eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
పాఠకుల అభిప్రాయాలు
Total Comments: 16475
హరహరమహదేవ!
గురించి Veluri Venkateswara Rao అభిప్రాయం:
07/01/2013
5:58 pm
శంకరమంచి సత్యం రాసిన రేడియోనాటిక గురించి మరికొన్ని జ్ఞాపకాలు:
ఈ నాటికకి మూలం 1955 లో సత్యం రాసిన ఒక చిన్న ప్రయోగాత్మక శ్రవ్య నాటిక. అప్పట్లో ఈ నాటిక నిడివి సుమారు ఇరవై నిమిషాలు మాత్రవే. ఏలూరు కాలేజీలో స్టేజీమీద, తెరలు మూసేసి, స్టేజీమీద దీపాలు ఆర్పేసి, ఈ నాటికని ప్రదర్శించటం (చదివించడం?) జరిగింది. ఆ రోజుల్లో కాలేజీకి వెళ్ళే ఆడపిల్లలు స్టేజీ మీద వేషాలు వెయ్యటం నిషిద్ధం. సూర్యప్రభ అనే విద్యార్థిని తాను సీత ‘ వేషం ‘ వేస్తానని ముందుకు వచ్చింది. మా ప్రిన్సిపాలు గారు ఒప్పుకోలేదు. అందుకని, నా సహపాఠి యడవల్లి శ్యామ సుందర్ ( అప్పట్లో అతని గొంతుక అచ్చంగా ఆడపిల్ల గొంతులా వినిపించేది) సీత మాటలు చదివాడు. గుళ్ళో గంటలు, గుళ్ళో రకరకాల శబ్దాలు, వగైరా గొడవర్తి సత్యనారాయణ, నేనూ కల్పించాము.
ఆ తరువాత సత్యం 1956 లో మరొక శ్రవ్య నాటిక రాసాడు. ఆ నాటిక అతని మొదటిపుస్తకం ‘ సీత స్వగతాలు‘ కి నాంది. ఆదొక చిన్న ప్రేమకథ. కృష్ణానది ఒడ్డున ఒక అబ్బాయి, ఒక అమ్మాయీ –ఇద్దరి ప్రేమికుల సంభాషణ. అందులోనూ, సీత మాటలు చదివింది యడవల్లి శ్యామసుందరే! (ఆ రోజుల్లో సత్యానికి సీత అనేపేరు చాలా ఇష్టం!) ఆ నాటికకీ తెరవెనుక సాంకేతిక భాగవతం, నీళ్ళు పారుతున్నప్పుడు వచ్చే గల గల శబ్దం, పిట్టల కూతలు, వగైరా జరిపించింది మళ్ళీ సత్యనారాయణా, నేనూ!
రాజేశ్వర శర్మ దాచి వుంచిన బొమ్మ గురించి గుర్తుపట్టగలిగినంత మటుకు చెపుతాను. పొరపాట్లు దొర్లటానికి అవకాశం లేకపోలేదు.
1956 లో ఏలూరు కాలేజి మాక్ పార్లమెంటులో పాల్గొన్న కొంతమంది ఈ బొమ్మలో ఉన్నారు.
ముందు వరస: సూర్యప్రభ, విజయలక్ష్మి
రెండో వరస: పర్వతనేని సాంబశివరావు ( సినిమా సాంబశివరావే!), అప్పట్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ చౌదరి గారు (మాక్ పార్లమెంటు స్పీకరు), దేశరాజు సత్య సుబ్రహ్మణ్యం ( మా ప్రిన్సిపాలు గారు), వెల్చేరు నారాయణ రావు మేష్టారు, (విద్యార్థి సంఘం సహాయ సలహాదారు), పి.వి. సోమయాజులు గారు ( విద్యార్థి సంఘం ముఖ్య సలహాదారు).
మూడవ వరస : రాజేశ్వర శర్మ, పక్కనున్న వ్యక్తి పేరు గుర్తులేదు, ఆ తరువాత ఉన్న వ్యక్తి పాకాల భగవానులు.
నాలుగో వరస: మొదటి ఇద్దరూ గుర్తు లేరు, మూడో వ్యక్తి యడవల్లి శ్యామసుందర్, ఆ పక్కన వ్యక్తి పేరు గుర్తు లేదు, ఆ తరువాత గొడవర్తి సత్యనారాయణ, నేను ( అపొజిషన్ లీడర్), ఈమని శంకర రావు, శంకరమంచి సత్యం (ఏదో మంత్రి అనుకుంటా!)
