వెల్చేరు గారు ఈ వ్యాసంలో కవిత్వమ్లో ఉండే “నిశ్శబ్దాన్ని” నిర్వచించడంలో వెనకబడ్డారో.. లేక ఆయనకే ఆ విషయం లో సరైన స్పష్టత లేదో నాకు బోధపడలేదు గానీ మొత్తంగా ఇస్మాయిల్ ని కవిగా చూపించడంలో వెల్చేరు ఎక్కడో తోవమరిచినట్టున్నారు.
“క్లుప్తత” అన్నదానికి ఎక్కడైనా దానిదైన చోటుంది. కవిత్వం లోనూ జీవితం లోనూ కూడా!! జపనీయుల “హైకూ” లు ఇటువంటి క్లుప్తతతో బొమ్మలంటి రేఖాచిత్రాలని కవిత్వంగా గీసినవే!! అది ఒక తరహా కవిత్వం!
మాటలని మించిన మౌనానికి భాష లేదని నేనను గానీ అది “క్లుప్తత” అయితే కాదు. అదొక తాత్వికత. దాన్ని ఇస్మాయిల్ కవితలో ఎలా చూసారో మరింత వివరంగా వెల్చేరు చెప్పగలిగితే బాగుండేదేమో? అలాంటి కవి ఇస్మాయిల్ అవునో కాడో స్పష్టపడేది కూడాను.
ఇకపోతే కవిత్వంలో ” మాటల” ప్రయోజనం లేదని అనడానికి కూడా కుదరదు. విస్తరించ వలసిన చోట భావంలో “క్లుప్తత” అంతే చికాగ్గా ఉంటుంది.ఈ తారతమ్యం చూపించడంలో విమర్శకుడు విఫలమ్ కావడమ్ తరుచూ జరిగింది. ఇందుకు విమర్శకులు విమర్శకన్నా మించి కవులకి ఎక్కువ ప్రాధన్యం ఇవ్వడం ఒక కారణమ్ బహుశా!! వీళ్ళ మెచ్చుకోళ్ళలోనూ లేదా వీళ్ల దాటివేతలోనూ కూడా ఏ అంతస్సూత్రమూ కనిపించకపోవడం అన్నది విమర్శలోని పెద్ద లోపం !!
నారాయణరావు గారి అభిప్రాయాన్ని అనుసరించామా ” శ్రీశ్రీ” కవి కాడు. “తిలక్” కవి కాడు. అజంతా అసలే కాడు. అలాగే మరి కొందరు మిగతా కవులు కూడాను. శ్రీశ్రీ ” ఆహ:” తప్ప కవితా ఓ కవితా అన్నది కవితే కాకూడదు. అది శబ్ధమయమూ.. మాటల మయమూను. భాషని అతి చిక్కగా తన ఊహాచిత్రాలకి అతికించిన తిలక్ కవిత్వం ఈ లెఖ్ఖన వట్టి మాటల పోగులాగా మారిపోయే పరిస్థితి ఉంది మరి. ఒక కవిది ఒక తరహా కవిత్వం అని చెప్పడమ్ వేరు. అదులోని విశిష్టతని వివరించడమ్ వేరు. మాట ద్వారా ..ధ్వని ద్వారా అందవలసిన ఊహ దగ్గర కవిత్వంలో క్లుప్తతకీ నిశ్శబ్దానికీ పెద్దపీట వేయడమ్ వేరు.అది అన్ని చోట్లా నిజమ్ కాదు గనక. క్లుప్తతని ముందుకు తీసుకుని రావడం కోసం శబ్దశక్తిని తక్కువ చేయనఖ్ఖర లేదు. అయితే తన విమర్శనా శైలిలో ఇలాంటి దూకుడు విమర్శకునిగా వెల్చేరు చూపించడం కొత్త విషయమేమీ కాదు.
