నాగరత్నమ్మను గురించి హిందూ పత్రికలో వచ్చిన వార్తను ఇక్కడ చదువగలరు. తిరువయ్యారులో నాగరత్నమ్మ నిర్మించిన త్యాగరాజస్వామి ఆలయము, మున్నగునవి ఈ చిత్రాలలో చూడవచ్చును.
బాగా తీసుకు వచ్చారు ప్రసాద్
“ఐనా అలవి కానంతగా నిన్ను ప్రేమిస్తున్నాను కనక
నాకే గనక తెలిస్తే నిన్ను వెతుక్కుని వెతుక్కుని ఎదురొచ్చి” “నాకే గనక తెలిస్తే చిటాఁమని నిన్ను నిద్దర్లేపి చెవిలోకి” …”నాకే గనక తెలిస్తే లెగిసొచ్చి కట్టి కావిలించుకుని నీకు బెదరు.” చరణాలముక్తాయింపులు బాగా వచ్చాయి
సంగీతరంగంలో అంతటి పేరుప్రఖ్యాతులూ, అనుభవమూ గడించాక కూడా విజయరాఘవరావుగారు ఎంతో నిరాడంబరంగా జీవించారు. ‘మీరు ఆట్లాంటా వస్తున్నట్టుగా కూడా మాకు తెలియలేదే?’ అనే నేనంటే ‘ఇక్కడ మా అమ్మాయీ, అల్లుడి family, మీరూ తప్ప నాకెవరూ తెలియద’ని ఎంతో సీదాగా ఆయన చెప్పడం నాకు బాధ కలిగించింది. ఆయనచేత కచేరీ ఏర్పాటు చేయించాలనీ, ఈసారి వచ్చినప్పుడు ముందుగా అడిగి తెలుసుకుంటాననీ అన్నాను. ఆ అవకాశం రానేలేదు.
సంగీతంలోనే కాక మాట తీరులోనూ, ప్రవర్తనలోనూ సంస్కారం ఉట్టిపడేట్టు జీవించిన మహానుభావుడాయన. Sionలో వాళ్ళ Ram sharan ఇంటి ప్రాంతాన్ని ఎన్నటికీ మరిచిపోలేను.
మాన్యులు శ్రీ రోహిణీప్రసాద్ గారి నివాళిని చదివి, ఆయన అనుసంధించిన ఆ స్వరలహరిలో తేలియాడుతుంటే మైమఱపు కలిగి, కళ్ళల్లో నీళ్ళుతిరిగాయి. మా చిన్నప్పుడు – ఆయన పేర్కొన్న ఆ కార్యక్రమం జరిగిన తర్వాత – మా బాబాయిగారు, పిన్ని మద్రాసులో మా ఇంటికి వచ్చినప్పుడు ఆ సంఘటనను గుఱించి మా అందరికీ వివరించి చెప్పటం, మా పిన్ని శ్రీ రోహిణీప్రసాద్ గారిని గుఱించి ఎంతో ఆప్యాయనంగా మాట్లాడటం నా కింకా గుర్తున్నది. తెలుగు సాహిత్యాన్ని వేలుపట్టుకొని నడిపించిన మహామహుని తనయునికి ఆయన సంగీతాభిమానమంతా సంక్రమించినదని మా పిన్ని అనటం వల్ల నాకప్పుడు శ్రీ రోహిణీప్రసాద్‌గారి పేరు తెలిసింది. వారిని నేనెన్నడూ కలుసుకోలేకపోయినా – మా బాబాయిగారు, నాన్నగారల ద్వారానూ; వారి అక్కగారు ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి శాంతసుందరిగారు, బావగారు సుప్రసిద్ధకథకులు శ్రీ రామవరపు గణేశ్వరరావు గారల ముఖతః వారిని గుఱించి తెలుసుకొనే అవకాశం కలిగింది. వారి స్మృత్యంజలి మా ఇంటిల్లిపాదినీ కదిలించిందని చెప్పటానికే ధన్యవాదపురస్సరంగా ఈ నాలుగు మాటలూ వ్రాశాను.
