పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16480

  1. పలుకుబడి: నతి సూత్రం, కళింగత్తుపరణి గురించి rama bharadwaj అభిప్రాయం:

    03/02/2012 4:22 am

    తమిళం కూడా మాట్లాడగలిగిన తెలుగు పడుచులు అని మాత్రం ఎందుకని అనుకోకూడదూ కొలిచాలా? వారు కన్నడ స్త్రీలు అన్న ఊహకి అక్కడ ఆధారం ఏమి?? జయకొండర్ మూలభావం గానీ పుట్టపర్తి అనువాదం గానీ అందుకు ఆస్కారం ఇవ్వడం లేదే? సురేశ్ నమ్మకం లాంటిది నారాయణాచార్యుల వారికి సైతం ఎందుకని ఉండకూడదూ? “వడుగరు” అంటె తమకి “ఉత్తరాన ఉన్నవారు” అన్న అర్ధమ్లో తెలుగు వారిని గురించి తమిళులు భావించిన వారు. కరునాడు అంటే నల్లటి భూభాగం అని అనుకున్నా నల్లమలలు ఉన్న ప్రాంతం ఆంధ్రదేశమే కదా? నల్ల కొండలు అన్న అర్ధానికి వీలులేదా? అదటుంచి.. నారాయణాచార్యుల వారు విద్వత్తూ, అనుభవమూ కూడా మెండుగా ఉన్నవారు. పైగా భాషలో అఖండులూనూ! ఆయన అంత నిరాధారంగా మాట్లాడి ఉండరు. సంగీతంలో కర్ణాటకానికి ప్రాంతీయత కన్నా సంగీత పరంగా “శ్రావ్యత” కే పెద్ద పీట వెయ్యవలసి ఉంటుంది. పైగా దానిని గురించి ఎక్కడా అది “ప్రాంత సంబంధిగా” వాడిన ఉదాహరణ మనం ప్రాచీన సంగీత గ్రంధాల నించి ఒక్కటీ చూపించకుండా కేవలం భాషా పరిధిలోనే గిరిగిళ్ళు తిరుగుతూ వ్యాఖ్యానం చేసుకోవడం లో సంపూర్ణత గానీ, బలం గానీ లేదు. ఇన్ని వందల ఏళ్ళలో జరిగిన సంగీత పరిణామ దశలలో దీనిని గురించి ఒక్క ప్రస్తావనా లేకుండానే ఈ పదం సంగీత పరంగా ప్రాచుర్యానికి రాగల వీలులేదు. అందువలన మరిన్ని స్పస్టమైన ఆకరాలు లేకుండా కేవలం ఊహల ఆధారంగా భావనలు చేయడానికి ఇక్కడ శాస్త్రం ఒప్పదు. అది తేలేదాకా బాలమురళీ చెప్పినట్టూ సంగీతపరంగా శ్రావ్యమైన గానంగానే గ్రహించడం, కర్ణాటకం అనే అనడం ఇక్కడ సముచితం. మనకి సంగీత శాస్త్ర పరిణామం చెప్పే శాస్త్ర గ్రంధాల లిస్టు చాలానే ఉంది. అవన్నీ ఎంత దొరుకుతున్నాయివాళ అన్నది సంగీత రంగం లోని వారెవరన్నా చెప్పాలి. ఆ పుస్తకాలు ఏమైనా దీని గురించి చెప్పేయా? అన్నది కూడా తెలుసుకోవలసి ఉంది. కాకపోతే మన దగ్గర గాన విద్య తెలిసిన వారే తప్ప సంగీత శాస్త్రాన్ని గురించి విపులంగా విశదీకరించి చెప్పగల వారెవ్వరూ కనిపించడం లేదు. కనీసం పుస్తకాలని రాసిన వారు ఎక్కువలేరు. ఒకవేళ వీటిని గురించి రాసిన పుస్తకాలంటూ ఏమన్నా ఉన్నా అవి బహుశా చర్చింపబడక పోయి ఉండవచ్చు. వాటిని గురించిన చింత తమకు సంగీతం తెలుసని చెప్పుకునే వారికి ఉన్నట్టు కనిపించదు కూడా! ఇది చాలా విచారించవలసిన విషయమే! చాలా పెద్ద లోటు ఇది. కాకపోతే తెలిసినంత వరకైనా “సప్రమాణంగా” ముఖ్యంగా సంగీత రంగంలో ఇందుకు చాలిన వారెవరైనా మాట్లాడటమే ఎక్కువ బాగుంటుంది.

