” మల్లెల మొల్లలన్ కొనగ నా తరమా ధర హెచ్చె మోదుగల్ కొల్లలమూల్యముల్ .. . కోమలి కొప్పున కుప్పవోసెదన్ … ”
ఎన్నో పద్యాలు ఒకప్పుడు నా నోటికి వచ్చు.
దాశరధి చనిపొయాడని తెలిసిన రోజు నాకు బాగా జ్ఞాపకం. ఆ పొద్దున ఆంధ్ర విశ్వకళాపరిషత్ in gate లోంచి లోపలికి రాగానే కనపడే పెద్ద కొండ మల్లె చెట్టు కూలిపోయింది.
బుచ్చిబాబు ఇంగ్లిష్ చదువుకుని ఇంగ్లిష్ లెక్చరర్ గా పనిచేసాడనీ అంతకు ముందు ఐ.సీ.యస్ కి ప్రయత్నించినా తగినంత ఎత్తు లేకపొవడం వల్ల ఎన్నుకోబడలేదనీ గుర్తు.
బుచ్చిబాబు రాసిన ‘నన్ను మార్చిన పుస్తకం ‘ నన్ను మార్చిన పుస్తకాలలొ ఒకటి. 15-16 సంవత్సరాల వయసు లొ చదివానేమో. అది ఆయన రచనల్లో నేను చదివిన మొదటి పుస్తకం. తర్వాత బుచ్చి బాబు కథల్లొ ఇంగ్లిష్ మాటలు లేకపోవటం గమనించిన గుర్తు కూడా. ‘అరకు లొయలో కూలిన శిఖరం’ లొ కూడా ఇంగ్లిష్ మాటలకోసం వెతకటమూ గుర్తే
సిగరెట్, మనిఆర్దర్, బకెట్ ఈ మూడే కనపడ్డాయి నాకు ఈ కథలో ఇప్పుడు మళ్ళీ చూస్తే.
నా వరకూ నేను తిలక్ కీ, బుచ్చిబాబు కీ ఋణగ్రస్తుణ్ణి.
తః తః
మొదట్లొ — ప్రతి జాతికీ ఉన్నట్టే తెలుగువారికీ ఊళ్ల పేర్లూ, ఇంటి పేర్లూ ఉన్నాయి. ఇవి ఏర్పడ్డంలో తెలుగువారికో ప్రత్యేకత ఉంది. మధ్యలొ — మన ఇంటిపేర్లలో నూటికి తొంబదికి మించి ఊళ్లపేర్లే చోటు చేసుకున్నాయి
ఈ రెంటినీ పక్కపక్కన పెడితే…
ప్రతి జాతికీ ఉన్నట్టే తెలుగువారికీ ఊళ్ల పేర్లూ, ఇంటి పేర్లూ ఉన్నాయి. ఇవి ఏర్పడ్డంలో తెలుగువారికో ప్రత్యేకత ఉంది. మన ఇంటిపేర్లలో నూటికి తొంబదికి మించి ఊళ్లపేర్లే చోటు చేసుకున్నాయి.
ఇదీ పరిశొధనా వ్యాసం. పరిశీలకులు తానాలో వచ్చిందానికల్లా తందానా అంటే ఇలాగే ఉంటుంది.
“నాగమురళి గారు: ఏలూరును హేలాపురి గానూ, నల్లగొండను నీలగిరిగాను, కొలిచాలను కోలాచలంగాను — అన్నీ సంస్కృతం నుండే ఉద్భవించాయని — వివరించే పండిత వ్యుత్పత్తులు కోకొల్లలు.” కొలిచాల.
‘…జంబూక రంధ్ర అగ్రహారం దాన్నే నక్కబొక్కలపాడు అనికూడా అంటార’ని వంగర వేసిన పాత్రతొ అనిపిస్తాడు ‘దొంగ రాముడు సినిమాలో నరసరాజు. తన భాషను తక్కువ చేసుకునే జబ్బు తెలుగు వాడి స్థిరాస్థి.
