పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి rama bharadwaj అభిప్రాయం:

    09/14/2011 2:11 pm

    “తెనుగునకు వ్యాకరణ దీపము చిన్నది” అని అన్నది చిన్నయసూరి, చెళ్ళపిళ్ళ కాదు. ఇకపోతే నేను “నునుపారు” లోని ఆరు కి అర్ధం చెప్పలేదు. నునుపు+ ఆరు అని విరిచినట్టుగానే నూగు+ఆరు ని విరవమని సూచన చేసాను. కామేశ్వర రావుగారి వివరణ మరీచులు అన్నది ఒప్పు. మనం నిఘంటువులని అర్ధ వివరణ కోసం మాత్రమే చూస్తున్నాం తప్ప వాటిని సవరించుకోవడమ్ దిశగా గాని, పదాల సంఖ్యని పెంచుకోవాలని గానీ ప్రయత్నమ్ పెద్దగా చెయ్యలేదు. అదునా ఆధునిక కాలంలో ఆసక్తీ అర్హతా ఉన్న వాళ్ళు ఎవరూ కూడా వేరే వృత్తులకి బతుకుతెరువుకి వెళ్లడమూ. ఆయా వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఈ పనులకి సరిపడా శ్రధ్ధా సామర్ధ్యాలను చూపకపోవడమూ కారణంగా ఉన్న నిఘంటువులతో కుస్తీలు పట్టుకోవలసి వస్తోంది.

    పాత తెలుగుతో పనిచేసే క్రమంలో నిఘంటువులతో పనిచేసే వారికి అందరికీ కొలిచాల లాగే ఈ విషయాలు అనుభవంలోకి వస్తాయి. కవిత్వం విషయంలో మనం కవి హృదయాన్ని అనుసరించాలి తప్ప ముక్కస్యముక్కహ అన్న రీతిలో అర్ధాలని చూడకూడదు కూడాను. అక్కడ ఒప్పైన అర్ధాన్ని మనం తీసుకోవాలి. నూగారు లోని ఆరు సంఖ్యా పదం లోని ఆరు ఒకటి కావు గనక ఇది వేరే విషయం. నూగు అన్నదానికి నేను నూగు+ఆరు గానే విభజించుకుంటాను. మనకి ఇవాళ అరసున్నలూ.. ఖండబిందు పూర్ణబిందులూ.. మామూలు ర బండి ర లూ చాలా తికమకతొ కలిసిపోయి ఉన్నాయి. అందులో సరైనవి ఏవో కానివి ఏవో నిఘంటువులూ ఇవ్వడం లేదు. ఎవరి తోవని అనుసరించి దేన్ని సాధించాలో స్పస్టమైన రీతి ఒకటి ఉన్నట్టు కనబడని సందర్భాలు చాలా ఎదురౌతాయి. చూద్దాం ఇతరులు ఇంకేమంటారో??

    రమ.

  2. పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి కామేశ్వరరావు అభిప్రాయం:

    09/14/2011 1:39 pm

    “పయిఁ బ్రాకుమరీచుల నూఁగు నూఁగు లేఁ
    గొమ్మలు వట్ట”

    ఇక్కడ మరీచులు అంటే కిరణాలు. మిరియాలు కాదు. మరీచము, మరిచము అంటే మిరియము. దానికి బహువచనం మరీచములు అవుతుంది కాని మరీచులు కాదు. పైగా ఇక్కడసలు మిరియపు తీగల, కొమ్మల ప్రసక్తి అవసరమే లేదు! మరీచి – కిరణము. మరీచులు – కిరణాలు. చకోరాలకి చంద్రకిరణాలు ఆహారమని కవిసమయం కదా. పైన ప్రాకే చంద్రకిరణాలనే లేలేత కొమ్మలని (అన్నిసార్లు లేత ఎందుకంటే వెన్నల కిరణాలు అంత సన్నగా ఉన్నాయి కాబట్టి). వాటిని పట్టుకోడానికి తమ చంచువులని కదులుస్తున్నాయి. నూగు అంటే ఆకులమీద, కాయలమీద ఏర్పడే చిన్నచిన్న ముళ్ళు అనే అర్థం దగ్గర యీ పద్యం ఎందుకిచ్చారో నాకు తెలియడం లేదు. అది పొరపాటే అయ్యుండాలి.

