తహ తహ గారూ:
మీరు ఉదహరించిన సైన్ తీటా కవిత రాసింది, మీరాస్లోవ్ హొలూబ్. కవిత పేరు “జీతో ది మెజీషియన్.” దాన్ని ఎప్పుడో ధాత నామ సంవత్సరంలో తెలుగు చేసి భారతి లో ప్రచురించింది నేనే! అనువాదకుడిని నేనని తెలిసిన తరువాత కూడా ఇంకా మీకు చదవాలనే కోరిక మిగిలి వుంటే ఆ కవిత వెతికి (పాత భారతి పత్రికలు వెతికితే బహుశా దొరకచ్చు!) పోస్ట్ చెయ్యటానికి ప్రయత్నిస్తాను. మీరాస్లోవ్ హొలూబ్ ఇండియా వచ్చాడు కూడాను! (అయితే, అతన్ని నేను కలవలేక పోయాననుకోండి.) వృత్తి పరంగా అతను వైద్యుడు. ప్రవృత్తి పరంగా కవి. అతను మరణించి చాలాకాలం అయ్యింది!
ఈ కవిత ఇంతకు మునుపే చదివినాను. ఇప్పుడీ అభిప్రాయములు వింతగా అనిపిస్తున్నాయి. మళ్ళీ వ్రాయమనడమేమిటి? ఎందుకు రాయాలి?
ఇది రచయిత తన –స్వీయ ఇచ్ఛానుసరణ –అని చెప్పినారు కదా. అందువల్ల వారు తెలుగు పాఠకులకు పరిచయమైన ఏ చారిత్రక వ్యక్తినైననూ తీసుకొనే సదుపాయం వారికి ఉన్నది. సెబాస్టియన్ కీ శీతారామరాజు కీ ఒక పోలిక మాత్రము ఉన్నది. ఏలాగునంటారా. చనిపోయిన పిదప వచ్చిన అమరత్వము. సెబాస్టియన్ పోయినాడు. ఆయనను క్రైస్తవులు సెయింటు గా చేసినారు. శీతారామరాజు పోయినాడు. అతనిని బ్రిటీషు దొరల గుండెలలో నిదురించిన సిమ్హముగా తెలుగువారు అమరుని జేసినారు. ఇప్పుడు కొందరు చనిపోయిన వారిని, వీరు నిజముగా ఎట్టివారు అనే చారిత్రక సత్యమేమీ తెలియనీయకుండగనే వీరులుగా కీర్తించుతుంటారు విప్లవ వాదులు, రాజకీయ, మత, నాయకులున్నూ. శివాజీ పై చారిత్రక పరిశోధన పుస్తకముగా రాగానే మరాఠాలు ఎట్లా ప్రతిస్పందించినది మనకు ఎరికయే గదా. శీతారామరాజు గురించి తిరునగరి సత్యనారాయణ గారు ప్రతిస్పందించిన విధము ఈ ధోరణి లోనిదే కదా. శీతారామరాజుని తమ అభిప్రాయములో కీర్తించినారు తిరునగరి గారు. కానీ, ఇది జనబాహుళ్యమైన కథానికయే గాని, చారిత్రక సత్యమేమో మనకు ఇదమిత్థముగా తెలియదు. ఉదాహరణకి శీతారామరాజు ఎట్లా చనిపోయినాడో, భిన్నాభిప్రాయములు ఉన్నాయి కదా. అందువలన శీతారామరాజుని సంగ్రామ సింహముగా చూపిన చరిత్రకారులు నిజముగా చరిత్ర రాసినారో లేక భక్తితో రాసినారో అనే సందేహము కలుగుట సహజమే. ఆ విధముగా చూసినప్పుడు హేజియోగ్రఫరులు భక్తి తలకెక్కిన చరిత్రకారులే కదా. తేడా ఇంకెమున్నది. లేదు. ఇందుగా మనకు తెలియగలది ఏమిటంటే, మనకు ఇష్టమైన, మనము గౌరవించే వ్యక్తులని సాధారణీకరణం చేస్తే మనకు నచ్చదు అని. తిరునగరి గారి విప్లవ వామపక్ష భావములు గాయపడి ఉండి వారు అలా రాసి ఉంటారు. నా మటుకు నాకు, ఇటువంటి విషయములలో, వామపక్షీయులైన గాని, మత ఛాందస వాదులైన గాని, ఒకే విధమున ప్రతిస్పందిస్తారని యొక అవగాహనతోనే రచయిత శీతారామరాజుని ఎంచుకున్నాడని నాకు కలిగిన అభిప్రాయము. ఏ ఉద్దేశముతో రచయిత శీతారామరాజుని ఎంచుకునినాడో ఆ ఉద్దేశమును తిరునగరి గారు తన ప్రతిస్పందనతో సత్యముగా నిరూపించినారని నాకు తట్టిన మాట వాస్తవము. నమస్తే – బీవీకే.
