మీ కామెంటును చూచి, ప్రథమారంభంగా నన్నాకర్షించిన మీ ప్రశ్నలు బట్టి, గట్టిగను పట్టుబట్టి వెతుకు బొత్తాము నొక్కి వెతికితిని. అప్పుడు పంచరత్న లంకెల దర్శనప్రాప్తి జరిగినది. అద్దానియందు ముత్యాల సరములు అని వున్నదాని మీద నొక్కి చదివినాను.
అదియంతయు చదివిన తరువాత ముత్తెములు సరాలలో కాకుండగా నరాలలో బంధించిన యెడల యమధర్మరాజుకు కాసింత విశ్రాంతి కలిపించినవారమగుదుమని ఒకనాడు ఒకానొక మిత్రుడు నాతో మొఱపెట్టుకొన్న వైనము ఙప్తికి వచ్చినది.
అయిననూ పొత్తము పూర్తిగా చదివితిని కావున ఆ సరములయందు నను పూర్తిగా కమ్మిన వాక్యములు ఇవియని చెప్పుటలో ఇసుమంత సందేహము లేదు.
అంతు పట్టని ఊహలన్నీ,
అంధకారం లాగ కమ్మీ….
అనిన వాక్యములు కవితావిదారక స్థానములో జగణము భగణము మీద కాక మగణము మీద యమోపచారము పొందినట్లు అనిపించినది. ఇది కూడా ఒక భావనే కావున, కవులైన వారు అర్థము చేసుకొనెదరని భావించుచుంటిని.
ఏతావాతా చెప్పునది ఏమనగా – ఆ సరములు చదివిన పిమ్మట అద్దానియందున్న మాత్రాఛందస్సు పరిస్థితి ఏమిటో తెలియనైతే లేదు కానీ, మాత్రా బిళ్ళగోలీలు వేసుకొనే పరిస్థితి దాపురించేట్లుగా కనపడటముతో
అంతు పట్టని రాతలన్నీ
అంధకారం లాగ కమ్మీ…
అని ఒక రెండు వాక్యములు నాకు నేనుగా రాసుకొని సమాధానపఱచుకొంటిని.
ఇక గురజాడ గుఱించి మీరు అంత ప్రియముగా గోముగా అడిగిననూ నేను మాటాడదలచుకోలేదు. ఆయన వలన కాదుకానీ, ఆయన రచనల వలన మన సాహిత్యము, వల్లకాడు దిశగా సాగిపోయినదని నా నిశ్చితాభిప్రాయము. దానికి కారణములు ఇక్కడ వివరించపూనుకునే ఓపిక లేదు. కాకున్న గురజాడ సంగీతమునకు, స్వరములకు సంబంధించిన మీ ప్రశ్నలు చాలా ఉత్సాహపూరితముగా వున్నవి. ఇతర చదువరులెవరన్నా విశదీకరించ పూనుకుంటే అవి చదవవలెనని పూనకముగా వున్నది.
ఆ సమయము కొఱకు ఎదురు చూచుచు
అశ్మాచం
PS: – మీ పి.ఎస్ నందు శ్రీశ్రీ గుఱించిన మీ అభిప్రాయముతో నాకు భేదవిభేదమున్నది కానీ, మిఱుమిట్లు కొలిపినది మీకే కావున ఆయ్యదాంధకార పరిస్థితి మీ వరకే నిలిచి యుండును. అద్దానివలన ఇతరులకు ఇబ్బంది లేదు, వుండకూడదు అని ఆశ. అయిననూ పైన డైగ్రెషనుకు సంబంధించిన మీ ప్రశ్నావివరణకు, స్విన్బర్నుకు సంబంధించి ప్రశ్నకు రచయిత నుండి ఏమి సమాధానము వచ్చునోనని ఆసక్తోత్సాహముగానున్నది.
ఆణిముత్యమనుకొన్న వీరి ప్రాత రచనా స్వరూపము, విశ్వరూపమూ నగ్నదిగంబరముగా నిలబడి కించిత్ ఆశ్చర్యము కలిగించినది.
ఈ వ్యాసము గర్హించదగినదని చెప్పివేత వలన దీనికి మరింత ప్రచారపు తిలకము అద్దినట్లగును. రచయిత ఇట్లు రాయుట ఆనాటి వయ: ప్రభావము కాబోలును. రోతలందు పరమరోతలు వేరయానని ఉక్తితో ముగింపు పలుకుచున్నాడ.
In the comments essayist says: “ఇకపోతే లైలాగారు రెండవ అంశములో “2. Now clarification about my previous words … Asshole … Dumbshit …”చెప్పినవి digression కాక మఱేమిటో?”
