పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-3 గురించి తః తః అభిప్రాయం:

    11/30/2017 3:06 pm

    “ఇంతకు పూర్వం చర్చలలో గజముఖుడైన వినాయకుడు వేద సాహిత్యంలో కనిపించడని, ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాల్లో కూడా ఎక్కడా గజాననుని ప్రస్తావన లేదని నిర్ధారించాం కదా!”

    శ్రీ కొలిచాల వ్యాసం చదవటానికి చాలా బాగుంది. రచయిత “‘అంతు’ చిక్కని” అనటం నాకు సబబనిపించలేదు. అదలా ఉంచి, వేదభాష్య కర్త శ్రీ సాయణులు, వేదభాష్యానికి ముందు “వాగీశాద్యాః సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాః స్యుః తం నమామి గజాననం” అన్న శ్లోకాన్ని వేదభాష్యాల ప్రారంభాలలో తన శ్లోక ముద్రికగా ఉపయోగించారని శ్రీ పుల్లెల వారు చెప్పిన విషయం గుర్తుకు వచ్చి వేదభాష్య కర్త – శ్రీ విద్యారణ్యుల తమ్ముడు – వేదభాష్య ప్రారంభాలలో –వేదాలలో ఎక్కడా కనపడని దేవుడిని తలచుకుని నమస్కరించటమేమిటా అని విస్తుపోతున్నాను! (ఫుల్లెల వారి ప్రస్తావనలు: సంస్కృత భాషా ప్రచారసమితి, హైదరాబాద్ 2011 పుట -367.)

    నమస్కారాలతో
    తః తః

  2. ‘జ్ఞాపిక’ గురించి varma అభిప్రాయం:

    11/29/2017 11:46 pm

    మెంతులు రెండు విధాల ఉపయోగిస్తారు. ఒకటి జిగురు కోసమయితే రెండోది వాటి చేదువల్ల ఎలకలు మెంతిబుట్టలు కొరికే సాహసం చెయ్యలేవు. లేకపోతే కాగితం కనిపిస్తే ఎలుకలు పీకి పాకం పెట్టేస్తాయి. ధన్యవాదాలు రావుగారూ, విశ్వనాధ్ గారూ, సూర్యా గారూ.

  3. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-3 గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:

    11/28/2017 1:55 pm

    Fantastic series sir. Wonderful. Well researched article. Thank you!

  4. జయప్రభశబ్ద కవిత్వం గురించి gudipati అభిప్రాయం:

    11/28/2017 10:53 am

    yadakula BhuShan gaaru, ippude essay chadivaa. I like it very much. sensible appreciation.

  5. విచిత్రపత్రం గురించి శ్రీకాంత్ గడ్డిపాటి అభిప్రాయం:

    11/27/2017 2:53 am

    చాల బావుందండీ. ఇప్పుడే చదివేను.

  6. గడి నుడి – 13 గురించి వీరభద్రం అభిప్రాయం:

    11/26/2017 1:17 pm

    <> 25 దాటింది కానీ సరిచూసుకోవటం ఎలాగో తెలియలేదు.

    [సరిచూపు ఆప్షన్ ఇచ్చాం – సం.]

  7. నాకు నచ్చిన పద్యం: ఒక ఉన్మాది మనస్సినీవాలి గురించి siddu అభిప్రాయం:

    11/26/2017 1:16 am

    వందల లైకులు హీరోయిన్ ఫోటోలకు పంపుతాం. మీకు ఎన్ని వేల లైకులు పంపాలి? సార్ మీ పద్యవివరణలు నాకు చాల బాగా నచ్చాయి. మీ ఆశీస్సులు కావాలి.

  8. ‘జ్ఞాపిక’ గురించి విశ్వనాథ్ అభిప్రాయం:

    11/25/2017 7:13 am

    ఇదివరకు రోజుల్లో మెంతులు పేపరు చింపిన ముక్కలు మైలతుత్తం 2,3 రోజులు నానబెట్టి రోట్లో రుబ్బిన ఆ పిండిని బియ్యం ఏరుకొనే వెదురుచాటలకు పలుచగా పట్టించి నీడపట్టున ఆరబెట్టే వారు. మెంతులు జిగురు కోసం, మైలతుత్తం పురుగు పట్టకుండా ఉండేందుకు వాడేవారు. ఆ వాసన ఇప్పటికీ గుర్తే! ఆ చాటలు మన్నికగా, చూడ చక్కగా ఉండేవి. ఇప్పుడు ఆ చాటలు లేవు, ఆ ప్రక్రియ లేదు. ఏమైనా మంచి అనుభూతిని కలిగించారు. ధన్యవాదాలు.

  9. ఛందస్సులో గణితాంశములు – 3: యమాతారాజభానసలగం గురించి siddu అభిప్రాయం:

    11/23/2017 3:20 pm

    Sir, you are a genius!

  10. తిక్కనగారి భారతంలో ఒక పద్యం గురించి విజయ సారథి అభిప్రాయం:

    11/22/2017 5:35 pm

    క్షమించాలి, ద్వితీయ ఆశ్వాసం లో 201 వ పద్యం 204 వ పద్యం కాదు. టైపో గమనించలేదు.