పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. శ్రీ ఆంజనేయ రక్షా కవచం గురించి యువ అభిప్రాయం:

    03/01/2009 11:03 am

    బాగుందండీ.
    నిద్ర మేలుకోటానికి సస్పెన్స్ నవల నేను చాలాసార్లు ప్రయత్నించా. పది నిమిషాల కంటే ఎక్కువ చదవకుండానే నిద్ర వచ్చేది అదీ ఆ నవల తాలూకు కలలతో 🙂
    – యువ

  2. భ్రంశధార గురించి Subrahmanyam Mula అభిప్రాయం:

    03/01/2009 9:00 am

    మౌని చేవ్రాలు
    మున్నీటి పాలు.

    కవితంతా నిండిన తడి పాఠకుడి కళ్ళలోనూ చేరుతుంది కవిత పూర్తవగానే.. “ఈ ముసలి ఏరెంత ఒంటరిది” అన్న ప్రయోగం ఎంత నచ్చిందో చెప్పలేను. నిజంగా వంశధార ఒడ్డుకి వెళ్ళొచ్చినట్టుంది. తప్పక రాస్తూ ఉండండి.

  3. అతడు, నేను, అతడి కథ గురించి Maddipati Krishna Rao అభిప్రాయం:

    03/01/2009 8:46 am

    రచనకు వన్నె తెచ్చేది విమర్శకుడని విన్నాను. మన భాగ్యమేమోగానీ, తెలుగులో విమర్శ ఎక్కువగా దూషణ భూషణాలకే పరిమితమైపోయింది. కథను ఆస్వాదించడంలో పాఠకుడి పాత్ర ఎంతో ఉన్నా ఆ పాత్ర నిర్వహణకు తర్ఫీదునిచ్చే వ్యాసాలు నాకున్న పరిమిత అనుభవంలో చాలా తక్కువ చూశాను. చాలా సంవత్సరాల క్రితం నాదగ్గర పనిచేసిన ఒక స్టూడెంటు music appreciation class తీసుకుంటున్నాను అంటే తేలిగ్గా గ్రేడు సంపాదించడానికనుకున్నాను, అప్పట్లో. “నా కళ్ళతో చూడ”మన్నట్టు పాఠకులకు మంచి సులోచనాలందించిన మాధవ్ కు ధన్యవాదాలు.

    కృష్ణారావు

  4. విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి vrveluri అభిప్రాయం:

    03/01/2009 8:38 am

    ఈ పుస్తక ప్రచురణ గురించి మరొక ముఖ్య విషయం మనవి చేస్తున్నాను.
    శ్రీ కొడవళ్ళ హనుమంత రావు గారు ఇచ్చిన భూరి విరాళం మూలంగానే ఈ పుస్తక ప్రచురణ సాధ్యం అయ్యింది.

    వేలూరి వేంకటేశ్వర రావు.

  5. కథ దేని గురించి? గురించి baabjeelu అభిప్రాయం:

    03/01/2009 8:20 am

    “వస్తువు గురించి చెప్పే విధానం వ్యాసానికి ఎంత దూరంగా వుంటే అంత మంచిదని మాత్రమే నా వుద్దేశ్యం”
    మంచి వుద్దేశ్యవేఁ. అయితే ఇప్పుడెవరు కథలు రాస్తున్నారు?. వ్యాసాలే రాస్తున్నారు.
    విరసం వారి పుణ్యవాఁని, రావిశాస్త్రి గారు, కుటుంబరావు గారు మరియూ కారా మేష్టారు గారు స్థాయిలో కథలు రావడం మానీసి ముప్ఫైయేళ్ళవుతున్నయి గదా?
    మధ్యలో నామిని, వంశీ ల్లాటి వాళ్ళు ఏవో గిలికినా.

  6. మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి chavakiran అభిప్రాయం:

    03/01/2009 8:14 am

    బాగా వ్రాస్తున్నారు. నెనర్లు. మీ ఆసక్తి ప్రతి పేజీలోను ద్యోతమౌతుంది.

