పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. మా పెద్దనాన్న జువ్వాడి గౌతమరావు గారు గురించి ravi kommera అభిప్రాయం:

    11/01/2012 11:01 pm

    ఈ మహానుభావుడి గురించి తెలుసుకున్నందుకు ఆనందంగా ఉంది.

  2. 2012: బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డ్ గురించి Tulasimohan అభిప్రాయం:

    11/01/2012 12:58 pm

    భూషణ్ గారు
    ధన్యవాదాలండి.
    తులసిదళాల్లో మీరెన్నుకున్న వాక్యాలన్నీ నాకెంతో తృప్తినిచ్చినవి, సరిగ్గా నా భావానికి పదాల జతొచ్చినట్టుగా అనిపించినవి. నిజమైన భావం నుండే సిసలైన కవిత్వం వస్తుంది. అప్పుడే పాఠకుడిని సూటిగా చేరుతాయి అనేది నేను నమ్మేవాటిల్లో మొదటిది కవిత్వపరంగా. మీరు కూడా అవే ఎంపిక చేసుకోవడం తో మరోసారి నిరూపింపబడింది

  3. నిష్కృతి గురించి ప్రసాద్ అభిప్రాయం:

    11/01/2012 12:53 pm

    కధా, కధ కన్నా అనువాదం చాలా బాగున్నాయి. విషయాలని చక్కగా విశ్లేషించారు రచయిత. కధ చదువుతున్నంత సేపూ, అనువాదం అని అనిపించ లేదు. ఈ మధ్య కాలంలో అందరూ అనువాదాలని ఇలా మెచ్చుకోవడం మామూలై పోయి, ఏది నిజమైన మెప్పుకోలో, ఏది మొహర్బానీ మెప్పుకోలో అర్థం కాకుండా పోతోంది జనాలకి. నాకు మాత్రం అనువాదాలని చదువుతూ వుంటే, ఎక్కడో ఒక చోట అనువాదం అన్న ఫీలింగు వచ్చేస్తుంది. ఈ సారి అలా రాలేదు. అదీ నా మెప్పుకోలు. నిజమో, మొహర్బానీయో మిగిలిన పాఠకులే తేల్చుకోవాలి మరి. 🙂 🙂

    పాత్రలు వాటి పరిధిలో చక్కగానే ప్రవర్తించాయి. ఎటొచ్చీ, ఉంగరం దాచుకుని మర్చిపోయినావిడ మాత్రం, ఒక సారి సంస్కారం లేకుండా, ఆ పిల్లల తల్లి గురించి నోరు పారేసుకుంది. “అయ్యో, ఆ పాత్ర అలా అనాల్సిన అవసరం లేదు. అనకుండా బాగుండేది ఆ పాత్ర చిత్రణకు” అని అనిపించింది.

    అనువాదకురాలు చక్కటి కధని ఎన్నుకున్నారు.

    ప్రసాద్

  4. టి. జి. కమలాదేవి గురించి Sowmya అభిప్రాయం:

    11/01/2012 10:16 am

    “జాతీయ స్థాయి బిలియర్డ్స్ ఆటల పోటీలలో మహిళా విభాగంలో తొలి విజేత (1994) కమలాదేవే అన్న విషయం అందరూ చెప్తారు”
    -1994?? అరవై ఏళ్ళు దాటాక కూడా పోటీల్లో పాల్గొని టైటిల్స్ గెలిచారా? :O

    ఇప్పుడీ వ్యాసం చదివాక గూగుల్ సర్చి లో “A Kamala Chandra Babu, who won the National Billiards Ladies titles in 1991 and 1995” అన్న సమాచారం దొరికింది.

    వ్యాసం చాలా బాగుంది. థాంక్స్.

