పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. స్నేహితుడు, విమర్శకుడూ గురించి chavakiran అభిప్రాయం:

    06/24/2011 10:26 am

    ఇప్పుడు వల్లంపాటి వారి కథల సంకలనం (35 కథలు), నవలా సంకలనం (3 నవలలు) – కినిగెపై డిజిటల్ రూపంలో కూడా లభిస్తున్నాయి. Link = వల్లంపాటి రచించిన పుస్తకాలు – కినిగెపై

  2. కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి srinivas gattu అభిప్రాయం:

    06/24/2011 3:50 am

    చాలా బాగున్నది ఈ కలెక్షను. ధన్యవాదములు.

  3. కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి Rohiniprasad అభిప్రాయం:

    06/23/2011 10:24 am

    ఈ మంచి కలెక్షన్‌లో నేను చిన్నప్పుడు వ్యక్తిగతంగా చూసినవారు జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి, మొక్కపాటి నరసింహ శాస్త్రి , తల్లావజ్ఝల శివశంకర శాస్త్రిగార్లు.

    1962లో పదమూడేళ్ళ వయసులో నేను మద్రాసులో జరిగిన ఆంధ్రమహిళాసభ రజతోత్సవానికి రెండువారాలపాటు ప్రతిరోజూ హాజరయాను. అక్కడ ప్రసంగించిన ప్రముఖుల్లో ఉపాధ్యక్షుడు రాధాకృష్ణన్‌, ఏపీ ముఖ్యమంత్రి సంజీవరెడ్డి, దుర్గాబాయి దేశ్‌ముఖ్‌, కవుల్లో గిడుగు సీతాపతి, దేవులపల్లి మొదలైనవారి ప్రసంగాలు విన్నాను. ఇటువంటివారికి కొన్నేళ్ళ తరవాత తమ గొంతులను మనకు వినిపించే అవకాశం ఉండబోదని అప్పట్లో నాకు అనిపించలేదు. వారి దృశ్యాలూ, మాటలన్నీ మహిళాసభవారు అప్పుడు తీసిన డాక్యుమెంటరీలో లభించవచ్చు. నేనది చూడలేదుగాని, అందులో ముందువరసలో కూర్చున్న నేనుకూడా కనిపించానని మా అమ్మమ్మ 1970 ప్రాంతాల నాతో చెప్పింది!

    జనరల్‌గా మనవాళ్ళకి చారిత్రక దృక్పథం తక్కువే. ప్రశాంత్‌గారి స్పందన అటువంటిదే. ఇప్పటి యువతీయువకుల్లో కొందరికైనా తెలుగువారి recent history గురించిన ఆసక్తి ఉందనడంలో అనుమానంలేదు. వారికి సమాచారం అందించే బాధ్యత పాత తరానిదే.

    ఈ వ్యాసంలోని ప్రముఖుల పేర్ల వెంట వారి జీవితకాలం బ్రాకెట్లలో రాస్తే బాగుంటుంది. నాకు వీలున్నప్పుడల్లా సంగీతరావు, రజనీకాంతరావు, రావి కొండలరావు వంటి పెద్దవారితో ముచ్చటించి, ఆ వివరాలను తెలియజెయ్యడం ప్రశాంత్‌గారు చేసిన ఫిర్యాదు వంటిది తలెత్తకుండా ఉండటానికే. త్వరలోనే రావు బాలసరస్వతి, సుసర్ల దక్షిణామూర్తి, పాలగుమ్మి విశ్వనాథం మొదలైనవారిని కలుసుకోవాలని ఉంది.

    నా చిన్నతనంలో మద్రాసు, విజయవాడ, హైదరాబాద్ రేడియో స్టేషన్ల నుంచి ప్రతి ఉగాదికీ కవిసమ్మేళనాలు ప్రసారం అయేవి. అప్పటి కవుల రికార్డింగులన్నీ దొరికే అవకాశం ఉండే ఉంటుంది.

  4. కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    06/23/2011 8:58 am

    వినిపించిన గొంతులు చాలామందికి నచ్చినందుకు సంతోషం. ఇవి విజయవాడ రేడియో కేంద్రం సుమారు ముప్పయ్యేళ్ళ క్రితం “ప్రముఖుల గళాలు” అన్న శీర్షిక క్రింద ప్రసారం చేసిన ధారావాహికలోని భాగాలు. వ్యాఖ్యాత శ్రీ శంకరమంచి సత్యం. అవును “అమరావతి కథలు” రాసిన సత్యంగారే!

    మరికొందరి ప్రముఖుల గొంతులు రాబోయే సంచికల్లో.