    రమ.

  2. భయం గురించి Indrajit అభిప్రాయం:

    03/02/2012 2:13 am

    పూర్ణిమ గారు,
    మూల కధ చదవక పోయినా చదివినంత భావన కలిగేటంత చక్కగా అనువదించారు. ముఖ్యంగా భయాన్ని వర్ణించిన తీరు చాలా బాగుంది. కేవలం ఒకరి అనువాదాలనే కాకుండా ఇతరుల అనువాదాలను పరిచయం చేస్తే చదువరులు సంతోషిస్తారు.

  3. కోనసీమ కథలు: పిండంతే నిప్పటి గురించి నాగ మురళీధర్ నామాల అభిప్రాయం:

    03/02/2012 1:26 am

    ఉదయాన్నే ఒక మంచి కధ చదివాననే తృప్తి కలిగింది.

  4. పిలూ రాగం గురించి Siddineni Bhavanarayana అభిప్రాయం:

    03/02/2012 1:12 am

    బడే గులామలి, బేగం అఖ్తర్, బిస్మిల్లా ఖానూ, రాం నారాయాణూ, కొడవటిగంటి రోహిణీ ప్రసాదూ,పరుచూరి శ్రీనివాసూ గార్లు, __సారంగీ, షెహ్నాయీ,ఇంటర్నెట్టూ, ఈమాటా… అందరికీ బాకీ పడ్డాను. ఒక్క నమస్కారంతొ ఇందరి ఋణం తీరాలంటే అయ్యే పనేనా?

  5. నాకు నచ్చిన పద్యం: వింధ్యుని స్వగతం గురించి రవి అభిప్రాయం:

    03/02/2012 12:57 am

    “ఎందుకంటే పద్యంలో గొప్ప శబ్ద చమత్కారమేమీ లేదు. భావ చమత్కారమూ లేదు. చాలా సాదా సీదా పదాలతో ఏ వ్యంగ్యమూ లేకుండా సాగిందీ పద్యం. కానీ, ఒక ఆత్మవిశ్వాసం నిండుగా ఉన్న మనస్వి స్వానుభవపు తీవ్రత దీనిలో కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. ”

    పోనివ్వండి గురువు గారూ. క్లిష్టంగా పద్యం వ్రాసి, పాఠకుణ్ణి ముప్పుతిప్పలు పెట్టి, అపండితుడని ఈసడించుకుని, పద్యమంటేనే గూఢార్థమయమని, పాఠకుడు “ఊరకే” చదివితే లాభం లేదని సవాలక్ష గొంతెమ్మ కోరికలు కోరే పద్యరచనాపాటవం కన్నా కవి మనస్సును మనస్వితను హృద్యంగా, అందంగా, చక్కగా తెలియపర్చి సామాన్యపాఠకుడికి కూసింత అల్పసంతోషం కలిగించిన చిన్ని పద్యం! కవి మనస్విత కొంచానికి కొంచమైనా మీ వివరణ ద్వారా అర్థమయింది. అదే వేనవేలు.

  6. ఎమితిని సెపితివె? గురించి కనకన ప్రసాదు అభిప్రాయం:

    03/01/2012 11:25 pm

    బితిరీలకి జలుబు చేసి పదమూడేళ్ళు
    పేరడీల్ని గురించి పేరడీలాంటి మాటల్లో తప్ప ఇంకోరకంగా మాట్లాడ్డం యమా యాతన. బహుశా అసాధ్యం. నాకు తెలిసిన పుస్తకాలన్నీ అవతలిసిరీసి ఉంచుకున్న రెండు పుస్తకాల్నే (An Anthology of Modern Telugu Poetry; బేంక్ ఆఫ్ అమిరికా పాస్‌బుక్) ఇలాగా అలాగా ఎన్నిసుట్లు ఎంత తిరగేసినా మిగిలింది ఇలాట ఇగటాలే. వీటిని మా సైడు – అంటే అంపఖండి, పురుషోత్తపురం అటీపు – బితిరీలు అంటారు. నీకు ఇగటాలాడ్డం తెలియకపోతే, ఇగటాలు తెలీదు. మనిషి నడకబట్టి ‘వీరు పూజ్యులు. పెద్దవారి బితిరీలంటే ఇలాగే గావాల!’ అనీసి నువ్వు పట్టీసుకోలేకపోతే నువ్వు ఇంక బితిరీలు పట్టుకోలేవు. అంటే, పెద్దవారి ఎచ్చులంటే ఏమిటో తెలిసిన వాళ్ళకి అలాట పెద్దలే స్వయంగా చిలకట్లెగ్గట్టుకోనొచ్చి చెప్పకపోయినా తెలుసు. బితిరీలు పోల్చుకోలేని వారికి మరి ఎందరు పెద్దలొచ్చి ఉవాచ చేసినా మరింక తెలీదు. వారు పెద్దలు ఏ ముక్క చెప్పినా ‘మరే! మనందరి తరుఫునా మాష్టారు అధ్యయనీకరించేసారుగా! చారిత్రక సత్యాల్ని విస్మరిస్తే ఎట్లా?!…!!’ అని భక్తితో పల్లకుంతారు.

    అయితే మరి ఇది ఎందుకు రాస్తున్నాను? నా కడుపుబ్బరం ఉగ్గబట్టుకోలేక. నాకు వేలూరి రాసిన పేరడీలు చదవగానే ‘మీకు అట్టాగనిపించిందీ? నాకూ అట్టాగే అనిపించింది!’ అనిపించింది. కాని ‘ఆఁ … ఎవరెట్టాపోతే నాకేం!’ అనిపించలా. ఎందుకట్టా అనిపించలేదు చెప్మా? అని నవ్వి నవ్వి లుమ్మచుట్టుకుపోయి నా నాభి లోపల్లోపలకి నేనే అస్తమానం చూసుకోలేక అవస్తలు పడుతుంటే బితిరీలు కితకితలుగా మారి ఎక్కిళ్ళలోకి దిగి ఇవి ఇలాటలాట బితిరీలు కావు, ఇగటాలకే మొగలాయీలు ఈ చెతుర్లనీసి పరమ నిదానంగా బోధపట్టం మొదలెట్టీసింది అనీసి నేనెరుగుదును. వేలూరి ఈ ప్రత్యేకత ఎలా సాధించుకున్నాడో నాకు తెలీదు. బహుశ వారి పెద్ద మేష్టారు నేర్పిన విద్యయే అయ్యుంటాది. కాని వారినుండి ఇలాట కులాసాలు చూట్టాలు, కవితా దేవర దేవతా వస్త్రాల్ని పోల్చుకోడాలు మాత్రం మాసైడు మరి ఇదే మొదటిసారి…!