కవితకి ‘జీనొ పారడాక్స్’ అన్న పేరు చూసి చాలా ఆశ్చర్య పోయాను. తెలుగులో ఇటువంటి వస్తువుల మీద కవితలా అని. వెంటనే చదవటం మొదలు పెట్టి ఇంకొంచెం ఆశ్చర్య పోయాను ఇంత తేలికగా ఎలా చెప్పారు అని. దీనికి ఇంగ్లిష్ కవిత ఆధారం అని తెలిసింతర్వాత గౌరవం తగ్గలేదు. బాగా అనువదించారనిపించి అభిప్రాయం రాసేను. ఇటువంటి స్వేచ్చానువాదాలే ఉండాలని నేను కూడా అనుకుంటాను.
ఇంకొంచెం నిజం చెప్పాలంటే కాల్వినో కథలని అనువాదాలు అని అనచ్చా? పాత్రల, స్థలాల పేర్లు మార్చేస్తే అని రెండు రొజులుగా అనుకుంటూ మాధవ్ రచనల జాబితా చూస్తూ జీనొ దగ్గరికి వచ్చాను.
చాలా సంవత్సరాల క్రితం భారతిలో – భారతి అన్న విషయం రూఢి – ఒక ఈస్ట్ యూరొపియన్ కవిత అనుకుంటాను, ఆ కవితకి తెలుగు అనువాదం వచ్చింది, కవిత రూపం లొనే. అది Sin(తీటా) విలువ యే (తీటా) కైనా సరే ఒకటికి మించదన్న గణిత శాస్త్ర విషయం మీద ఆధార పడిన చక్కని కథా కవిత. ఒక రాజాస్థానానికి ఒక ఇంద్ర జాలికుడు వచ్చి మీకు కావాలిసిన యే వస్తువునైనా సృష్టించి ఇస్తానంటాడు. తను అలా సృష్టించ లేకపోతే ఒక భీకర ప్రతిన. తనను యెవరూ ఓడించ లేక పోతే ఒక దుర్మార్గమైన కోరిక తీర్చాలనడం లాంటివి. ఎవరూ అతను సృష్టించలేనిది అడగ లేకపోతారు. రాజు బిక్క మొహం వేస్తాడు. అప్పుడు ఒక బడి పిల్లాడు “ఒకటికి మించిన విలువను Sine ఫంక్షన్ కి ఇవ్వగలిగిన తీటా ను సృష్టించమని అడుగుతాడు.
కవిత పేరు, సంచిక వివరాలు, కవి పేరు, అనువాదకులు ఇవేవీ గుర్తులేవు.
శ్రీ శ్రీపాద గోపాల కృష్ణమూర్తిగారు భారతి పత్రిక 1952 సెప్టెంబర్ సంచికలో త్యాగరాజ సాహిత్యము అనే పేరుతో రాసిన వ్యాసప్రతిని ఈమాటలో ఉంచాము. ఈ వ్యాసాన్ని అందించిన జెజ్జాల కృష్ణ మోహనరావు గారికి కృతజ్ఞతలు.
భద్రిరాజు గారు ఒంగోలు ప్రాంతంలో పుట్టడం మా అదృష్టం. ఎక్కడో మారు మూలన గల కనిగిరి ప్రాంతంలో పుట్టి ప్రపంచ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు చవి చూశారు. వారు రాసిన తిక్కన భారతంలో పలుకుల పొందు చదివాను. చాలా బాగుంది. తిక్కనపై ఈ దిశగా శోధించి నూతనమైన ఆలోచనలకు తెరలేపారు. అందుకు ఆంధ్రులు వారికి ఎంతైనా ఋణపడి వుండాలి. ఇంకా భాషా శాస్త్ర పరంగాను ఎన్నో కొత్త కొత్త విషయాలకు మార్గగామి అయ్యారు. వారి మార్గంలో పయనించి భాషలోనూ, భావంలోనూ నూతనాన్వేషణ దిశగా పరిశోధనలు జరగాలి. అంతటితో ఆగిపోగూడదు. ఇప్పుడు ఆధునిక భాషాశాస్త్రవేత్తలని చెప్పుకుంటున్న వారిలో వారిని ఆదర్శంగా తీూసుకొని కొనసాగింపుగా శోధన జరపాలి గాని, వారితో ఇది ఆగిపోకూడదు. గొప్ప భాషా శాస్త్రవేత్తను, పరిశోధకుడిని, కవిని, అంతకుమించి గురువుని కోల్పోయినందుకు నివాళిని ప్రకటిస్తూ మీ…. ఏకలవ్య శిష్యుడు.
