ఖచ్చితంగా జరగబోయే విషయాల గురించి మనం భగవంతుడికే వదలివేయటం మంచిది కదా! లేదు, ఖచ్చితంగా జరుగుతాయో లేదో తెలియదు, కొంచెం అటూ ఇటూ అవచ్చు అంటే, వాటిని పట్టించుకుని జీవితాన్ని దు:ఖభరితం చేసుకోవటం అంత అజ్ఞానం ఇంకొకటి వుండదు.
జ్యోతిష్యం అనేది శాస్త్రబధ్ధమేనా అన్నది ఇంతవరకూ ఎవరూ రుజువు చెయ్యలేదు. అంటే, independent of time, place, or person ఫలనా గ్రహస్థితులు ఉన్న వ్యక్తులందరకూ,ఒకే రకమైన జీవిత ఫలితాలు ఉంటాయని, ఈ ఈ cases లో అలా వున్నాయని ఎవరూ నిరూపించలేదు. బలహీనమైన మనస్సుల ఆధారంగా అది ఒక బ్రతుకుతెరువు మాత్రమే.
నాకూ లెమన్స్ కీ లైమ్స్ కీ తేడా ఏమిటో అర్థం కాదండీ..అయితే అవి దబ్బకాయలని అర్థమన్నమాట. మా వైపు వాటిని గజనిమ్మ కాయలని అంటారు. అవీ ఇవీ ఒకటో కాదో !
కథ మాత్రం సూపరు!
తేలిక భాషలో కళాపూర్ణోదయం అందించిన రామారావు గారికి, ఈమాట కీ కృతజ్ఞతలు. ఒక్క చోట నాకు చిన్న సందేహం వచ్చింది. కథ కృష్ణుడి కాలం నించి వచ్చినట్టు వచ్చి, మణి కంధరుడు శ్రీ వేంకటేశ్వర్ స్వామి ని సేవించినట్టు వ్రాయబడింది. వెంకటేశ్వరుడు కలికాలం లో కదా..మరి వీటి రెంటికీ పొంతన ఎలా? నేను మళ్ళీ ఒక సారి మొత్తం చదివిన తరవాత అడగాలని అనిపిస్తోంది కానీ, సందేహం రాగానే అడగటం మంచిదని, నా మనసు మణిహారం పోరు పెడుతోంది. (మళ్ళీ మరచిపోతానేమోనని భయం లెండి)! యీ ప్రశ్న చొప్పదంటుదనిపిస్తే నన్ను క్షమించండి. (నేను సరిగ్గా అర్థం చేసుకుని ఉండకపోయి ఉండవచ్చు).
తమిళ ప్రచారాన్ని కాస్త పక్కన పెట్టి శాస్త్రీయంగా ఆలొచిస్తే శాసన భాష తర్వాతే కావ్య భాష. తమిళ లిపిలో వచ్చిన శాసనం 7 వ శతాబ్ది నాటిదని వారి ప్రభుత్వ సంస్థే తెలుపుతుంది (http://www.tnarch.gov.in/epi/ins2.htm)
తొల్కాప్పియం A. C. Burnell అభిప్రాయ పడినట్లుగా could not be dated to “much later than the eighth century”
ఈ మధ్య కాలంలో Herman Tieken (Kavya in South India : Old Tamil Chankam, 2001) అన్న డచ్చి పండితుడు గూబ గుయ్యిమనే ఒక సిద్ధాంతం ఒకటి ప్రతిపాదించాడు: అరవాన్ని అమరవాణి సంస్కృతానికి ధీటుగా నిలబెట్టడానికి- తొల్కాప్పియం /సంగం కాలాన్ని వెనక్కు నెట్టడం, పాండ్యుల (9 శ.) బృహత్ ప్రణాళిక లో భాగమే. తమిళాన్ని వెనక్కు నెట్టే ప్రయత్నాలకు చాల చరిత్ర ఉన్నది అని తెలుసుకోవడం మేలు.
భాషా శాస్త్రాల్లో అభిరుచిగల సురేశం లాంటి వారు దీనిమీద సమీక్ష వ్యాసం వ్రాస్తారేమోనని ఎదురు చూశాను, చివరికి శెట్టార్ గారి పుస్తక ప్రస్తావన చదవగానే ఒళాందుని సిద్ధాంతం గుర్తుకొచ్చింది.
