ఈమాటలో తెలుగు పేరుతో సంస్కృతం దంచేసే మహానుభావులెందరో ఉన్నారు అన్నది జగద్విదితం. వారెవరిచేతైనా వ్యంగ్యం — గూఢంగా ఉండే వ్యంగ్యం, అగూఢంగా ఉండే వ్యంగ్యం — వీటిగురించి ఒక చిన్న వ్యాసం రాయించండి మహప్రభో!
ముమ్మటుడిదో, కుంతకుడిదో — ఏదో ఒక లక్షణగ్రంథం నుంచి ఒక పాఠం రాయిద్దురూ! అర్థం పర్థం లేని కామెంట్లు రాసే వాళ్ళకీ,– కేవలం మెంటల్ రాతలు రాసేవాళ్ళకీ — ఇద్దరికీ పనికొస్తుంది!
లేకపోతే, మీరు కథలకీ, వ్యాసాలకీ బ్లర్బులు రాస్తారుగదా! అప్పుడు, ఇల్లాంటి, “వ్యాస – కథలకీ” లేదా “కథా – వ్యాసాలకీ” బ్లర్బ్బులో, “ఇది వ్యంగ్యము. అపార్థము చేసికొనకుడు,” అని భక్తులకు, — ముఖ్యంగా మూఢభక్తులకు, బోధపడేలా చెప్పేద్దురూ!
ఒక చిత్రకారుడెవరో తను గీసిన బొమ్మక్రింద “కుక్క బొమ్మ,” అని రాసాడట! బొమ్మని చూసి శ్రోత్రియపరులు చిరుతపులి అని భయపడతారేమోనని భయపడి!
రామయ్య గారు, నేను రాసినదీ, మీ కామెంటూ మళ్ళీ ఓ సారి చూసుకుంటే తెల్సింది. మీరు చెప్పినది పూర్తిగా సరికాదు. ప్రస్తుత పరిస్థితులు, ఇలాగే కొనసాగుతాయి రెండు తెలుగు రాష్ట్రాలలో అని భావించుకుంటే – అబ్బే తెలుగు మాట్లాడేది తెలంగాణా ఒక్కటే, ఆంధ్రాలో మాట్లాడేది తెలుక్కాదు అంటే సరే ఒక రాష్ట్రం అందాం – రాబోయ్యే రోజుల్లో పోతన ఆంధ్ర మహాభాగవతం కనుమరుగవుతుందనుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం ఉన్నట్టు తోచదు.
మహాకవి, పెజా కవి శ్రీశ్రీ ఎక్కడా? పోతనలాంటి పనికిమాలిన సీసపద్యాలు రాసేవాడెక్కడా? కధ నిజమో కాదో తెలియదు కానీ పోతన భాగవతాన్ని తనకి అంకితం ఇమ్మని ఆ రోజుల్లోనే – ఇప్పట్లాగానే – ఓ రాజ రాజ నరేంద్రుడు పోతనని ఏడిపించుకు తిని ఆ పనికిమాలిన పద్యాలన్నీ భూస్థాపితం చేసాడుట. బుధ్ధిలేని కొంతమంది వాటిని తవ్వితీసిమనమీదకి వదిలారు. ఆ పద్యాలు ఎంతచదివినా మహాకవి రాసే కవితల మూలంగా వచ్చే “అత్యద్భుత సామాజిక స్పృహ” రాదనేది జగమెరిగిన సత్యం. నా తప్పు ఒప్పుకుంటున్నాను. ఆ మధ్య చదివిన మహా కవి కవిత ఇచ్చాను ఇక్కడ. పోతన భాగవతం అయుదు సంపుటాలలో ఎంత వెదికినా ఇటువంటి అణి ముత్యం ఒక్కటీ నాకు కనపళ్ళేదు.
మా ఆఫీసులో పనిచేసే ఒకాయన “సర్వీస్ డాగ్” అనే దాన్ని తీసుకొస్తాడు. అది ఈ అయిదోపాదానికి పూర్తిగా వ్యతిరేకం మరి. అయినా చెప్పాను కదండి, నాకేం తెలుసు వంకాయ పులుసు అనీ?
మీ భవిష్యత్ దృష్టినీ పెజాకవినీ ఆక్షేపించినందు క్షంతవ్యుడను. మీ వ్యాక్యం ఏమీ అనుకోరని సరి చేస్తున్నాను.