తిరునగరి అభిప్రాయం బాగుంది. మాధవ్‌కి కొంచెం కష్టమైన స్థితే సంభవించింది. సీతారామరాజుని అక్కడ ఉపమ గా ఎన్నుకోవడం వలన వచ్చిపడిన పరిస్థితి ఇదీ 🙂
కాకపోతే అనువాదపు తీరు బాగా వచ్చింది. వీలుంటే మాధవ్ ఆ ఉపమానాన్ని మార్చి మరొక సారి అనువాదం చేసే ప్రయత్నం చెయ్యొచ్చును. తప్పులేదు. మంచి కవితని జారవిడవడం మాత్రం ఎందుకూ?? ఏం మాధవ్? మరో పాఠం తయారు చెయ్యకూడదూ?? ఆలోచించండి. సెబాస్టియన్, సీతారామరాజు లకి పొంతన కుదరదు గనక, మీరు ఇంకోసారి ఇంకొక ఉపమానంతో ఈ కవితని రాసి చూడండి మళ్ళీ !
తలవని తలంపుగా ఈ కవిత ఇప్పుడే చదివాను. మీ స్వేచ్చ చాలా సహజంగా తనను తాను ఈ గేయంగా వెలయించుకుంది. మీరు చివర్లొ చెప్పేదాకా ఒక మాతృక ఉన్నట్టు అనిపించలేదు. జీనొ నాలుగు ఆర్గ్యుమెంట్లను “..Immeasurably subtle and profound..” అన్నాడు రసెల్. మీరు మీ కవితలో జెనో పారడాక్స్ ను తేలికగా తెలిసే విధంగా కవితా సౌందర్యం ఏమాత్రం చెడకుండా చెప్పేరు.
అన్నట్టు జీనొ కూడా ఇటాలియనే.
మరోమాట కూడా చెప్పాలి. మాతృకను చదివిన తిరునగరి సత్యనారాయణ గారి అభిప్రాయం ఆలోచింపజేసింది.
ఆకెళ్ళ రామ కృష్ణ గారూ! ఆలశ్యంగా చూసాను మీ అభిప్రాయాన్ని. మీ బాధ పట్ల ప్రతిస్పందించాలనిపించి ఈ అభిప్రాయం! మీ బాధతో నేను ఏకీభవిస్తూనే, నా కొన్ని గ్రహింపులు ఇవని చెబుతున్నాను. తొలిగా [కొంచెం ముందువెనకలుగా ప్రక్రియా పరంగా] “పద్యం” నన్నయ్య కాలానిది. అప్పుడు తెలుగునే కవిత్వం చెప్పడం అంటే అదొక సాహసమైన సంగతి తెలుగు కవులకి. సంస్కృతం అన్నికాలాలలోనూ భారత దేశంలో చదువుకున్న వారి భాష . అటువంటి స్థితిలో సంస్కృతాన్ని కలుపుకుంటూనే తప్పనిసరిగా తెలుగుని వాడవలసిన ఒక సామాజిక సన్నివేశం కవులముందు మొదట్లో ఉంది. దానిని నన్నయ్య చెప్పేరు కూడాను. ఇంక తెలుగు పదాలని కనిపెట్టటం అన్నది బహుశా ఇప్పటి మీ ఆలోచన! పుష్కలంగా తేట తెనుగు సమాజంలో ఎప్పుడూ ఉంది. గమనించండి. వెయ్యేళ్ళ కిందట అయితే అది మనకి ఆనాటి దేశి చ్చందాల్లో ఉంది. ఆనాటి ద్విపదల్లో ఉంది. పాల్కురికి సోమన గారి బసవపురాణం చదివి చూడండి. అన్నమయ్య పదాలని చదివి చూడండి. తిక్కన గారి కంద పద్యాన్నీ చదివిచూడండి. సమాజంలో ఉన్న సొంపైన తెనుగుకి వాళ్ళు తమ సృజనలో చోటిచ్చారు. కావాలనే తెనుగునే వాడుతామని అమలుచేసి చూపారు. నన్నయ్య గారికి ఆ సులువు లేదు.
