్మణ్యం గారు, చక్రపాణి గారు, బి.యన్.రెడ్డి గారు, బలుసుపాలెం సుందర రామారావు గారు, ధనికొండ హనుమంతరావు గారు, మా నాన్నగారు, పుస్తకాన్ని అచ్చువేసిన కె.జి.కృష్ణమూర్తి గారు, తత్కర్తృత్వచర్చను సాకల్యంగా కొనసాగించేందుకు శ్రీ రోహిణీప్రసాద్ గారలలో ఎవరూ ఇప్పుడు లేరు. నాకు తెలిసినది నా చిన్ననాడు 1970 దరిదాపుల వీరిలో పెక్కుమందితో ప్రసంగించినప్పటి విశేషాంశం మాత్రమే. బహుశః శ్రీ బి. వేణుగోపాలరెడ్డి గారు, శ్రీ బి. విశ్వనాథరెడ్డి గారు, శ్రీ రామవరపు గణేశ్వరరావు గారలలో ఎవరైనా జ్ఞాపకం చేసికొని ఉంటే తెలిసినవారు నిర్ధారింపగలుగుతారేమో.
1970, 80 దశకాలలో చంందమామ పత్రికను క్రమం తప్పకుండా చదివిన అశేష బాల పాఠకులలో నేను కూడా ఒకడిని. అందులో చదివిన కొన్ని అద్భుతమైన కథలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. చందమామ ఇప్పటికీ నేను చదువుతాను. వసుంధరగారు రాసిన అంత తేలికగా మారడు అనే కథ అద్భుతంగా ఉంటుంది. మాచిరాజు కామేశ్వర రావుగారు రాసిన కథలలో గొప్ప జీవిత సత్యాలు ఉంటాయి.కానీ ఇప్పుడా పత్రికను చదువుతుంటే కొందరు రచయితలకు చైల్డ్ సైకాలజీ అంతగా అర్థం కాలేదేమోనని అనిపిస్తుంది. ఉదాహరణకు అప్పట్లో నేను ఎంతగానో ఇష్టడిన సీరియల్ రాతిరధం కొద్ది రోజుల క్రితం ఇంటర్నెట్ లో చదివాను. అందులో కథానాయకులు ఖడ్గవర్మ, జీవదత్తులు దాదాపు ప్రతి సంచికలోనూ క్రూరమృగాలను చంపుతుంటారు. సేవ్ ద టైగర్ లాంటి నినాదాలను పిల్లలకు పరిచయం చెయ్యవలసిన బాధ్యత చందమామ మరిచిపోయిందా? ఇంకా అనేక కథలలో దెయ్యలూ, భూతాల గురించి ప్రస్తావన ఉంటుంది. పిల్లలలో అటువంటి మూఢ నమ్మకాలు కలిగించడం ధర్మమా? కథలలో, సీరియల్స్ లో క్షత్రియుడు బ్రాహ్మణుడు అంటూ కుల ప్రస్తావనలకు అంతు లేదు. ఇక తప్పుడు నీతులు బోధించే కథలకు కొదవలేదు. మాయదారి ముసలిది అనే ఒక సీరియల్లో దొంగలకు ఖలీఫా గారు పిలిచి ఉద్యోగాలు ఇస్తారు. గజపాదలింగేశ్వర అనే కథలో ఉద్యోగి లంచాలు తీసుకుంటుంటే రాజు మందలించవలిసింది పోయి అతని తెలివికి మెచ్చి పెద్ద పదవి ఇస్తాడు. దాసరి సుబ్రహ్మణ్యం గారు రాసిన సీరియల్స్ లో ఎప్పుడూ కథానాయకుడు నాయిక అందాన్ని చూసి ప్రేమిస్తాడు, మనసుని చూసి కాదు. ఒక కథ (పేరు మరిచాను) అయితే మరీ దారుణం. అందులో కలికాలం ప్రభావం మూలాన ఒక బ్రాహ్మణుడు నిజం చెప్పడం మూలాన తన కొడుకుని కోల్పోతాడు. తిరిగి అబద్దం చెప్పడం మూలాన తన కొడుకుని తిరిగి పొందుతాడు. ఈ కథ నా కుటుంబ సభ్యులలో ఒకరిపై ఎటువంటి ప్రభావం చూపిందో చెప్పడం కష్టం. మనం కలికాలంలో ఉన్నాం కాబట్టి ఎప్పటికీ నిజం చెప్పకూడదు అని చాల సంవత్సారాల పాటు నా సోదరి నమ్మడానికి ఆ కథ దోహద పడింది.
