పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16450

  1. అన్నపూర్ణ సర్క్యూట్ ట్రెక్ – 1 గురించి Seshagiri Nimmagadda అభిప్రాయం:

    07/12/2025 6:53 am

    Thank you Ramakrishna garu and Srinivas garu for you feed back and kind compliments.
    We are glad you are enjoying reading our article on the treks in the Himalayas.
    Seshagiri

  2. కంప్యూటర్ చిప్ కథ – 4: మెరుపు – విద్యుత్తు: బెంజమిన్ ఫ్రాంక్లిన్ ప్రయోగాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    07/12/2025 12:33 am

    సవరించినందుకు దంతుర్తి గారికి కృతజ్ఞతలు. “నెవార్క్” పొరబాటే. “1752 జూన్ నెల వానా కాలం” బదులు “1752 జూన్ నెల; ఉరుములతో కూడిన జల్లులు పడే ఎండాకాలం” అనాల్సింది. సైన్సు చరిత్రకు సంబంధించిన వ్యాసం కనుక దీని గురించి మరికాస్త వివరణ:

    కారణమేమోగాని గాలిపటం ప్రయోగం గురించి ఫ్రాంక్లిన్ పూర్తి వివరాలు ఇవ్వలేదు. కొడుకూ, తనూ మాత్రమే సాక్ష్యం. కొడుకు దాని గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఫ్రాంక్లిన్ కూడా కొన్ని నెలల మౌనం తర్వాత, 1752 అక్టోబరులో గజెట్ పత్రికలో ఓ చిన్న ప్రకటన ఇచ్చి, దానినే రాయల్ సొసైటీకి తెలపమని కాలిన్సన్‎ని కోరాడు. నేనిచ్చిన కథనం, పదిహేనేళ్ళ తర్వాత, 1767 లో జోసెఫ్ ప్రీస్ట్లీ రాసిన History of Electricity లోనిది (https://founders.archives.gov/documents/Franklin/01-04-02-0135). అసలా చరిత్ర రాయమని ప్రీస్ట్లీని కోరింది ఫ్రాంక్లినే. ప్రీస్ట్లీకి ఫ్రాంక్లిన్ స్వయంగా చెప్పి ఉండాలి.

    కొడవళ్ళ హనుమంతరావు

  3. శతజయంతులు: కంటకాలు, కిరీటాలు గురించి కె. శ్రీనివాస్ అభిప్రాయం:

    07/11/2025 4:20 am

    ఒక జోడింపు

    ఈ వ్యాసంలో ఖమ్మం లో ఒక డిగ్రీ కాలేజ్ లో దాశరథి, ఆరుద్ర ల మీద జమిలిగా జరిగిన శతజయంతి సదస్సు గురించి ప్రశంసాత్మకంగా ప్రస్తావించాను. నిజానికి ఎనిమిదినెలల కిందట జరిగిన మంజీరా రచయితల సంఘం 38 వ వార్షికోత్సవం దాశరథి-ఆరుద్ర-బిరుదురాజు రామరాజుల శతజయంతి సదస్సుగా జరిగింది. ఆ సభకు నేను అతిథిగా వెళ్ళాను. దాన్ని కూడా ఈ వ్యాసంలో ప్రస్తావించి ఉండాల్సింది. “మంజీరా” అస్తిత్వ, ఆధునిక సాహిత్యాల వేదికగా నిష్పక్ష వైఖరితో కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

    ఆరుద్ర స్మరణ తెలంగాణ లో మరెక్కడైనా జరుగుతుందా అన్న నిష్ఠూరపు ప్రశ్న వేయడంలో ఉద్దేశం, ప్రత్యేక శ్రద్ధ ఉన్నవాళ్ళు మినహా సర్వసాధారణంగా జరిగేదికాదని. ప్రభుత్వ సంస్థలు, వ్యవస్థలు, మీడియా తమంతట తామే గుర్తించి జరపవలసిన సందర్భాలు, ఇప్పుడు పరిగణనలు మారడంవల్ల, అప్రధానం అవుతున్నాయని నా అభిప్రాయం.

  4. కంప్యూటర్ చిప్ కథ – 4: మెరుపు – విద్యుత్తు: బెంజమిన్ ఫ్రాంక్లిన్ ప్రయోగాలు గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    07/10/2025 3:32 pm

    వ్యాసం బాగుంది – మొదటనుండీ అన్నీ తవ్వితీయడం. రామాయణంలో పిడకల వేట అనుకోకపోతే కొన్ని విషయాలు.

    >> 1752 జూన్ నెల వానా కాలం..