ఇకపోతే మణిప్రవాళ శైలి ఒక్క తెనుగులోనే లేదు. ఆ కాలం నాటి ప్రాంతీయభాషలన్నిటినీ ఈ శైలి వశపరచుకొంది. తెలుగేమీ ఇందుకు మినహాయింపు కాదు. అయితే సంస్కృతం తాలూకు అందం సంస్కృతానిది. అది బాగుందని అనుకున్నందువల్ల తెలుగు వెనకబడనఖ్ఖరలేదు. ప్రతీ భాషకీ దానిదే అయిన ఒక సౌందర్యం ఉంటుంది కదా?
కవులని అటుంచండి. బాగుందని మెచ్చుకున్నవారినటుంచండి. మనకి తెలిసిన తెలుగు పదాలు చాలానే ఉన్నా, ఇవాళ మనం ఎందుకూ ఇంగ్లీషుని అతిగా వాడి పరమ కటువుగానూ, కృతకంగానూ, బాధ్యత లేకుండా తేలిక భావంతో ఎలా పడితే అలా తెలుగుని మాట్లాడుతున్నాం? గురజాడ గిరీశాన్ని దాటి తెలుగు వాక్యం వాడకంలో మనం అసలు ఏం ముందుకెళ్ళాం గనకా? ఎందుకని కనీశం మనకి తెలిసిన తెలుగునైనా తనివితీరా మాట్లాడే ప్రయత్నం నిజాయితీగా చేయలేకపోతున్నాం? అప్పుడు సంస్కృతం తప్పనట్టే, ఇప్పుడీ ఇంగ్లీషూ తెలుగుకి ఒక తప్పనిసరి అయ్యిందేమి? ఇది ముందు తెలుగు వాళ్ళకి తెలిస్తే, ఏ భాషా వాళ్ల నెత్తిన ఎక్కి స్వారీ చెయ్యలేదు కదా. కాదంటారా? రుజువైన సంగతి ఏమంటే సమాజంలోని తెలుగువారికి ఆత్మన్యూనత ఎక్కువ. అందుకే, ఎంతమంది కవులు ఎంత చక్కని తెలుగు రాసినా, మరెంతమందో సొగసైన తెలుగుని మాట్లాడమని చెవినిల్లు కట్టుకుని పోరినా, ఏదీ ఎప్పుడైనా సమాజంలో బతికే తెలుగువారు తమ నిత్య వ్యవహారంలో దాని విలువని గుర్తించారా? చక్కటి తెలుగులో మనస్పూర్తిగా ఏ అంశం మీదనైనా స్పందించారా? అందుకు పాపం ఆ పద్యాలు రాసిన కవులేమి చెయ్యగలరూ? వాటిని చదివే తెలుగు సాహిత్యాభిమానులు మాత్రం ఏమి చెయ్యగలరూ? కుప్పపోసినంత అచ్చతెనుగు అక్కడ ఉంది. ఏదీ ఎవరైనా ఒక గుప్పెడన్నా ఏరుకుని తమ మాటల్లొకి పొదుగుతారేమో చూడండి.
మహభారత ఆదిపర్వంలొ కర్ణ ప్రవేశం గూర్చి మీరు ఉదహరించిన పద్యం మరియు దానికి మీరు ఇచ్చిన వివరణ చూసి చాలా ఆనందం కలిగింది. మీకు నా ధన్యవాదములు. దయచేసి నా అభ్యర్ధన మన్నించి మహాభారత ఆదిపర్వంలో నన్నయభట్టారకులు వ్రాసిన “శారద రాత్రులు” అనే పద్యాన్ని నాకోసం అర్ధసహితంగా వివరించగలరని కోరుచున్నాను.
జీనో పేరడాక్సు గురించి vrveluri అభిప్రాయం:
09/21/2012 11:50 pm
తహ తహ గారూ:
మీరు ఉదహరించిన సైన్ తీటా కవిత రాసింది, మీరాస్లోవ్ హొలూబ్. కవిత పేరు “జీతో ది మెజీషియన్.” దాన్ని ఎప్పుడో ధాత నామ సంవత్సరంలో తెలుగు చేసి భారతి లో ప్రచురించింది నేనే! అనువాదకుడిని నేనని తెలిసిన తరువాత కూడా ఇంకా మీకు చదవాలనే కోరిక మిగిలి వుంటే ఆ కవిత వెతికి (పాత భారతి పత్రికలు వెతికితే బహుశా దొరకచ్చు!) పోస్ట్ చెయ్యటానికి ప్రయత్నిస్తాను. మీరాస్లోవ్ హొలూబ్ ఇండియా వచ్చాడు కూడాను! (అయితే, అతన్ని నేను కలవలేక పోయాననుకోండి.) వృత్తి పరంగా అతను వైద్యుడు. ప్రవృత్తి పరంగా కవి. అతను మరణించి చాలాకాలం అయ్యింది!