  7. బోడి పద్యం గురించి baabjeelu అభిప్రాయం:

    03/01/2009 8:05 am

    అఫ్సరుడు గారికి. (“వరద” లో కొట్టుకొచ్చిన ప్రయోగం ఇది)
    గురుతుల్యులు లాటి వారు తప్ప మరొహళ్ళు ఈ “బోడి పద్యానికి” టీకా టిప్పణీ ఇవ్వలేరు.
    “సగం దళితం సగం ఖండితం” అంటే?
    “సగానికి కూలిన మసీదు గోడ మీద
    పడీ పడీ ఏడుస్తున్నాను ఇవ్వళ్టికీ” అంటే? ఎందుకూ?
    “ఆ సగం ముక్కకి ఎప్పుడో మోక్షం దొరికింది కదరా” హమ్మయ్య. మిగిలిన ముక్క సంగతి?
    ఈ మాటకి ధన్యవాదాలు.

  8. నిశ్శబ్దం గురించి baabjeelu అభిప్రాయం:

    03/01/2009 7:30 am

    రవికిరణ్ గారూ,

    అద్భుతవైఁన “ఎమోషన్” నిస్సందేహంగా. నిశ్శబ్దంగా మీ “ఎమోషన్” ని చదవడం బానే వుంది.

    శిల్పం సంగతి?? (వల్లంపాటి వారు లేరు. తెలిసిన వాళ్ళు ఎందుకో విమర్శ గురించి మాటాడ్డం మానీసేరు) నా మట్టుకు నాకు “అతడు-ఆమె” వ్యవహారంలా అనిపిస్తోంది. కానీ మొదటి ఖండిక అతడుది. రెండో ఖండిక ఆమెది. మూడో ఖండిక నిస్సందేహంగా ఆతడిది. నాలుగో ఖండిక ఖచ్చితంగా ఆమెదే.

    విడివిడిగా వుంటే వున్న తక్కువేవిటి? కలిపి వొక కవితగా వేయడం వల్ల వచ్చిన ఎక్కువ ఏఁవిటీ?

    ఇలాటివి చదివినప్పుడు “పచ్చి ఎమోషన్” ని కవిత్వమని ఎటుల యననొప్పు అని క్రొశ్నించాలనిపిస్తుంది. మీరు నిరంకుశులు. చదివేవాళ్ళు?

    ఏదేవైఁనా. మీ “రౌడీ” పదప్రయోగాలు, మర్యాదస్థులికి ఇబ్బందేమో?

  9. అతడు, నేను, అతడి కథ గురించి అక్కిరాజు భట్టిప్రోలు అభిప్రాయం:

    03/01/2009 6:08 am

    భగవంతం కథ చదవటమే కాదు. ఆయనతో మాట్లాడటమూ ఓ అనుభవమే. చుట్టూ ఉండే మామూలు విషయాలు కూడా అద్భుతంగా, అందంగా, తార్కికంగా, వికారంగా, ఊహించలేనట్టుగా చూడగలడు.
    చాలామంది మన రచయితలు కోల్పోయిన మామూలుతనాన్ని కాపాడుకో గలగడమే భగవంతం గొప్పదనం.

    -అక్కిరాజు

  10. కథ దేని గురించి? గురించి akella ramakrishna అభిప్రాయం:

    03/01/2009 6:05 am

    ఈ రచయిత ఏమి చెప్పదలుచుకున్నది ముందు అనుకోలేదు. చదివితే అలాగే అనిపించింది. నా ఉద్దేశములో కథల్ని కొన్ని రకాలుగా విభజించడం అంత సులువైన పని కాదు. కథ ముఖ్యోద్దేశం కథ కథకూ మారుతుంది. వస్తువూ, శైలీ కంటే కూడా ఆ కథ పాఠకులకు ఎంత నచ్చిందనేది ముఖ్యం. మనస్సులను రంజింపగలిగితే అది మంచి కథే అవ్వాలి.