ఒక్కోసారి సాదా సీదా వచనంలో “మాటల్లో” సైతం మనసుని మేల్కొలిపే ఒక చిత్రిక పట్టిన భావం మృదువుగా తాకకపోదు. మాట అవసరమ్ ఎంత అని తెలిసి వాడగలగడమే కవితా నాణ్యతకి గుర్తు. అంతే గానీ పికాసా గీతల్లోలాగా మూడే మూడు మాటల్లో చిత్రం గీయడం కవికి అవసరం లేదు. కవి చిత్రకారుడి పాత్రలోకి వెళితే చిత్రకారుడు మాటల్లోంచి చెప్పినట్టు పాఠకునికి చెప్పాలీ అంటే ఎక్కువ రంగులు వాడాలి కాబోలు. అప్పుడక్కడ అదీ ఎబ్బెట్టుగానే ఉంటుంది కాదా??.
మాటకీ మాటకీ మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించడం కవికి సహజంగా తెలుస్తుంది. అప్పుడే మంచి కవిత పుడుతుంది. సరైన మాటలు వాడటమే కవిత్వం!! అందువలన క్లుప్తతా.. నిశ్శబ్దమ్ కవితాస్వాదనకి చాలాసార్లు ప్రతిబంధకాలే అవుతాయి!!
ఇస్మాయిల్ కవిత్వం అంతగా ఆస్వాదయోగ్యమ్ కాలేని కారణమ్ ఈ లక్షణమే!! అందులోనే గొప్పదనం ఉందని ఒక విమర్శకుడు అనవచ్చు. కానీ పాఠకుడు అలా అనుకోలేకపోయినట్టున్నాడు మరి. శ్రీశ్రీని చదివి సంతోషించ గలిగినట్టు.. కృష్ణశాస్త్రిని ఆస్వాదించగలిగినట్టు.. తిలక్ ని అంత సమాసాల పోగులలోంచి కూడా… మెచ్చుకోగలిగినట్టు ఇస్మాయిల్ ని స్వీకరించడం జరగకపోడానికి కారణమూ ఇదే!! అతని అనువాదాలకి వచ్చిన ప్రతిస్పందనతో తెలుగు కవితాప్రియులని అంచనావేసి తక్కువచేయడానికి కుదరదు.
ఇస్మాయిల్ ఇంగ్లీషు లెక్చరర్ గనక ఆ ప్రభావం అతని కవిత్వం మీద ఉండే వీలుంది. తన భావ వ్యక్తీకరణకి ఆయన తెలుగు భాషని ఎన్నుకోవడమ్ అన్నది ఆయనకి మరి ఎందుకని అవసరం అయ్యిందో??
“సృజనల ప్రసారాల్లో భాష – అంటే వర్ణమాల, నిఘంటువు, ప్రతి పదార్ధ విశ్లేషణ మొదలైనవి, టెలిఫోన్ తీగెలు చేసే పని లాంటిదే చేస్తున్నాయి. భాష, ఆలోచన పకోడీలను, పళ్ళ రసాన్నీ కట్టిచ్చే పొట్లాల్లాంటివి. వాటిని విప్పి అవతల పారేసి, లోనున్నదాన్ని ఆస్వాదించవలసి ఉంది. ఈ అనుభవం ఆ సృజనే సాధించుకోవాలి తప్ప, దానిపైన మరిన్ని వివరణలతో ప్రయోజనం లేదని నా అనుమానం”
చాలా విలువైన మాట కనకప్రసాదు గారు. మీ తదుపరి వివరణ కోసం ఎదురుచూస్తూ..
ఈ మీ ఈమాటలో ఒకప్పుడు, అనగా బాగున్న రోజుల్లో చిక్కని ఉపదేశాల్లాంటి మంచి సరుకులు, అంతే చక్కని కామెంట్లు ఉండేవి. ఇప్పుడు ఉపదేశాల సంగతి ఎలాగున్నా కమెంట్లు మటుకు మతప్రబోధకులు చేసే “బ్రెయిన్ వాషింగ్” ఉపన్యాసాల్లాగా తయారైనాయి. ఆపైన “వాషింగ్” కాకపోగా “డ్రెయినింగు” ఎక్కువైపోయింది.