పక్కనే ఇంకో అభిప్రాయ వేదికలో, అశోక వనంలో సీత గురించిన పద్యం శీర్షికలో, విశ్వనాథ పద్యం గురించి వీరు ఏం చర్చ చెయ్యలేదు. పద్యం పైన వ్యాఖ్యను గురించి నోరు మెదప లేదు. కాని ఎవరో పెళ్లి శుభలేఖలో తెలుగులో పద్యం కావాలంటే, – మీ పెళ్లి గురించి ఈ శీర్షికలో ఇక్కడ ఈ డైగ్రెషన్ ఎందుకు? అని అనలేదేం? పైగా, సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు భాషలలో తనకు నచ్చిన పద్యం అంటూ రాసారు. తెలుగు పద్యం కావాలని ఆయనెవరో అడిగితే, ఇంగ్లీషులో అనువాదం కూడా ఎందుకు రాసినట్టు?
వీరి రచన గురించిన అభిప్రాయ వేదికలో మాత్రం, శ్రీ శ్రీ పద్యాలు, తన పద్యాలు గురించే మాట్లాడాలి, ఇంకెవరూ ఇప్పటి వాడుక ఇంగ్లిష్ భాషలో లిరిక్ రాయకూడదేం. రాస్తే అది digression. ఈ మాట మేగజీన్ లో అన్ని అభిప్రాయాలూ అందరికీ కనిపిస్తూనే ఉంటాయి. నిజంగా వేరు వేరు గదుల్లో, గోడలు అడ్డు ఉంటే, ఒకచోట డైగ్రెషన్ అంటూ, అవతలకు వెళ్లి వారు అదే పని చేస్తున్నట్టు అందరికీ తెలియదు కదా.
In the essay Essayist says: “మహాప్రస్థానంలో ఈ ఛందస్సులో ఐదు గేయములు ఉన్నాయి, అవి – అద్వైతం (అ), ఋక్కులు (ఋ), దేశచరిత్ర (దే), నవకవిత (న), పేదలు (పే). ఈ ఛందస్సు ప్రత్యేకత ఏమనగా – ఇందులో ప్రతి పాదములో 14 మాత్రలు ఉంటాయి. అవి 6, 8 మాత్రలుగా విఱుగుతాయి. రెండవ భాగములోని ఎనిమిది మాత్రలు సామాన్యముగా రెండు చతుర్మాత్రలుగా ఉంటాయి…”
భారతం, భాగవతం, ప్రబంధాల లోని పద్యాలు చదువుతున్నప్పుడు ఇది చంపకమాల, ఉత్పలమాల, సీసం, అని కవి చెపుతాడు. ఆ పద్య లక్షణాలు వారికి తెలుసు. మహీధర నళినీ మోహన్ –మాత్రా ఛందస్సులో మేఘసందేశం – అన్న తెలుగు పుస్తకంలో -మాత్రా ఛందస్సులో ఆయన ఎంచుకున్న గణములు, పాదములో గణముల సంఖ్య, పద్యం లోని పాదాల సంఖ్య ముందుగానే చెప్పారు. ఆ యా రచనలలో వారి కూర్పుల గురించి ఆ రచయితలు స్వయంగా సమాచారమిచ్చారు.
ఈ వ్యాసం లో మాత్రం, — ‘అద్వైతం’ అన్న గేయంలో శ్రీశ్రీ 6,4,4 ఛందస్సు వాడినాడనినది -వ్యాసకర్త అభిప్రాయం. నిర్ణయం. శ్రీ శ్రీ చెప్పలేదు. ‘అద్వైతం’ గేయం చివరి దాకా పఠించగలిగితే – అక్కడ ఏ. సి. స్విన్బర్న్ కవికి, ప్రత్యేకంగా A match అనే గీతంలో చూపిన మార్గానికి కృతజ్ఞతతో, 1936(?) – అని మహాప్రస్థానం పుస్తకంలో ముద్రించబడి ఉన్నది. ఏమి మార్గము శ్రీ శ్రీ కవికి -స్విన్బర్న్ నుండి లభించింది అన్న ప్రసక్తే తేలేదే ఈ వ్యాసకర్త? విచిత్రం. కవి చెప్పినది వ్యాసకర్త ఉపేక్ష చెయ్యటం. ఎందువల్ల? వ్యాసకర్త స్విన్బర్గ్ A match చదివారా? అతని ఇతర కవిత్వం చదివారా? శ్రీ శ్రీ కవితలోని వాక్యము -6,4,4 గానే ఎందుకు తను విభజించారో, అలా తీర్మానించుకోటానికి బేసిస్ ఏమిటో, ఈ వ్యాస రచయిత చెప్పాలి. అదంతే, అక్కడ అదే ఛందస్సు ఉంది అనేస్తే చాలదు.
