పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16479

  1. మైదానానికి చెలియలి కట్ట గురించి pavani అభిప్రాయం:

    05/09/2012 7:13 am

    I have read your article. It is a good detailed analysis. I read Maidaanam but I did not like it for something was missing. If I was asked why I did not like the book I couldn’t tell. From today I can say why I did not Like Maidaanam. I got words from your article. Thank you.

  2. చందవరం, ప్రకాశం జిల్లా గురించి అజ్ఞాత అభిప్రాయం:

    05/09/2012 12:49 am

    ఈరకం కవిత్వం అంటే నాకు చాలా ఇష్టం. రచయితని ‘మామూలు మాటలని కవితలుగా మలచగల అద్యుభయ కవయిత్రి’ అనచ్చు

  3. తేనీటి సమయం గురించి Sudhakar Majety అభిప్రాయం:

    05/08/2012 11:44 pm

    జీవితాన్ని అనుభవించాలంటే బెంజ్ లూ, బీచ్ ఫ్రంట్ ఇళ్ళూ అక్కర్లేదు, మంచి కాఫీ, మరీ ముఖ్యం, దాన్ని అనుభవించగలిగే దర్జా ఉంటే చాలు. ఎంత బాగా రాసారండీ !

  4. పాఠకులకు సూచనలు గురించి Rohiniprasad అభిప్రాయం:

    05/08/2012 11:42 pm

    ఇటీవలనే లండన్‌లో దొరికిన 1912 నాటి కలకత్తా ఫోటోలు కొన్ని ఇక్కడ చూడవచ్చు. మన దేశంలో గత వందేళ్ళుగా మారకుండా ఉన్నవి ఎటువంటివో మనం గమనించవచ్చు.

  5. మల్లె అంటు గురించి Sudhakar Majety అభిప్రాయం:

    05/08/2012 11:39 pm

    జ్ఞాపకాల జవ్వాది వీచిక….
    ఎంత అందంగా రాసారు!

  6. చందవరం, ప్రకాశం జిల్లా గురించి vikas,vinnakota అభిప్రాయం:

    05/08/2012 9:16 pm

    చాలా బాగున్నది అండి..

    వికాస్ విన్నకోట

  7. ఆషాఢస్య ప్రథమ దివసే గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    05/08/2012 12:16 pm

    Kudos to Mohana Rao gaaru for a scholarly essay!

    కాని నాకు ఒక సందేహము మాత్రము ఉన్నది. కాళిదాసు ఉజ్జయినీవాసుడు. కాని గుప్తుల రాజధాని పాటలీపుత్రము. ఇంత దూరము ఉన్నా కాళిదాసుకు చంద్రగుప్తునికి ఎలా సంబంధాలు ఉండినవో అన్నది చర్చనీయాంశమే. ఈ రెండవ చంద్రగుప్తుడే విక్రమాదిత్యుడా అన్న విషయము ఇంకా తేలలేదు.

    సముద్రగుప్తుని కొడుకైన రెండవ చంద్రగుప్తుడు శకులను ఓడించిన తరువాత ఉజ్జయినిని తన రెండవ రాజధానిగా చేసుకున్నాడని మనకు దొరికిన శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. కొన్ని బంగారు నాణేల మీద ఒకవైపు దేవశ్రీ మహారాజాధిరాజ శ్రీ చంద్రగుప్త అని మరోవైపు శ్రీవిక్రమాదిత్య అన్న ముద్రల ఆధారంగా రెండవ చంద్రగుప్తుడే విక్రమాదిత్యుడని చెప్పవచ్చు. రెండవ చంద్రగుప్తుని రాజ్యకాలం 380–413/415 CE అని కచ్చితంగా చెప్పవచ్చు కాబట్టి కాళిదాసు 4వ శతాబ్దానికి చెందినవాడనే చెప్పడం సబబు. ఇది ప్రస్తుతం పండితులంతా (Indologists) ఒప్పుకున్న వాదం.

    కాళిదాసు కాలనిర్ణయ వివాదంపై విస్తృత చర్చకు Kālidāsa: Date, Life, and Works (1969) by Vasudev Vishnu Mirashi, Narayan Raghunath Navlekar ను చూడవచ్చు.