    ఇక ఇక్కడ “నూగు” అంటే “లేత”, “నునుపు”, “సన్నని” అన్న అర్థాలేమైనా తీసుకోవచ్చు. సన్నని అన్న అర్థమే నాకు సబబుగా తోస్తోంది. నూగుకి సన్నని అనే అర్థం తీసుకున్నా నూగు+ఆరు అన్న విరుపుకి అభ్యంతరమేమీ లేదు. “ఆరు” అన్న పదానికి వెంట్రుకలన్న అర్థం ఎలా వచ్చిందన్నది పరిశీలించవలసిన అంశం.

  3. నాకు నచ్చిన పద్యం: భీష్మస్తుతి గురించి Suryaprakash Rao Mothiiki అభిప్రాయం:

    09/14/2011 10:08 am

    ఈ పద్యాన్ని తెలుగు సినిమా “భీష్మ” లొ ఘంటసాల పాడారు!

  4. ఈమాట గురించి గురించి Salahuddin అభిప్రాయం:

    09/14/2011 9:47 am

    తెలుగు భాషాభిమానులకు నమస్కారం!

    మీలో సాహిత్య ప్రియులకు, నాదొక మనవి. నేను రాసిన కొన్ని కధలు నా blog లో పొందుపరచాను. సాహిత్యవిశ్లేషణ, మరియు ప్రత్యేకాభిరుచి (elitist) కి సంబంధించి ఉండకపోవచ్చు గాని, చరిత్రగతి, పురాణాలను కొంతవరకు మేళవించి, నేనొక Science Fiction కధను వ్రాస్తున్నాను. ఇంకా ఎన్నో కధలు నా మస్తిష్కం లో ఉన్నవి, future లో నా బ్లాగ్ లో వ్రాయడం జరుగుతుంది. నా కదావస్తువులు, శైలి నచ్చితే తప్పకుండా నా blog ని సందర్శించ ప్రార్ధన.

    ధన్యవాదములు.

  5. పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    09/14/2011 9:34 am

    “తెలుగు వ్యాకరణ దీపం చిన్నది” అని చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారు అన్న నాటికి నేటికి పెద్ద మార్పేమి రాలేదు. అట్లాగే, ‘తెలుగు నైఘంటిక దీపం’ కూడా చిన్నదనే చెప్పాలి. గత పది, పదిహేనేళ్ళుగా తెలుగు ప్రాచీన సాహిత్యం చదువుతూ, నిఘంటువులు చూస్తున్న నాకు అర్థమైన విషయం ఏమిటంటే మన ప్రాచీన సాహిత్యంలోని పదజాలాన్ని వివరించడానికి మనకు అందుబాటులో ఉన్న నిఘంటువులు పూర్తిగా చాలవని (శ్రీసూర్యరాయాంధ్ర నిఘంటువు నాకెప్పుడూ అందుబాటులో లేదు). అందుకే, నిఘంటు అర్థాలను వివేచించి, ప్రశ్నించడంలో తప్పు లేదనిపిస్తుంది.

    బహుజనపల్లి వారి శబ్దరత్నాకరము లో నూఁగు అన్న శబ్దానికి ‘కొన్ని యాకులమీఁదను కాయలమీఁదను ఏర్పడియుండు చిన్న చిన్న ముండ్లు’ అన్న అర్థాన్నిచ్చి తిక్కన పద్యాన్ని ఉదాహరణగా ఇవ్వడం ఎంతవరకూ ఔచిత్యమో పరిశీలిద్దాం.

    తిక్కన రాసిన నిర్వచనోత్తర రామాయణంలో షష్ఠాశ్వాసం లో 51వ పద్యం ఇది:

    సమ్మదవారి గన్గడలఁ జాలుగ మై గరుపార నిందుబిం-
    బమ్మున దృష్టి నిల్పి పయిఁ బ్రాకుమరీచుల నూఁగు నూఁగు లేఁ
    గొమ్మలు వట్ట చంచుపుట కోటిఁ గదల్చి తెమల్చి కొంచు సౌ-
    ఖ్యమ్మ విహంగమ మ్మయిన యాకృతి నొందెఁ జకోర మొక్కెడన్ (6.51)

    “… ఇందు బింబం పై దృష్టి నిలిపి చకోరాలు పైకి పాకే మిరియపు తీగల ‘నూఁగు నూఁగు లేఁత కొమ్మలను’ ముక్కులతో కదల్చి , తెమల్చుచుండగా ఎగిరే పక్షి ఆకృతి పొందాయి” అని నాకు తెలిసిన అర్థం.

