పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16471

  1. నాకు నచ్చిన పద్యం: వసంతునితో వెన్నెలఱేడు పోటీ! గురించి వేలూరి వేంకటేశ్వరరావు అభిప్రాయం:

    04/04/2017 5:34 pm

    కామేశ్వర రావుగారూ!

    మీరు మరీ బడాయికి పోయారు కానీ, ఆఖరి చరణం తీసేస్తే ఈ పద్యం కేవలం ఋతువర్ణన పద్యమేకదా! (Of course, give a little to the poet for drawing the contrast between the Lord of Spring and the satellite to the earth!)

    …ఏ గతి రచియించిరేని సమకాలమువారలు మెచ్చరే కదా!

    అప్పుడు, ఇప్పుడూ, ఎప్పుడూ – ముఖ్యంగా తెలుగు సాహితీవేత్తలమనుకొనే ఈ నాటి కవుల్లో, విమర్శకులలో కొట్టవచ్చినట్టు కనిపించే ఒకానొకలక్షణం.

    ఈ పద్యంలో ఉన్నది వసంతుడూ చంద్రుడే కాని కవులు కాదు. కవుల మధ్యనున్న స్పర్థ కేవలం పాఠకులకు స్ఫురించే అంశమే తప్ప నేరుగా కవి చెప్పింది కాదు,’ అని మీరు మొహమాటానికి అన్నారని నేను అంటాను.

    కాకపోతే, తరువాత ఇలా ఎందుకు రాసారు?

    “… అయినా ఒక కవిగా, ఎంత గొప్ప కవిత్వాన్ని రచించినా సమకాలము వారలు మెచ్చకపోవడాన్ని గూర్చి వాపోయాడు వేంకటకవి. మెచ్చకపోవడమే కాదు, ఏ రకంగా తక్కువ చేసి చిన్నబుచ్చుతారో కూడా మనకీ పద్యంలో చూచాయగా తెలియజెప్పాడు.

    ఈ పద్యం మీద వేదం వారి వ్యాఖ్యకూడా జోడిస్తే ఇంకా బాగుండేది.

    మరొక విషయం: కాళిదాసుని వదిలేయడం ఏమీబాగాలేదు. కుమార సంభవంలో వసంతుడి రాక పై శ్లోకాలు, అంతకన్న మరీముఖ్యంగా, ఋతుసంహారం లోని వసంతవర్ణన (They may be a little explicit, hence more likable!) వదిలేయటం ఏమీ బాగాలేదు, చెప్పొద్దూ!

    అసలు విషయం: ఋతుసంహారం, నాలాంటి ‘ మీడియోకర్ల’ కి తేలిగ్గ అర్థమయే కావ్యం. ఎప్పుడో, ధాతనామసంవత్సరంలో, ఋతుసంహారంలో వర్ణనలతో, కన్నెగంటి చంద్ర కవితలని పోల్చానని, నన్ను ఆక్షేపించారు.

    (ఏ గతి రచియించిరేని సమకాలమువారలు మెచ్చరే కదా!)

    ఏది ఎలావున్నా, మంచి పద్యం; మరీమంచి వ్యాఖ్యానం. (I envy you!)

  2. విశ్వనాథ రెండు నవలికలు: తొలిపలుకు గురించి Akella Suryanaryana Murthy అభిప్రాయం:

    04/04/2017 5:13 am

    విష్ణుశర్మ ఇంగ్లీష్ చదువు, హహ హూ హూ 1974 లో చదివేను, అప్పుడే కాలేజీ వాతావరణం, కానీ రెండూ చాలా నచ్చేయి. తెలుగునీ, ఏ ఇతర భారతీయ భాషనీ చులకన చెయడం మెకాలే ప్రభావం. ఇంగ్లీష్ గొప్పదనీ కష్టమనే అభిప్రాయం కలగజేయడం ప్రధాన ఉద్దేశ్యం. ఏవైనా బానిస బతుకులు అంతేనేమో.