చాలా విలువైన సంభాషణ. సోషల్ మీడియాలో వెల్లువెత్తిపోతున్న అభిప్రాయాలు, కథలు, కవితలు .. వీటిలో మంచి ముత్యాలను ఎంచుకోవటం కష్టమైపోతున్న ఈ రోజుల్లో చాసో అభిప్రాయాలను నవతరం కథకులు కాస్తయినా అందుకుంటే జల్లెడ పట్టుకునే పని పాటకులకు తగ్గుతుంది.
ద్వితీయ కళత్రం గురించి Dr CBS Venkataramana అభిప్రాయం:
11/11/2013 7:06 am
జాతకాలూ అవీ అన్నీ ఖచ్చితంగా నిజాలైతే, వాటి గురించి అసలు చర్చించనక్కరలేదు. ఎందుచేతనంటే, భగవంతుడైన శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లుగా:
“అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాన్శ్చ భాషసే
గతాసూనగతాసూన్శ్చ నానుశోచంతి పండితా:”
ఖచ్చితంగా జరగబోయే విషయాల గురించి మనం భగవంతుడికే వదలివేయటం మంచిది కదా! లేదు, ఖచ్చితంగా జరుగుతాయో లేదో తెలియదు, కొంచెం అటూ ఇటూ అవచ్చు అంటే, వాటిని పట్టించుకుని జీవితాన్ని దు:ఖభరితం చేసుకోవటం అంత అజ్ఞానం ఇంకొకటి వుండదు.
జ్యోతిష్యం అనేది శాస్త్రబధ్ధమేనా అన్నది ఇంతవరకూ ఎవరూ రుజువు చెయ్యలేదు. అంటే, independent of time, place, or person ఫలనా గ్రహస్థితులు ఉన్న వ్యక్తులందరకూ,ఒకే రకమైన జీవిత ఫలితాలు ఉంటాయని, ఈ ఈ cases లో అలా వున్నాయని ఎవరూ నిరూపించలేదు. బలహీనమైన మనస్సుల ఆధారంగా అది ఒక బ్రతుకుతెరువు మాత్రమే.
Dr. C.B.S. Venkataramana
తెలిసీ పలికిన విలువేమో! గురించి ramanuja prasad అభిప్రాయం:
11/11/2013 4:17 am
చాలా రోజుల తర్వాత పూర్తిగా తెలుగు కథ చదివిన తృప్తి కలిగింది. రచయితకు కృతార్థులం.
తెలుగు, ఇతర ద్రావిడ భాషలు: వాటి ప్రాచీనత గురించి తఃతః అభిప్రాయం:
11/11/2013 2:23 am
సుందరం గారూ, మీ రచన తెలుగుని ఎంత ప్రాచీనం చేసిందో తెలియలేదు గానీ నా గుండెలకు ఇంకా చేరువ చేసింది.
నమస్కారాలతో
తఃతః
జిగిరీ – 6వ భాగం గురించి ఎన్నెల అభిప్రాయం:
11/11/2013 12:48 am
మా ఊళ్ళో తిరిగిన షాదుల్, ఇమాం, బీబమ్మ, చాంద్ అందరూ కళ్ళల్లో తిరుగుతున్నారు. బరువెక్కిన హృదయం తడి కళ్ళల్లోంచి పొంగుకొస్తోంది. ఈ తడి ఎండడానికేంజేయాల్నో!!
నిమ్మకాయలు గురించి ఎన్నెల అభిప్రాయం:
11/10/2013 11:36 pm
నాకూ లెమన్స్ కీ లైమ్స్ కీ తేడా ఏమిటో అర్థం కాదండీ..అయితే అవి దబ్బకాయలని అర్థమన్నమాట. మా వైపు వాటిని గజనిమ్మ కాయలని అంటారు. అవీ ఇవీ ఒకటో కాదో !
కథ మాత్రం సూపరు!