    ఇక్కడ నూఁగు అన్న పదానికి ‘కొన్ని యాకులమీఁదను కాయలమీఁదను ఏర్పడియుండు చిన్న చిన్న ముండ్లు’ అన్న అర్థం సరిపోతుందా? ‘కొన్ని యాకులమీఁదను కాయలమీఁదను ఏర్పడియుండు చిన్న చిన్న ముండ్లు’ అన్నది నామవాచకము (విశేష్యము). ‘నూఁగు నూఁగు లేఁత కొమ్మలను’ అన్న చోట ‘నూఁగు’ విశేషణంగా వాడినట్టు స్పష్టంగానే తెలుస్తోంది. ‘నూఁగు నూఁగు’ అని రెండుసార్లు వాడడం కూడా అది విశేషణమే అన్న వాదాన్నే బలపరుస్తున్నది. అందుకే నేను శబ్దరత్నాకరము లో నూఁగు అన్న పదానికి విశేషణార్థంలో ఇచ్చిన లేఁత అన్న అర్థాన్ని తీసుకొని అది సరికాదు అని వాదించాను.

    రమగారు అన్నారు:

    “నూగు” ని “నూన్” లోంచి చూడబోతే కదా మీకు ఇబ్బంది? నూగు అన్న పదాన్ని భిన్నంగా నున్న లేదా నూన్ అన్నదానికన్నా మీరు చూడటమ్ కస్టం ఏమీ కాదే?? భిన్నపదాలని మీరు ఏక వ్యుత్పత్తి నించి సాధించలేరు కదా?

    రమ గారు: నూఁగు అన్న పదంలో మధ్యలో అరసున్న ఉన్నది చూసారా? తెలుగులో అరసున్న ఉన్న ప్రతిపదాన్ని ఒకప్పుడు పూర్తిసున్నతో పలికేవారని మనం చెప్పుకోవచ్చు. తెలుఁగు, తోఁట వంటి పదాలకు మిగిలిన ద్రావిడ భాషలలో ఇంకా సున్నతో ఉచ్చారణ నిలిచే ఉంది (తెలుంగు, తోంట మొ॥). నూగు మొదటగా నూంగు/నూన్గు అన్న రూపంలో ఉండేది అని మీరు ఒప్పుకుంటే అది నున్న/నూన్- అన్న ధాతువు సంబంధించిందేఅని వివరించడం అంత కష్టమేమి కాదని నా అభిప్రాయం. లేకపోతే, నూన్గుకు మిగిలిన ద్రావిడ భాషలలో సజాతి పదాలు చూపలేం. ప్రతి అచ్చతెలుగు పదానికి మూలద్రావిడభాషా ధాతువు చూపించగలగాలి. లేదా, అది తెలుగు భాషలోనే కొత్తగా పుట్టిన పదమని (independent innovation) వాదించగలగాలి. అది historical linguistics లో మనము నేర్చుకొనే తొలిపాఠాల్లో ఒకటి.

    వల్లభరాయని పద్యంలో నునుపారు పదానికి ఆరు అంటే వెంట్రుక(లు) అన్న అర్థం లేదండి. నూఁగారులో ఆరుకు వెంట్రుకలు అన్న అర్థం రావడానికి దాని మూలధాతువు *నాఱు అయి ఉండవచ్చునేమో ఆలోచించాలి.

  6. శ్రీపాదరాయలు గురించి nagamurali అభిప్రాయం:

    09/14/2011 9:10 am

    Lyla గారూ,

    Hats off to your sense of humor!!

  7. రావణుడి తలలు గురించి Pavankumar Krovvidi అభిప్రాయం:

    09/14/2011 7:50 am

    anni okelaaa untaaigaa serial lo choopinattugaaaaaa……, kadha kosam alaa raasuntaaru kadaa…….

  8. పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి Rohiniprasad అభిప్రాయం:

    09/14/2011 7:35 am

    ఈ వ్యాసమూ, దాన్ని గురించిన (కాట్లాడుకోకుండా వస్తున్న) స్పందనలూ చదివితే తెలుగుభాష గురించిన అభిరుచీ, ఆసక్తీ ఎంతమందిలో, ఏ స్థాయిలో ఉన్నాయోనని ఆశ్చర్యం కలుగుతుంది. వారిలో చాలామంది తెలుగుభాషకు సంబంధించని వృత్తుల్లో పనిచేస్తున్నారనేది తెలిసినదే. వీరితో పోలిస్తే ఇక్కడ హైదరాబాదులో చీటికీమాటికీ వేదికలెక్కుతూ, సన్మానాలూ గట్రా చేయించుకుంటున్న పండితుల గురించి అనుమానాలు కలుగుతాయి. Hats off to these amateur researchers.