  8. లక్ష్మణదేవర నవ్వు గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    05/08/2012 11:32 am

    దేవర అన్న పదానికి ఉన్న రెండు అర్థాలలో దేవుఁడు, ప్రభువు అన్న అర్థాలు దేవ శబ్దానికి -రు అనే బహువచన ప్రత్యయము (మహన్మహత్యర్థక బహువచన ప్రత్యయము) జత చేయడం వల్ల వచ్చింది. మనుష్య నామవాచకాలకు -రు ప్రత్యయము, ఇతర నామవాచకాలకు -గళు/-ళు జతచేయడం ఇతర ద్రావిడ భాషలలో కనిపించినా తెలుగులో మాత్రం బాలురు, పెక్కురు వంటి కొన్ని నామవాచకాలలో తప్ప ఇతర నామవాచకాలలో -లు అన్న ప్రత్యయమే కనిపిస్తుంది.

    భర్త తోబుట్టువు అన్న అర్థం ఉన్న దేవర అన్న పదానికి ధాతురూపాలు ఇండో-యూరోపియన్ భాషలన్నింటిలో ఉన్నాయి..

    గ్రీక్ — dāḗr
    అర్మేనియన్ — taigr
    స్లావిక్ — dēverь
    జర్మన్ — zeihhor
    ఇంగ్లీష్ – tacor
    పార్శీ — hīwar

    భర్త సోదరుడినే కాకుండా సహోదరి భర్తను కూడ దేవర అని సంబోధించిన సందర్భాలు కూడా సంస్కృతంలో మనకు కనిపిస్తాయి. ఉదాహరణకు భాగవతం తృతీయ స్కంధంలో 14.25వ శ్లోకం చూడండి:

    శ్మశాన చక్రానిల ధూలి ధూమ్ర వికీర్ణ-విద్యోత-జటా-కలాపః
    భస్మావగుంఠామల రుక్మ దేహోదేవస్ త్రిభిః పశ్యతి దేవరస్ తే

    కశ్యపుడు దితికి అసురసంధ్య వేళలో మైథునం కూడదని చెబుతూ, గణనాథుడైన శివుడు మూడు కళ్ళతో చూస్తుంటాడు అని హెచ్చరిస్తాడు. దితి సహోదరి భర్త అయిన శివుడిని ఇక్కడ నీ దేవరుడు (దేవరస్ తే) అని సంబోధించడం విశేషం.

  9. లక్ష్మణదేవర నవ్వు గురించి వినీల్ అభిప్రాయం:

    05/08/2012 4:58 am

    చక్కని వ్యాసం. మంచి పాటను, మాటను పరిచయం చేశారు. హిందీ దేవర్ కు, మన దేవరకు ఇంత దగ్గరి పోలిక అని ఇప్పుడే తెలిసింది. చివర్లో రచయిత అభిప్రాయం/ముగింపు మాత్రం హడావిడిగా చొప్పించినట్టుంది.

  10. ఆషాఢస్య ప్రథమ దివసే గురించి తఃతః అభిప్రాయం:

    05/07/2012 10:41 pm

    జయప్రభ గారు అంత దీర్ఘం గా చెప్పింది ‘ఆషాఢస్య ప్రథమ దివసే’ మీద చెప్పిన అభిప్రాయమేనా? ఒక రచన మీద వచ్చినట్లుగా ప్రచురిత మైన అభిప్రాయాల్లొ యెన్ని నిజంగా ఆ రచన మీద ఉంటున్నాయి?
    అలా యేదైనా రచన మీద కాకుండా చెప్పే అభిప్రాయాలకు ‘ఈమాట’లో చోటు కలిగించే పద్ధతిని గురించి సంపాదకులు ఆలోచించాల్సిన సమయమాసన్న మైనదా?

    తఃతః

    [అటువంటి చోటు ఈమాట చర్చావేదికల పైన ఎప్పుడో కల్పించాము. కాని, పాఠకులు ఆ వేదికను సద్వినియోగం చేసుకోవడంలేదని చెప్పడానికి చింతిస్తున్నాము … సం]