షేక్స్పియర్ ‘All the world’s a stage’ ని, ‘జీవితమే ఒక నాటక రంగం’గా, కీట్స్ ‘A thing of beauty is a joy for ever’ని ‘అందమె ఆనందం’గా ‘బ్రతుకు తెరువు’కి ఒకే పాటలో తెలుగు చేసినది తండ్రి గారా? తనయుడా?
“What does that mean? A misleading sentence right in the beginning of the essay. Neither Gurajada nor Sri Sri wrote poetry to show case matra chandassu.”
గురజాడవారు వాడుక భాషలో మాత్రాఛందస్సును ఉపయోగించి వ్రాయుమని చెప్పగా, తాను వ్రాసినానని శ్రీశ్రీ చెప్పాడు. అంటే అట్టి మాత్రాఛందస్సుకు అగ్రస్థానము నిచ్చాడనియే కదా దాని అర్థము? అంతకుముందు శ్రీశ్రీ వృత్తములలో, జాత్యుపజాతులలో తన కవిత్వమును వ్రాసియుండెను, అట్టి కవితలకు ఉదాహరణమును ఇక్కడ ( http://eemaata.com/em/issues/201001/1530.html?allinonepage=1 ) చదువ వీలగును. ఇట్టి ఛందస్సును త్యజించి, మాత్రాఛందస్సును మాత్రమే తఱువాత వాడియున్నాడంటే దానికి ఒక ఉన్నత స్థానము ఇచ్చాడనియే అని నేను అర్థము చేసికొన్నాను. ఇతరులు వేఱు విధముగా అర్థము చేసికొని ఉంటే దానిని విశదీకరించడము వారి కర్తవ్యము అవుతుంది.
ఇకపోతే లైలాగారు రెండవ అంశములో
“2. Now clarification about my previous words … Asshole … Dumbshit …”
చెప్పినవి digression కాక మఱేమిటో?
పాటలను పాడుకొనేటప్పుడు దాని నడక, లయ – వీటికి తగ్గట్లు పదములు అమరినప్పుడు మాత్రమే శ్రోతలకు గొప్ప అనుభూతి లభిస్తుంది. పదములను గాయకురాలికి తోచినట్లు ఎక్కడిక్కడ నఱికి పాడితే అనుభూతి కలగడము కాదు అసహ్యము కలుగుతుంది. అలా నఱికి పాడిన పాటలు బాగుండవని ఎన్నో మారులు ఎందఱో చేసిన విమర్శలను నేను చదివియున్నాను.
భారాతాది గ్రంథములలో ఉండే అర్థవంతమైన పద్యాలను చదివి ఆనందించ వచ్చును. అదొక అనుభూతి. కాని అన్నిటినీ పాడుకోలేము, ముఖ్యముగా తాళబద్ధముగా పాడుకోలేము. ఈ ఆనందార్ణవ ఛందస్సు తాళబద్ధమైనది. ఆఱు, ఎనిమిది మాత్రలకు విఱుగుతుంది. శ్రీశ్రీ అలా ఎందుకు వ్రాసినాడంటే, అప్పుడే గేయపు నడక, లయ వాటిలో ప్రతిబింబిత మవుతాయి. శ్రీశ్రీ పాదాంత విరామమును కూడ పాటించాడు. ఇవన్నీ ఆ మహాకవి ఎందుకు చేసినాడంటే, వాటిని జనులు పాడుకొని ఒక క్రొత్త ఉద్రేకాన్ని పొందాలని.