మేగజీన్ చదువరులకు నా ప్రశ్నలు:
1. గురజాడ ‘ముత్యాల సరాలు’ అతని కవితా సంకలనము పేరా? లేక అతడు వాడిన మాత్రా ఛందస్సు పేరా? గురజాడకు సంగీతములో ప్రవేశముందా? అతని కవితలకు అతడు స్వరములు కూర్చాడా?
2. ఈ పత్రికలో ‘ముత్యాల సరాలు’ అన్న మకుటంతో ఒక కవిత ఉంది. అది కవి ఏ ఛందస్సులో వ్రాసారు? దాని పేరేమిటి?
Lyla
P.S: ఓరి నాయనో! మహా ఐతే పట్టుమని పది సొంత కవితలు లేని ఈ శ్రీశ్రీ మహాకవి ఎట్లా ఐనాడా? అని ఆశ్చర్యపోయే నాకు, అతనిని మాత్రాఛందస్సు మధ్వాచార్యుడిగా, రూపొందిస్తున్న వ్యాసం మహామిరుమిట్లు కొలుపుచున్నది.
పాఠకులను గొఱ్ఱుచెక్కకు పిచ్చికమొల తీఱున కట్టివేయునంతటి పన్నున్న (pun ఉన్న అని అర్థము) ఈ వ్యాసేంద్రము చదివిన పిదప మాంఛి దోశట్టు తిన్నతీరున, నాక్కుయందు నెగడులు చెలఱేగి ఈ మాత్రావిబద్ధ ఛందస్సుననుసరిస్తూ రాసిన ఒక అయాచితాపరిపక్వ రచన మీకు తెలియని అయాచితరచయితగా ఈ పత్రికా పరిష్కర్తృకసంపాదకునకు, రచయితకు పంపుదల జరిగినది. రచయితలలో ఆణిముత్యము వంటి వీరు ఇటువంటి వ్యాసములు మఱిన్ని రాయవలెనని, మాకున్న ఈ అల్పానల్ప కోర్కెతీర్పనగునని అభ్యర్థిస్తూ
…ర్మాకృతి కూర్చున్న విధమంతయు రామ ప్రతిజ్ఞ మూర్తియై ” ఈ పంక్తిని సీతమ్మ “కూరుచున్న విధమంతయు” చూస్తూంటే ఆమె చుట్టూ ముద్రా రాక్షసం గూడా ఉన్నదా అనిపిస్తోంది.
శంకర్ గారు, నిజమే, మీరన్నట్టు, మేనమామ లతో మనకుండే అనుబంధం గొప్పది. చనువు, ప్రేమలతో బాటు స్నేహం, గౌరవం కూడా వుంటుంది. శేషు మావయ్య మీదా మీ విశ్లేషణ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
శుభాకాంక్షలతో..
* సునీత గారు,
‘అచ్చంగా దమయంతి గారి కథ ‘ అంటూ ఎంత గొప్ప ప్రశంసని అందించారు! ఆనందంతో సముద్రమైపోయాను సుమా!
అనేకానేక ధన్యవాదాలు మీకు.
శూభాభినందనలతో..
‘ఈమాట’ సంచికలలోని శ్రీ బృందావనరావు గారి అమోఘములైన పద్యవ్యాఖ్యలన్నీ ఆంధ్ర సాహిత్యకలశరత్నాకరంలోని అనర్ఘములైన ఆణిముత్యాలను పరిచయం చేస్తూ – ఈ రసవారిధియొక్క మేరలేని లోతుపఱపులకు; వారి సహృదయతకు, అద్భుతావహమైన అభిరుచికి అక్షరసాక్ష్యాలుగా అలరారుతున్నాయి. వాటిని పదే పదే చదువుకొనటం ఒక మధురమైన అనుభూతి. ఆ పథానుగాములై హృద్యపద్యవ్యాఖ్యానసంప్రదాయాన్ని శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు గారు సమర్థంగా కొనసాగిస్తుండటం ఎంతో ముదావహమైన విషయం.