    విశ్వనాథ సత్యన్నారాయణ గారంటే నాకు చాలా గౌరవం ఇష్టం కూడా, అందుకనే ఆయనను సంబోధించేటప్పుడు పేరు చివర గారు లేకపొవడం నాకు నచ్చలేదు.

  3. బావి దగ్గర: ఒక ఎక్‌ఫ్రాస్టిక్ పోయెమ్ గురించి వేలూరి వేంకటేశ్వరరావు అభిప్రాయం:

    04/03/2017 12:50 pm

    Thanks Ramarao. It is my fault. I could blame the current editor(s), but I do not want to take that escapist route.

    By the way, you know I am horrible at proofreading. You may not remember, but you proofread మూడు ప్రార్థనా పద్యాలు, a few years ago for me.

    Thanks again.

    [Typo corrected – Ed.]

  4. పాకశాలలో పాణినీయం గురించి సుబ్రహ్మణ్యం కెందోళె, బెంగళూరు అభిప్రాయం:

    04/03/2017 12:13 pm

    వరరుచి గురించి వెదకుతూ ఉంటే “ఈ మాట” దొరికింది. “పాకశాలలో పాణినీయం” నన్ను ఆకట్టుకుంది. మళ్ళీ మళ్ళీ చదివాను.

    దీనిని నా కన్నడ మిత్రులు చదవాలనిపించింది. వారికోసం ఈ కథను కన్నడంలో అనువదించాలి అనుకొంటున్నాను. మీ అభిప్రాయం తెలుపండి.

  5. బావి దగ్గర: ఒక ఎక్‌ఫ్రాస్టిక్ పోయెమ్ గురించి Ramarao Kanneganti అభిప్రాయం:

    04/03/2017 10:50 am

    గురువు గారు, ఒక typo correct చెయ్యాలి:
    And voices singing
    out of empty cisterns
    And exhausted well

    ఆ రెండో And capitalize చెయ్యకూడదు. ఇంకా, well -> wells

    అద్భుతంగా ఉంది. బాగా ఉంది.

  6. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 4 గురించి Ramakrishna Reddy Garlapati అభిప్రాయం:

    04/03/2017 9:39 am

    ధన్యవాదాలండి….ఇప్పుడు అన్నీ కుదిరాయి…సంతోషం….మరొక్కసారి ధన్యవాదాలు.

  7. అంతా కొత్తగా… గురించి Suparna mahi అభిప్రాయం:

    04/02/2017 11:52 pm

    చాలా చక్కని పోయెమ్ సర్. ధన్యవాదాలు.

  8. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 4 గురించి Ramakrishna Reddy Garlapati అభిప్రాయం:

    04/02/2017 11:15 am

    ఈ గడులు తప్పినందువల్ల ‘సరి చూడు’ జవాబుల్ని తప్పు చూపిస్తున్నదండి. గమనించ ప్రార్ధన.

    [ఒక గడిలో అక్షరం తప్పిపోయినందున ‘సరి చూడు’ కాస్తా సడలిపోయింది. ఇప్పుడు సవరించాము. తప్పు ఎత్తిచూపినందుకు కృతజ్ఞతలు. — సం.]

  9. విశ్వనాథ రెండు నవలికలు: తొలిపలుకు గురించి C.Chandrasekhar అభిప్రాయం:

    04/02/2017 8:36 am

    Overall a good introduction – (1) there are too many generalisations in the earlier part (2) to my mind there are no inconsistencies or linguistic errors on account of Vishwanatha’s dictation – those who knew him know that he had fabulous memory, and the writers who took down the dictation were also scholars and poets in their own right (3) an understated fact – both the novels are highly satirical – a style that was popular in contemporary English / European literature, but was rarely found in Indian languages.

  10. అంతా కొత్తగా… గురించి J.V.RAMANA అభిప్రాయం:

    04/02/2017 5:43 am

    కొత్త కొత్తగా కవిత చాలా బాగుంది. అక్షరం అక్షరంలో కవి హృదయం ఆవిష్కృతమవుతోంది.