రిగార్డులతో, వేలూరి వేంకటేశ్వర రావు.
జీనో పేరడాక్సు గురించి B.V. Krishnamurthy అభిప్రాయం:
09/21/2012 4:24 pm
ఈ కవిత ఇంతకు మునుపే చదివినాను. ఇప్పుడీ అభిప్రాయములు వింతగా అనిపిస్తున్నాయి. మళ్ళీ వ్రాయమనడమేమిటి? ఎందుకు రాయాలి?
ఇది రచయిత తన –స్వీయ ఇచ్ఛానుసరణ –అని చెప్పినారు కదా. అందువల్ల వారు తెలుగు పాఠకులకు పరిచయమైన ఏ చారిత్రక వ్యక్తినైననూ తీసుకొనే సదుపాయం వారికి ఉన్నది. సెబాస్టియన్ కీ శీతారామరాజు కీ ఒక పోలిక మాత్రము ఉన్నది. ఏలాగునంటారా. చనిపోయిన పిదప వచ్చిన అమరత్వము. సెబాస్టియన్ పోయినాడు. ఆయనను క్రైస్తవులు సెయింటు గా చేసినారు. శీతారామరాజు పోయినాడు. అతనిని బ్రిటీషు దొరల గుండెలలో నిదురించిన సిమ్హముగా తెలుగువారు అమరుని జేసినారు. ఇప్పుడు కొందరు చనిపోయిన వారిని, వీరు నిజముగా ఎట్టివారు అనే చారిత్రక సత్యమేమీ తెలియనీయకుండగనే వీరులుగా కీర్తించుతుంటారు విప్లవ వాదులు, రాజకీయ, మత, నాయకులున్నూ. శివాజీ పై చారిత్రక పరిశోధన పుస్తకముగా రాగానే మరాఠాలు ఎట్లా ప్రతిస్పందించినది మనకు ఎరికయే గదా. శీతారామరాజు గురించి తిరునగరి సత్యనారాయణ గారు ప్రతిస్పందించిన విధము ఈ ధోరణి లోనిదే కదా. శీతారామరాజుని తమ అభిప్రాయములో కీర్తించినారు తిరునగరి గారు. కానీ, ఇది జనబాహుళ్యమైన కథానికయే గాని, చారిత్రక సత్యమేమో మనకు ఇదమిత్థముగా తెలియదు. ఉదాహరణకి శీతారామరాజు ఎట్లా చనిపోయినాడో, భిన్నాభిప్రాయములు ఉన్నాయి కదా. అందువలన శీతారామరాజుని సంగ్రామ సింహముగా చూపిన చరిత్రకారులు నిజముగా చరిత్ర రాసినారో లేక భక్తితో రాసినారో అనే సందేహము కలుగుట సహజమే. ఆ విధముగా చూసినప్పుడు హేజియోగ్రఫరులు భక్తి తలకెక్కిన చరిత్రకారులే కదా. తేడా ఇంకెమున్నది. లేదు. ఇందుగా మనకు తెలియగలది ఏమిటంటే, మనకు ఇష్టమైన, మనము గౌరవించే వ్యక్తులని సాధారణీకరణం చేస్తే మనకు నచ్చదు అని. తిరునగరి గారి విప్లవ వామపక్ష భావములు గాయపడి ఉండి వారు అలా రాసి ఉంటారు. నా మటుకు నాకు, ఇటువంటి విషయములలో, వామపక్షీయులైన గాని, మత ఛాందస వాదులైన గాని, ఒకే విధమున ప్రతిస్పందిస్తారని యొక అవగాహనతోనే రచయిత శీతారామరాజుని ఎంచుకున్నాడని నాకు కలిగిన అభిప్రాయము. ఏ ఉద్దేశముతో రచయిత శీతారామరాజుని ఎంచుకునినాడో ఆ ఉద్దేశమును తిరునగరి గారు తన ప్రతిస్పందనతో సత్యముగా నిరూపించినారని నాకు తట్టిన మాట వాస్తవము. నమస్తే – బీవీకే.