ఉత్తర భారత భాషలలో, సంస్కృతములో, తమిళ, మలయాళములలో ఎక్కువగా పాదాంతయతిని వాడుతారు. అలా చేసినందువలన వాటికి గానయోగ్యత లభిస్తుంది. తెలుగు కన్నడ భాషలలో (ముఖ్యముగా తెలుగులో) సాహిత్యము రెండు భిన్న రీతులలో రూపొందినాయి. కావ్యములు పఠనీయములు మాత్రమే. అది సంగీతముతో ఎక్కువ సంబంధము లేకుండా రూపొందినది. వాగ్గేయకారులు రచించిన గీతులకు మాత్రమే గేయత్వము లభించినది. కవులు ఎక్కువగా ఈ వాగ్గేయకారులను, యక్షగాన కర్తలను సరకుగొనలేదు. ఇప్పుడు ఛందోబద్ధమైన కవిత్వము నిరాదరణకు పాలవడానికి ఇది ఒక ముఖ్య కారణము అని నాకు అనిపిస్తుంది.
అందుకే నేను గానయోగ్యతకు అనువైన వృత్తములను అభ్యసించడములో కృషి చేస్తున్నాను. అంతే కాదు, మనమెఱిగిన మాలికా విక్రీడితములను కూడా తాళబద్ధమును చేయ వచ్చునని నిరూపించినాను.
ఇతరులు దీనిని అంగీకరిస్తారో, అనుమోదిస్తారో, కనీసము బాగుందని ఒక మాటైనా అంటారో లేదో అన్నది వారికే నేను వదలివేస్తాను. కాని నాకు మనఃతృప్తి లభించినది దీనివలన. అది చాలు నాకు. ఎందుకంటే నేను “ఈమాట”లో వ్రాసిన 50 పైన వ్యాసములను ఇతరులు మెచ్చుకోలేదని అనుకొని ఉంటే అర్జునునిలా అస్త్ర సన్యాసము చేయడానికి ఉద్యమించి ఉండేవాడిని.
లైలాగారికి, తహతహగారికి, వేలూరిగారికి, అశ్మాచంగారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు!
“జానక్యాః కమలాంలాంజలిపుటే” శ్లోకానికి మీరు ఉదాహరించిన శ్రీమాన్ సముద్రాల రామానుజాచార్యుల వారి అనురణనం భవ్యంగా ఉన్నది. ఈ విధంగా కర్ణామృతములైన సంప్రదాయశ్లోకాలను తెలుగుచేసి సందర్భోచితంగా చలనచిత్రాలలో ప్రవేశపెట్టటం వారికొక వైనోదికక్రీడ. ఇది శ్రీకృష్ణాంజనేయయుద్ధం లోనిది:
మురళీధరరావుగారు: చేకూరి సిద్ధకవి అనువాదం గురించి నాకింతకుముందు తెలియదు. పూర్తి పద్యం అందించినందుకు నా ధన్యవాదాలు.
సినిమాపాట అయినందువల్ల పెళ్ళి శుభలేఖల్లో అచ్చు వేయడానికి సందేహిస్తారేమో కాని నాకు సముద్రాల జూనియర్ గారి “అనువాదం/అనుసరణ” అంటే చాలా ఇష్టం :).
జానకి దోసిట కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపురాశై
ఆణిముత్యములు తలంబ్రాలుగా ఇరువురు మెరిసిన సీతారాముల కల్యాణము …
On a related note, there is a good translation (into English) of this popular Sanskrit chATu verse by Velcheru Narayanarao and David Shulman in: A Poem at the Right Moment – Remembered Verses from Premodern South India, Univ. of California Press, Berkeley, 1998.