వ్యక్తితో అనుబంధం, ఆత్మీయత అల్లుకొన్నవారి రచనలెప్పుడూ ఆ వ్యక్తితో తమకు గల పరిచయాన్ని నెమరువేసుకొంటూ ఈ విధంగానే ఉంటాయి. శ్రీకృష్ణదేవరాయలు పరమపదించినప్పుడు అల్లసాని పెద్దనగారు నిఃస్పృహులై, “మనుచరిత్రం బందుకొనువేళ యెదురేఁగి పల్లకి తన కేలఁ బట్టి యెత్తె”, “ఆంధ్రకవితాపితామహ! అల్లసాని పెద్దనార్య! అని నన్నుఁ బిలచునట్టి కృష్ణరాయల తోడ దివి కేఁగలేక బ్రదికియున్నాఁడ” అన్న వాక్యాలు స్వోత్కర్షలు కావు.
సాహిత్యాభిమానులు అందులో చరిత్రశకలాలను గుర్తించి, వ్యక్తిజీవితాన్ని పునర్నిర్మించుకొంటారు.
చాలాకాలంగా భారతదేశవాసానికి, ఈనాటి ప్రచార భేరీభాంకారాలకు దూరంగా ఉండటం వల్ల మా బాబాయిగారిని గుఱించి ఈ తరానికి అంతగా తెలియకపోవటం జరిగింది. వారు స్వర్గస్థులైనప్పుడు నేను మా కుటుంబానికీ, బాబాయిగారికీ ఆప్తులైన శ్రీ మందలపర్తి కిషోర్ గారికి తెలియజేయటమూ, వారు సాక్షి దినపత్రికలోను, సాక్షి టివిలోనూ వెల్లడించటం జరిగింది. తర్వాత శ్రీ రవిబాబుగారు సహృదయంతో గౌరవపూర్వకంగా నెమరువేసుకొన్నారు.
ఈ లేఖావళిని ఈరోజే చూడటం మూలాన ఆలస్యంగా స్పందించినందుకు మన్నింప ప్రార్థన.
వారి జ్ఞాపకాలను మఱెప్పుడైనా వ్రాసే ప్రయత్నం చేస్తాను. శ్రీ రోహిణీప్రసాద్ గారికి ధన్యవాదాలు.
నా స్వోత్కర్ష కొట్టుకోవాలంటే మరెన్నో అవకాశాలుంటాయి సార్. విజయరాఘవరావుగారి కంటే పెద్దల పేర్లే drop చెయ్యగలను. ఆయనతో నాకుండిన interaction మాత్రమే రాశాను.
ఆయన 15-8-1947న జనగణమన ఆర్కెస్ట్రా వాయింపించిన సంగతీ, సంగీతదర్శకుడు రోషన్ దిల్రుబాతో వేణువు జుగల్‌బందీ వాయించిన సంగతీ స్వయంగా ఆయనే చెప్పారు. ఈ వ్యాసం నా డబ్బా కొట్టుకోవడానికి రాయలేదు. అలాంటి పని ఇంతకన్నా చాలా subtleగా చెయ్యాలి. Pl give me more credit for my writing abilities!
నా సంగతి వదిలేసి సంగీతం మీద ఏమన్నా ఆసక్తి ఉంటే రావుగారి గురించి తలుచుకోండి. మీవంటివారిని కూడా convince చెయ్యలేని నా స్వోత్కర్ష మాటకేం లెండి.
చివరకు “నరసరావుపేట” అన్న బ్లాగు (అది ఆయన స్వస్థలం) నడిపేవారికి కూడా ఈ వార్త తెలిసినట్లు లేదు. వెటకారం బహు బాగానే ఉంది కానీ లాభం లేదు! నిజమే! నాకు కూడా తెలీలేదు. ఆయన నాకు (మా అత్తింటివారి వైపు నుంచి)దూరపు బంధువు కూడా అవుతారు. అయినా తెలీలేదు. బంధుత్వాలిలా ఉన్నాయని ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలన్నమాట! :-))
ఆయనతో కలిసి పని చేసి, కచేరీలు నిర్వహించి, సంగీత దర్శకత్వాలు వహించి, ఎంతో కొంత స్నేహం, పరిచయం ఉన్న వారికే ఏదో ఒక పత్రిక చూస్తే తప్ప తెలీలేదంటే కేవలం నరసరావు పేట సంగతులతో బ్లాగు నడిపే వారికి ఈ విషయం తెలీక పోవడంలో ఆశ్చర్యం ఉందని అనుకోడం లేదు గానీ, బంధువులెవరూ ఈ విషయాన్ని పంచుకోకపోవడం.. కొంత విషాదం! పైగా ఆయన కుటుంబంతో నాకు పరిచయం తక్కువ.