“పోతన శ్రీమదాంధ్ర మహాభగవతం పద్యాలు ఎలాగైనా సర్వనాశనం అయితీరుతాయి రాబోయ్యే రొజుల్లో కానీ ప్రజా/మహా కవి కవితలు మాత్రం తెలుగు వాడు జీవించి ఉన్నంతవరకూ (అంటే దిబ్బ/మినప రోట్టి మన తెలుగు వాళ్ళు మర్చిపోయే వరకూ) మనగలుగుతాయి”
నా తప్పు ఒప్పుకుని ఇంక అంతర్జాలం బేండ్ విడ్త్ (అంటే ఏమిటో నాకూ తెలియదు కానీ అందరూ వాడుతున్నారు ఆ మాట, నేనెందుకు వాడకూడదూ అని) చేయనని మీకు నా హామీ. శెలవు.
ఘంటసాల గారితో వేరెవరినీ పోల్చలేము. ఇంకో.. ఇరవై సంవత్సరాల తర్వాత బాలు గారికి అభిమానులు ఉంటారో.. ఉండరో కానీ, ఇంకా వంద సంవత్సరాల తర్వాత కూడా.. ఘంటసాల గారికి భక్తులుంటారు.
అజంతా గారి స్వప్నలిపి కవితల పుస్తకం పునుర్ముద్రణ విషయమై నేను త్రిపుర గారి ఆప్త మిత్రులు సాహితీ బందుగు, హైదరాబాదు వాస్తవ్యులు, శ్రీ రామడుగు రాధాకృష్ణ మూర్తి గారికి విన్నవించాను. అలాగే అజంతా గారి మిత్రులు విశాలాంధ్ర పబ్లికేషన్స్ ( ప్రస్థుతం అది నవచైతన్య అని తెలంగాణా రాష్ట్రానికి సంబందించిన మరో ముక్కగా విడివడింది కాబోలు ) శ్రీ ఏటుకూరి ప్రసాదు గారికీ విన్నవించాను. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం అందుకున్న ”స్వప్నలిపి” పుస్తకం దశాబ్దాల అనంతరం తిరిగి పునర్ముద్రణ పొంది నలుగురికీ అందుబాటులోకి వచ్చేలా మీరే చూడగలరు అని వారిని అభ్యర్ధించాను. తమ కమిటీ మెంబరర్లతో యీ విషయం చర్చిస్తానని ఏటుకూరి ప్రసాదు గారు హామీ ఇచ్చారు. (ఇది నేం డ్రాపింగ్, ప్లేయింగ్ టు ద గ్యాలరి ల కింద వచ్చే విషయంలా ఉన్నా మీకు నివేదించాలనే నా ఉబలాటాన్ని ఆపుకోలేకున్నాను). వీలుంటే మీరూ ఓ సమిధ వేస్తారని ఆశపెట్టుకుంటున్నాను.
కళాపూర్ణోదయం ఎన్నాళ్ళకు చదువగలిగాను. ఎప్పుడో చిన్నప్పుడు కొద్ది కొద్దిగా చదివినట్టు గుర్తు. ఎందులో చదివానో కూడా గుర్తు లేదు. బహుశా కాశీమజిలీ కథల్లో చదివానేమో అనిపిస్తుంది.
ఈమాట.కొమ్ కు చాలా చాలా థాంక్స్.
ఇలాగే యెన్నో మంచి పుస్తకాలు మాకు అందుబాటులోకి తీసుకొస్తారని ఆశిస్తున్నా.
సంపాదకుని తిరస్కరణ లేఖ గురించి కటకటా! అభిప్రాయం:
01/18/2016 5:31 pm
అయ్యా సంపాదకుడు గారూ:
ఈమాటలో తెలుగు పేరుతో సంస్కృతం దంచేసే మహానుభావులెందరో ఉన్నారు అన్నది జగద్విదితం. వారెవరిచేతైనా వ్యంగ్యం — గూఢంగా ఉండే వ్యంగ్యం, అగూఢంగా ఉండే వ్యంగ్యం — వీటిగురించి ఒక చిన్న వ్యాసం రాయించండి మహప్రభో!
ముమ్మటుడిదో, కుంతకుడిదో — ఏదో ఒక లక్షణగ్రంథం నుంచి ఒక పాఠం రాయిద్దురూ! అర్థం పర్థం లేని కామెంట్లు రాసే వాళ్ళకీ,– కేవలం మెంటల్ రాతలు రాసేవాళ్ళకీ — ఇద్దరికీ పనికొస్తుంది!
