మీరు బి.వి.రామన్ గారు గాంధి గురించి వ్రాసిన దానిని ఎగతాళి చేసారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని మర్చి పోతున్నారు. జాతకము లోని వివిధ కాంబినేషన్ల బట్టి వివిధ విషయములు చూడాలి. ద్వాదశం, శయ్య సుఖము, మోక్షము, వ్యయము లను సూచించును. ఆత్మ కారకుడు మోక్షస్థానములో ఉండటము వలన అధ్యాత్మికత గురించిన ప్రస్తావన సరియేగదా. ఇది మీరన్నట్లు 2+2=4 లాగా కాదు కదా. వివిధ సిధ్ధాంతములు మనకు సూచకములే (గైడులైనులే).
ఇంకొక సంగతి: డీన్ చేసిన ప్రయోగం చాలా సరళమైనది. ఒక జాతకం సరిగా చెప్పాలంటే, వివిధ వర్గ (రాశి, నవాంశ, దశాంశ, …), ఏ విషయము కావలయునో ఆ దశ భుక్తి తదితర విచారము, గోచార, తిథి ప్రవేశ ఫల నిర్ణయము ఇటువంటి వివిధ ప్రకార చింతనము ఆవశ్యకము. అంచేత, డీన్ ప్రయోగ ఫలితము నాకు అంత ఆశ్చర్యము కలిగింపలేదు. అదీ కాక, ఆయన నమ్మకము అధికమని నిరోపించాడే కాని జ్యోతిష్యము పని చేయదని నిరూపించలేదని నా అభిప్రాయము.
నా అభిప్రాయము ఏమన జ్యోతిష్యము ఎడ్యుకేటెడ్ గెస్ చేయటానికి సాయం చేస్తుంది.
మోహన రావు గారికి
మీ వ్యాసం సంస్కృత వృత్త ఛందస్సుల నభ్యసించే విద్యార్ధులకు లక్షణ లక్ష్య సముపేతమైన పాఠ్యగ్రంధం వంటిది. అభ్యాసకులకు రిఫరెన్స్ బుక్. అంతే కాక వృత్తాల పూర్వాపరాలు,తత్సంబంధిత కధలు చాలా హృద్యంగా ఉండి పాఠకులను చదివింపచేస్తాయి. జగద్గురు శంకరాచార్యులు వారు రచించిన దేవీ దేవతా స్తోత్రాలను నిత్య పూజా విధానంలో భాగంగా అనుసంధించని హైందవ కుటుంబం ఉండదు. ఐతే ఈ స్తోత్రాలలో ఇమిడివున్న వృత్తాల పేరులు ఇప్పుడు తెలిసుకొని ఆ పరిజ్ఞానం మా కందించిన మీకు అనేకానేక కృతజ్ఞతలు.
ముఖ్యంగా శ్లోకాలలో పాదానికి 16 అక్షరాలు వుండి మాత్రా చందస్సులో వుంటుంది అనే తప్ప పూర్వర్ధంలో 5,6,7 అక్షరాలు య గణం, అవే ఉత్తరార్ధంలో జ గణం కావాలని నేను మీ వ్యాసం ద్వారానే తెలుసుకున్నాను. కృతజ్ఞుడను. పూజలో నిత్యం అనుసంధీంచే స్వరచిత శ్లోకాలలో ఈ నియమం దైవికంగా అనుసరించబడడం నా అదృష్టం.
దేవ్యపరాధ స్తోత్రం వచనం గా భావించిన నాకు ఇది శిఖరిణీ వృత్తం అని తెలిసి ఆశ్చర్యం కలిగించింది. అక్కడక్కడా క్రమబద్ధమైన లయ గమనించినా అంతా ఒక క్రమంలో వున్నదని గమనించలేదు. ముద్రించిన వారి లోపాలు ఇందుకు కారణం కావచ్చును.