    నాలో ఉన్నాయని నాకే తెలియని ఫన్నీ బోన్స్ అన్నింటిలోకీ ఈ వేళాకోళాలు వేళాపాళా లేకండా ప్రవేశించీసి మాయావిడ ‘ఆపుబే నీ యబ్బా..! వాకింగ్కెల్దామా?!’ అని తిట్టడాలవరకూ వచ్చింది. నా కడుపులో ఇన్నిగటాలున్నాయనీసి నాకు ఇంతకుముందు తెలీదు. నిజంగానే భాషకి జబ్బు చేసి నలభయ్యేళ్ళు అయ్యిందనే నీను కూడా అనుకుని ఊరుకున్నాను. అంతేకాదు; ఆ మరుసట్నాడు వ్యాకరణానికి జలుబు చేసి పదమూడేళ్ళు అనీసి మాయావిడితోటి అన్నాను. అది “అక్ఖల్లేని బితిరీలన్నీ నీకెందుకురా? నోర్మూసుకుని చేతులు గట్టిగా ఊపుతూ, ఒక కన్ను సగం తెరిచి, ఒక కన్ను సగం మూసుకుని, మిగిల్నవన్నీ పూర్తిగా మూసుకుని, నిదానంగా వాకింగ్ చెయ్యి…!” అని వాకింగ్ ఎట్లా చెయ్యాలో ఉవాచల్లోకి దిగిపోయింది. ఆ బితిరీలు నేను ఒద్దంటున్నా వినకుండా ఎవరు పిలిచారని అడగడానికి వీల్లేకుండా నాలోపలికొచ్చీసేయి. ఎంతలా అంటే నా ఊహల్ని నిబ్బరంగా నిలబెట్టే వచనాన్నుండి తప్పించీసుకుని, జాగింగ్ ట్రెయిల్ చుట్టూ అడ్డంగా ఒకసారీ నిలువుగా ఒక సారీ ‘నడువూ నడువూ తిమ్మప్పా! నవ్వాకోయీ తిమ్మప్పా!! పెద్దావారు తిమ్మప్పా! పెదవికి చేటు తిమ్మప్పా!! ‘ అని మాష్టారు చెప్పినట్టు తలూపి బుద్ధిగా నడిచే కవితా బాల వలె!

    మనస్సు, మెదడు, భాష, వ్యాకరణం బితిరీలకి బానిసలైపోతాయి. ఆ బితిరీల్ని వొదుల్చుకుని ఏ కొత్త గడుసు లోకాల్లోకీ మాటకారితనంగా పెత్తనం చెయ్యకుండా ఊరుకోడానికి ఒక పట్టాన మనం ఒప్పుకోం. ఒకవేళ మనం ఒప్పుకున్నా, మనలోని పెద్దవారికి ‘మనసు మాట వినదు.’ వేలూరిని వేలూరి అనీసే నేను ఎరుగుదును. కాని ఇలాగ వెవ్వెవ్వేలూరిగా తెలీదు.

    ఈ పేరడీని పెద్దవారి ఎచ్చుల్నీ, వారి బితిరీలకి మనం నమస్కారం చెయ్యడాల్నీ, ఇంకా వారి ఉవాచల వెనుక సంకల్పాల వికల్పాలన్నింట్నీ తెలుసుకోకుండా గనక మీరు చూసారా, మీకు ఈ ఇగటం అర్ధం కాదు. పెద్దల్ని వొదిలెయ్యండి. పెద్దవారి ఎచ్చుల వల్ల వచ్చే ఇగటాల్ని ఎవరూ చూడకుండా దొంగచాటుగా ఎంజామెంట్ మాత్రం చేసుకోండి. పెద్దవారి ఎచ్చులు భాషంత అనాది అని, వారి ఆలోచనలకి కూడా ఎప్పుడే నా జలుబు చేస్తుంటుందనీ వారి ఉవాచలే మీలో కొన్ని ఇగటాల్ని పొగబెడతాయి. అప్పుడు వెవ్వెవ్వేలూరి ఇగటానికీ స్నేహానికీ పోషకుడూ విదూషకుడూ అయిన మనిషి కనిపిస్తాడు. ‘అబ్బ ఇదుగో ప్లీజ్! ఒద్దువై, వెవ్వె.. వెళిపోవై!’ అని చెప్పినా వినకుండా. ఆయన ఇగటాలకి అర్ధం పర్ధం ఏమైనా ఉన్నాయో లేవో మీ అంతట మీరు ఆలోచించుకోకుండా ఎవరైనా పెద్ద మేషార్ని కనుక్కోవాలని మళ్ళీ బూకరించుకుంటారు మీరు. భాషకి ఎన్నేళ్ళాయి జబ్బు చేసిందో, నెలకో దినం తక్కువ చేసి ఛందస్సుకి మేహవాతం ఒస్తునాదో లేదో, వ్యాకరణానికి జలుబు చేస్తే ఎట్లా ఒదలగొట్టాలో ఒక సుహృద్భావపూరిత మేధో ఆవరణంలో మీరు మర్యాదగా చర్చించ గలుగుతారు. అట్లా చర్చించినవన్నీ ఎవరైనా సాహితీ మిత్రులతో బుక్కుగా వేయించుకోండి. ఆ పని చాలా నిదానంగా, లేని పద్యాన్ని ఉన్నట్టు రూపించినంత నిబ్బరంగానూ చెయ్యాలి. దానికి ‘మధ్య మాట’ ఎవరు రాయాలో ఈ సుట్టు మొదట వేలూరినే అడగండి. ఎందుకేనా మంచిది …!