జీనో పేరడాక్సు గురించి తఃతః అభిప్రాయం:
09/21/2012 2:44 pm
కవితకి ‘జీనొ పారడాక్స్’ అన్న పేరు చూసి చాలా ఆశ్చర్య పోయాను. తెలుగులో ఇటువంటి వస్తువుల మీద కవితలా అని. వెంటనే చదవటం మొదలు పెట్టి ఇంకొంచెం ఆశ్చర్య పోయాను ఇంత తేలికగా ఎలా చెప్పారు అని. దీనికి ఇంగ్లిష్ కవిత ఆధారం అని తెలిసింతర్వాత గౌరవం తగ్గలేదు. బాగా అనువదించారనిపించి అభిప్రాయం రాసేను. ఇటువంటి స్వేచ్చానువాదాలే ఉండాలని నేను కూడా అనుకుంటాను.
ఇంకొంచెం నిజం చెప్పాలంటే కాల్వినో కథలని అనువాదాలు అని అనచ్చా? పాత్రల, స్థలాల పేర్లు మార్చేస్తే అని రెండు రొజులుగా అనుకుంటూ మాధవ్ రచనల జాబితా చూస్తూ జీనొ దగ్గరికి వచ్చాను.
చాలా సంవత్సరాల క్రితం భారతిలో – భారతి అన్న విషయం రూఢి – ఒక ఈస్ట్ యూరొపియన్ కవిత అనుకుంటాను, ఆ కవితకి తెలుగు అనువాదం వచ్చింది, కవిత రూపం లొనే. అది Sin(తీటా) విలువ యే (తీటా) కైనా సరే ఒకటికి మించదన్న గణిత శాస్త్ర విషయం మీద ఆధార పడిన చక్కని కథా కవిత. ఒక రాజాస్థానానికి ఒక ఇంద్ర జాలికుడు వచ్చి మీకు కావాలిసిన యే వస్తువునైనా సృష్టించి ఇస్తానంటాడు. తను అలా సృష్టించ లేకపోతే ఒక భీకర ప్రతిన. తనను యెవరూ ఓడించ లేక పోతే ఒక దుర్మార్గమైన కోరిక తీర్చాలనడం లాంటివి. ఎవరూ అతను సృష్టించలేనిది అడగ లేకపోతారు. రాజు బిక్క మొహం వేస్తాడు. అప్పుడు ఒక బడి పిల్లాడు “ఒకటికి మించిన విలువను Sine ఫంక్షన్ కి ఇవ్వగలిగిన తీటా ను సృష్టించమని అడుగుతాడు.
కవిత పేరు, సంచిక వివరాలు, కవి పేరు, అనువాదకులు ఇవేవీ గుర్తులేవు.
గుర్తుంటే ఎంత బాగుండేది.
తఃతః
గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి Madhav అభిప్రాయం:
09/21/2012 2:30 pm
శ్రీ శ్రీపాద గోపాల కృష్ణమూర్తిగారు భారతి పత్రిక 1952 సెప్టెంబర్ సంచికలో త్యాగరాజ సాహిత్యము అనే పేరుతో రాసిన వ్యాసప్రతిని ఈమాటలో ఉంచాము. ఈ వ్యాసాన్ని అందించిన జెజ్జాల కృష్ణ మోహనరావు గారికి కృతజ్ఞతలు.
సంపాదకులు.
తిక్కన భారతంలో పలుకులపొందు గురించి చాగం కొండారెడ్డి అభిప్రాయం:
09/21/2012 4:18 am
భద్రిరాజు గారు ఒంగోలు ప్రాంతంలో పుట్టడం మా అదృష్టం. ఎక్కడో మారు మూలన గల కనిగిరి ప్రాంతంలో పుట్టి ప్రపంచ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు చవి చూశారు. వారు రాసిన తిక్కన భారతంలో పలుకుల పొందు చదివాను. చాలా బాగుంది. తిక్కనపై ఈ దిశగా శోధించి నూతనమైన ఆలోచనలకు తెరలేపారు. అందుకు ఆంధ్రులు వారికి ఎంతైనా ఋణపడి వుండాలి. ఇంకా భాషా శాస్త్ర పరంగాను ఎన్నో కొత్త కొత్త విషయాలకు మార్గగామి అయ్యారు. వారి మార్గంలో పయనించి భాషలోనూ, భావంలోనూ నూతనాన్వేషణ దిశగా పరిశోధనలు జరగాలి. అంతటితో ఆగిపోగూడదు. ఇప్పుడు ఆధునిక భాషాశాస్త్రవేత్తలని చెప్పుకుంటున్న వారిలో వారిని ఆదర్శంగా తీూసుకొని కొనసాగింపుగా శోధన జరపాలి గాని, వారితో ఇది ఆగిపోకూడదు. గొప్ప భాషా శాస్త్రవేత్తను, పరిశోధకుడిని, కవిని, అంతకుమించి గురువుని కోల్పోయినందుకు నివాళిని ప్రకటిస్తూ మీ…. ఏకలవ్య శిష్యుడు.