    “వానా కాలం” అనేది కాస్త జాగ్రత్తగా చూడాల్సింది. అమెరికాలో చలికాలం, వేసవి, అనేవి ఉన్నాయి కాని వర్షం ఎప్పుడైనా పడవచ్చు. ఇండియాలో ఉన్నట్టూ ఇక్కడ “వానా కాలం” అనేది లేదు. కిందటి నెలల వ్యాసాల్లో చూసిన మరో పిడక “నెవార్క్” అని రాయడం. Newark ని “న్యూ ఆర్క్” అనడం కద్దు. నేను మరో కొంతమందిని కూడా అడిగి చూసాను. “నెవార్క్” అనడం ఎక్కడా వినలేదు. ఒకాయన “న్యూ వర్క్” అన్నా సరే “నెవార్క్” అనేది తప్పు అనుకుంటా. పోనీయండి నామవాచకాలు ఎలా పలికినా పోయింది లేదు కదా. ఇక్కడ దిగిన మొదట్లో కొంతకాలం నేను **ఆర్కన్సాస్** అనే పలికేవాణ్ణి, ఓ పెద్దాయన తప్పు చూపించేవరకూ. 🙂

  5. పంచేంద్రియాలు: 5 స్పర్శ గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    07/10/2025 3:19 pm

    నేను చాలాకాలం చర్మం మీద ఉండే నెర్వ్ ఎండింగ్స్ వల్ల మాత్రమే నెప్పి తెలుస్తుంది అనుకునేవాణ్ణి. ఈ నెర్వ్ ఎండింగ్స్ పనిచేయకుండా మత్తు మందు ఇచ్చి శరీరాన్ని కోయవచ్చు – ఆపరేషన్ లో చేసినట్టుగానే. మరి కొన్ని విషయాలు తెలిసాయి ఇది చదివాక.

    దోమలు కొంతమందిని విపరీతంగా కుట్టటం ఎందువల్ల? అందర్నీ కుట్టడం కూడా ఎందువల్ల అంటారు? శరీరం మీద ఏదో ఒక వ్యామోహపు శక్తి ఉండకపోతే అవి రావు కదా? అలాగే కొన్ని రసాయనాలని స్ప్రే రూపంలో జల్లి దోమలు కుట్టకుండా చూసుకోవచ్చు. గట్టి ఎండ తగిలినా ఏమి కాకుండా ఉండడానికి స్ప్రే లు ఉన్నాయి. అవి ఎలా పనిచేస్తాయో, అవి గంటో రెండు గంటలో కాక రోజంరా లేదా రాత్రంతా పనిచేసే దారి ఉందా? ఈ విషయాలు చెప్పగలరా?

  6. శతజయంతులు: కంటకాలు, కిరీటాలు గురించి Manchikamti అభిప్రాయం:

    07/10/2025 12:50 pm

    వ్యాసం బాగుంది

  7. శతజయంతులు: కంటకాలు, కిరీటాలు గురించి అసమీక్ష్యసమీక్ష్యకారి అభిప్రాయం:

    07/10/2025 7:57 am

    నిజమే. ఆరుద్ర స్మరణ తెలంగాణలో మరెక్కడైనా జరుగుతుందా? దాశరథి స్మరణ ఆంధ్రాలో జరుగుతున్నదా?

  8. తెలుగు భాష ఎవరిది? గురించి బత్తుల వెంకటేశ్వర్లు అభిప్రాయం:

    07/10/2025 2:14 am

    చాలా ఉన్నతమైన వ్యాసాలు వస్తున్నాయి.మీ కృషికి అభినందనలు.కొనసాగాలని కోరుకుంటూ

    జయహో తెలుగు

  9. కన్నీరు భద్రం! గురించి లక్ష్మణ్ బాబు కందగట్ల అభిప్రాయం:

    07/09/2025 3:00 pm

    కన్నీటి గురించి చాలా బాగా వ్రాసారు….

  10. కన్నీరు భద్రం! గురించి జయంతి ప్రకాశ శర్మ అభిప్రాయం:

    07/09/2025 1:31 pm

    మంచి కథ. నిజంగా కన్నీరు ఇంకిపోయింది అందరిలో! అలాంటి సమయంలో ఈ కథ ఓ మేలుకొలుపు. నిజంగా ప్రతీ మనిషి ఆ emotions ఉండి ఉంటే.. అర్ధరాత్రి నిద్రలో ఆ ఏడుపు వస్తుంది. కానీ అన్నింటికీ అతీతంగా బతుకుతున్నాం. అందుకే ఈ కథ బాగా నచ్చింది.