మాధవ్ గారికి
స్పందన తెలుపమన్నందుకు ఈ క్రింది రెండు మాటలు…
“కొందరు శబ్దాలకు తలూపుతారు. కొందరు శబ్దాలకు నాట్యం చేస్తారు. కొందరు శబ్దాలకు ‘చెవి’ విరుస్తారు. కాని కొందరు నిశ్శబ్దసౌందర్యాన్ని దర్శించడం కోసం శబ్దలోకయాత్ర మొదలుపెడతారు.
చివరివారికి లోయలు స్వాగతం పలుకుతాయి. మీకు స్వాగతం పలికిన లోయల్ని పరిచయం చేసుకున్నాను. సంతోషం.
ఈ కథ గురించి రచయితగా చెప్పడానికి ఏమీలేదు. ఎవరి లోయల మీద ఎగురుతొన్న పక్షుల రెక్కల చప్పుళ్ళని వారి రక్తంలోకి అనువదించుకుని ఆనందించడమే…
ప్రసాద్ గారికి నమస్కారం – మీరు రాసింది బాగానే ఉంది. చివరి పాదంలో దురితలోని రితో యతి సరిపోదు. సామాన్యముగా శ్రీకు రికు యతి చెల్లుతుంది. కాని పాదంలో ఒక యతికంటె ఎక్కువగా ఉంటే, మొదటి
అక్షరము సంయుక్తాక్షరమయితే అందులో ఒక అక్షరంతోనే పాదమంతా యతి చెల్లించాలి. అంటే దురితలోని రికు బదులు శీ అక్షరముతో యతి చెల్లించాలి. నా ఈమెయిలు చిరునామా jkmrao@yahoo.com
అక్కడికి మీరు రాస్తే మిగిలిన విషయాలను చర్చించుకోవచ్చు.
విధేయుడు – మోహన
ప్రసాద్ గారూ నమస్కారం – ఈ వ్యాసం అంటే నాకు ఇష్టం. ఇదే ఈమాటలో నా మొదటి వ్యాసం. ఇలాటి రచనలకు ప్రోత్సాహం ఇచ్చింది వేలూరి గారు, మిగిలిన ఈమాట సంపాదక వర్గం. సుమారు మూడు సంవత్సరాల
తరువాత దీనిపైన మొట్టమొదటి అభిప్రాయం వ్రాసిన మీకు కృతజ్ఞతలు. మీ పద్యం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. నాకు ఎక్కువ సిగ్గు కలిగించకండి. అది సరే కానీ, ఇంత చక్కగా పద్యాలు వ్రాస్తున్నారు. మీరెందుకు ఈమాటలో ప్రచురించరాదు? సంపాదకులు వింటున్నారా?
విధేయుడు – మోహన
మీ వ్యాసం ఆద్యంతం హృద్యంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగించింది. ఒక్కొక్క రసంలో ఉదహరించిన పద్యాలను చదువుతూంటే అవే రసాలలో ఇతర మహా కవులు ఇతర కావ్యాలలో అనేక సందర్భాలలో రచించిన ఇతర మత్తేభాలు స్మృతిపధంలో కుమ్ముకులాడుతు వచ్చాయి. దేనికదే సాటి. అన్నిటినీ ఉదహరించలేరు గదా అనిపించింది.
మోహన రావు గారికి,
మీ సద్యో ప్రత్యుత్తరానికి కృతజతలు. ముఖ్యంగా పద్య లక్షణాలను సరిగా తెలియజేసినందుకు. నాకు ఇవి వ్యాసం చదివినపుడు అవగతం కాలేదు. సరిచేసిన పద్యాన్ని క్రింద వ్రాసాను నా అవగాహన పూర్ణమేనా చూడండి
మీకున్న చందో పరిజ్ఞానాన్ని తెలుసుకున్న తరువాత ఒక చిన్న సంశయం తీర్చుకోవాలనుంది. దండకానికి లక్షణం తెలియచేయ (గల)రా. అనేక త గణాల తరువాత కొన్ని (ఒకటో రెండో) న గణాలు కనబడతాయి. న గణ ప్రయోగమే లేకుండా కేవల త గణాలతో దండకం వ్రాస్తే తప్పవుతుందా?