కొన్ని ఉపన్యాసాలు వింటే దెబ్బలూ, గాయాలు తగిలినా ఆ నొప్పులు అనుభవించటానికి బాగుంటాయి. మరి కొన్నేమో మొక్కపాటివారు అప్పుడెప్పుడో చెప్పినట్టు “అధ్యక్ష సమక్షమందు నిరక్షరకుక్షి నైన నేను, నా కుక్షింభరత్వము కొరకు ప్రత్యక్ష సాక్షీభూతముగా……” రీతిలో సాగుతుంటయి……
పత్రికను, మాబోటి పాఠకులని ఈ ప్రబోధకోపన్యాసాల కామెంట్ల నుండి రక్షించటానికి సంపాదకులకు శక్తి ప్రసాదించు మహాప్రభో!…..
విజ్ఞప్తి – ఒక వేళ ఈ కామెంటు కత్తిరించాలనుకుంటే, అసలు ప్రచురించకండి….
భవదీయుడు
వంశీ
[కామెంటు పెట్టి ఏం చేయాలో మాకూ దయచేసి చెప్పకండి – సం.]
Sometimes it is necessary to introduce a creative work. More precisely, it is necessary to place it in a contextual frame work. ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగులకు పేర్లెందుకు పెడతారూ? ఇందుకే, ఆ చిత్ర రచనకి ఒక కాంటెక్స్ట్ ఇవ్వటానికే. ఆ రచనని స్వీకరించే వాళ్ళకి ఒక బాణం గుర్తుగా, ఇటేపెళ్ళండి బాబులూ అని. ఇది తన సృజనకు వివరణ ఇవ్వడం కాదు. సృజనాత్మక రచనలకు – చిత్రమైనా, గానమైనా, పదమైనా – ఆ రచనలకు వెలుపలగా రచయిత నుంచి ఎటువంటి వివరణ ఉండకూడదు అని నాకు బలమైన నమ్మకం. కొన్నిటికా బాణం గుర్తు అవసరం ఉండదు. కొన్నింటికుంటుంది. నా ఉద్దేశంలో దీపఖేల కు ఆ అవసరం ఉన్నది ఈ పాటకంటే ఎక్కువగా.
సృజనాత్మకమైన ప్రసారాల్లోన పాట అన్నింటికంటే ఎక్కువ సాంద్రతను, అంటే signal to noise ratioను సాధిస్తుందని నా సిద్ధాంతం.
నిజమే. దీనిక్కారణం సాహిత్యంలో ఉన్న రసం సంగీతంలో ఉన్న రసంతో కలిసి రెట్టింపవుతున్నది. అందువల్ల, కోలా కలిపిన మందులా తాగడానికి మరింతగా వీలవుతున్నది. ఇది ఉర్దూ ఘజల్ వినే వారికి అనుభవమే. చాలామంది ఘజల్ కేవలం చదివి పూర్తిగా ఆస్వాదించలేరు, అది పాటలా వస్తే తప్ప. కేవలం సాహిత్యాన్ని చదివి ఆస్వాదించడమనేది వారి సాధన బట్టి వుంటున్నది.
(నాకింకా నోరు నొప్పి పుట్టలేదని మీకు అర్థమౌతున్నది కూడా :-))
ఒకే ఒక్క ఇస్మాయిల్ గురించి rama bharadwaj అభిప్రాయం:
12/01/2010 1:08 am
వెల్చేరు గారు ఈ వ్యాసంలో కవిత్వమ్లో ఉండే “నిశ్శబ్దాన్ని” నిర్వచించడంలో వెనకబడ్డారో.. లేక ఆయనకే ఆ విషయం లో సరైన స్పష్టత లేదో నాకు బోధపడలేదు గానీ మొత్తంగా ఇస్మాయిల్ ని కవిగా చూపించడంలో వెల్చేరు ఎక్కడో తోవమరిచినట్టున్నారు.
