పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. తడి గురించి M.S.Prasad అభిప్రాయం:

    04/15/2009 3:53 am

    ఈ కధ చాలా చాలా బాగుంది. జీవితం బుద్బుదప్రాయం అని తెలుసుకొని మనం చేయదలుచుకున్న మంచి పనిని ఎప్పుడూ దాటవేయరాదని నీతి గ్రహించాలి. హృదయాన్ని కదిలించే ఉత్తమ కధానికల్లో ఇది ఒకటి.

  2. నన్నెచోడుని క్రౌంచపదము గురించి M.S.Prasad అభిప్రాయం:

    04/15/2009 2:01 am

    మోహన రావు గారికి
    మీ వ్యాసం చాలా బాగుంది. క్రౌంచపద వృత్తానికి లక్షణాలేవో మాత్రం నాకు తెలియలేదు. మీరు వ్యాసంలో తెలిపినదానినీ ఉదాహృతప్రాచీన పద్యాలనీ పోల్చి చూస్తే సరిపోక లక్షణాలు ఇంకా సంశయంలో పడేస్తున్నాయి. ఐతే మీరు వ్రాసిన పద్యం మాత్రమే క్రౌంచపద లక్షణానికి లక్ష్యంగా భావిస్తున్నాను. ఈ క్రింది పద్యం ఒకసారి చూసి క్రౌంచపద లక్షణాలు కలిగినదేనా అన్నది తెలుపవలిసింది. నా అవగాహనలో ఏమైనా తప్పుంటే దిద్ద వలసింది.

    దేవగణేశా! దుష్ట వినాశా! స్థిరగుణ! సురగణ వినుత! మహేశా!
    భావభవారీ! శతృ విదారీ! భవహర! రజత గిరివర విహారీ!
    పావన మూర్తీ! భద్ర సుకీర్తీ! పరమపద భవన! దళిత శ్రితార్తీ!
    శ్రీవర వంద్యా! శ్రీద యనింద్యా! శివమయ!విహృత దురిత ఘన మాంద్యా!

  3. ‘అపు సంసార్ ‘ – సత్యజిత్ రాయ్ సినిమా గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    04/14/2009 9:54 am

    కత్తి మహేష్ కుమార్ గారికి:

    వ్యాసం బాగుంది అంటూనే నిరాశ పరచిందన్నారు! అర్ధం కాలేదు నాకు. నేను రాయ్ సినిమాలపై కొత్తగా ఎక్కువ చెప్పటం లేదు అన్న విషయం, వ్యాసం చివర ఇచ్చిన పుస్తకాల లిష్టు చూసి, అందులో ఉన్న పుస్తకాలు చదివినవారికి అది తెలుసు కదా!

    నా అభిప్రాయంలో ఎక్కువ మంది చిత్రదర్శకుల గురించి తెలుసుకోటం కన్నా, ఒకరిద్దరు దర్శకుల గురించి లోతుగా అధ్యయనం చేసి అది ఇతరులతో పంచుకుంటే మంచిది అనిపిస్తుంది. ప్రస్తుతం, సినిమా ప్రపంచంలో రాయ్‌కి ఉన్న బహుముఖత్వం మీద ఒక వ్యాసం రాసే ఆలోచన ఉంది.

    రాయ్‌కి ఉన్న పరిపూర్ణత్వం

    చాలా మంది చిత్ర దర్శకులకి సినిమా తియ్యటంలో ఉన్న ఒకటి, రెండు అంశాలపై సాధికారత ఉంటుందేమో! సత్యజిత్ రాయ్ అలా కాదు. సినిమా నిర్మాణంలో ఉన్న – నటనా దర్శకత్వం, సిన్మాటొగ్రఫీ (కెమేరా పనితనం), ఎడిటింగ్, కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, రూపకల్పన (డిజైన్), కళా దర్శకత్వం, కాంతిని దానితో పాటు శబ్దాన్ని ఉపయోగించే తీరు – వంటి విభిన్న అంశాలలో నిష్ణాతుడు కావటంతో రాయ్ సినీప్రపంచంలో ఒక పరిపూర్ణతను సాధించాడనిపిస్తుంది. ఇంత బహుముఖత్వానికి బీజం – సినిమా మాధ్యమాన్ని మథించాలి అన్న పట్టుదలే!

    పైన చెప్పిన విషయాల ఆధారంగా త్వరలో ఒక వ్యాసం మిత్రులతో పంచుకోవాలని ఆశ.

    పనికొచ్చే చిత్రాలు (అంటే నాకు అర్ధం కాలేదు), ప్రజలను అబ్బురపరచే చిత్రాలపై వ్యాసాలు రాయగల సత్తా నాకు లేదు. ఆ సినిమాలు నా వద్ద లేవు.

    లక్ష్మన్న

  4. తడి గురించి రవిచంద్ర అభిప్రాయం:

    04/12/2009 1:23 am

    కథ చాలా ఉత్తేజితుల్ని చేసేదిగా ఉంది. నిజజీవితంలో హరి లాంటి పాత్రలు నాకు కూడా ఎన్నో తారసపడ్డాయి. ఈ కథలో రచయిత వ్యక్తపరిచిన అభిప్రాయాలు నా మనసుకు అద్దంలా కనిపించాయి.