“చందమామ” జ్ఞాపకాలు గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
11/30/2015 2:58 pm

సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి Bhavabhuti. K అభిప్రాయం:
11/30/2015 1:42 pm
మోహనగారూ,
వ్యాసం చాలా బాగుంది. మీ వ్యాసాల్ని ఆసక్తితో చదువేవాళ్ళలో నేనూ ఒకడిని. మీరు తరచుగా ఇలాంటి పరిశీలనాత్మక పరిశోధనలు చేస్తే బాగుంటుంది.
శ్రీశ్రీ ఛందోబందోబస్తుల్ని తెంపేస్తున్నానంటూ చాలా ఛందస్సునే తనకి తెలియకుండానే వాడాడన్నది వెల్లడి అవుతోంది మీ పరిశోధన వల్ల.
సహజంగా గొప్పకవి, పదవిరించీ అవడం వల్ల అతనికి కలిగే మహోద్రేకంలో చేసి ఉండవచ్చు.
అయితే ఇది శ్రీశ్రీకి కొత్త కాదు. చెయ్యనన్నది చెయ్యడం, తెగిడినవాటిని మళ్ళీ తన అవసరం కోసం వాడు కోవడం అతనికి అలవాటే.
ఉదాహరణకి..
కలకత్తా కాళిక నాలుక, పరమేష్టి జూకాలూ, జగన్నాథరథచక్రాలూ పట్టుకుని పదచిత్రాలు గీయడం లాంటివి….
‘శ్రీ అనగా లక్ష్మి’ అని మనకి తన కలం పేరులో గల పెన్నిధిని కూడా వివరించాడు..
రాయనన్నవాడు ‘అధివాస్తవికుల ప్రవేశం’ అంటూ వృత్తాల్లో గిరికీలు కొట్టాడు..
‘కెమెరా కన్ను’ అంటూ చిత్రకవిత్వం చూపించాడు..
ఆఖరికి తీర్థయాత్రల డబ్బింగు సినిమాలకి మాటపాటలు కూడా రాసాడు.
గమనికః శ్రీశ్రీ వీరాభిమానులు నాపై ధ్వజం ఎత్తకండి. నేను కూడా బహ్వభిమానినే…అపార్ధం చేసుకోకండి నా మాటలు
“చందమామ” జ్ఞాపకాలు గురించి Vasudeva Rao అభిప్రాయం:
11/30/2015 12:00 pm
1970, 80 దశకాలలో చంందమామ పత్రికను క్రమం తప్పకుండా చదివిన అశేష బాల పాఠకులలో నేను కూడా ఒకడిని. అందులో చదివిన కొన్ని అద్భుతమైన కథలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. చందమామ ఇప్పటికీ నేను చదువుతాను. వసుంధరగారు రాసిన అంత తేలికగా మారడు అనే కథ అద్భుతంగా ఉంటుంది. మాచిరాజు కామేశ్వర రావుగారు రాసిన కథలలో గొప్ప జీవిత సత్యాలు ఉంటాయి.కానీ ఇప్పుడా పత్రికను చదువుతుంటే కొందరు రచయితలకు చైల్డ్ సైకాలజీ అంతగా అర్థం కాలేదేమోనని అనిపిస్తుంది. ఉదాహరణకు అప్పట్లో నేను ఎంతగానో ఇష్టడిన సీరియల్ రాతిరధం కొద్ది రోజుల క్రితం ఇంటర్నెట్ లో చదివాను. అందులో కథానాయకులు ఖడ్గవర్మ, జీవదత్తులు దాదాపు ప్రతి సంచికలోనూ క్రూరమృగాలను చంపుతుంటారు. సేవ్ ద టైగర్ లాంటి నినాదాలను పిల్లలకు పరిచయం చెయ్యవలసిన బాధ్యత చందమామ మరిచిపోయిందా? ఇంకా అనేక కథలలో