“క్లుప్తత” అన్నదానికి ఎక్కడైనా దానిదైన చోటుంది. కవిత్వం లోనూ జీవితం లోనూ కూడా!! జపనీయుల “హైకూ” లు ఇటువంటి క్లుప్తతతో బొమ్మలంటి రేఖాచిత్రాలని కవిత్వంగా గీసినవే!! అది ఒక తరహా కవిత్వం!
మాటలని మించిన మౌనానికి భాష లేదని నేనను గానీ అది “క్లుప్తత” అయితే కాదు. అదొక తాత్వికత. దాన్ని ఇస్మాయిల్ కవితలో ఎలా చూసారో మరింత వివరంగా వెల్చేరు చెప్పగలిగితే బాగుండేదేమో? అలాంటి కవి ఇస్మాయిల్ అవునో కాడో స్పష్టపడేది కూడాను.
ఇకపోతే కవిత్వంలో ” మాటల” ప్రయోజనం లేదని అనడానికి కూడా కుదరదు. విస్తరించ వలసిన చోట భావంలో “క్లుప్తత” అంతే చికాగ్గా ఉంటుంది.ఈ తారతమ్యం చూపించడంలో విమర్శకుడు విఫలమ్ కావడమ్ తరుచూ జరిగింది. ఇందుకు విమర్శకులు విమర్శకన్నా మించి కవులకి ఎక్కువ ప్రాధన్యం ఇవ్వడం ఒక కారణమ్ బహుశా!! వీళ్ళ మెచ్చుకోళ్ళలోనూ లేదా వీళ్ల దాటివేతలోనూ కూడా ఏ అంతస్సూత్రమూ కనిపించకపోవడం అన్నది విమర్శలోని పెద్ద లోపం !!
నారాయణరావు గారి అభిప్రాయాన్ని అనుసరించామా ” శ్రీశ్రీ” కవి కాడు. “తిలక్” కవి కాడు. అజంతా అసలే కాడు. అలాగే మరి కొందరు మిగతా కవులు కూడాను. శ్రీశ్రీ ” ఆహ:” తప్ప కవితా ఓ కవితా అన్నది కవితే కాకూడదు. అది శబ్ధమయమూ.. మాటల మయమూను. భాషని అతి చిక్కగా తన ఊహాచిత్రాలకి అతికించిన తిలక్ కవిత్వం ఈ లెఖ్ఖన వట్టి మాటల పోగులాగా మారిపోయే పరిస్థితి ఉంది మరి. ఒక కవిది ఒక తరహా కవిత్వం అని చెప్పడమ్ వేరు. అదులోని విశిష్టతని వివరించడమ్ వేరు. మాట ద్వారా ..ధ్వని ద్వారా అందవలసిన ఊహ దగ్గర కవిత్వంలో క్లుప్తతకీ నిశ్శబ్దానికీ పెద్దపీట వేయడమ్ వేరు.అది అన్ని చోట్లా నిజమ్ కాదు గనక. క్లుప్తతని ముందుకు తీసుకుని రావడం కోసం శబ్దశక్తిని తక్కువ చేయనఖ్ఖర లేదు. అయితే తన విమర్శనా శైలిలో ఇలాంటి దూకుడు విమర్శకునిగా వెల్చేరు చూపించడం కొత్త విషయమేమీ కాదు.
ఒక్కోసారి సాదా సీదా వచనంలో “మాటల్లో” సైతం మనసుని మేల్కొలిపే ఒక చిత్రిక పట్టిన భావం మృదువుగా తాకకపోదు. మాట అవసరమ్ ఎంత అని తెలిసి వాడగలగడమే కవితా నాణ్యతకి గుర్తు. అంతే గానీ పికాసా గీతల్లోలాగా మూడే మూడు మాటల్లో చిత్రం గీయడం కవికి అవసరం లేదు. కవి చిత్రకారుడి పాత్రలోకి వెళితే చిత్రకారుడు మాటల్లోంచి చెప్పినట్టు పాఠకునికి చెప్పాలీ అంటే ఎక్కువ రంగులు వాడాలి కాబోలు. అప్పుడక్కడ అదీ ఎబ్బెట్టుగానే ఉంటుంది కాదా??.