  5. శర్మిష్ఠ, వేణుకుంజం నాటికల నుంచి పాటలు గురించి Sowmya అభిప్రాయం:

    10/31/2012 3:51 pm

    >> ‘శర్మిష్ఠ‘ (హైదరాబాదు కేంద్రంలో 1960 ప్రాంతంలో మరల రికార్డు కాబడినది. 1942 ప్రాంతంలో ప్రసారితమైన శ్రవ్య రూపకం మనకి ఈనాడు లభ్యం కాదు)
    – అయితే అదే శర్మిష్ఠ నాటకానికి రెండు వేర్వేరు సమయాల్లో రజనీగారూ, విశ్వనాథం గారూ సంగీతదర్శకత్వం వహించారా?
    ఇవ్వాళ రజనీభావతరంగాలు పుస్తకం చదువుతూంటే అందులో ఆయక “కృష్ణ-రజని” అన్న వ్యాసంలో “రజని సంగీతంతో తయారయి ప్రసారమైన కృష్ణశాస్త్రి తొలి సంగీత నాటకం శర్మిష్ఠ” అనీ, అది 1941 మార్చి 23న మద్రాసు కేంద్రం నుంచి ప్రసారం అయిందని రాశారు.

  6. తోలుబొమ్మలాట – 12వ భాగం గురించి D.Ravindrababu అభిప్రాయం:

    10/29/2012 9:22 pm

    ఈ కథ బావుంది. మార్పు తప్పనిసరి. అది అర్ధం చేసుకుంటే భవిష్యత్తు బావుంటుంది. ఇంత వయసులో కూడా గోవిందయ్య పల్లెలొ నడుచుకునే లౌక్యం అలవర్చుకోలేదా అని బాధ పడ్దా. చివరికి అతనికి తత్వం బోధ పడినందుకూ సంతొషం కలిగింది. నిరాశ పడకుండ, ప్రయత్నం కొనసాగించడం అంతరించి పోతున్న కొన్ని art forms మరియు వృత్తులకు దిశా నిర్దేశం చేసినట్లుంది.

  7. చందవరం, ప్రకాశం జిల్లా గురించి Aparna Yeluripati అభిప్రాయం:

    10/24/2012 12:37 pm

    అనంత్ గారు, ఇది వత్తులు తియ్యడం కాదండీ చాలమంది అలాగే పాడతారు. అంత వ్యాకరణ యుక్తంగా పాడరు. పాడేవారందరూ పండితులు కాదు కదా.
    ఇక్కడ ఒక పల్లెటూరు దైనందిన జీవన దృశ్యీకరణ. దాన్ని దానిలాగే చిత్రించారు. అందుకే చవకరకం తేనీరు అన్నా, నాసిరకం పుణుగులు పొంగణాలన్నా. ఒకదాన్ని వివరించాలంటే అక్కడే కూర్చుని రాయాలని, దాన్నే తాగుతూ రాయాలనీ లేదు కదా. అలా చెప్పాలంటే కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడీ —- పాటలో నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో అని రాయడానికి కవి కూడా మండుటెండలో మాడక్కరలెదు కదా ప్రేం కుమార్ గారూ??

  8. మహాభారతం ఏం చెప్తుంది? ఒక కొత్త కోణం గురించి Phani Kumar అభిప్రాయం:

    10/24/2012 10:49 am

    డబ్బు ఒక్కటి ఉంటే చాలు దానిని ఎలా సంపాయించినా సరే; మనస్సు ముచ్చటపడేవి తీర్చుకోగలగడం దాని ప్రయోజనం; అలా తీర్చుకోవడం వల్ల కలిగే అనుభవమే సుఖం ఇది … “మ్లేఛ్ఛభావన” … పాశ్చాత్యభావన.

    ఈ విషయాన్ని చాలా చక్కగా వివరించారు. కొంతమంది ఇటువంటి భావనలని నిజ జీవితానికి విలువనివ్వడముగా భావిస్తే వారిని ఆ సర్వేశ్వరుడే కాపాడగలడు.

    ఫణి కుమార్.

  9. భిక్షువు గురించి haribabu అభిప్రాయం:

    10/23/2012 2:59 am

    మీ కవితకు నేను దాసోహం
    పనిని సైతం త్యజించి
    పట్టెడు అన్నం పెట్టమని
    గుండె పిండి మరి చెప్పారు

  10. ఇటు నేనే – అటు నేనే గురించి తః తః అభిప్రాయం:

    10/22/2012 11:20 pm

    తీరూ, తీరమూ కవితలొ ఉన్నాయి పడవా, తెడ్దూ చదివే వాళ్ళు తెచ్చుకొవాలి