దెయ్యలూ, భూతాల గురించి ప్రస్తావన ఉంటుంది. పిల్లలలో అటువంటి మూఢ నమ్మకాలు కలిగించడం ధర్మమా? కథలలో, సీరియల్స్ లో క్షత్రియుడు బ్రాహ్మణుడు అంటూ కుల ప్రస్తావనలకు అంతు లేదు. ఇక తప్పుడు నీతులు బోధించే కథలకు కొదవలేదు. మాయదారి ముసలిది అనే ఒక సీరియల్లో దొంగలకు ఖలీఫా గారు పిలిచి ఉద్యోగాలు ఇస్తారు. గజపాదలింగేశ్వర అనే కథలో ఉద్యోగి లంచాలు తీసుకుంటుంటే రాజు మందలించవలిసింది పోయి అతని తెలివికి మెచ్చి పెద్ద పదవి ఇస్తాడు. దాసరి సుబ్రహ్మణ్యం గారు రాసిన సీరియల్స్ లో ఎప్పుడూ కథానాయకుడు నాయిక అందాన్ని చూసి ప్రేమిస్తాడు, మనసుని చూసి కాదు. ఒక కథ (పేరు మరిచాను) అయితే మరీ దారుణం. అందులో కలికాలం ప్రభావం మూలాన ఒక బ్రాహ్మణుడు నిజం చెప్పడం మూలాన తన కొడుకుని కోల్పోతాడు. తిరిగి అబద్దం చెప్పడం మూలాన తన కొడుకుని తిరిగి పొందుతాడు. ఈ కథ నా కుటుంబ సభ్యులలో ఒకరిపై ఎటువంటి ప్రభావం చూపిందో చెప్పడం కష్టం. మనం కలికాలంలో ఉన్నాం కాబట్టి ఎప్పటికీ నిజం చెప్పకూడదు అని చాల సంవత్సారాల పాటు నా సోదరి నమ్మడానికి ఆ కథ దోహద పడింది.
నాకు నచ్చిన పద్యం: అశోకవనంలో సీత వర్ణన గురించి తః తః అభిప్రాయం:
11/30/2015 8:02 am
నమస్కారాలు శ్రీనివాస్:
షేక్స్పియర్ ‘All the world’s a stage’ ని, ‘జీవితమే ఒక నాటక రంగం’గా, కీట్స్ ‘A thing of beauty is a joy for ever’ని ‘అందమె ఆనందం’గా ‘బ్రతుకు తెరువు’కి ఒకే పాటలో తెలుగు చేసినది తండ్రి గారా? తనయుడా?
తః తః
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి తః తః అభిప్రాయం:
11/30/2015 4:53 am
ఆలోచించాల్సిన విషయం, ఎందుకంటే
1. మనసులోనిమ(మా)…..ర్మములు తెలుసుకో (త్యాగరాజు, పల్లవి)
2. కాలా .. తీత విఖ్యాత (త్యాగరాజు, సామజవరగమన, పల్లవి)
3. భవచంద్ర కళాధర (త్యాగరాజు, దేవాదిదేవ సదాశివ, చరణం)*
(*సాహిత్యాన్ని గౌరవించే బాలమురళికి కూడా ‘ భవచంద్ర కళాధర ‘ అని పాడక తప్పలెదు.)
అని ఎంతొమంది పాడటం వింటూ వుంటాం. అదనంగా,
4. నీకిర …ణములే (ఏమిటోయీ మాయా, మిస్సమ్మ, పింగళి, రాజేశ్వర రావు)
తః తః
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి మోహన అభిప్రాయం:
11/29/2015 6:02 pm
“What does that mean? A misleading sentence right in the beginning of the essay. Neither Gurajada nor Sri Sri wrote poetry to show case matra chandassu.”