మాటకీ మాటకీ మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించడం కవికి సహజంగా తెలుస్తుంది. అప్పుడే మంచి కవిత పుడుతుంది. సరైన మాటలు వాడటమే కవిత్వం!! అందువలన క్లుప్తతా.. నిశ్శబ్దమ్ కవితాస్వాదనకి చాలాసార్లు ప్రతిబంధకాలే అవుతాయి!!
ఇస్మాయిల్ కవిత్వం అంతగా ఆస్వాదయోగ్యమ్ కాలేని కారణమ్ ఈ లక్షణమే!! అందులోనే గొప్పదనం ఉందని ఒక విమర్శకుడు అనవచ్చు. కానీ పాఠకుడు అలా అనుకోలేకపోయినట్టున్నాడు మరి. శ్రీశ్రీని చదివి సంతోషించ గలిగినట్టు.. కృష్ణశాస్త్రిని ఆస్వాదించగలిగినట్టు.. తిలక్ ని అంత సమాసాల పోగులలోంచి కూడా… మెచ్చుకోగలిగినట్టు ఇస్మాయిల్ ని స్వీకరించడం జరగకపోడానికి కారణమూ ఇదే!! అతని అనువాదాలకి వచ్చిన ప్రతిస్పందనతో తెలుగు కవితాప్రియులని అంచనావేసి తక్కువచేయడానికి కుదరదు.
ఇస్మాయిల్ ఇంగ్లీషు లెక్చరర్ గనక ఆ ప్రభావం అతని కవిత్వం మీద ఉండే వీలుంది. తన భావ వ్యక్తీకరణకి ఆయన తెలుగు భాషని ఎన్నుకోవడమ్ అన్నది ఆయనకి మరి ఎందుకని అవసరం అయ్యిందో??
రమ.
దుప్పట్లో ముడుక్కున్నా గురించి madhurasree అభిప్రాయం:
11/30/2010 6:53 am
తీసుకున్న వస్తువును శిల్ప పరంగా చెప్పడం సాహిత్య లక్షణం లక్షణం కోల్పొయింది
జీనో పేరడాక్సు గురించి Sowmya అభిప్రాయం:
11/28/2010 11:52 am
“భక్తి తలకెక్కిన చరిత్రకారుడెవడో
రక్త సిక్తమైన ఆ మాంసపుముద్దని
ఎర్ర మందారఁవనో
మోదుగపూవనో కీర్తిస్తాడు.”
– నాకసలు పైదంతా వద్దు. ఇదొక్కటే చాలు! 🙂
ఏ నడలో ఏ ఎడలో! గురించి సుబ్రహ్మణ్యం అభిప్రాయం:
11/27/2010 6:27 am
చాలా విలువైన మాట కనకప్రసాదు గారు. మీ తదుపరి వివరణ కోసం ఎదురుచూస్తూ..
– సుబ్రహ్మణ్యం.
ప్రేమ కవితలు గురించి RAMAKRISHNA అభిప్రాయం:
11/27/2010 1:17 am
చాల చాల బాగున్నై
నువ్వు గురించి srinivas అభిప్రాయం:
11/26/2010 1:45 am
it is nice very good
కుతంత్రం గురించి Kumar N అభిప్రాయం:
11/26/2010 1:25 am
Wonderful and ofcourse sweet too..I fell in love with the girl.
And Aruna Pappu’s comment is adorable
ఇస్మాయిల్ గారితో నా పరిచయం గురించి వంశీ అభిప్రాయం:
11/25/2010 4:16 pm
ఈ మీ ఈమాటలో ఒకప్పుడు, అనగా బాగున్న రోజుల్లో చిక్కని ఉపదేశాల్లాంటి మంచి సరుకులు, అంతే చక్కని కామెంట్లు ఉండేవి. ఇప్పుడు ఉపదేశాల సంగతి ఎలాగున్నా కమెంట్లు మటుకు మతప్రబోధకులు చేసే “బ్రెయిన్ వాషింగ్” ఉపన్యాసాల్లాగా తయారైనాయి. ఆపైన “వాషింగ్” కాకపోగా “డ్రెయినింగు” ఎక్కువైపోయింది.