ఆ రోజుల్లో ఏలూరు కాలేజికెళ్ళిన వాళ్ళు, ఈమాట చదువుతున్నవాళ్ళు ఎవరయినా ఉంటే, నా పొరపాట్లు దిద్దటం, మిగిలిన వ్యక్తులని గుర్తుపట్టటం అసాధ్యం కాదని భావిస్తూ…
వేలూరి వేంకటేశ్వర రావు
కనక ప్రసాద్! త్రిపురని బాగా బొమ్మ కట్టి చూపారు ఆర్ద్రంగా ఆవేదనగా ఎంతో ఇష్టంగా! మొదటిసారిగా మీరు చదవడానికి సులువుగా అలతి అలతి తెలుగు మాటల వాక్యాలలో! మీ బాధ ఎంత గాఢమైనదే అయినా ఎందుకో ఆ చిట్టచివరి పదం మాత్రం నా మనసుకి నొప్పి కలిగించింది. మీ బాధ మీ అనుబంధం ఆ పదం లేకపోయినా కూడా అంతే బలమైనదని తెలుస్తూనే ఉంది.
కవులు… కవిత్వాలు… వారి అంతరంగాలూ… వారి వారి జీవిత విశేషాల మాలికలు. .. అవి ఉత్తరోత్తరా కాలాలు దాటేకా చెందడానికి వీలుండే మార్పులూ… ఇలా చాలా ఆసక్తికరమైన ఈ వ్యాసపు మాటలలో ఎందుకనీ ఎక్కడా “విమర్శకుల” అంతరంగాలూ… వారి రాతలూ… వాటికి భవిష్యత్తులో ఆపాదింపబడే ఊహాజనిత కర్తృత్వాలూ ఇలాంటి వాటి ప్రస్తావన లేదేమో? విమర్శ అన్నది సృజన కాదా? కవులకి ఉండే లాంటి పరిస్థితులు విమర్శ రాసే వారికి మాత్రం ఉండవా? నా ఉద్దేశ్యం “కీర్తి కండూతీ” వగైరాలన్నమాట! మరి ఈ తెగ వారిని గురించి ఒక్క మాటా ఈ విశ్లేషణలో లేదేమా? అని.
కవిత్వోదయవేళల్లో తానేమిటో తన అంతరంగమేమిటో చెప్పడానికి ఎప్పుడైనా అవకాశం కవికి మాత్రమే ఉంటుంది. కానీ కవి తరుపున కూడా వకాల్తా పుచ్చుకున్నట్టు విమర్శకులే ఈ విషయం మీద మాట్లాడటంలో నిజం ఉండే వీలు లేదు. కవితావిర్భావం గురించి ఆ కవికే తెలియదనడం ఒక విమర్శకుని అవధీ, పరిధీ దాటిన మాట మరి. ఆ మాట చెప్పవలసింది కేవలం కవులు.
నందో రాజా భవిష్యతి! రేపు ఏం జరగనుందో తెలియదని అనుకున్నప్పుడు అది ఏ సృజన కారులకైనా ఒకటే! అందులో ఏ తరతమ బేధాలూ ఉండలేవు. ఆ సందేహ పరిధి లోకి విమర్శకులూ విశ్లేషకులూ శాస్త్రకారులూ మాత్రం మినహాయింపు ఎలా కాగలరూ?
కాశీలోని గంగా నదితో ప్రఘాడమైన అనుబంధం కలిగిఉన్నా, religious inclinations / beliefs తో పుణ్యస్నానాలు చెయ్యని త్రిపుర గారు, గాంధీజి మరణించినప్పుడు (30th, January, 1948) Banaras Hindu University (BHU) లోని సహవిధ్యార్ధులందరితో కలిసి గంగా స్నానమాచరించారట. 1963 నుంచి నేటి వరకూ విభిన్న తరాల వారిని ఒకేలా స్పందింపజెయ్యగలగటం త్రిపుర కధల ప్రత్యేకత. పాఠకులే కాకుండా ప్రతిభావంతులైన రచయితలెందరో త్రిపుర గారిని ఓ కల్ట్ ఫిగర్ గా చూసుకున్నది అబ్బురమైన విషయం. తమ రచనలు వేరు జీవితం వేరుగా కాకుండా తెలుగు నాట జీవించిన వాళ్లుగా శ్రీ శ్రీ,, చలం, త్రిపుర గార్లను పేర్కొంటారు. మార్కిస్ట్ భావాల పట్ల సానుభూతి కలిగి ఉన్నా, నిజజీవితంలో ఓ బుద్దిస్ట్ మాంక్ లా జీవించిన త్రిపుర గారి ఆశయాలకు అనుగుణంగా మరణాంతం వారి కళ్లు నేత్రదానం చెయ్యబడ్డాయట. తన అంతరాళాలలోని త్రిపురని అందరితో పంచుకున్న కనకప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
త్రిపురతో మీ జ్ఞాపకాలు హృద్యంగా ఉన్నాయి ప్రసాద్ గారు. త్రిపుర ఒక స్వచ్ఛమైన నదిలాంటి వారు. నదిలోకి చూస్తే మనకి మనమే కనిపిస్తాం. ఆయనతో సంభాషణ కూడా అంతే. ఆయనలా మనుషుల్ని ప్రేమించిన వాళ్ళు అరుదుగా ఉంటారు. వైశాఖ పూర్ణిమ నాడే మన కాలపు బుద్ధుడు కూడా నిర్యాణం చెందడం ఆశ్చర్యం. ఒక జెన్ కవిత గుర్తొస్తోంది.