జీనో పేరడాక్సు గురించి rama bharadwaj అభిప్రాయం:
09/21/2012 3:26 am
తిరునగరి అభిప్రాయం బాగుంది. మాధవ్‌కి కొంచెం కష్టమైన స్థితే సంభవించింది. సీతారామరాజుని అక్కడ ఉపమ గా ఎన్నుకోవడం వలన వచ్చిపడిన పరిస్థితి ఇదీ 🙂
కాకపోతే అనువాదపు తీరు బాగా వచ్చింది. వీలుంటే మాధవ్ ఆ ఉపమానాన్ని మార్చి మరొక సారి అనువాదం చేసే ప్రయత్నం చెయ్యొచ్చును. తప్పులేదు. మంచి కవితని జారవిడవడం మాత్రం ఎందుకూ?? ఏం మాధవ్? మరో పాఠం తయారు చెయ్యకూడదూ?? ఆలోచించండి. సెబాస్టియన్, సీతారామరాజు లకి పొంతన కుదరదు గనక, మీరు ఇంకోసారి ఇంకొక ఉపమానంతో ఈ కవితని రాసి చూడండి మళ్ళీ !
రమ.
జీనో పేరడాక్సు గురించి తఃతః అభిప్రాయం:
09/20/2012 2:58 pm
తలవని తలంపుగా ఈ కవిత ఇప్పుడే చదివాను. మీ స్వేచ్చ చాలా సహజంగా తనను తాను ఈ గేయంగా వెలయించుకుంది. మీరు చివర్లొ చెప్పేదాకా ఒక మాతృక ఉన్నట్టు అనిపించలేదు. జీనొ నాలుగు ఆర్గ్యుమెంట్లను “..Immeasurably subtle and profound..” అన్నాడు రసెల్. మీరు మీ కవితలో జెనో పారడాక్స్ ను తేలికగా తెలిసే విధంగా కవితా సౌందర్యం ఏమాత్రం చెడకుండా చెప్పేరు.
అన్నట్టు జీనొ కూడా ఇటాలియనే.
మరోమాట కూడా చెప్పాలి. మాతృకను చదివిన తిరునగరి సత్యనారాయణ గారి అభిప్రాయం ఆలోచింపజేసింది.
తఃతః
నాకు నచ్చిన పద్యం: నన్నయ భారతంలో కర్ణ ప్రవేశం గురించి rama bharadwaj అభిప్రాయం:
09/20/2012 1:03 pm
ఆకెళ్ళ రామ కృష్ణ గారూ! ఆలశ్యంగా చూసాను మీ అభిప్రాయాన్ని. మీ బాధ పట్ల ప్రతిస్పందించాలనిపించి ఈ అభిప్రాయం! మీ బాధతో నేను ఏకీభవిస్తూనే, నా కొన్ని గ్రహింపులు ఇవని చెబుతున్నాను. తొలిగా [కొంచెం ముందువెనకలుగా ప్రక్రియా పరంగా] “పద్యం” నన్నయ్య కాలానిది. అప్పుడు తెలుగునే కవిత్వం చెప్పడం అంటే అదొక సాహసమైన సంగతి తెలుగు కవులకి. సంస్కృతం అన్నికాలాలలోనూ భారత దేశంలో చదువుకున్న వారి భాష . అటువంటి స్థితిలో సంస్కృతాన్ని కలుపుకుంటూనే తప్పనిసరిగా తెలుగుని వాడవలసిన ఒక సామాజిక సన్నివేశం కవులముందు మొదట్లో ఉంది. దానిని నన్నయ్య చెప్పేరు కూడాను. ఇంక తెలుగు పదాలని కనిపెట్టటం అన్నది బహుశా ఇప్పటి మీ ఆలోచన! పుష్కలంగా తేట తెనుగు సమాజంలో ఎప్పుడూ ఉంది. గమనించండి. వెయ్యేళ్ళ కిందట అయితే అది మనకి ఆనాటి దేశి చ్చందాల్లో ఉంది. ఆనాటి ద్విపదల్లో ఉంది. పాల్కురికి సోమన గారి బసవపురాణం చదివి చూడండి. అన్నమయ్య పదాలని చదివి చూడండి. తిక్కన గారి కంద పద్యాన్నీ చదివిచూడండి. సమాజంలో ఉన్న సొంపైన తెనుగుకి వాళ్ళు తమ సృజనలో చోటిచ్చారు. కావాలనే తెనుగునే వాడుతామని అమలుచేసి చూపారు. నన్నయ్య గారికి ఆ సులువు లేదు.