కొన్ని ఉపన్యాసాలు వింటే దెబ్బలూ, గాయాలు తగిలినా ఆ నొప్పులు అనుభవించటానికి బాగుంటాయి. మరి కొన్నేమో మొక్కపాటివారు అప్పుడెప్పుడో చెప్పినట్టు “అధ్యక్ష సమక్షమందు నిరక్షరకుక్షి నైన నేను, నా కుక్షింభరత్వము కొరకు ప్రత్యక్ష సాక్షీభూతముగా……” రీతిలో సాగుతుంటయి……
పత్రికను, మాబోటి పాఠకులని ఈ ప్రబోధకోపన్యాసాల కామెంట్ల నుండి రక్షించటానికి సంపాదకులకు శక్తి ప్రసాదించు మహాప్రభో!…..
విజ్ఞప్తి – ఒక వేళ ఈ కామెంటు కత్తిరించాలనుకుంటే, అసలు ప్రచురించకండి….
భవదీయుడు
వంశీ
[కామెంటు పెట్టి ఏం చేయాలో మాకూ దయచేసి చెప్పకండి – సం.]
ఏ నడలో ఏ ఎడలో! గురించి Madhav అభిప్రాయం:
11/25/2010 3:57 pm
‘To introduce’ is not ‘to explain’
చౌరస్తాలో ఎటెళ్ళాలో దారి చూపించే బాణం మనల్ని గమ్యం దగ్గరిదాకా తీసుకొచ్చి ఒదిలిపెట్టదు. ఎటేపెళ్ళాలో చెబుతుందంతే.
Sometimes it is necessary to introduce a creative work. More precisely, it is necessary to place it in a contextual frame work. ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగులకు పేర్లెందుకు పెడతారూ? ఇందుకే, ఆ చిత్ర రచనకి ఒక కాంటెక్స్ట్ ఇవ్వటానికే. ఆ రచనని స్వీకరించే వాళ్ళకి ఒక బాణం గుర్తుగా, ఇటేపెళ్ళండి బాబులూ అని. ఇది తన సృజనకు వివరణ ఇవ్వడం కాదు. సృజనాత్మక రచనలకు – చిత్రమైనా, గానమైనా, పదమైనా – ఆ రచనలకు వెలుపలగా రచయిత నుంచి ఎటువంటి వివరణ ఉండకూడదు అని నాకు బలమైన నమ్మకం. కొన్నిటికా బాణం గుర్తు అవసరం ఉండదు. కొన్నింటికుంటుంది. నా ఉద్దేశంలో దీపఖేల కు ఆ అవసరం ఉన్నది ఈ పాటకంటే ఎక్కువగా.
నిజమే. దీనిక్కారణం సాహిత్యంలో ఉన్న రసం సంగీతంలో ఉన్న రసంతో కలిసి రెట్టింపవుతున్నది. అందువల్ల, కోలా కలిపిన మందులా తాగడానికి మరింతగా వీలవుతున్నది. ఇది ఉర్దూ ఘజల్ వినే వారికి అనుభవమే. చాలామంది ఘజల్ కేవలం చదివి పూర్తిగా ఆస్వాదించలేరు, అది పాటలా వస్తే తప్ప. కేవలం సాహిత్యాన్ని చదివి ఆస్వాదించడమనేది వారి సాధన బట్టి వుంటున్నది.
(నాకింకా నోరు నొప్పి పుట్టలేదని మీకు అర్థమౌతున్నది కూడా :-))
పాప మనసు గురించి ns murty అభిప్రాయం:
11/25/2010 12:29 am
చాలా బాగుంది. పిల్లలను అర్థంచేసుకుందికి చాలా పెద్ద మనసుండాలి.
మీ కవిత లో ఆర్గ్రత కనిపిస్తోంది.
అభినందనలు