శ్రీ విశ్వనాథ వారి విరహిణీ సీతా వర్ణనను కావ్యార్థసూచనకు నిమిత్తంగాను, కావ్యప్రతీతమైన రసధ్వనికి అభివ్యక్తిగాను నిరూపించటం రమణీయంగా ఉన్నది. చాలమంది పాఠకులకు తెలిసినదే అయినా, కొందరికైనా తెలిసి ఉండకపోవచ్చునని ఈ చిన్ని సంగతిని ప్రస్తావిస్తున్నాను:
ఇది కల్పవృక్షానికి బీజావాపన పద్యం. శ్రీ విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షం ఈ పద్యంతోనే ప్రారంభమయిందని, ఇది వారి మనోమయకోశంలో అవతరించిన తర్వాత దీనికి పూర్వోత్తరసంహితగా వెలసిన పద్యావళితో సన్నివేశం పూర్తయి, రచనను నలుగురికీ వినిపించి ఆనందాన్ని పంచిన చాలా రోజులకు ఆత్మనిత్యత్వప్రతిపాదనపూర్వకంగా బాలకాండకు వచ్చారని పెద్దలంటారు. తమ సకలోహవైభవసనాథమై వెలసిన మహారచనకు ప్రాతిపదికంగా ఇది శ్రీ విశ్వనాథ వారికి అత్యంతప్రీతిపాత్రమైన పద్యమని పెద్దలంటారు.
రసజ్ఞులైన శ్రీ బృందావనరావు గారి పరిచయభాగ్యం నాకు సంఘటిల్లలేదు. వారి ఆయురారోగ్యక్షేమస్థేమాదులతో గ్రంథకరణాధికరణవిశేషాలను సంక్షిప్తంగానైనా తెలియజేయవలసినదిగా సంపాదకులకు మనవి.
ముందుగా … నవంబరు 26వ తేదీన రాసిన అభిప్రాయంలో రెండు తప్పులు దొర్లాయి. 1. “… తలంబ్రాలుగా శిరమున మెరిసిన” అని ఉండాలి. 2. “సీతారామ కల్యాణం” లోని ఆ పాట సముద్రాల జూనియర్ రచన అన్నాను. కానీ సినిమా పాటల పుస్తకంలో సముద్రాల రాఘవాచార్యుల (సీనియర్) రచన అని ఉంది. [కొన్ని చోట్ల “సముద్రాల” రచనగాను, ఒక సందర్భంలో సముద్రాల జూనియర్ రచనగాను చెప్పబడింది.]
విశ్వనాథ రాసిన సొగసయిన పద్యాన్ని, బృందావనరావుగారి మంచి వర్ణనని వదిలేసి సినిమా కబుర్లు చెప్పడం భావ్యం కాదు కనుక “జానక్యాః కమలాంలాంజలిపుటే” శ్లోకానికి మరొక తెలుగు సినిమా 🙂 అనుసరణను ప్రస్తావించి ఈ చర్చనుండి తప్పుకుంటాను. ఆరుద్ర “సంపూర్ణరామాయణం”లో (1972) “ఎర్రని దోసిట తెల్లని ముత్యాలు…” అని ఒక పొడుగాటి పాట రాసారు.
ఆయనే రెండేళ్ల తరవాత వచ్చిన “సీతాకల్యాణం”లో
“తెల్లని ముత్యములెర్రగ మారి
ఎర్రనివేమో నీలములవుతూ …” అని కూడా రాసారు.
భవదీయుడు,
శ్రీనివాస్
తా.క. “అందమె ఆనందం’గా ‘బ్రతుకు తెరువు’కి ఒకే పాటలో తెలుగు చేసినది తండ్రి గారా? తనయుడా?” అన్న ప్రశ్నకి నా వద్ద కచ్చితయిన సమాధానం లేదు. పాటల పుస్తకం, రికార్డులు, కొన్ని ఇంటర్యూలు .. వీటి ప్రకారమయితే అది తనయుడి పాట. అసలు తండ్రీ కాదు, తనయుడూ కాదు, రాసింది మరొక పెద్ద మనిషి అనే వాదం కూడా ఉంది.
వాక్కును విఱవని వారు వాగ్గేయకారులెట్లగుదురని సమాధానపు ప్రశ్న. తెలిసినవానికి చెప్పవచ్చును. తెలియనివానికి చెప్పవచ్చును. తెలిసీ తెలియనివానికీ చెప్పవచ్చును. పై మూడిటికీ చెందనివానికి మటుకు చెప్పలేమని శాస్త్రము.