    భవదీయుడు,
    — శ్రీనివాస్

  5. కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి prasanth అభిప్రాయం:

    06/21/2011 3:00 pm

    మన జాతి ..మేధావులని బతికి ఉన్నన్ని నాళ్ళూ వాళ్ళని నిర్లక్ష్యమ్ చేస్తుంది. వాళ్ళు పోయిన తర్వాత వాళ్ల గుర్తులని విని మురిసిపోతుంది.ఇది ఏ రకమైన సంస్కృతో.. దీనికి ఎవరిని నెపం పెట్టాలో నాకు తెలియదు గానీ ఈ స్వభావమ్ మీద మాత్రమ్ ఆ జాతిజనులు ఆత్మ విమర్శ అన్నది చేసుకోవడమ్ అన్నది.. ముఖ్యమైనది ఎప్పుడైనా!! ఒకతరం లోని వారు గతించేదాకా ఆగి.. అప్పుడు వగచేకన్నా ..అంతకన్నా వారు తమకాలంలో తమతో సమాంతరంగా బతుకుతున్న కవుల రచయితల వేదాంతుల స్వరాలనీ ..వారి ఆలోచనలనీ తమకాలంలోనే శాస్త్రీయ మార్గాల ద్వారా నిల్పుకునే శ్రధ్ధని చూపించడమ్ ఉత్తమమ్ కాదా?? అప్పుడు రేపటి తరాలు ఇప్పుడు రాస్తున్న ఇలాంటి ఉత్తరాలని రాయాల్సిన అవసరం ఉండదు కద. అయితే బహుశా మనం మన సమకాలం లోని వారిని నోరుతెరిచి పొగడటం చేయలేమేమో మరి. జరుక్ శాస్త్రి కీ ..జాషువాకీ మాత్రం ఆ రోజుల్లో ఏమ్ జాగ్రత్త దొరికింది గనక?? ఆకాశవాణి వారు ఎన్ని మంచి మంచి స్వరాలని చెరిపేయగా ఇవాళ్టికి అక్కడా ఇక్కడా ఏరుకోవాల్సి వస్తోందీ?? ఇంతే మరి తెలుగువాళ్ళు !! చేమకూరవెంకట కవి చెప్పనే చెప్పాడు కద? చిన్న చిన్న అహంకారాలతో మనం పెద్ద పెద్ద నష్టాలు ఎప్పుడూ ఇష్టపడ్డాం !!

    ఇంకా అలా ఇష్ట పడుతూనే ఉన్నాం! మరి కొన్ని తరాల నష్టాల కోసం!! మరికొన్ని కాలాల తర్వాత వాళ్ళు అచ్చం ఇలాగే..ఇప్పుడు అందరూ వగచినట్లే ఇలాగే వగచాలని!!.

    వ్యక్తిగత అభిమాఅనం ఉన్నవారి వలన తప్పితే సత్కవులు రాణకు వచ్చేరు తప్ప ఇతరత్రా అవార్డులూ రివార్డులూ మన సమకాలం లోనే చవటలకి వెళ్తూంటే అలాగే కళ్లప్పగించి చూస్తున్నవాళ్ళం.. రేపటి దాకా .. అలాగే అన్నీ చూస్తూనే ఉంటాం కూడాను. ఎప్పటికో మేలుకుని..తెలివితెచ్చుకుని.. ఇప్పుడు “అయ్యయ్యో” అని అన్నట్టుగానే అప్పుడూ అంటాం.!! కదా మరి …మనం తెలుగువాళ్ళం !! చిన్న చిన్న అహాలకి బానిసలం. దురాలోచనలే తప్ప దూరాలోచనలు లేనివాళ్ళం!! ఎప్పడూ అర్హతలేని వాళ్లకి ఎత్తైన పీటలు వేస్తూ ..పండితులనైనా సరే ..కిందనే కూర్చోబెట్టగలిగినవాళ్ళం!! మనం తెలుగువాళ్ళం !!

    ప్రశాంత్

  6. కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి balantrapuprasuna అభిప్రాయం:

    06/21/2011 7:26 am

    its్ difficult to say who the commentator is. it could be jaggayya. but we don’t know the year. but thankyou srinivas garu for uploading such great collection. and special thanks for the poetry pieces of jashua and balagangadhar tilak.mokkapati’s reminiscences are also great and we cant forget jaruk sastri.thank you sir.

  7. పురూరవ గురించి jagan అభిప్రాయం:

    06/21/2011 2:49 am

    Hi all
    is there any way to download this.
    I am waiting from many years to read this book.
    please help me
    Thanks
    jagan mohan

  8. బడి పిల్లల అయోమయం గురించి nenu అభిప్రాయం:

    06/20/2011 12:12 am

    చాలా బాగా రాసారు. విమర్శలతో పాటు ప్రశంసించడం బాగా ఉంది.

  9. కొడుకుల శివరాం భాగవత గానం గురించి Pardha Saradhi Mantravadi అభిప్రాయం:

    06/18/2011 5:53 am

    చక్కని మంచి ముత్యాలు ఏరి అందంగా కూర్చిన మణిహారం మీ ‘ఈ మాట’. చాలా బాగుంది!
    ఇంకా మరిన్ని జత చేయమని ప్రార్థన

  10. కొడుకుల శివరాం భాగవత గానం గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    06/16/2011 1:53 am

    “Audio files శ్రీ శివరాం గారి copy righted material. కనుక దయచేసి వాటిని కాపీ చేసుకోకండి. –సం”
    సరే, కొనుక్కోగలమా? “గలిగితే”, వివరాలు చెప్పండి?