పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16472

  1. జనవరి 2017 గురించి రవి అభిప్రాయం:

    01/04/2017 5:50 am

    ఈమాట – కొత్తరూపం ఇదివరకటి రూపంకంటే భిన్నంగా ఉంది. కానీ ఈ కొత్తరూపు కూడా కొంతకాలానికి మూసగా అవుతుందని అనిపిస్తున్నది. ఆలోచించాలి. పెద్ద ఖతులకు, శీర్షికలకు కళ్ళకు ఇబ్బంది కలిగించే ఆకుపచ్చరంగు, పైన లంకెలకు కాషాయరంగు – ఇవి warm/hot colors అనుకుంటాను. వీలైతే అభిప్రాయాలు సేకరించి, వాటిని Cool colors లో మార్చటం గురించి ఆలోచించగలరు.

    – కొత్త ఖతి బావుంది. పాత ఖతి మార్చి చాలామంచిపని చేశారు. అక్షరాల మధ్య, వాక్యాల మధ్య ఖాళీ కూడా ఆహ్లాదకరంగా వుంది.

    – ఈమాట పత్రిక శీర్షిక క్రింద – ఇంగ్లీషులో సబ్ టైటిల్ ఉంది. EEMAATA: AN ELECTRONIC MAGAZINE IN TELUGU FOR A WORLD WITHOUT BOUNDARIES. ఎందుకిలాగ? ఈమాటకు తెలుగు రాదా? లేక ఇంగ్లీషంటే మోజా? లేక అమెరికాలో నివసించే తెలుగువాళ్ళకే ఇది పరిమితమా?

    – “పాఠకుల అభిప్రాయాలు” లంకె, పేజీకి చాలా క్రింద వైపు మూలన ఉంది. ఇది కనబడేట్టుగా పైనెక్కడైనా ఉంటే బావుంటుంది. ఆ పేజీ చాలా తరచుగా పాఠకులు రెఫర్ చేస్తారని అనుకుంటాను. వీలైతే నంబర్ ఆఫ్ క్లిక్స్ చూడండి.

    – క్రింద ఎడమవైపున “తేనెపట్టు” అని రాశారు. లంకె మిస్సింగ్.

    – గ్రంథాలయం లంకె ఎక్కడ? అలాగే ఇదివరకటి సంచికలలో “ఫలానా నెల సంచిక” కు ఎలా వెళ్ళాలి?

    – పాఠకుల అభిప్రాయాల పేజీలో అటు వైపున “గ్రంథాలయం” ఉంది. ఎందుకలాగ?

    – పాఠకుల అభిప్రాయాల పేజీలో ఇటువైపు మార్జిన్ చాలా దళసరిగా ఉంది.

    ఏమైనా సరే, కొత్తగా ఆలోచిస్తున్నందుకు, కొత్తదనం కోసం ఆలోచిస్తున్నందుకు అభినందనలు, ధన్యవాదాలు.

  2. సత్య దర్శనం గురించి Srinivas అభిప్రాయం:

    01/04/2017 5:41 am

    too good

  3. తానొకటి తలచిన… గురించి జిలేబి అభిప్రాయం:

    01/04/2017 12:04 am

    వంకాయ కూర పేరు ఇలియానా ఇండియానా అని ఉండాలేమో నండీ బులుసు వారు 🙂

    చీర్స్
    జిలేబి

  4. ఐదు కవితలు: శివలెంక రాజేశ్వరీదేవి గురించి Buchireddy gangula అభిప్రాయం:

    01/03/2017 11:07 pm

    Excellent madam
    Nice review
    =================
    Buchireddy gangula

  5. చిత్రకవిత్వరీతులు గురించి మోహన అభిప్రాయం:

    01/03/2017 7:48 pm

    చాల బాగుందండీ, దేశికాచార్యులుగారు. ఇట్టివి మఱికొన్ని సూరపనేని వేణుగోపాలరావుగారు వ్రాసిన గూఢచిత్ర రహస్య ప్రకాశికలో ఉన్నాయి. సీతారావణసంవాదఝరి పుస్తకము archive.org లో లభ్యమని పాఠకులకు నివేదన. నమస్సులతో – మోహన

  6. పెట్టని మొక్కు ఫలితం గురించి కరుణాకర్ కొన్నె అభిప్రాయం:

    01/03/2017 2:42 pm

    రాజు గారూ ఈ మధ్య అగుపడ్డం మానేశారేంటి? అంటే మా మానాన మేం ఏవో పనికిరాని కథలని పని లేని టైమ్ లో చదువుకుంటుంటే, పుటుక్కున.. మీ పనికిరాని టైమ్ కి నేనొక సాక్షి అని ఉబుసుపోని కబుర్లతో ఊసులాడి, తేరుకునేంతలోపలే చటుక్కున మాయమయ్యారు..ఇక్కడ ఉన్నారా అంతర్జాలం లో..అక్కడ మా లాంటి వాళ్ళు అసలు పేపర్లనే చదవడం మానేసారు, పని లేని టైమ్ లో అయినా..ఇంతకీ మళ్ళీ అవకాశం వస్తే వంగుతారా? వంచగలరా? సంస్కారం తో కూడిన అహంకారానికి ప్రాయశ్చిత్తమెందుకులే అయినా…

  7. గుప్పిట ప్రేమ గురించి పూర్ణ చంద్ర అభిప్రాయం:

    01/03/2017 1:14 pm

    అద్వితీయం…మీ కవిత…భావుకత్వం ఎల్లలని చెరిపేసి, హృదయ స్పందనలను ఆకాశగమనం గావించింది..అనేకానుభూతుల స్వర్గధామంలా..ప్రేమలో రస మాధుర్యం పున్నాగపూలలా విరగబూసింది. చాలా చాలా బాగుంది…మీకవిత… సుపరిమళాల తోటలా

  8. కోటిగాని కతలు: బత్తాయిలు పోయినాయి గురించి పూర్ణ చంద్ర అభిప్రాయం:

    01/03/2017 1:07 pm

    చాలా బాగుంది మీరు రాసిన కథ. ఊరిని కళ్లకు కట్టారు. నా చిన్నతనంలో కూడా చూసాను ఇటువంటి సంఘటనలు. ఇప్పటికీ ఇంకా జరుగుతున్నాయనుకుంటా కొన్ని మారుమూల గ్రామాలలో..ఏది ఏమయినా సంఘటనలను, పాత్రలను మీరు మీ కథ లో చాలా వాస్తవికంగా ఆవిష్కరించారు. భారతీయ గ్రామీణ వ్యవస్థలో అధికారుల రాబందుల మనస్తత్వాన్ని, బలై పోతున్న అమాయక గ్రామీణులను, చాల సహజంగా చూపించిన కథ..మీకు అభినందనలు..

  9. రాజేశ్వరీదేవి: శైవలిని గురించి పూర్ణ చంద్ర అభిప్రాయం:

    01/03/2017 12:21 pm

    అద్భుతం…గుండె లోతుల్లో స్పృశిస్తూ…దాచుకున్న చిన్ననాటి స్మృతులను తోడి తీసేలా….ఆధునికతను వెనక్కినెట్టి మన జీవిత తొలినాళ్ళ తడబడు అడుగుల దారులతో పయనమయ్యేలా… జీవన స్మృతుల మాధుర్యాలను కమ్మిన చీకటి మబ్బులను పారద్రోలేలా… మీరు అద్వితీయంగా రాసిన కవిత మళ్ళీ కాలాన్ని వెనక్కినెట్టి. తాటికాయలచక్రాలతో గట్టు మీద పరుగులెత్తిస్తోంది. గుళ్ళొ రాములవారి పాట…చెరువు గట్టున కడవల శబ్దాలు…ఎడ్లబండ్ల గలగలలు…భానుమతి రామారవు సినిమా పోస్టర్లు…టెలిగ్రాం తెచ్చిన పోస్టుమాన్ బాబాయి…చొప్పబెండ్లతో కళ్ళద్దాలతో… షావుకారు దగ్గర కొన్న పిప్పరమెంటు చప్పరిస్తూ.. స్కూల్ మాస్టారు ఎదురైతే సందులో దాక్కున్న వైనం… అమ్మ స్వయంగా కలిపి పెట్టె పెరుగన్నం…వెన్నెల రాత్రులు…బుర్రకథలు…రెడియోలో ఘంటసాల పాటలు… ఒక్కసారే ఉప్పెనలా పెనవేస్తున్న జ్ఞాపకాలు… మీ కవిత యొక్క ఉద్దేశ్యాన్ని నేను సరిగా అర్థం చేసుకోలెకపోతె మన్నించగలరు… నా వరకు…ఏదో అస్పష్టమైన…భావోద్రేకం మాత్రం కలిగింది…దాని ఫలితమే ఈ నా స్పందన… ఏది ఏమైనా…మీ కవితలు చాలా బాగున్నాయి…

  10. రాసక్రీడాష్టకము గురించి kuppa sudarsana kumar అభిప్రాయం:

    01/03/2017 11:40 am

    ఈమాట మాసపత్రికగ మారుతున్నందుకు చాల అనందంగా ఉంది. శ్రీ జెజ్జాల కృష్ణ మోహన్ గారి గురించి యెంత చెప్పినా తక్కువే. వారికి నా నమస్కారాలు, అభినందనలు తెలియచెయగలరు.