నాకు తెలిసిన ఆయన జ్ఞాపకం! నరరసరావు పేట ద్విశతాబ్ది ఉత్సవాలు జరిగినపుడు ఆయన్ని అహ్వానించగా ఆయన అమెరికా నుంచి వచ్చారు. మా వూరి నడి బొడ్డులో ఆయనకు సన్మానం జరిగింది.ఆ సభలో ఆయన,తన వేణువుని సవరించి అందరికీ వీనుల విందు చేశారు. చాలా ఉద్వేగ భరితులై మాతృభూమి గురించి ఆశువుగా కవిత్వం చెప్పారని చదివాను. వీలైతే ఆ నాటి వార్తా పత్రికలు సంపాదించడానికి ప్రయత్నిస్తే తెలుస్తుందేమో!
నా వద్ద వారి కవితా సంకలనం “అంతర్వాణి” ఉంది. మరి కొన్ని విశేషాలు సుబ్రహ్మణ్యం గారి అబ్బాయి శ్రీ ఏల్చూరి మురళీధర్ రావు గారిని సంప్రదిస్తే చెప్పగలరు.
విద్యాసుందరి – వ్యాసానుబంధము గురించి మోహన అభిప్రాయం:
01/13/2012 9:24 pm
నాగరత్నమ్మను గురించి హిందూ పత్రికలో వచ్చిన వార్తను ఇక్కడ చదువగలరు. తిరువయ్యారులో నాగరత్నమ్మ నిర్మించిన త్యాగరాజస్వామి ఆలయము, మున్నగునవి ఈ చిత్రాలలో చూడవచ్చును.
విధేయుడు – మోహన
నాకే గనక తెలిస్తే గురించి TahaTaha అభిప్రాయం:
01/13/2012 10:39 am
బాగా తీసుకు వచ్చారు ప్రసాద్
“ఐనా అలవి కానంతగా నిన్ను ప్రేమిస్తున్నాను కనక
నాకే గనక తెలిస్తే నిన్ను వెతుక్కుని వెతుక్కుని ఎదురొచ్చి” “నాకే గనక తెలిస్తే చిటాఁమని నిన్ను నిద్దర్లేపి చెవిలోకి” …”నాకే గనక తెలిస్తే లెగిసొచ్చి కట్టి కావిలించుకుని నీకు బెదరు.” చరణాలముక్తాయింపులు బాగా వచ్చాయి
ఆగవే రజనీ! విభావరి! గురించి TahaTaha అభిప్రాయం:
01/13/2012 9:40 am
ధన్య వాదాలు మోహన గారూ
మిత్రుడు
తఃతః
వేణునాదం ఆగింది! గురించి Rohiniprasad అభిప్రాయం:
01/13/2012 1:47 am
సంగీతరంగంలో అంతటి పేరుప్రఖ్యాతులూ, అనుభవమూ గడించాక కూడా విజయరాఘవరావుగారు ఎంతో నిరాడంబరంగా జీవించారు. ‘మీరు ఆట్లాంటా వస్తున్నట్టుగా కూడా మాకు తెలియలేదే?’ అనే నేనంటే ‘ఇక్కడ మా అమ్మాయీ, అల్లుడి family, మీరూ తప్ప నాకెవరూ తెలియద’ని ఎంతో సీదాగా ఆయన చెప్పడం నాకు బాధ కలిగించింది. ఆయనచేత కచేరీ ఏర్పాటు చేయించాలనీ, ఈసారి వచ్చినప్పుడు ముందుగా అడిగి తెలుసుకుంటాననీ అన్నాను. ఆ అవకాశం రానేలేదు.
సంగీతంలోనే కాక మాట తీరులోనూ, ప్రవర్తనలోనూ సంస్కారం ఉట్టిపడేట్టు జీవించిన మహానుభావుడాయన. Sionలో వాళ్ళ Ram sharan ఇంటి ప్రాంతాన్ని ఎన్నటికీ మరిచిపోలేను.
మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి రాసూరి మహేశ్వరరావు అభిప్రాయం:
01/12/2012 10:31 pm
ఈరోజు మెదటిసారి ఈ సైట్ లోకి వచ్చాము. చాలా ఉపయోగకరమైన మంచి సమాచారం ఉంది. చాలా బాగుంది.