ఇకపోతే మణిప్రవాళ శైలి ఒక్క తెనుగులోనే లేదు. ఆ కాలం నాటి ప్రాంతీయభాషలన్నిటినీ ఈ శైలి వశపరచుకొంది. తెలుగేమీ ఇందుకు మినహాయింపు కాదు. అయితే సంస్కృతం తాలూకు అందం సంస్కృతానిది. అది బాగుందని అనుకున్నందువల్ల తెలుగు వెనకబడనఖ్ఖరలేదు. ప్రతీ భాషకీ దానిదే అయిన ఒక సౌందర్యం ఉంటుంది కదా?
కవులని అటుంచండి. బాగుందని మెచ్చుకున్నవారినటుంచండి. మనకి తెలిసిన తెలుగు పదాలు చాలానే ఉన్నా, ఇవాళ మనం ఎందుకూ ఇంగ్లీషుని అతిగా వాడి పరమ కటువుగానూ, కృతకంగానూ, బాధ్యత లేకుండా తేలిక భావంతో ఎలా పడితే అలా తెలుగుని మాట్లాడుతున్నాం? గురజాడ గిరీశాన్ని దాటి తెలుగు వాక్యం వాడకంలో మనం అసలు ఏం ముందుకెళ్ళాం గనకా? ఎందుకని కనీశం మనకి తెలిసిన తెలుగునైనా తనివితీరా మాట్లాడే ప్రయత్నం నిజాయితీగా చేయలేకపోతున్నాం? అప్పుడు సంస్కృతం తప్పనట్టే, ఇప్పుడీ ఇంగ్లీషూ తెలుగుకి ఒక తప్పనిసరి అయ్యిందేమి? ఇది ముందు తెలుగు వాళ్ళకి తెలిస్తే, ఏ భాషా వాళ్ల నెత్తిన ఎక్కి స్వారీ చెయ్యలేదు కదా. కాదంటారా? రుజువైన సంగతి ఏమంటే సమాజంలోని తెలుగువారికి ఆత్మన్యూనత ఎక్కువ. అందుకే, ఎంతమంది కవులు ఎంత చక్కని తెలుగు రాసినా, మరెంతమందో సొగసైన తెలుగుని మాట్లాడమని చెవినిల్లు కట్టుకుని పోరినా, ఏదీ ఎప్పుడైనా సమాజంలో బతికే తెలుగువారు తమ నిత్య వ్యవహారంలో దాని విలువని గుర్తించారా? చక్కటి తెలుగులో మనస్పూర్తిగా ఏ అంశం మీదనైనా స్పందించారా? అందుకు పాపం ఆ పద్యాలు రాసిన కవులేమి చెయ్యగలరూ? వాటిని చదివే తెలుగు సాహిత్యాభిమానులు మాత్రం ఏమి చెయ్యగలరూ? కుప్పపోసినంత అచ్చతెనుగు అక్కడ ఉంది. ఏదీ ఎవరైనా ఒక గుప్పెడన్నా ఏరుకుని తమ మాటల్లొకి పొదుగుతారేమో చూడండి.
రమ.
కోనసీమ కథలు: విలేకరి గురించి poorva phalguni అభిప్రాయం:
09/20/2012 10:09 am
కధ ఆసాంతం ఒక్క బిగినచదివించింది. కధ కు ఎన్నుకున్న వస్తువు బావుంది
నాకు నచ్చిన పద్యం: నన్నయ భారతంలో కర్ణ ప్రవేశం గురించి Narayana Murthy అభిప్రాయం:
09/20/2012 1:46 am
మహభారత ఆదిపర్వంలొ కర్ణ ప్రవేశం గూర్చి మీరు ఉదహరించిన పద్యం మరియు దానికి మీరు ఇచ్చిన వివరణ చూసి చాలా ఆనందం కలిగింది. మీకు నా ధన్యవాదములు. దయచేసి నా అభ్యర్ధన మన్నించి మహాభారత ఆదిపర్వంలో నన్నయభట్టారకులు వ్రాసిన “శారద రాత్రులు” అనే పద్యాన్ని నాకోసం అర్ధసహితంగా వివరించగలరని కోరుచున్నాను.
వినమ్రతలతొ
భవదీయుడు
నారాయణమూర్తి