తః తః
లైలా తన అభిప్రాయాన్ని తనే చెప్పాలి. నేను లైలా తరుపున మాట్లాడలేను. అయితే నా అభిప్రాయం నేను గమనించినంత వరకూ తెలుగు సాహిత్యానికి సంబంధించి, ఇటువంటి ధోరణి లో స్త్రీలు ఏనాడూ మాట్లాడలేదు. ఐతే రచయితలు మాత్రం ఎన్నోసార్లు యధేచ్చగా మాట్లాడేరు . నేను కూడా ప్రసాద్ గారి అభిప్రాయాన్నే సమర్ధిస్తాను. ఐతే అభిప్రాయాన్ని ఒక కోప ధోరణి లో వ్యక్తీకరించడానికి యాధాలాపంగా వ్యక్తీకరించడానికీ తప్పనిసరిగా తేడా ఉంటుంది. నేను అనుకున్నది ఇదివరకూ చెప్పినట్టే రవికిరణ్ పాఠకులని హిపోక్రాట్స్ అని అన్నదాని మీద ఒక పాఠకురాలిగా లైలా ప్రతిస్పందన మాత్రమే! అయితే ప్రతిస్పందన అలా ఎందుకు ఉన్నది లైలా చెప్పవలసిన విషయం. దానిమీద రవికిరణ్ రాసిన ప్రతి సమాధానం మాత్రం బొత్తిగా బాగులేదు. అది ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న దానికి అక్కడ ఒక రికార్డు ఉన్నది. అది మంచిదే! చాలా మంది మగవాళ్ళు ఒక పొరపాటు దొర్లినా దానిని పొరపాటు అని చెప్పడం సైతం చెయ్యరు. ఇక్కడ రవికిరణ్ చేసాడు. అది నాకు నచ్చింది. ఇంక బూతులు వాడకం జీవితంలో అందరూ చెయ్యరు. గనక, రవికిరణ్ అలా సామాన్యీకరించడానికి సైతం వీలుండదు ప్రసాద్ చెప్పినట్టు. ఒక పొరపాటుని సమర్ధించుకుందికని మనం ఒక సిధ్ధాంతం చెయ్యనఖ్ఖరలా!
రెండు తప్పులు ఎప్పుడూ ఒక ఒప్పు అవకపోయినా రచనలో బూతుల వాడకంలో ఆడ వాళ్లనీ మగవాళ్లనీ ఒక గాట కట్టడానికి వీలే లేదు తెలుగున సాహిత్యానికి సంబంధించి. ఎందుకంటే తెలుగు సాహిత్యంలో కనీశం పాఠకులుగా కూడా స్త్రీలని ఊహించని వాళ్ళు మన మగ కవులూ / రచయితలూ మగ విమర్శకులూను. రచనలో వాళ్ల వాళ్ల మనోభావాలని మగవారికి మల్లే వ్యక్తీకరించడానికి తెలుగు సమాజం (తెలుగు ఆధునిక సమాజంతో కలిపి కూడా) ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదు. ఉన్న కొద్దిపాటి అవకాశమూ వారు స్వయంగా సాధించి తెచ్చుకున్నదే! అందుకు కవయిత్రులు చాలా మూల్యం చెల్లించవలసి వచ్చింది కూడా! ఇటువంటి వాతావరణంలో (ఈమాట ఇదికూడా తెలుగు సమాజం కి చెందిన ఒక తెలుగు వెబ్ పత్రికే గనక) ఇక్కడ ఇప్పుడు మీరేదో “ఐతే స్త్రీలు రాయవచ్చా?” అని ప్రశ్నించడం రెండు అసమానతలని తీసుకొచ్చి ఒక సమానంగా చూపించడమే అవుతున్నది. కొన్ని వేల ఏళ్ళుగా మాటల్నీ తిట్లనీ పడిన స్త్రీ జాతి మగవాళ్ల రీతిలో గనక మాట్లాడితే ఇదిగో ఇలా ఉంటుంది సుమా అని చూపించడానికి లైలా వ్యాఖ్య పనికొస్తుంది . అంతే చాలా సార్లు స్త్రీల కోపాలని బయట పెట్టడానికి స్త్రీలకి విడిగా భాష సైతం లేదు. ఇదెంత అవమాన కరమైన విషయమో ఎవరైనా అలోచించారా? స్త్రీలు తమ కోపాలని వ్యక్తీకరించాలంటే తమని తాము కించపరుచుకోవాలి. ఒక మగవాడి భాషలో! ఎంత అన్యాయం కదా?? ఇది స్త్రీల అందరి వ్యక్తీకరణకీ ఒక సూత్రీకరణ కాదు. అలాగే ఒక లైలా వ్యాఖ్యని చూపించి తమ రచనా రీతిలో ఆడవారిని కించపరిచిన వెనకటి మగవారి వ్యక్తీకరణలని సమానంగా చూపించి వాటిని తుడిచి వేసే వీలూ లేదు.