ఈ మాట సంపాదకులకు – అయ్యా ! ప్రచురితమైన వ్యాసాలతో సంబంధం లేకుండా మా వ్యక్తిగతమైన సంశయాలకు సమాధానం పొందాలంటే మేము ఏమి చెయ్యాలో తెలియపరచగలరు.
[ఈమాటలో ఇటువంటి ప్రశ్నలకూ, అభిప్రాయ చర్చలకూ ఒక ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. పాఠకులకు త్వరలోనే తెలియజేయగలం. – సం.]
మీరు కొత్తగా ఏమీ చెప్పకపోవడమే నన్ను నిరాశపరిచిన విషయం. పదిమంది ఇలా చెప్పారు కాబట్టి రే సినిమా ఇలాంటిది అని చెప్పడం film appreciation లేక film studies కోర్సుల్లో assignments చెయ్యడానికి పనికివచ్చే తరహా. అందువల్ల కొత్తగా రే కిగానీ పాఠకుడిగా నాకుగానీ ఒరిగిందేమీ లేదు. కొత్తగా తెలుసుకున్నది అసలు లేదు. రే గురించి “మీరు” కొత్తగా చెప్పేది ఏమీ లేకపోతే అక్కడిదీ ఇక్కడిదీ కూర్చి,పేర్చి చెప్పడం ఎందుకని నా ప్రశ్న. సమకాలీన చిత్రాలు, భారతీయ సినిమాను కొంత పుంతలు తొక్కిస్తున్న సినిమాలు ఇన్ని వస్తుండగా,వాటినన్నీ వదిలేసి ఇంకా రే perfection ని పరిచయం చేస్తాను అంటే, ఏంచేద్ధాం! అని నా అసహనాన్ని వ్యక్తపరిచాను.
ప్రసాద్ గారికి – మీ పద్యం బాగుంది. ఒక రెండు సూచనలు – మొదటి అర్ధ భాగంలో ప్రాసయతి ఉండాలి. దేవ గణేశా భావజనాశా అని ఉంటే ప్రాసయతి చెల్లుతుంది. అలాగే మిగిలిన పాదాలకు. రెండవ అర్ధ భాగంలో రెండు యతులు ఉన్నాయి.. వినుతకు బదులు దే అక్షరానికి యతి సరిపోయేటట్లు వాడాలి. సురనుత త్రిజగ జనేశా అని రాయవచ్చును. మరొకటి. నాలుగు నాలుగు మాత్రలు ఉండేటట్లు పదాలను విరిచి రాస్తే పాడడానికి అనుకూలంగా ఉంటుంది. అలా రాయక పోతే తప్పని కాదు. నన్నెచోడుడే ఈ నియమాన్ని పాటించలేదు. సంగీతములో నాట్యములో క్రౌంచపదం ఉంది కాబట్టి ఇలా రాస్తే బాగుంటుంది.
విధేయుడు – మోహన
సీతారాముడి “శివదర్పణం” గురించి vinay అభిప్రాయం:
04/18/2009 3:49 pm
చాలా చక్కగా వర్ణించారు.Thank you.
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 2 గురించి Vijaya KLNR Pingali అభిప్రాయం:
04/18/2009 10:49 am
మీరు బి.వి.రామన్ గారు గాంధి గురించి వ్రాసిన దానిని ఎగతాళి చేసారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని మర్చి పోతున్నారు. జాతకము లోని వివిధ కాంబినేషన్ల బట్టి వివిధ విషయములు చూడాలి. ద్వాదశం, శయ్య సుఖము, మోక్షము, వ్యయము లను సూచించును. ఆత్మ కారకుడు మోక్షస్థానములో ఉండటము వలన అధ్యాత్మికత గురించిన ప్రస్తావన సరియేగదా. ఇది మీరన్నట్లు 2+2=4 లాగా కాదు కదా. వివిధ సిధ్ధాంతములు మనకు సూచకములే (గైడులైనులే).