My legacy –
What will it be?
Flowers in spring,
The cuckoo in summer,
And the crimson maples
Of autumn …
ఒక్క నీటిచుక్కనీ కనపడనీయని వేదన మనసంతా గుర్రపుడెక్కలా పరచుకొని సలుపుతోంటే పగలంతా పరాయిదైన సగం ప్రాణాన్ని… ఆర్థ్రత నిండిన పదాల మద్య ఒదిగిన విషాద గీతం… చాలా హృద్యంగా వుంది స్వాతి గారు!
హరహరమహదేవ! గురించి Veluri Venkateswara Rao అభిప్రాయం:
07/01/2013 5:58 pm

అవధారు గురించి jayaprabha అభిప్రాయం:
07/01/2013 3:23 pm
కనక ప్రసాద్! త్రిపురని బాగా బొమ్మ కట్టి చూపారు ఆర్ద్రంగా ఆవేదనగా ఎంతో ఇష్టంగా! మొదటిసారిగా మీరు చదవడానికి సులువుగా అలతి అలతి తెలుగు మాటల వాక్యాలలో! మీ బాధ ఎంత గాఢమైనదే అయినా ఎందుకో ఆ చిట్టచివరి పదం మాత్రం నా మనసుకి నొప్పి కలిగించింది. మీ బాధ మీ అనుబంధం ఆ పదం లేకపోయినా కూడా అంతే బలమైనదని తెలుస్తూనే ఉంది.
జయప్రభ.
మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు – 2 గురించి jayaprabha అభిప్రాయం:
07/01/2013 3:13 pm
కవులు… కవిత్వాలు… వారి అంతరంగాలూ… వారి వారి జీవిత విశేషాల మాలికలు. .. అవి ఉత్తరోత్తరా కాలాలు దాటేకా చెందడానికి వీలుండే మార్పులూ… ఇలా చాలా ఆసక్తికరమైన ఈ వ్యాసపు మాటలలో ఎందుకనీ ఎక్కడా “విమర్శకుల” అంతరంగాలూ… వారి రాతలూ… వాటికి భవిష్యత్తులో ఆపాదింపబడే ఊహాజనిత కర్తృత్వాలూ ఇలాంటి వాటి ప్రస్తావన లేదేమో? విమర్శ అన్నది సృజన కాదా? కవులకి ఉండే లాంటి పరిస్థితులు విమర్శ రాసే వారికి మాత్రం ఉండవా? నా ఉద్దేశ్యం “కీర్తి కండూతీ” వగైరాలన్నమాట! మరి ఈ తెగ వారిని గురించి ఒక్క మాటా ఈ విశ్లేషణలో లేదేమా? అని.
కవిత్వోదయవేళల్లో తానేమిటో తన అంతరంగమేమిటో చెప్పడానికి ఎప్పుడైనా అవకాశం కవికి మాత్రమే ఉంటుంది. కానీ కవి తరుపున కూడా వకాల్తా పుచ్చుకున్నట్టు విమర్శకులే ఈ విషయం మీద మాట్లాడటంలో నిజం ఉండే వీలు లేదు. కవితావిర్భావం గురించి ఆ కవికే తెలియదనడం ఒక విమర్శకుని అవధీ, పరిధీ దాటిన మాట మరి. ఆ మాట చెప్పవలసింది కేవలం కవులు.
నందో రాజా భవిష్యతి! రేపు ఏం జరగనుందో తెలియదని అనుకున్నప్పుడు అది ఏ సృజన కారులకైనా ఒకటే! అందులో ఏ తరతమ బేధాలూ ఉండలేవు. ఆ సందేహ పరిధి లోకి విమర్శకులూ విశ్లేషకులూ శాస్త్రకారులూ మాత్రం మినహాయింపు ఎలా కాగలరూ?