మొదట ఒక రచన చేసిన తరవాత దానిమీద పాఠకులు ఎందుకని ఒక అభిప్రాయమైనా రాయలేదో తెలుసుకోగోరే ఒక కుతూహలం ఆ రాసిన వ్యక్తికి ఉంటే ఉండొచ్చునేమో గానీ, అలా రాని అభిప్రాయానికి పాఠకులని అందరినీ ” హిపోక్రాట్స్” గా అనడం కవి చేయకూడదు. ఈ రెండూ రెండు వేరు వేరు సంగతులు. ఇది రవికిరణ్ బహుశా ఇప్పుడు అర్ధం చేసుకుని ఉంటాడు బాగా!
ఐతే, ఈ రెండిటినీ కూడా ఈ మాట సంపాదకులు అచ్చువేయకుండా ఉండే అవకాశం ఉండి కూడా వారు ఆ పని ఎందుకని చేయలేదూ? పాపం మరి వారికి రీడర్ షిప్ కొరత ఉండి ఉంటుంది. ఎలాగైనా ఏదో ఒక సెన్సెషనైజేషన్ చేద్దామని
(కమర్షియల్ పత్రికలకు మల్లేనే) ఒక ఉత్సాహం చూపించినారు. ఏదేమైనా ఇటువంటి తరహాలో మాట్లాడటంలో స్త్రీపురుషులెవరైనా గానీ సాధించే అదనపు సంరంభం ఏమైనా ఉండొచ్చును గానీ , ఇతర మానవ విలువలేవీ మాత్రం ఉండవనే నేను బలంగా నమ్ముతాను.
నాకు నచ్చిన పద్యం: దాశరథి మించుకాగడా గురించి తః తః అభిప్రాయం:
07/29/2013 1:46 am
అన్నట్టు 1967-68 ప్రాంతాల్లొ ఆంధ్రప్రభ వారపత్రిక లొ అనుకుంటాను ఒక సంచిక లొ బహదుర్ షా జఫర్ గజల్ కి దాశరథి తెనుగు వచ్చింది నాకు అక్షరం అక్షరం గుర్తుంది.
“రమ్మంటె చాలుగానీ
రాజ్యాలు విడిచి రానా
నీచిన్న నవ్వు కోసం
స్వర్గాలు గడిచి రానా
ఏడేడు సాగరాలూ
ఎత్తైన పర్వతాలూ
ఎంతెంత దూరమైనా
బ్రతుకంత నడిచి రానా
నీవుండు మేడ గదిలో
ననుచేరనీయరేమో
జలతారు చీర గట్టి
సిగపూలు ముడిచి రానా
పగబూని కరుకు వారు
నను బంది చేసినారు
ఎనాటికైన గానీ
ఈగోడ పొడిచి రానా”
తః తః
నాకు నచ్చిన పద్యం: దాశరథి మించుకాగడా గురించి తః తః అభిప్రాయం:
07/29/2013 1:26 am
దాశరథివి ఒకటా రెండా ఎన్ని అందమైన పద్యాలు.
“కానుగ చెట్ల నీడల ఒకానొక స్వప్నపు సెజ్జమీద నిద్రాణత హాయి గొల్పగ సదా శయనింపగనీ మహాంధకా రాన మనస్సు హాయిగొనె రానుభవత్కమ నీయ కాంతి సౌ ధానికి నన్ను బిల్వకుము తన్వి విభావిభవభిరామవై”
“… అశా హర్మ్యా గ్రము జేరి నీకయి నిరీక్షా గీతికల్ రాసితిన్ ”
” మల్లెల మొల్లలన్ కొనగ నా తరమా ధర హెచ్చె మోదుగల్ కొల్లలమూల్యముల్ .. . కోమలి కొప్పున కుప్పవోసెదన్ … ”
ఎన్నో పద్యాలు ఒకప్పుడు నా నోటికి వచ్చు.
దాశరధి చనిపొయాడని తెలిసిన రోజు నాకు బాగా జ్ఞాపకం. ఆ పొద్దున ఆంధ్ర విశ్వకళాపరిషత్ in gate లోంచి లోపలికి రాగానే కనపడే పెద్ద కొండ మల్లె చెట్టు కూలిపోయింది.
తః తః
నన్ను గురించి కథ రాయవూ – కథ నచ్చిన కారణం గురించి తః తః అభిప్రాయం:
07/29/2013 12:38 am
బుచ్చిబాబు ఇంగ్లిష్ చదువుకుని ఇంగ్లిష్ లెక్చరర్ గా పనిచేసాడనీ అంతకు ముందు ఐ.సీ.యస్ కి ప్రయత్నించినా తగినంత ఎత్తు లేకపొవడం వల్ల ఎన్నుకోబడలేదనీ గుర్తు.