  5. రామా కనవేమిరా! గురించి రవిచంద్ర అభిప్రాయం:

    04/12/2009 12:59 am

    కథాంశం పెద్ద ఆసక్తి కరంగా లేదు. ఈ కథ ద్వరా రచయిత ఏమి చెప్పదలుచుకున్నాడో అర్థం కాలేదు.

  6. ‘అపు సంసార్ ‘ – సత్యజిత్ రాయ్ సినిమా గురించి కె.మహేష్ కుమార్ అభిప్రాయం:

    04/11/2009 5:59 am

    వ్యాసం బాగుంది. కానీ మీరు కొత్తగా చెప్పిందేమీ లేదనిపించింది. కొంత నిరాశ కలిగింది. రే,బెనెగల్,మృణాల్ సేన్ ల గురించి ఎంతకాలమని చెప్పిందే చెప్పుకుంటాం? కొత్త దర్శకులు లేరా? మీ అభిరుచికి తగిన కళాఖండాలు కాకపోయినా, పనికొచ్చే సినిమాలు, ప్రజలను అబ్బురపరచిన చిత్రాలు లేవా?

  7. తెల్ల కాయితం గురించి రవిచంద్ర అభిప్రాయం:

    04/11/2009 3:34 am

    కథాంశం చాలా బాగుంది. నేను చదువుకునేటప్పుడు దీనికి పోలిన సంఘటనే ఒకటి జరిగింది. కాబట్టి సహజత్వానికి దగ్గరగా లేదంటే నేను అంగీకరించను.

  8. ఇద్దరు దుర్మార్గులు గురించి Mrithyunjayarao అభిప్రాయం:

    04/09/2009 11:55 pm

    కథ చాలా బాగుంది. కథలొ ఉన్న పాత్రల్ని విటుడు, వేశ్య, గృహిణి అని విభజించడం సరికాదనుకుంటాను. అన్వేషి, సహచరి, మార్గదర్శకురాలు అని చూడాలనుకుంటాను. ఆనందాన్ని వెదికేవాడు తాత్త్వికుడేకానీ విటుడు కాదు గదా! రచయిత మీద భారతీయ ఆలోచనా ప్రభావం ఉన్నట్టుగా అనిపిస్తోంది. మంచి రచన. కొనసాగించండి.
    మృత్యుంజయరావు పిన్నమనేని.

  9. అతడు, నేను, అతడి కథ గురించి Meher అభిప్రాయం:

    04/08/2009 5:50 am

    మంచి కథను పరిచయం చేసినందుకు మాధవ్‌గారికి నెనరులు. నేను యిటీవలే అరకు వెళ్ళాను. అంత విశృంఖలమైన ప్రకృతి ఎవరినైనా కదిలిస్తుంది. రచయితలకైతే సహజంగానే ఏదో ఒకటి రాయాలన్న ఉద్దీపన కలిగిస్తుంది. నేనూ ఏదో ఒకటి రాయాలనుకున్నాను. కానీ నేనేం రాసినా ఇందులో శతసహస్రాంసమైనా అయ్యుండేది కాదు. ఆ నేపథ్యాన్ని ఇంత అద్భుతమైన ఉద్దేశ్యానికి వాడుకోగలిగేవాణ్ణి కాదు. కథ అర్థం అవడమూ అర్థం కాకపోవడమూ తరువాతి సంగతి; ముందు చదువరి ఈ కథని పూర్తిగా ఆస్వాదించాలంటే, విశాఖపట్నం నుంచి అరకుకి రైలు మార్గంలో ఒక్కసారైనా ప్రయాణించి వుండడం అతని కనీస అర్హత. మాధవ్‌గారు చూడలేదు కాబట్టే కథని ఒక పార్శ్వం లోంచే ఆస్వాదించగలిగారు. నేనైతే ఆ టన్నెల్స్‌‌‌‌‍లోంచి కూడా నడిచాను. అదో వింత అనుభవం.

    “ఇదంతా నాన్సెన్స్ అంటే ఏం చెప్పను? అర్ధం కాని వన్నీ గొప్పవేనా అంటే ఏం చెప్పను? ‘పర్సెప్షన్ ఆఫ్ క్వాలిటీ’ మనకు ఉంటుందని నేననుకుంటాను.”

    ఇది నిజం. కొన్ని కళరూపాలు అర్థం కాకపోతే అది వాటి తప్పే అనిపిస్తుంది. మరికొన్నింటి విషయంలో మాత్రం, మనం సరైన దృక్పథం లోంచి చూడలేదు కాబట్టి అర్థం కాలేదనిపిస్తుంది; మనదే లోపమనిపిస్తుంది. ఈ “పర్సెప్షన్ ఆఫ్ క్వాలిటీ” మనకు సాధనతోనే సంక్రమిస్తుంది.

  10. మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి రవిచంద్ర అభిప్రాయం:

    04/08/2009 3:02 am

    సాయి బ్రహ్మానందం గారికి!

    త్యాగరాజుపై సమగ్ర సమాచారం అందించినందుకు అందుకోండి నా మన:పూర్వక అభినందనలు. ఇదేలాగా కర్ణాటక సంగీతాన్ని గురించి, సమగ్ర వ్యాసాన్ని కూడా చూడాలని నా ఆశ. ఇది చిన్నపని కాదు అని తెలుసు. కానీ దీనివల్ల ప్రపంచంలో అతి ప్రాచీనమైన సంగీత సాంప్రదాయాన్ని, మాకందరికీ పరిచయం చేసినట్లవుతుంది.

    అభినందనలతో
    రవిచంద్ర