శాస్త్రప్రసక్తి వచ్చినది కావున, శాస్త్రప్రకారము వాగ్బాట పట్టువిడుపు మార్గములో, ఆయా గీతులకు సంగతులు వెయ్యవలెననగా విపఱీ(రీ)తముగా విఱువవలెను. ఆ విఱుపు సంగతి తెలిసిన వాగ్గేయకారులు సాహిత్యమున సనిదపలు వేసినప్పుడు వచ్చు సంగతులకు తగునట్లుగా తమ శక్తి కొలదీ విఱచిపెట్టగా, పాడువారైన పాడు వారు కోతిపిల్లవాండ్లవలె మఱిన్ని ముక్కలు చేశినారు. ఆయా విఱుపులు సర్వత్ర గోవిందనామ స్మరణవలె సంపూర్తిగా సమ్మతమే!
అది నచ్చనివానికి అఘోరేభ్య దర్శన ప్రాప్తి. నచ్చినవానికి శివసాయుజ్యము. ఇందులో ఆలోచించవలసిన పని లేదు. పని లేనందువలన పాట లేదు. రెండూ లేనందువలన హస్తవాసినందు సమయము పాఱుతూ మెటికలు విఱుపు, మాట విఱుపులు వచ్చును.
దాని బదులుమాఱుగా ఆయా గీతులు వినకపోవుటే మంచిది. వినినచో విఱుపులను కూడికబట్టి సహజాతిగా ఆనందింపవలెను. ఆనందపుపాలు హ్రస్వాకారములో తక్కువ అయినదని ఊర్ధ్వముఖముగా మొఱపెట్టరాదు. ఆనందములో ఎక్కువపాలు భాగస్వామిగానున్నప్పుడు ఆ పాలు తాగి పఱుండవలెను. అంతకు మించిన స్వర్గము లేదు.
అయిననూ ఎవరి స్వర్గము వారిది. ఎవరిది వారిదైనా, త్రిశంకుస్వర్గమునకు స్వర్గముకానర్హత లేదనునది సత్యము. ఈ కామెంటునకు ఏ స్వర్గప్రాప్తి వున్నదో ఏమో! నేను మటుకు మా మృత్తికం గాడిని అడిగి ఆ పాలు వానియందు పోసి సేవించి సుఖముగా పఱుండెదను. మీ ఆనందము మీరు చూచుకొనుడు.
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి అశ్మాచం అభిప్రాయం:
12/03/2015 6:34 pm
లైలా గారు

స్వర్గంలో స్ట్రిప్ టీజ్ గురించి అశ్మాచం అభిప్రాయం:
12/03/2015 12:53 pm
కటిచేలంబు బిగించి కలకట్టియ జక్కం గయి బంధించి దో
స్తట సంస్ఫాలన మాచరించి చరణద్వంద్వంబుఁ గీలించి త
ద్దిసమొలాగ్రము మీఁదనుండి యుఱికెన్ ముసద్దిసింహంబు ది
క్తటముల్ మ్రోయ హ్రదంబులో గుభగుభ ధ్వానం బనూనంబుగన్
ఆణిముత్యమనుకొన్న వీరి ప్రాత రచనా స్వరూపము, విశ్వరూపమూ నగ్నదిగంబరముగా నిలబడి కించిత్ ఆశ్చర్యము కలిగించినది.
ఈ వ్యాసము గర్హించదగినదని చెప్పివేత వలన దీనికి మరింత ప్రచారపు తిలకము అద్దినట్లగును. రచయిత ఇట్లు రాయుట ఆనాటి వయ: ప్రభావము కాబోలును. రోతలందు పరమరోతలు వేరయానని ఉక్తితో ముగింపు పలుకుచున్నాడ.
అశ్మాచం
అద్వైత దర్పణం గురించి Baskar K అభిప్రాయం:
12/02/2015 9:19 pm
భావరాజు గారూ!
ఈ కవితలో అద్వైతం అన్న పదం కేవలం నైఘంటుకార్ధంలోనే వాడబడింది.
ఆధ్యాత్మికత, అధిభౌతికతలాంటివి లేవిక్కడ.
భాస్కర్
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి lyla yerneni అభిప్రాయం:
12/02/2015 6:11 pm
In the comments essayist says: “ఇకపోతే లైలాగారు రెండవ అంశములో “2. Now clarification about my previous words … Asshole … Dumbshit …”చెప్పినవి digression కాక మఱేమిటో?”