జయప్రభ.
అవధారు గురించి K.K. Ramaiah అభిప్రాయం:
07/01/2013 2:29 pm
కాశీలోని గంగా నదితో ప్రఘాడమైన అనుబంధం కలిగిఉన్నా, religious inclinations / beliefs తో పుణ్యస్నానాలు చెయ్యని త్రిపుర గారు, గాంధీజి మరణించినప్పుడు (30th, January, 1948) Banaras Hindu University (BHU) లోని సహవిధ్యార్ధులందరితో కలిసి గంగా స్నానమాచరించారట. 1963 నుంచి నేటి వరకూ విభిన్న తరాల వారిని ఒకేలా స్పందింపజెయ్యగలగటం త్రిపుర కధల ప్రత్యేకత. పాఠకులే కాకుండా ప్రతిభావంతులైన రచయితలెందరో త్రిపుర గారిని ఓ కల్ట్ ఫిగర్ గా చూసుకున్నది అబ్బురమైన విషయం. తమ రచనలు వేరు జీవితం వేరుగా కాకుండా తెలుగు నాట జీవించిన వాళ్లుగా శ్రీ శ్రీ,, చలం, త్రిపుర గార్లను పేర్కొంటారు. మార్కిస్ట్ భావాల పట్ల సానుభూతి కలిగి ఉన్నా, నిజజీవితంలో ఓ బుద్దిస్ట్ మాంక్ లా జీవించిన త్రిపుర గారి ఆశయాలకు అనుగుణంగా మరణాంతం వారి కళ్లు నేత్రదానం చెయ్యబడ్డాయట. తన అంతరాళాలలోని త్రిపురని అందరితో పంచుకున్న కనకప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
– కె. కె. రామయ్య
అవధారు గురించి Subrahmanyam Mula అభిప్రాయం:
07/01/2013 1:57 pm
త్రిపురతో మీ జ్ఞాపకాలు హృద్యంగా ఉన్నాయి ప్రసాద్ గారు. త్రిపుర ఒక స్వచ్ఛమైన నదిలాంటి వారు. నదిలోకి చూస్తే మనకి మనమే కనిపిస్తాం. ఆయనతో సంభాషణ కూడా అంతే. ఆయనలా మనుషుల్ని ప్రేమించిన వాళ్ళు అరుదుగా ఉంటారు. వైశాఖ పూర్ణిమ నాడే మన కాలపు బుద్ధుడు కూడా నిర్యాణం చెందడం ఆశ్చర్యం. ఒక జెన్ కవిత గుర్తొస్తోంది.
My legacy –
What will it be?
Flowers in spring,
The cuckoo in summer,
And the crimson maples
Of autumn …
– Ryokan
నదిలోని నీరు గురించి కెక్యూబ్ వర్మ అభిప్రాయం:
07/01/2013 11:02 am
ఒక్క నీటిచుక్కనీ కనపడనీయని వేదన మనసంతా గుర్రపుడెక్కలా పరచుకొని సలుపుతోంటే పగలంతా పరాయిదైన సగం ప్రాణాన్ని… ఆర్థ్రత నిండిన పదాల మద్య ఒదిగిన విషాద గీతం… చాలా హృద్యంగా వుంది స్వాతి గారు!
అభినందనలతో..
ప్రాప్తం గురించి Murali Krishna అభిప్రాయం:
06/30/2013 10:19 am
మీ కవిత బాగుంది. ఇప్పుడెందుకిలా కంటే ఇందులో పరిణతి కనిపించింది.
ఆకుపై నిలిచిన వానచినుకులు గురించి కృష్ణా అక్కులు అభిప్రాయం:
06/30/2013 5:27 am
చాల అందంగా, సున్నితంగా, అద్భుతంగా వుంది.
ప్రాచీన తెలుగు కొలమానం గురించి reyya asanna rao అభిప్రాయం:
06/30/2013 4:17 am
prachina telugu kolamanala gurinchi netlo sodhinchaga Ee Maata patrikalo Uuly-2006lo vacchina vyasam kanipinchidi. Telugu bhashalo entho pradhanyamunna “patha kolamanala ” gurinchi vishleshistu vyasam rastunnanu. mee vyasamloni konni vivaralanu teesukovadaniki ANUMATHI ivvalsindiga korutunnanu.
– Asanna rao (cell:8008000119)
Good Bye. గురించి kothapalli ravibabu అభిప్రాయం:
06/29/2013 11:43 am
వేలూరి గారూ ,
సంపాదకునిగా ఎందుకు విరమించుకున్నారో చెప్పలేదు. చాలా బాధగా ఉంది. రాస్తూ ఉండండి.