  9. శ్రీపాదరాయలు గురించి lyla yerneni అభిప్రాయం:

    09/13/2011 9:10 pm

    I am re-reading this essay, along with a few other music books, so I can muster my courage, be bold enough, to ask my questions, clear my doubts. But before all that, inspired, I first want to write a ‘fresh’ musical composition. A Tiny Tot Ballet. A small operetta. You can call it ‘Opra’ if you like. 🙂

    (The story line is:

    A wife confides in her best female friend, that her husband 🙁 is adulterous. Angrily, She asks, how can the ‘other woman’ be comparable to her. And she weeps.

    The friend sympathizes. Then the friend goes to the cheated woman’s husband. Scolds him. Arbitrates how the wealth should be divided between the two parties.)

    పాఠక శ్రోతలారా! తెర ఎత్తుతున్నారు. ఇక వినండి – ఈ స్వరస సంగీత స్వరాక్షర గీతిని.

    (Wife’s Voice. Place: Leased Loft in Soho.)

    సమాగమమా!
    మా
    సమాగమమా!
    మరి మా
    సమాగమమా?

    గమగమ గగనిని
    నిగనిగ గగనిని

    సమమా!
    సమమా……
    దాని సమమా?
    మగని సాని
    సమమా?
    దాని సమమా,
    సానిదాని సమమా!

    (Friend’s Voice. Place: Husband’s California Palatial Home)

    గధమా!
    మదమా?
    మగని
    మదమా
    మగ మదమా?
    గధమా!
    మదగధమా!

    మరీ!

    నీ సాని
    దాని
    సమమా?
    సరి సమమా?
    మరీ,
    నీ సానిదాని
    సమమా;

    దాసా!
    పాద దాసా!
    సానిదాని పాదదాసా,
    దాసా,
    పాద దాసా;

    సగమా?
    నీ గని
    మరి సగమా?
    సరిగ సగమా?
    సరి సగమా
    సరిగ
    సరి సగమా?

    సమాగమమా…..:-)

    (మీకు ఇష్టమైనన్ని సంగతులు వేసుకోండి.)

    lyla

  10. పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి rama bharadwaj అభిప్రాయం:

    09/13/2011 3:46 pm

    తిక్కన వాడకమే చెప్పడం లేదా నూగు అన్నది వేరు అనీ. లేత అన్నది వేరు అనీ.

    మీరు “నును” అన్న దానిలోని “నూ” కీ “నూగు” అన్న పదమ్ లోని “నూ” కి ఒకటే ధాతుమూలాన్ని వెతికి తికమక పDaకండి. “నూగు” ని “నూన్ ” లోంచి చూడబోతే కదా మీకు ఇబ్బంది? నూగు అన్న పదాన్ని భిన్నంగా నున్న లేదా నూన్ అన్నదానికన్నా మీరు చూడటమ్ కస్టం ఏమీ కాదే?? భిన్నపదాలని మీరు ఏక వ్యుత్పత్తి నించి సాధించలేరు కదా?

    నునుపు నున్న అంటేనే మీకు లేత అవసరం అవుతోంది. నూగు ని మీరు అలాగే గ్రహిస్తే అలాంటి బలవంతం లేదని నా మాట. ఆరు ని తీసుకుంటేనే విడగొట్టుకుందికి సులువు. అర్ధమ్ సైతం సుస్పస్టం. దానాదీనా చెప్పదలుచుకున్నదేమంటే నూగు +ఆరు, నునుపు+ ఆరు లాగే మీరు గ్రహించవలసి ఉంటుందని.

    నునుపారు పదానికి మీరు వల్లభరాయని పద్యాన్ని చెప్పడం బాగుంది. ఆ రాయడు నాకిస్టమైనకవి. ఆ పద్యం కూడాను.;) అంత కొంటె కవి తెలుగు సాహిత్యమ్ లో మరొకరులేరు. శ్రీనాధుడు తప్ప. శ్రీనాధుడే వల్లభరాయడా అని మీ భాషా చర్చని నేను సాహిత్య చర్చ లోకి మళ్ళించను.

    రమ.