పక్కనే ఇంకో అభిప్రాయ వేదికలో, అశోక వనంలో సీత గురించిన పద్యం శీర్షికలో, విశ్వనాథ పద్యం గురించి వీరు ఏం చర్చ చెయ్యలేదు. పద్యం పైన వ్యాఖ్యను గురించి నోరు మెదప లేదు. కాని ఎవరో పెళ్లి శుభలేఖలో తెలుగులో పద్యం కావాలంటే, – మీ పెళ్లి గురించి ఈ శీర్షికలో ఇక్కడ ఈ డైగ్రెషన్ ఎందుకు? అని అనలేదేం? పైగా, సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు భాషలలో తనకు నచ్చిన పద్యం అంటూ రాసారు. తెలుగు పద్యం కావాలని ఆయనెవరో అడిగితే, ఇంగ్లీషులో అనువాదం కూడా ఎందుకు రాసినట్టు?
వీరి రచన గురించిన అభిప్రాయ వేదికలో మాత్రం, శ్రీ శ్రీ పద్యాలు, తన పద్యాలు గురించే మాట్లాడాలి, ఇంకెవరూ ఇప్పటి వాడుక ఇంగ్లిష్ భాషలో లిరిక్ రాయకూడదేం. రాస్తే అది digression. ఈ మాట మేగజీన్ లో అన్ని అభిప్రాయాలూ అందరికీ కనిపిస్తూనే ఉంటాయి. నిజంగా వేరు వేరు గదుల్లో, గోడలు అడ్డు ఉంటే, ఒకచోట డైగ్రెషన్ అంటూ, అవతలకు వెళ్లి వారు అదే పని చేస్తున్నట్టు అందరికీ తెలియదు కదా.
In the essay Essayist says: “మహాప్రస్థానంలో ఈ ఛందస్సులో ఐదు గేయములు ఉన్నాయి, అవి – అద్వైతం (అ), ఋక్కులు (ఋ), దేశచరిత్ర (దే), నవకవిత (న), పేదలు (పే). ఈ ఛందస్సు ప్రత్యేకత ఏమనగా – ఇందులో ప్రతి పాదములో 14 మాత్రలు ఉంటాయి. అవి 6, 8 మాత్రలుగా విఱుగుతాయి. రెండవ భాగములోని ఎనిమిది మాత్రలు సామాన్యముగా రెండు చతుర్మాత్రలుగా ఉంటాయి…”
భారతం, భాగవతం, ప్రబంధాల లోని పద్యాలు చదువుతున్నప్పుడు ఇది చంపకమాల, ఉత్పలమాల, సీసం, అని కవి చెపుతాడు. ఆ పద్య లక్షణాలు వారికి తెలుసు. మహీధర నళినీ మోహన్ –మాత్రా ఛందస్సులో మేఘసందేశం – అన్న తెలుగు పుస్తకంలో -మాత్రా ఛందస్సులో ఆయన ఎంచుకున్న గణములు, పాదములో గణముల సంఖ్య, పద్యం లోని పాదాల సంఖ్య ముందుగానే చెప్పారు. ఆ యా రచనలలో వారి కూర్పుల గురించి ఆ రచయితలు స్వయంగా సమాచారమిచ్చారు.
ఈ వ్యాసం లో మాత్రం, — ‘అద్వైతం’ అన్న గేయంలో శ్రీశ్రీ 6,4,4 ఛందస్సు వాడినాడనినది -వ్యాసకర్త అభిప్రాయం. నిర్ణయం. శ్రీ శ్రీ చెప్పలేదు. ‘అద్వైతం’ గేయం చివరి దాకా పఠించగలిగితే – అక్కడ ఏ. సి. స్విన్బర్న్ కవికి, ప్రత్యేకంగా A match అనే గీతంలో చూపిన మార్గానికి కృతజ్ఞతతో, 1936(?) – అని మహాప్రస్థానం పుస్తకంలో ముద్రించబడి ఉన్నది. ఏమి మార్గము శ్రీ శ్రీ కవికి -స్విన్బర్న్ నుండి లభించింది అన్న ప్రసక్తే తేలేదే ఈ వ్యాసకర్త? విచిత్రం. కవి చెప్పినది వ్యాసకర్త ఉపేక్ష చెయ్యటం. ఎందువల్ల? వ్యాసకర్త స్విన్బర్గ్ A match చదివారా? అతని ఇతర కవిత్వం చదివారా? శ్రీ శ్రీ కవితలోని వాక్యము -6,4,4 గానే ఎందుకు తను విభజించారో, అలా తీర్మానించుకోటానికి బేసిస్ ఏమిటో, ఈ వ్యాస రచయిత చెప్పాలి. అదంతే, అక్కడ అదే ఛందస్సు ఉంది అనేస్తే చాలదు.