ఇంకొక సంగతి: డీన్ చేసిన ప్రయోగం చాలా సరళమైనది. ఒక జాతకం సరిగా చెప్పాలంటే, వివిధ వర్గ (రాశి, నవాంశ, దశాంశ, …), ఏ విషయము కావలయునో ఆ దశ భుక్తి తదితర విచారము, గోచార, తిథి ప్రవేశ ఫల నిర్ణయము ఇటువంటి వివిధ ప్రకార చింతనము ఆవశ్యకము. అంచేత, డీన్ ప్రయోగ ఫలితము నాకు అంత ఆశ్చర్యము కలిగింపలేదు. అదీ కాక, ఆయన నమ్మకము అధికమని నిరోపించాడే కాని జ్యోతిష్యము పని చేయదని నిరూపించలేదని నా అభిప్రాయము.
నా అభిప్రాయము ఏమన జ్యోతిష్యము ఎడ్యుకేటెడ్ గెస్ చేయటానికి సాయం చేస్తుంది.
శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము గురించి M.S.Prasad అభిప్రాయం:
04/16/2009 11:51 pm
మోహన రావు గారికి
మీ వ్యాసం సంస్కృత వృత్త ఛందస్సుల నభ్యసించే విద్యార్ధులకు లక్షణ లక్ష్య సముపేతమైన పాఠ్యగ్రంధం వంటిది. అభ్యాసకులకు రిఫరెన్స్ బుక్. అంతే కాక వృత్తాల పూర్వాపరాలు,తత్సంబంధిత కధలు చాలా హృద్యంగా ఉండి పాఠకులను చదివింపచేస్తాయి. జగద్గురు శంకరాచార్యులు వారు రచించిన దేవీ దేవతా స్తోత్రాలను నిత్య పూజా విధానంలో భాగంగా అనుసంధించని హైందవ కుటుంబం ఉండదు. ఐతే ఈ స్తోత్రాలలో ఇమిడివున్న వృత్తాల పేరులు ఇప్పుడు తెలిసుకొని ఆ పరిజ్ఞానం మా కందించిన మీకు అనేకానేక కృతజ్ఞతలు.
ముఖ్యంగా శ్లోకాలలో పాదానికి 16 అక్షరాలు వుండి మాత్రా చందస్సులో వుంటుంది అనే తప్ప పూర్వర్ధంలో 5,6,7 అక్షరాలు య గణం, అవే ఉత్తరార్ధంలో జ గణం కావాలని నేను మీ వ్యాసం ద్వారానే తెలుసుకున్నాను. కృతజ్ఞుడను. పూజలో నిత్యం అనుసంధీంచే స్వరచిత శ్లోకాలలో ఈ నియమం దైవికంగా అనుసరించబడడం నా అదృష్టం.
దేవ్యపరాధ స్తోత్రం వచనం గా భావించిన నాకు ఇది శిఖరిణీ వృత్తం అని తెలిసి ఆశ్చర్యం కలిగించింది. అక్కడక్కడా క్రమబద్ధమైన లయ గమనించినా అంతా ఒక క్రమంలో వున్నదని గమనించలేదు. ముద్రించిన వారి లోపాలు ఇందుకు కారణం కావచ్చును.
భుజంగ ప్రయాతాది ఛందేషు పూర్వం
నిజేష్టేశ్వ రారాధనం భక్తి పూర్ణో (అ)
సృజం యేషు తజ్జ్ఞాన దాతార మార్యం
భజామ్యద్య బెజ్జాల కృష్ణం మహంతం
(పూర్వం యేషు భుజంగ ప్రయాతాది ఛందేషు భక్తి పూర్ణో నిజేష్టేశ్వ రారాధనం (అహమ) అసృజం, అద్య తత్ (నామ) జ్జ్ఞాన దాతారం, ఆర్యం, మహంతం బెజ్జాల కృష్ణం భజామి.)