గురజాడవారు వాడుక భాషలో మాత్రాఛందస్సును ఉపయోగించి వ్రాయుమని చెప్పగా, తాను వ్రాసినానని శ్రీశ్రీ చెప్పాడు. అంటే అట్టి మాత్రాఛందస్సుకు అగ్రస్థానము నిచ్చాడనియే కదా దాని అర్థము? అంతకుముందు శ్రీశ్రీ వృత్తములలో, జాత్యుపజాతులలో తన కవిత్వమును వ్రాసియుండెను, అట్టి కవితలకు ఉదాహరణమును ఇక్కడ ( http://eemaata.com/em/issues/201001/1530.html?allinonepage=1 ) చదువ వీలగును. ఇట్టి ఛందస్సును త్యజించి, మాత్రాఛందస్సును మాత్రమే తఱువాత వాడియున్నాడంటే దానికి ఒక ఉన్నత స్థానము ఇచ్చాడనియే అని నేను అర్థము చేసికొన్నాను. ఇతరులు వేఱు విధముగా అర్థము చేసికొని ఉంటే దానిని విశదీకరించడము వారి కర్తవ్యము అవుతుంది.
ఇకపోతే లైలాగారు రెండవ అంశములో
“2. Now clarification about my previous words … Asshole … Dumbshit …”
చెప్పినవి digression కాక మఱేమిటో?
పాటలను పాడుకొనేటప్పుడు దాని నడక, లయ – వీటికి తగ్గట్లు పదములు అమరినప్పుడు మాత్రమే శ్రోతలకు గొప్ప అనుభూతి లభిస్తుంది. పదములను గాయకురాలికి తోచినట్లు ఎక్కడిక్కడ నఱికి పాడితే అనుభూతి కలగడము కాదు అసహ్యము కలుగుతుంది. అలా నఱికి పాడిన పాటలు బాగుండవని ఎన్నో మారులు ఎందఱో చేసిన విమర్శలను నేను చదివియున్నాను.
భారాతాది గ్రంథములలో ఉండే అర్థవంతమైన పద్యాలను చదివి ఆనందించ వచ్చును. అదొక అనుభూతి. కాని అన్నిటినీ పాడుకోలేము, ముఖ్యముగా తాళబద్ధముగా పాడుకోలేము. ఈ ఆనందార్ణవ ఛందస్సు తాళబద్ధమైనది. ఆఱు, ఎనిమిది మాత్రలకు విఱుగుతుంది. శ్రీశ్రీ అలా ఎందుకు వ్రాసినాడంటే, అప్పుడే గేయపు నడక, లయ వాటిలో ప్రతిబింబిత మవుతాయి. శ్రీశ్రీ పాదాంత విరామమును కూడ పాటించాడు. ఇవన్నీ ఆ మహాకవి ఎందుకు చేసినాడంటే, వాటిని జనులు పాడుకొని ఒక క్రొత్త ఉద్రేకాన్ని పొందాలని.
ఉత్తర భారత భాషలలో, సంస్కృతములో, తమిళ, మలయాళములలో ఎక్కువగా పాదాంతయతిని వాడుతారు. అలా చేసినందువలన వాటికి గానయోగ్యత లభిస్తుంది. తెలుగు కన్నడ భాషలలో (ముఖ్యముగా తెలుగులో) సాహిత్యము రెండు భిన్న రీతులలో రూపొందినాయి. కావ్యములు పఠనీయములు మాత్రమే. అది సంగీతముతో ఎక్కువ సంబంధము లేకుండా రూపొందినది. వాగ్గేయకారులు రచించిన గీతులకు మాత్రమే గేయత్వము లభించినది. కవులు ఎక్కువగా ఈ వాగ్గేయకారులను, యక్షగాన కర్తలను సరకుగొనలేదు. ఇప్పుడు ఛందోబద్ధమైన కవిత్వము నిరాదరణకు పాలవడానికి ఇది ఒక ముఖ్య కారణము అని నాకు అనిపిస్తుంది.