వేణునాదం ఆగింది! గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
01/12/2012 9:33 pm
మాన్యులు శ్రీ రోహిణీప్రసాద్ గారి నివాళిని చదివి, ఆయన అనుసంధించిన ఆ స్వరలహరిలో తేలియాడుతుంటే మైమఱపు కలిగి, కళ్ళల్లో నీళ్ళుతిరిగాయి. మా చిన్నప్పుడు – ఆయన పేర్కొన్న ఆ కార్యక్రమం జరిగిన తర్వాత – మా బాబాయిగారు, పిన్ని మద్రాసులో మా ఇంటికి వచ్చినప్పుడు ఆ సంఘటనను గుఱించి మా అందరికీ వివరించి చెప్పటం, మా పిన్ని శ్రీ రోహిణీప్రసాద్ గారిని గుఱించి ఎంతో ఆప్యాయనంగా మాట్లాడటం నా కింకా గుర్తున్నది. తెలుగు సాహిత్యాన్ని వేలుపట్టుకొని నడిపించిన మహామహుని తనయునికి ఆయన సంగీతాభిమానమంతా సంక్రమించినదని మా పిన్ని అనటం వల్ల నాకప్పుడు శ్రీ రోహిణీప్రసాద్‌గారి పేరు తెలిసింది. వారిని నేనెన్నడూ కలుసుకోలేకపోయినా – మా బాబాయిగారు, నాన్నగారల ద్వారానూ; వారి అక్కగారు ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి శాంతసుందరిగారు, బావగారు సుప్రసిద్ధకథకులు శ్రీ రామవరపు గణేశ్వరరావు గారల ముఖతః వారిని గుఱించి తెలుసుకొనే అవకాశం కలిగింది. వారి స్మృత్యంజలి మా ఇంటిల్లిపాదినీ కదిలించిందని చెప్పటానికే ధన్యవాదపురస్సరంగా ఈ నాలుగు మాటలూ వ్రాశాను.
వ్యక్తితో అనుబంధం, ఆత్మీయత అల్లుకొన్నవారి రచనలెప్పుడూ ఆ వ్యక్తితో తమకు గల పరిచయాన్ని నెమరువేసుకొంటూ ఈ విధంగానే ఉంటాయి. శ్రీకృష్ణదేవరాయలు పరమపదించినప్పుడు అల్లసాని పెద్దనగారు నిఃస్పృహులై, “మనుచరిత్రం బందుకొనువేళ యెదురేఁగి పల్లకి తన కేలఁ బట్టి యెత్తె”, “ఆంధ్రకవితాపితామహ! అల్లసాని పెద్దనార్య! అని నన్నుఁ బిలచునట్టి కృష్ణరాయల తోడ దివి కేఁగలేక బ్రదికియున్నాఁడ” అన్న వాక్యాలు స్వోత్కర్షలు కావు.
సాహిత్యాభిమానులు అందులో చరిత్రశకలాలను గుర్తించి, వ్యక్తిజీవితాన్ని పునర్నిర్మించుకొంటారు.
చాలాకాలంగా భారతదేశవాసానికి, ఈనాటి ప్రచార భేరీభాంకారాలకు దూరంగా ఉండటం వల్ల మా బాబాయిగారిని గుఱించి ఈ తరానికి అంతగా తెలియకపోవటం జరిగింది. వారు స్వర్గస్థులైనప్పుడు నేను మా కుటుంబానికీ, బాబాయిగారికీ ఆప్తులైన శ్రీ మందలపర్తి కిషోర్ గారికి తెలియజేయటమూ, వారు సాక్షి దినపత్రికలోను, సాక్షి టివిలోనూ వెల్లడించటం జరిగింది. తర్వాత శ్రీ రవిబాబుగారు సహృదయంతో గౌరవపూర్వకంగా నెమరువేసుకొన్నారు.
ఈ లేఖావళిని ఈరోజే చూడటం మూలాన ఆలస్యంగా స్పందించినందుకు మన్నింప ప్రార్థన.
వారి జ్ఞాపకాలను మఱెప్పుడైనా వ్రాసే ప్రయత్నం చేస్తాను. శ్రీ రోహిణీప్రసాద్ గారికి ధన్యవాదాలు.
సవినమ్రంగా,
ఏల్చూరి మురళీధరరావు
వేణునాదం ఆగింది! గురించి Editors అభిప్రాయం:
01/12/2012 2:50 pm
Dear Posters:
The editors have decided to not approve further comments on this article (barring those that are only about the person being remembered, Sri E. V. R).
We appreciate your cooperation.
Editors of eemaata.
వేణునాదం ఆగింది! గురించి Rohiniprasad అభిప్రాయం:
01/12/2012 10:23 am
ఎందుకో నేను రెహమాన్‌గారి కామెంట్ మిస్ అయాను.