మేగజీన్ చదువరులకు నా ప్రశ్నలు:
1. గురజాడ ‘ముత్యాల సరాలు’ అతని కవితా సంకలనము పేరా? లేక అతడు వాడిన మాత్రా ఛందస్సు పేరా? గురజాడకు సంగీతములో ప్రవేశముందా? అతని కవితలకు అతడు స్వరములు కూర్చాడా?
2. ఈ పత్రికలో ‘ముత్యాల సరాలు’ అన్న మకుటంతో ఒక కవిత ఉంది. అది కవి ఏ ఛందస్సులో వ్రాసారు? దాని పేరేమిటి?
Lyla
P.S: ఓరి నాయనో! మహా ఐతే పట్టుమని పది సొంత కవితలు లేని ఈ శ్రీశ్రీ మహాకవి ఎట్లా ఐనాడా? అని ఆశ్చర్యపోయే నాకు, అతనిని మాత్రాఛందస్సు మధ్వాచార్యుడిగా, రూపొందిస్తున్న వ్యాసం మహామిరుమిట్లు కొలుపుచున్నది.
ప్రచురణకి వచ్చే రచనల గురించి గురించి అశ్మాచం అభిప్రాయం:
12/02/2015 1:49 pm
పాఠకులను గొఱ్ఱుచెక్కకు పిచ్చికమొల తీఱున కట్టివేయునంతటి పన్నున్న (pun ఉన్న అని అర్థము) ఈ వ్యాసేంద్రము చదివిన పిదప మాంఛి దోశట్టు తిన్నతీరున, నాక్కుయందు నెగడులు చెలఱేగి ఈ మాత్రావిబద్ధ ఛందస్సుననుసరిస్తూ రాసిన ఒక అయాచితాపరిపక్వ రచన మీకు తెలియని అయాచితరచయితగా ఈ పత్రికా పరిష్కర్తృకసంపాదకునకు, రచయితకు పంపుదల జరిగినది. రచయితలలో ఆణిముత్యము వంటి వీరు ఇటువంటి వ్యాసములు మఱిన్ని రాయవలెనని, మాకున్న ఈ అల్పానల్ప కోర్కెతీర్పనగునని అభ్యర్థిస్తూ
ఉలిపాయలు మిఱపలు రస
తోషణము లనేక జన్మదురితౌఘ విని
శ్శోషణములు మూలజపు
టొయ్యారములు అపూపగమను చవిభాషణముల్
అశ్మాచం
నాకు నచ్చిన పద్యం: అశోకవనంలో సీత వర్ణన గురించి తః తః అభిప్రాయం:
12/01/2015 11:24 pm
…ర్మాకృతి కూర్చున్న విధమంతయు రామ ప్రతిజ్ఞ మూర్తియై ” ఈ పంక్తిని సీతమ్మ “కూరుచున్న విధమంతయు” చూస్తూంటే ఆమె చుట్టూ ముద్రా రాక్షసం గూడా ఉన్నదా అనిపిస్తోంది.
తః తః
శేషు మావయ్య గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
12/01/2015 1:52 pm
శంకర్ గారు, నిజమే, మీరన్నట్టు, మేనమామ లతో మనకుండే అనుబంధం గొప్పది. చనువు, ప్రేమలతో బాటు స్నేహం, గౌరవం కూడా వుంటుంది. శేషు మావయ్య మీదా మీ విశ్లేషణ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
శుభాకాంక్షలతో..
* సునీత గారు,
‘అచ్చంగా దమయంతి గారి కథ ‘ అంటూ ఎంత గొప్ప ప్రశంసని అందించారు! ఆనందంతో సముద్రమైపోయాను సుమా!
అనేకానేక ధన్యవాదాలు మీకు.
శూభాభినందనలతో..
నాకు నచ్చిన పద్యం: అశోకవనంలో సీత వర్ణన గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
11/30/2015 10:08 pm
‘ఈమాట’ సంచికలలోని శ్రీ బృందావనరావు గారి అమోఘములైన పద్యవ్యాఖ్యలన్నీ ఆంధ్ర సాహిత్యకలశరత్నాకరంలోని అనర్ఘములైన ఆణిముత్యాలను పరిచయం చేస్తూ – ఈ రసవారిధియొక్క మేరలేని లోతుపఱపులకు; వారి సహృదయతకు, అద్భుతావహమైన అభిరుచికి అక్షరసాక్ష్యాలుగా అలరారుతున్నాయి. వాటిని పదే పదే చదువుకొనటం ఒక మధురమైన అనుభూతి. ఆ పథానుగాములై హృద్యపద్యవ్యాఖ్యానసంప్రదాయాన్ని శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు గారు సమర్థంగా కొనసాగిస్తుండటం ఎంతో ముదావహమైన విషయం.