అందుకే నేను గానయోగ్యతకు అనువైన వృత్తములను అభ్యసించడములో కృషి చేస్తున్నాను. అంతే కాదు, మనమెఱిగిన మాలికా విక్రీడితములను కూడా తాళబద్ధమును చేయ వచ్చునని నిరూపించినాను.
ఇతరులు దీనిని అంగీకరిస్తారో, అనుమోదిస్తారో, కనీసము బాగుందని ఒక మాటైనా అంటారో లేదో అన్నది వారికే నేను వదలివేస్తాను. కాని నాకు మనఃతృప్తి లభించినది దీనివలన. అది చాలు నాకు. ఎందుకంటే నేను “ఈమాట”లో వ్రాసిన 50 పైన వ్యాసములను ఇతరులు మెచ్చుకోలేదని అనుకొని ఉంటే అర్జునునిలా అస్త్ర సన్యాసము చేయడానికి ఉద్యమించి ఉండేవాడిని.
లైలాగారికి, తహతహగారికి, వేలూరిగారికి, అశ్మాచంగారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు!
విధేయుడు – మోహన
నాకు నచ్చిన పద్యం: అశోకవనంలో సీత వర్ణన గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
11/28/2015 9:50 am
శ్రీ శ్రీనివాస్ గారికి నమస్కారములతో,
“జానక్యాః కమలాంలాంజలిపుటే” శ్లోకానికి మీరు ఉదాహరించిన శ్రీమాన్ సముద్రాల రామానుజాచార్యుల వారి అనురణనం భవ్యంగా ఉన్నది. ఈ విధంగా కర్ణామృతములైన సంప్రదాయశ్లోకాలను తెలుగుచేసి సందర్భోచితంగా చలనచిత్రాలలో ప్రవేశపెట్టటం వారికొక వైనోదికక్రీడ. ఇది శ్రీకృష్ణాంజనేయయుద్ధం లోనిది:
రామో నామ బభూవ హుం తదబలా సీతేతి హుం తౌ పితు
ర్వాచా పఞ్చవటీ వనే విహరత స్తా మాహర ద్రావణః
నిద్రార్థం జననీకథా మితి హరే ర్హుం కాతర శ్శృణ్వత
స్సౌమిత్రే క్వ ధనుర్ధనుర్ధను రితి వ్యగ్రా గిరః పాన్తు వః.
“ఇనకులవంశుఁడౌ దశరథేశుని పుత్త్రులు రామలక్ష్మణుల్;
జనకజ రామపత్ని; పితురాజ్ఞ (? పిత యాజ్ఞ) శిరంబునఁ దాల్చి మువ్వురున్
వనముల కేఁగ, జానకిని వైరముతోఁ గొనిపోయె రావణుం”
డనుచును నీవు చెప్ప – వినినంతనె యాగ్రహమంది, “లక్ష్మణా!
ధను విటుఁ దె” మ్మనంటిఁ గద, దాఁగునె పూర్వభవానుబంధముల్.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
బాలానందం గురించి Vasu అభిప్రాయం:
11/28/2015 12:58 am
Srinivas,
The two surnames seem related but distinct. In this case I am right because Radio Annayya was my grand father’s brother. Same surname as me.
I remember your Telusa posts on this subject in those days spelled it right.
Vasu (Nyayapathi Srinivasa Rao).
దేశభక్తి గేయాలు గురించి రామకృష్ణమూర్తి. అభిప్రాయం:
11/27/2015 7:01 am
ఈ దేశభక్తి గేయాలు ఎందుకో ప్లే కావటం లేదు.దయచేసి వీటిని వినే అవకాశం కల్పించండి.
[మాకు ఈ ఆడియోలు పనిచేస్తున్నాయండీ. – సం.]
నాకు నచ్చిన పద్యం: అశోకవనంలో సీత వర్ణన గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:
11/26/2015 4:16 pm