లేకపోతే, మీరు కథలకీ, వ్యాసాలకీ బ్లర్బులు రాస్తారుగదా! అప్పుడు, ఇల్లాంటి, “వ్యాస – కథలకీ” లేదా “కథా – వ్యాసాలకీ” బ్లర్బ్బులో, “ఇది వ్యంగ్యము. అపార్థము చేసికొనకుడు,” అని భక్తులకు, — ముఖ్యంగా మూఢభక్తులకు, బోధపడేలా చెప్పేద్దురూ!
ఒక చిత్రకారుడెవరో తను గీసిన బొమ్మక్రింద “కుక్క బొమ్మ,” అని రాసాడట! బొమ్మని చూసి శ్రోత్రియపరులు చిరుతపులి అని భయపడతారేమోనని భయపడి!
విధేయుడు,
కటకటా!
సంపాదకుని తిరస్కరణ లేఖ గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
01/18/2016 12:35 pm
రామయ్య గారు, నేను రాసినదీ, మీ కామెంటూ మళ్ళీ ఓ సారి చూసుకుంటే తెల్సింది. మీరు చెప్పినది పూర్తిగా సరికాదు. ప్రస్తుత పరిస్థితులు, ఇలాగే కొనసాగుతాయి రెండు తెలుగు రాష్ట్రాలలో అని భావించుకుంటే – అబ్బే తెలుగు మాట్లాడేది తెలంగాణా ఒక్కటే, ఆంధ్రాలో మాట్లాడేది తెలుక్కాదు అంటే సరే ఒక రాష్ట్రం అందాం – రాబోయ్యే రోజుల్లో పోతన ఆంధ్ర మహాభాగవతం కనుమరుగవుతుందనుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం ఉన్నట్టు తోచదు.
మహాకవి, పెజా కవి శ్రీశ్రీ ఎక్కడా? పోతనలాంటి పనికిమాలిన సీసపద్యాలు రాసేవాడెక్కడా? కధ నిజమో కాదో తెలియదు కానీ పోతన భాగవతాన్ని తనకి అంకితం ఇమ్మని ఆ రోజుల్లోనే – ఇప్పట్లాగానే – ఓ రాజ రాజ నరేంద్రుడు పోతనని ఏడిపించుకు తిని ఆ పనికిమాలిన పద్యాలన్నీ భూస్థాపితం చేసాడుట. బుధ్ధిలేని కొంతమంది వాటిని తవ్వితీసిమనమీదకి వదిలారు. ఆ పద్యాలు ఎంతచదివినా మహాకవి రాసే కవితల మూలంగా వచ్చే “అత్యద్భుత సామాజిక స్పృహ” రాదనేది జగమెరిగిన సత్యం. నా తప్పు ఒప్పుకుంటున్నాను. ఆ మధ్య చదివిన మహా కవి కవిత ఇచ్చాను ఇక్కడ. పోతన భాగవతం అయుదు సంపుటాలలో ఎంత వెదికినా ఇటువంటి అణి ముత్యం ఒక్కటీ నాకు కనపళ్ళేదు.
అరిచే కుక్కలు కరవవు
కరిచే కుక్కలు అరవవు
అరవని కరిచే కుక్కలు తరమవు
కరవని అరిచే కుక్కలు మరలవు
అరవని కరవని కుక్కలెక్కడా దొరకవు
మా ఆఫీసులో పనిచేసే ఒకాయన “సర్వీస్ డాగ్” అనే దాన్ని తీసుకొస్తాడు. అది ఈ అయిదోపాదానికి పూర్తిగా వ్యతిరేకం మరి. అయినా చెప్పాను కదండి, నాకేం తెలుసు వంకాయ పులుసు అనీ?
మీ భవిష్యత్ దృష్టినీ పెజాకవినీ ఆక్షేపించినందు క్షంతవ్యుడను. మీ వ్యాక్యం ఏమీ అనుకోరని సరి చేస్తున్నాను.
“పోతన శ్రీమదాంధ్ర మహాభగవతం పద్యాలు ఎలాగైనా సర్వనాశనం అయితీరుతాయి రాబోయ్యే రొజుల్లో కానీ ప్రజా/మహా కవి కవితలు మాత్రం తెలుగు వాడు జీవించి ఉన్నంతవరకూ (అంటే దిబ్బ/మినప రోట్టి మన తెలుగు వాళ్ళు మర్చిపోయే వరకూ) మనగలుగుతాయి”
నా తప్పు ఒప్పుకుని ఇంక అంతర్జాలం బేండ్ విడ్త్ (అంటే ఏమిటో నాకూ తెలియదు కానీ అందరూ వాడుతున్నారు ఆ మాట, నేనెందుకు వాడకూడదూ అని) చేయనని మీకు నా హామీ. శెలవు.