  7. మల్లెపూల మధూలిక గురించి మోహన అభిప్రాయం:

    03/01/2012 9:07 pm

    జగ మొక నందనము, మన సొక బృందావనము, నందన మందిస్తుంది ఆనందాన్ని సుఖశాంతులను, మీకు, ఈమాట పాఠకులకు తప్పక! కవిత బాగుంది. మరి, చెట్టు ఆకులను రాల్చడము ప్రకృతి ధర్మము గదా, ఏమంటారు? విధేయుడు – మోహన

  8. స్నానాల గదిలో గురించి మోహన అభిప్రాయం:

    03/01/2012 8:59 pm

    గదిలో కలిగిన భావాలను మదిలో పదిలపరచుకొని, మదిలో మెదలిన భావాలను గదిలో పదిలపరచుకొని చక్కగా కవితను అల్లారు. మీ ఊహాగానానికి జోహారులు. కాని ఆవిరితో నిండిపోయిన నీటిని తేనీరనుకోకండి, నాలుక నల్లబడుతుంది 🙂 విధేయుడు – మోహన

  9. బిచ్చగత్తె శిశువు గురించి మోహన అభిప్రాయం:

    03/01/2012 8:50 pm

    రవిగారు, ఛందస్సంఘానికి స్వాగతము! మీ ప్రయత్నానికి జోహారులు. చందురుని నుండిల దిగిన చక్రవర్తి., ఈ పాదము ఎంత అందమైనదో! కావ్యాలను పరిశీలిస్తూ చదివితే అరసున్న ఉపయోగములో సామర్థ్యాన్ని సంపాదించగలరు. విధేయుడు – మోహన

  10. పిలూ రాగం గురించి శారద అభిప్రాయం:

    03/01/2012 7:24 pm

    వినసొంపైన రాగం- పీలూ గురించి చాలా బాగా వివరించారు.

    “మోహె పన్ ఘట్” క్లారిఫికేషన్ కి ధన్యవాదాలు. అది పీలూ నా లేక గారా నా అన్న విషయం పై నేనూ వాదోపవాదాలు విన్నాను. మీలాగే అది గారా అయిందుండొచ్చని అభిప్రాయపడ్డాను. బాంబే జయశ్రీ
    పాడిన భజన్ “రాఘవం కరుణాకరం” అనే పాట విన్నారా? అది కూడా చాలా మంది పీలూ అన్నా నాకు గారా లాగే అనిపిస్తుంది. మీ అభిప్రాయం చెప్పగలరు.

    తెలుగు తమిళ సినిమాల్లో పీలూ లో పాటలు చాలానె వున్నట్టున్నాయి.

    1.”తెల్లారే దాకా నువ్వు తలుపు తీసి తొంగుంటే”- సినిమా పేరు తెలియదు కానీ, పాడింది యేసుదాస్ అనుకుంటా.
    2. ఏ దివిలో విరిసిన పారిజాతమో- ఈ పాట గురించి చాలా మందితో చర్చించాను- కొన్నిసార్లు పీలూ లా, కొన్నిసార్లు కాపీ లాగనిపిస్తుంది. మీ ఉద్దేశం యేమిటి?
    3.”ప్రియా” అనే తమిళ చిత్రంలో ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీతంలో యేసుదాస్, జానకి పాడిన పాట- “యే పాడల్ ఒన్రు” అనే పాట- దీన్నే తెలుగులో “నీ పెదవుల పైన తేనెల వాన” అని ఎస్పీబీ జానకి పాడారు. ఇది
    కూడా పీలూ లాగే అనిపిస్తుంది నాకు.

    శారద