శ్రీ విశ్వనాథ వారి విరహిణీ సీతా వర్ణనను కావ్యార్థసూచనకు నిమిత్తంగాను, కావ్యప్రతీతమైన రసధ్వనికి అభివ్యక్తిగాను నిరూపించటం రమణీయంగా ఉన్నది. చాలమంది పాఠకులకు తెలిసినదే అయినా, కొందరికైనా తెలిసి ఉండకపోవచ్చునని ఈ చిన్ని సంగతిని ప్రస్తావిస్తున్నాను:
ఇది కల్పవృక్షానికి బీజావాపన పద్యం. శ్రీ విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షం ఈ పద్యంతోనే ప్రారంభమయిందని, ఇది వారి మనోమయకోశంలో అవతరించిన తర్వాత దీనికి పూర్వోత్తరసంహితగా వెలసిన పద్యావళితో సన్నివేశం పూర్తయి, రచనను నలుగురికీ వినిపించి ఆనందాన్ని పంచిన చాలా రోజులకు ఆత్మనిత్యత్వప్రతిపాదనపూర్వకంగా బాలకాండకు వచ్చారని పెద్దలంటారు. తమ సకలోహవైభవసనాథమై వెలసిన మహారచనకు ప్రాతిపదికంగా ఇది శ్రీ విశ్వనాథ వారికి అత్యంతప్రీతిపాత్రమైన పద్యమని పెద్దలంటారు.
రసజ్ఞులైన శ్రీ బృందావనరావు గారి పరిచయభాగ్యం నాకు సంఘటిల్లలేదు. వారి ఆయురారోగ్యక్షేమస్థేమాదులతో గ్రంథకరణాధికరణవిశేషాలను సంక్షిప్తంగానైనా తెలియజేయవలసినదిగా సంపాదకులకు మనవి.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
నాకు నచ్చిన పద్యం: అశోకవనంలో సీత వర్ణన గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:
11/30/2015 6:50 pm
ముందుగా … నవంబరు 26వ తేదీన రాసిన అభిప్రాయంలో రెండు తప్పులు దొర్లాయి. 1. “… తలంబ్రాలుగా శిరమున మెరిసిన” అని ఉండాలి. 2. “సీతారామ కల్యాణం” లోని ఆ పాట సముద్రాల జూనియర్ రచన అన్నాను. కానీ సినిమా పాటల పుస్తకంలో సముద్రాల రాఘవాచార్యుల (సీనియర్) రచన అని ఉంది. [కొన్ని చోట్ల “సముద్రాల” రచనగాను, ఒక సందర్భంలో సముద్రాల జూనియర్ రచనగాను చెప్పబడింది.]
విశ్వనాథ రాసిన సొగసయిన పద్యాన్ని, బృందావనరావుగారి మంచి వర్ణనని వదిలేసి సినిమా కబుర్లు చెప్పడం భావ్యం కాదు కనుక “జానక్యాః కమలాంలాంజలిపుటే” శ్లోకానికి మరొక తెలుగు సినిమా 🙂 అనుసరణను ప్రస్తావించి ఈ చర్చనుండి తప్పుకుంటాను. ఆరుద్ర “సంపూర్ణరామాయణం”లో (1972) “ఎర్రని దోసిట తెల్లని ముత్యాలు…” అని ఒక పొడుగాటి పాట రాసారు.
ఆయనే రెండేళ్ల తరవాత వచ్చిన “సీతాకల్యాణం”లో
“తెల్లని ముత్యములెర్రగ మారి
ఎర్రనివేమో నీలములవుతూ …” అని కూడా రాసారు.
భవదీయుడు,
శ్రీనివాస్
తా.క. “అందమె ఆనందం’గా ‘బ్రతుకు తెరువు’కి ఒకే పాటలో తెలుగు చేసినది తండ్రి గారా? తనయుడా?” అన్న ప్రశ్నకి నా వద్ద కచ్చితయిన సమాధానం లేదు. పాటల పుస్తకం, రికార్డులు, కొన్ని ఇంటర్యూలు .. వీటి ప్రకారమయితే అది తనయుడి పాట. అసలు తండ్రీ కాదు, తనయుడూ కాదు, రాసింది మరొక పెద్ద మనిషి అనే వాదం కూడా ఉంది.
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి అశ్మాచం అభిప్రాయం:
11/30/2015 5:09 pm