మన ఛాందసులు గురించి రామ్ ప్రసాద్ అభిప్రాయం:
01/17/2016 8:43 pm
చాలా అద్భుతమైన విశ్లేషణ . నమో నమః
రామ్
ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం గురించి కొండ రవికుమార్ అభిప్రాయం:
01/17/2016 9:29 am
ఘంటసాల గారితో వేరెవరినీ పోల్చలేము. ఇంకో.. ఇరవై సంవత్సరాల తర్వాత బాలు గారికి అభిమానులు ఉంటారో.. ఉండరో కానీ, ఇంకా వంద సంవత్సరాల తర్వాత కూడా.. ఘంటసాల గారికి భక్తులుంటారు.
ధీర గురించి sailajamithra అభిప్రాయం:
01/17/2016 5:20 am
కధనం చాల బావుంది … ఈ తరానికే కాదు భావి తరాలకు కూడా ఉపయోగించేలా ఉంది.
మా ఆవిడ – మంగళసూత్రం గురించి క్రిష్ణవేణి అభిప్రాయం:
01/16/2016 12:34 pm
బులుసుగారూ,
మీ మార్కయిన బ్రహ్మాడమైన హ్యూమర్.
ఎంత బాగో రాశారో, చెప్పలేను.
మనుషులపై మదుపు గురించి కొల్లూరి సోమ శంకర్ అభిప్రాయం:
01/16/2016 9:53 am
కమల్ గారూ, సురేష్ బాబు గారూ
కథ మీకు నచ్చినందుకు సంతోషం.
మీ అభిప్రాయం వెల్లడించినందుకు ధన్యవాదాలు.
అజంతా రెండు కవితలు గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
01/16/2016 8:08 am
ప్రియమైన శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారు,
అజంతా గారి స్వప్నలిపి కవితల పుస్తకం పునుర్ముద్రణ విషయమై నేను త్రిపుర గారి ఆప్త మిత్రులు సాహితీ బందుగు, హైదరాబాదు వాస్తవ్యులు, శ్రీ రామడుగు రాధాకృష్ణ మూర్తి గారికి విన్నవించాను. అలాగే అజంతా గారి మిత్రులు విశాలాంధ్ర పబ్లికేషన్స్ ( ప్రస్థుతం అది నవచైతన్య అని తెలంగాణా రాష్ట్రానికి సంబందించిన మరో ముక్కగా విడివడింది కాబోలు ) శ్రీ ఏటుకూరి ప్రసాదు గారికీ విన్నవించాను. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం అందుకున్న ”స్వప్నలిపి” పుస్తకం దశాబ్దాల అనంతరం తిరిగి పునర్ముద్రణ పొంది నలుగురికీ అందుబాటులోకి వచ్చేలా మీరే చూడగలరు అని వారిని అభ్యర్ధించాను. తమ కమిటీ మెంబరర్లతో యీ విషయం చర్చిస్తానని ఏటుకూరి ప్రసాదు గారు హామీ ఇచ్చారు. (ఇది నేం డ్రాపింగ్, ప్లేయింగ్ టు ద గ్యాలరి ల కింద వచ్చే విషయంలా ఉన్నా మీకు నివేదించాలనే నా ఉబలాటాన్ని ఆపుకోలేకున్నాను). వీలుంటే మీరూ ఓ సమిధ వేస్తారని ఆశపెట్టుకుంటున్నాను.
కళాపూర్ణోదయం -8: మణిహారం గురించి Aravindamohang అభిప్రాయం:
01/15/2016 9:44 am
కళాపూర్ణోదయం ఎన్నాళ్ళకు చదువగలిగాను. ఎప్పుడో చిన్నప్పుడు కొద్ది కొద్దిగా చదివినట్టు గుర్తు. ఎందులో చదివానో కూడా గుర్తు లేదు. బహుశా కాశీమజిలీ కథల్లో చదివానేమో అనిపిస్తుంది.
ఈమాట.కొమ్ కు చాలా చాలా థాంక్స్.
ఇలాగే యెన్నో మంచి పుస్తకాలు మాకు అందుబాటులోకి తీసుకొస్తారని ఆశిస్తున్నా.
కోనసీమ కథలు: శిరోముండనం గురించి suresh babu అభిప్రాయం:
01/14/2016 10:20 pm
శ్రీ రమణా గారిది ఒక్క మురుగె కాని మీ కథ మూడు మురుగులకి సమానం