కళాపూర్ణోదయం -8: మణిహారం గురించి ఎన్నెల అభిప్రాయం:
11/10/2013 11:21 pm
తేలిక భాషలో కళాపూర్ణోదయం అందించిన రామారావు గారికి, ఈమాట కీ కృతజ్ఞతలు. ఒక్క చోట నాకు చిన్న సందేహం వచ్చింది. కథ కృష్ణుడి కాలం నించి వచ్చినట్టు వచ్చి, మణి కంధరుడు శ్రీ వేంకటేశ్వర్ స్వామి ని సేవించినట్టు వ్రాయబడింది. వెంకటేశ్వరుడు కలికాలం లో కదా..మరి వీటి రెంటికీ పొంతన ఎలా? నేను మళ్ళీ ఒక సారి మొత్తం చదివిన తరవాత అడగాలని అనిపిస్తోంది కానీ, సందేహం రాగానే అడగటం మంచిదని, నా మనసు మణిహారం పోరు పెడుతోంది. (మళ్ళీ మరచిపోతానేమోనని భయం లెండి)! యీ ప్రశ్న చొప్పదంటుదనిపిస్తే నన్ను క్షమించండి. (నేను సరిగ్గా అర్థం చేసుకుని ఉండకపోయి ఉండవచ్చు).
తెలిసీ పలికిన విలువేమో! గురించి ennela అభిప్రాయం:
11/10/2013 12:34 pm
చాలా బాగుందండీ
తెలుగు, ఇతర ద్రావిడ భాషలు: వాటి ప్రాచీనత గురించి తమ్మినేని యదుకుల భూషణ్ అభిప్రాయం:
11/10/2013 2:15 am
ఎంతో చక్కని వ్యాసం ; సరళంగా , సుబోధకంగా ఉంది. షడక్షర్ శెట్టార్ గారి పుస్తక ప్రస్తావన సముచితం: ಶಂಗಂ ತಮಿಳಗಂ ಮತ್ತು ಕನ್ನಡ ನಾಡು ನುಡಿ .
తమిళ ప్రచారాన్ని కాస్త పక్కన పెట్టి శాస్త్రీయంగా ఆలొచిస్తే శాసన భాష తర్వాతే కావ్య భాష. తమిళ లిపిలో వచ్చిన శాసనం 7 వ శతాబ్ది నాటిదని వారి ప్రభుత్వ సంస్థే తెలుపుతుంది (http://www.tnarch.gov.in/epi/ins2.htm)
తొల్కాప్పియం A. C. Burnell అభిప్రాయ పడినట్లుగా could not be dated to “much later than the eighth century”
ఈ మధ్య కాలంలో Herman Tieken (Kavya in South India : Old Tamil Chankam, 2001) అన్న డచ్చి పండితుడు గూబ గుయ్యిమనే ఒక సిద్ధాంతం ఒకటి ప్రతిపాదించాడు: అరవాన్ని అమరవాణి సంస్కృతానికి ధీటుగా నిలబెట్టడానికి- తొల్కాప్పియం /సంగం కాలాన్ని వెనక్కు నెట్టడం, పాండ్యుల (9 శ.) బృహత్ ప్రణాళిక లో భాగమే. తమిళాన్ని వెనక్కు నెట్టే ప్రయత్నాలకు చాల చరిత్ర ఉన్నది అని తెలుసుకోవడం మేలు.
భాషా శాస్త్రాల్లో అభిరుచిగల సురేశం లాంటి వారు దీనిమీద సమీక్ష వ్యాసం వ్రాస్తారేమోనని ఎదురు చూశాను, చివరికి శెట్టార్ గారి పుస్తక ప్రస్తావన చదవగానే ఒళాందుని సిద్ధాంతం గుర్తుకొచ్చింది.
నాకు నచ్చిన పద్యం: హరిశ్చంద్ర కాటి సీను గురించి nkiranprasd shrma అభిప్రాయం:
11/09/2013 4:47 am
గురువు గారూ, హరిశ్చంద్రుని యొక్క ధర్మపత్నిని ఏ గ్రామం లో అమ్మారు ఆయన – కాశి లోనా, వారణాసి లోనా, లేక కాశి అన్నా వారణాసి అన్నా ఒకటేనా, కొంచెం చెప్పగలరు.
చా.సో. తో ముఖాముఖీ గురించి Lalitha P. అభిప్రాయం:
11/09/2013 4:44 am