సంస్కృతే శ్లోక నిర్మాణ క్రియా వాంఛిత లక్షణ
పరిజ్ఞాన ప్రదాతారం కృష్ణం వందే సుధీనిధీం
భవదీయుడు
అతడు, నేను, అతడి కథ గురించి B H A G A V A N T A M అభిప్రాయం:
04/16/2009 11:00 pm
మాధవ్ గారికి
స్పందన తెలుపమన్నందుకు ఈ క్రింది రెండు మాటలు…
“కొందరు శబ్దాలకు తలూపుతారు. కొందరు శబ్దాలకు నాట్యం చేస్తారు. కొందరు శబ్దాలకు ‘చెవి’ విరుస్తారు. కాని కొందరు నిశ్శబ్దసౌందర్యాన్ని దర్శించడం కోసం శబ్దలోకయాత్ర మొదలుపెడతారు.
చివరివారికి లోయలు స్వాగతం పలుకుతాయి. మీకు స్వాగతం పలికిన లోయల్ని పరిచయం చేసుకున్నాను. సంతోషం.
ఈ కథ గురించి రచయితగా చెప్పడానికి ఏమీలేదు. ఎవరి లోయల మీద ఎగురుతొన్న పక్షుల రెక్కల చప్పుళ్ళని వారి రక్తంలోకి అనువదించుకుని ఆనందించడమే…
భగవంతం
16.04.2009.
నన్నెచోడుని క్రౌంచపదము గురించి mOhana అభిప్రాయం:
04/16/2009 7:20 am
ప్రసాద్ గారికి నమస్కారం – మీరు రాసింది బాగానే ఉంది. చివరి పాదంలో దురితలోని రితో యతి సరిపోదు. సామాన్యముగా శ్రీకు రికు యతి చెల్లుతుంది. కాని పాదంలో ఒక యతికంటె ఎక్కువగా ఉంటే, మొదటి
అక్షరము సంయుక్తాక్షరమయితే అందులో ఒక అక్షరంతోనే పాదమంతా యతి చెల్లించాలి. అంటే దురితలోని రికు బదులు శీ అక్షరముతో యతి చెల్లించాలి. నా ఈమెయిలు చిరునామా jkmrao@yahoo.com
అక్కడికి మీరు రాస్తే మిగిలిన విషయాలను చర్చించుకోవచ్చు.
విధేయుడు – మోహన
ఏనుగుల ఆటలా – నవరసాలకు బాటలా? గురించి mOhana అభిప్రాయం:
04/16/2009 5:48 am
ప్రసాద్ గారూ నమస్కారం – ఈ వ్యాసం అంటే నాకు ఇష్టం. ఇదే ఈమాటలో నా మొదటి వ్యాసం. ఇలాటి రచనలకు ప్రోత్సాహం ఇచ్చింది వేలూరి గారు, మిగిలిన ఈమాట సంపాదక వర్గం. సుమారు మూడు సంవత్సరాల
తరువాత దీనిపైన మొట్టమొదటి అభిప్రాయం వ్రాసిన మీకు కృతజ్ఞతలు. మీ పద్యం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. నాకు ఎక్కువ సిగ్గు కలిగించకండి. అది సరే కానీ, ఇంత చక్కగా పద్యాలు వ్రాస్తున్నారు. మీరెందుకు ఈమాటలో ప్రచురించరాదు? సంపాదకులు వింటున్నారా?
విధేయుడు – మోహన
ఏనుగుల ఆటలా – నవరసాలకు బాటలా? గురించి M.S.Prasad అభిప్రాయం:
04/16/2009 1:01 am
మోహనరావు గారికి
మీ వ్యాసం ఆద్యంతం హృద్యంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగించింది. ఒక్కొక్క రసంలో ఉదహరించిన పద్యాలను చదువుతూంటే అవే రసాలలో ఇతర మహా కవులు ఇతర కావ్యాలలో అనేక సందర్భాలలో రచించిన ఇతర మత్తేభాలు స్మృతిపధంలో కుమ్ముకులాడుతు వచ్చాయి. దేనికదే సాటి. అన్నిటినీ ఉదహరించలేరు గదా అనిపించింది.