నా స్వోత్కర్ష కొట్టుకోవాలంటే మరెన్నో అవకాశాలుంటాయి సార్. విజయరాఘవరావుగారి కంటే పెద్దల పేర్లే drop చెయ్యగలను. ఆయనతో నాకుండిన interaction మాత్రమే రాశాను.
ఆయన 15-8-1947న జనగణమన ఆర్కెస్ట్రా వాయింపించిన సంగతీ, సంగీతదర్శకుడు రోషన్ దిల్రుబాతో వేణువు జుగల్‌బందీ వాయించిన సంగతీ స్వయంగా ఆయనే చెప్పారు. ఈ వ్యాసం నా డబ్బా కొట్టుకోవడానికి రాయలేదు. అలాంటి పని ఇంతకన్నా చాలా subtleగా చెయ్యాలి. Pl give me more credit for my writing abilities!
నా సంగతి వదిలేసి సంగీతం మీద ఏమన్నా ఆసక్తి ఉంటే రావుగారి గురించి తలుచుకోండి. మీవంటివారిని కూడా convince చెయ్యలేని నా స్వోత్కర్ష మాటకేం లెండి.
వేణునాదం ఆగింది! గురించి సుజాత అభిప్రాయం:
01/12/2012 7:12 am
చివరకు “నరసరావుపేట” అన్న బ్లాగు (అది ఆయన స్వస్థలం) నడిపేవారికి కూడా ఈ వార్త తెలిసినట్లు లేదు. వెటకారం బహు బాగానే ఉంది కానీ లాభం లేదు! నిజమే! నాకు కూడా తెలీలేదు. ఆయన నాకు (మా అత్తింటివారి వైపు నుంచి)దూరపు బంధువు కూడా అవుతారు. అయినా తెలీలేదు. బంధుత్వాలిలా ఉన్నాయని ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలన్నమాట! :-))
ఆయనతో కలిసి పని చేసి, కచేరీలు నిర్వహించి, సంగీత దర్శకత్వాలు వహించి, ఎంతో కొంత స్నేహం, పరిచయం ఉన్న వారికే ఏదో ఒక పత్రిక చూస్తే తప్ప తెలీలేదంటే కేవలం నరసరావు పేట సంగతులతో బ్లాగు నడిపే వారికి ఈ విషయం తెలీక పోవడంలో ఆశ్చర్యం ఉందని అనుకోడం లేదు గానీ, బంధువులెవరూ ఈ విషయాన్ని పంచుకోకపోవడం.. కొంత విషాదం! పైగా ఆయన కుటుంబంతో నాకు పరిచయం తక్కువ.
నాకు తెలిసిన ఆయన జ్ఞాపకం! నరరసరావు పేట ద్విశతాబ్ది ఉత్సవాలు జరిగినపుడు ఆయన్ని అహ్వానించగా ఆయన అమెరికా నుంచి వచ్చారు. మా వూరి నడి బొడ్డులో ఆయనకు సన్మానం జరిగింది.ఆ సభలో ఆయన,తన వేణువుని సవరించి అందరికీ వీనుల విందు చేశారు. చాలా ఉద్వేగ భరితులై మాతృభూమి గురించి ఆశువుగా కవిత్వం చెప్పారని చదివాను. వీలైతే ఆ నాటి వార్తా పత్రికలు సంపాదించడానికి ప్రయత్నిస్తే తెలుస్తుందేమో!
నా వద్ద వారి కవితా సంకలనం “అంతర్వాణి” ఉంది. మరి కొన్ని విశేషాలు సుబ్రహ్మణ్యం గారి అబ్బాయి శ్రీ ఏల్చూరి మురళీధర్ రావు గారిని సంప్రదిస్తే చెప్పగలరు.
పొదుపు సమీకరణాలు గురించి బులుసు సుబ్రహ్మణ్యం అభిప్రాయం:
01/12/2012 6:12 am
శర్మ గారికి,
నవ్వులు కూడా పొదుపు చేస్తే ఎలా సారూ.
ధన్యవాదాలు.
రాజ్ కుమార్ గార్కి,
మీ అభిమానం ఎప్పటి లాగానే ఉండాలని కోరుకుంటాను.
ధన్యవాదాలు.
పేరం కిరణ్ కుమార్ గారికి,
శివ సుబ్రహ్మణ్యం గారికి,
ధన్యవాదాలు.