బుచ్చిబాబు రాసిన ‘నన్ను మార్చిన పుస్తకం ‘ నన్ను మార్చిన పుస్తకాలలొ ఒకటి. 15-16 సంవత్సరాల వయసు లొ చదివానేమో. అది ఆయన రచనల్లో నేను చదివిన మొదటి పుస్తకం. తర్వాత బుచ్చి బాబు కథల్లొ ఇంగ్లిష్ మాటలు లేకపోవటం గమనించిన గుర్తు కూడా. ‘అరకు లొయలో కూలిన శిఖరం’ లొ కూడా ఇంగ్లిష్ మాటలకోసం వెతకటమూ గుర్తే
సిగరెట్, మనిఆర్దర్, బకెట్ ఈ మూడే కనపడ్డాయి నాకు ఈ కథలో ఇప్పుడు మళ్ళీ చూస్తే.
నా వరకూ నేను తిలక్ కీ, బుచ్చిబాబు కీ ఋణగ్రస్తుణ్ణి.
తః తః
మళ్ళీ అదే సంచిక గురించి తః తః అభిప్రాయం:
07/28/2013 8:57 pm
నారాయణ బాబు గారికి ధన్యవాదాలు
“కులికినా
ఒలికినా
నా అక్షరాలకు
నీ రూపమే
ఇస్తాను
పేరు ఏమి పెట్టినా
ప్రేమ కవిత్వమే రాస్తాను” అని
జులై 12, ‘ఈమాట’ లో
తః తః
రచయితలకు సూచనలు గురించి swetha అభిప్రాయం:
07/28/2013 1:58 pm
అందరికి నమస్కారం, మొదటిసారిగా ఈ వెబ్సైట్ చూడగానే అమ్మ చేతి భోజనం తిన్న అంత ఆనందంగా వుంది. యువ రచయతలకు చక్కని అవకాశం కల్పిచినందుకు కృతజ్ఞతలు.
తెలుగువారి ఊళ్ళ పేర్లు – ఇంటి పేర్లు గురించి తః తః అభిప్రాయం:
07/28/2013 1:32 pm
మొదట్లొ — ప్రతి జాతికీ ఉన్నట్టే తెలుగువారికీ ఊళ్ల పేర్లూ, ఇంటి పేర్లూ ఉన్నాయి. ఇవి ఏర్పడ్డంలో తెలుగువారికో ప్రత్యేకత ఉంది. మధ్యలొ — మన ఇంటిపేర్లలో నూటికి తొంబదికి మించి ఊళ్లపేర్లే చోటు చేసుకున్నాయి
ఈ రెంటినీ పక్కపక్కన పెడితే…
ఇదీ పరిశొధనా వ్యాసం. పరిశీలకులు తానాలో వచ్చిందానికల్లా తందానా అంటే ఇలాగే ఉంటుంది.
తః తః
తెలుగువారి ఊళ్ళ పేర్లు – ఇంటి పేర్లు గురించి తః తః అభిప్రాయం:
07/28/2013 1:14 pm
‘…జంబూక రంధ్ర అగ్రహారం దాన్నే నక్కబొక్కలపాడు అనికూడా అంటార’ని వంగర వేసిన పాత్రతొ అనిపిస్తాడు ‘దొంగ రాముడు సినిమాలో నరసరాజు. తన భాషను తక్కువ చేసుకునే జబ్బు తెలుగు వాడి స్థిరాస్థి.
తః తః
మళ్ళీ అదే సంచిక గురించి NARAYANA BABU అభిప్రాయం:
07/28/2013 12:49 am
సార్ చాలా బాగుంది
తమరు ఇంతటి ప్రేమ పిపాసులని ఇప్పుడే తెలిసింది
భార్యోత్సాహం గురించి Ramacharyulu అభిప్రాయం:
07/27/2013 2:21 am
ఓహ్, చాలా చాలా బాగుంది. హాయిగా కొద్దిసేపు నవ్వుకున్నా యింత హాస్య కధ చదివినందుకు. మొత్తం మీద పాతకొత్త సన్నివేశాలను జోడించి చక్కగా వ్రాశారు.
నిశ్శబ్దం గురించి jayaprabha అభిప్రాయం:
07/27/2013 12:31 am

జయప్రభ.