హృదయాహ్లాదన రాగమై, నవరసార్ద్రానంత సంయోగమై
విదితానేక మనోజ్ఞ భావ కలనా విభ్రాజితాభోగమై
మద మత్తేభ గతిన్ వచించితిరి ఈ మత్తేభ విక్రీడితం
బు దయన్ గైకొనుడిత్తు మోహన సుధా పూర్ణాఛ్ఛ ఛందోనిధీ!
నన్నెచోడుని క్రౌంచపదము గురించి M.S.Prasad అభిప్రాయం:
04/15/2009 10:36 pm
మోహన రావు గారికి,
మీ సద్యో ప్రత్యుత్తరానికి కృతజతలు. ముఖ్యంగా పద్య లక్షణాలను సరిగా తెలియజేసినందుకు. నాకు ఇవి వ్యాసం చదివినపుడు అవగతం కాలేదు. సరిచేసిన పద్యాన్ని క్రింద వ్రాసాను నా అవగాహన పూర్ణమేనా చూడండి
దేవగణేశా!భావజ నాశా! స్థిరమత! సురభృత! త్రిగుణ వినాశా!
భావభవారీ! శ్రీవర ధారీ! భవహర! పురహర! వరగుణ హారీ!
పావన మూర్తీ! హే విహృతార్తీ! పరమపద భవన పరిచిత కీర్తీ!
శ్రీవర వంద్యా! దేవ! యనింద్యా! శివమయ!విహృత దురిత ఘన మాంద్యా!
మీకున్న చందో పరిజ్ఞానాన్ని తెలుసుకున్న తరువాత ఒక చిన్న సంశయం తీర్చుకోవాలనుంది. దండకానికి లక్షణం తెలియచేయ (గల)రా. అనేక త గణాల తరువాత కొన్ని (ఒకటో రెండో) న గణాలు కనబడతాయి. న గణ ప్రయోగమే లేకుండా కేవల త గణాలతో దండకం వ్రాస్తే తప్పవుతుందా?
ఈ మాట సంపాదకులకు – అయ్యా ! ప్రచురితమైన వ్యాసాలతో సంబంధం లేకుండా మా వ్యక్తిగతమైన సంశయాలకు సమాధానం పొందాలంటే మేము ఏమి చెయ్యాలో తెలియపరచగలరు.
[ఈమాటలో ఇటువంటి ప్రశ్నలకూ, అభిప్రాయ చర్చలకూ ఒక ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. పాఠకులకు త్వరలోనే తెలియజేయగలం. – సం.]
‘అపు సంసార్ ‘ – సత్యజిత్ రాయ్ సినిమా గురించి కె.మహేష్ కుమార్ అభిప్రాయం:
04/15/2009 7:34 pm
మీరు కొత్తగా ఏమీ చెప్పకపోవడమే నన్ను నిరాశపరిచిన విషయం. పదిమంది ఇలా చెప్పారు కాబట్టి రే సినిమా ఇలాంటిది అని చెప్పడం film appreciation లేక film studies కోర్సుల్లో assignments చెయ్యడానికి పనికివచ్చే తరహా. అందువల్ల కొత్తగా రే కిగానీ పాఠకుడిగా నాకుగానీ ఒరిగిందేమీ లేదు. కొత్తగా తెలుసుకున్నది అసలు లేదు. రే గురించి “మీరు” కొత్తగా చెప్పేది ఏమీ లేకపోతే అక్కడిదీ ఇక్కడిదీ కూర్చి,పేర్చి చెప్పడం ఎందుకని నా ప్రశ్న. సమకాలీన చిత్రాలు, భారతీయ సినిమాను కొంత పుంతలు తొక్కిస్తున్న సినిమాలు ఇన్ని వస్తుండగా,వాటినన్నీ వదిలేసి ఇంకా రే perfection ని పరిచయం చేస్తాను అంటే, ఏంచేద్ధాం! అని నా అసహనాన్ని వ్యక్తపరిచాను.
నన్నెచోడుని క్రౌంచపదము గురించి mOhana అభిప్రాయం:
04/15/2009 11:09 am