పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16473

  1. శార్దూలవిక్రీడిత వృత్తము గురించి దేశికాచారి అభిప్రాయం:

    07/13/2014 7:08 pm

    శ్రీమోహనగారికి, మీరు ఛందస్సునుగఱించి చేస్తున్న కృషి ప్రశంసనీయమైనది. కాని వృత్తలక్షణాలను లక్ష్యంగా నుంచుకొని కవి పద్యాలు వ్రాస్తాడని సాధారణమైన అపోహ ఉన్నది. కాని కవికి లయ ముఖ్యం. భావోద్వేగం కల్గినప్పుడు కవినోట ఏదో ఒక లయతో అది బహిర్గతమౌతుంది. అందుచేత లక్షణకర్తలు పనిగా కూర్చొని 26 ఛందాలలో వివిధవృత్తలక్షణాలకు తగిన వృత్తకల్పన చేసేదొక విధం. దీనితో నిమిత్తం లేకుండా భావావేశం దానికదే ఒక అపూర్వవృత్తమును సృష్టించుట రెండవరకం. ఈ రెండవవిధానంపై ఛందోవిశ్లేషణకర్తలు ఎక్కువగా వ్రాసినట్లుగా లేదు. ఈరెండవపద్ధతిద్వారా నేను నాకావ్యాలలో అనేక నూతనవృత్తములను సృష్టించినాను.వీని విషయంలో నేను ముందుగా పద్యాన్ని వ్రాసి తరువాత లక్షణాన్ని చూచుకొన్నాను. మీరిప్పుడు శా.వి. గుఱించి మాట్లాడుతున్నారు గనుక, దానికి అనురూపమైన గణాలుండేవి నాసృష్టిలోనివి ఈక్రింది రెండు వృత్తాలు.

    వాచాతీతము నీమనీష, వంద్యంబు నీజ్ఞానమున్,
    నీచే నాయెద నింతదాఁక నిద్రాణమై యున్న శౌ
    ర్యాచారంబు ప్రబోధమొందె, ఆస్కందనోత్సాహపున్
    వైచిత్రిం దగు నాదు మేనఁ బాటిల్లె రోమాంచముల్.

    ఇది డయానావృత్తము. పద్యంవ్రాసిన తర్వాత లక్షణం చూచుకుంటే ఇది ఒక సగణం లోపించిన శా.వి.గా స్పష్టమైంది. దీనికి 4వగణారంభం (10వ అక్షరంయతి)

    కోశాగారము గుల్లవాఱినను,ఘోరాపద ల్గూడినన్,
    రాశీభూతము లౌచు యోద్ధలపురంబుల్ ధరం గూలినన్,
    దేశం బెల్లను రక్తవాహినులఁ దేలించి యుద్ధంబునన్
    నాశం బే నొనరింతు సోమనను నవ్యోరుదర్పంబునన్.

    ఇది నయాగరావృత్తము. పద్యం వ్రాసిన తర్వాత లక్షణం చూచుకుంటే ఇది ఒక్క గురువు తక్కువైన శా.వి.గా భాసించింది. దీనికి12వ అక్షరం యతి. ఈరెండు వృత్తాలు మొట్టమెదట నాహనుమప్పనాయకకావ్యంలో వ్రాసినాను.ఆతరువాత ఇతరకావ్యాల్లో నయాగరావృత్తాన్ని తరచుగా వ్రాసినాను. ఈదీర్ఘమైన అభిప్రాయాన్ని వ్రాసింది స్వోత్కర్షకొఱకు గాదు, ఈరెండవ నూతనవృత్తనిర్మాణపద్ధతిని విశ్లేషించుటకొఱకే.

  2. మేఘసందేశం (తెలుగులో) గురించి తృష్ణ అభిప్రాయం:

    07/13/2014 12:39 am

    ‘యండమూరి సత్యనారాయణ’ గారు బెజవాడ స్టేషన్ డైరెక్టర్ గా కొన్నాళ్ళు పనిచేశారు. ఆయన రేడియో పేరే ‘సత్య’. మరి యే పాటలు ఇస్తారు? 🙂

  3. అమెరికా ఇల్లాలి ముచ్చట్లు: ప్లాస్టిక్ బ్యాగులు గురించి శ్యామలాదేవి అభిప్రాయం:

    07/12/2014 11:34 pm

    పవన్ గారు: మీ అభిప్రాయానికి, అభిమానానికి నా ధన్యవాదాలు.

  4. విలువలు: కథ నచ్చిన కారణం గురించి Raja Mohan అభిప్రాయం:

    07/12/2014 8:29 pm

    జ్యేష్ట గారి కథలలో ‘విలువలు’ ఒక అద్భుతమైన కథ. ఒక మధ్య తరగతి ఇల్లాలు ఐశ్వర్యం వచ్చినా తన మనస్తత్వం ఇంకా బెరుకుగానే ఉండటం చాలా చక్కగా వివరించారు. జ్యేష్ట గారు జీవితం చదివిన మహా మనిషి.

  5. కొండదారిలో! గురించి Madhavi అభిప్రాయం:

    07/12/2014 1:38 pm

    గాలి ఎక్కువ కదిలిందా, గడ్డి ఎక్కువ కదిలిందా, అసలు కదిలాయా లేదా అని ఆలోచించటానికి ఇది సందర్భం కాదు కదా. ఈ కవిత ఒక అనుభూతికి సంబంధించింది. దాని పరిమళాన్ని ఆస్వాదించటమే గానీ కళ్ళతో చూడాలని ప్రయత్నించటం నిష్ఫలం.

    మానసా… బాగుంది.

  6. అమెరికా ఇల్లాలి ముచ్చట్లు: ప్లాస్టిక్ బ్యాగులు గురించి శ్యామలాదేవి అభిప్రాయం:

    07/12/2014 9:13 am

    మూర్తి గారు ధన్యవాదాలు. మీ పద్యాల్లో చెప్పిన నిజాలు చదువుతుంటే చాలా బాధగా కూడా అనిపించింది.

  7. ఒక శతాబ్దకాలంలో భూపరిణామక్రమం: భూచక్రం గురించి Subhash Koti అభిప్రాయం:

    07/12/2014 6:10 am

    రమా సుందరిగారూ! సూక్షాతిసూక్ష్మంగా నవలను నిశితంగా పరిశీలించిన తర్వాతే, మీరు సమీక్ష రాసినట్లు గోచరిస్తున్నది. ఎందుకంటె ఇందులో మీ సొంత వ్యాఖ్యానం కంటే,నవలలో నిక్షిప్తమైన అంశాలను వెలికిదీసి వివరించడానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. యిలవరిశి నోటినుండి వెలువడిన ప్రశ్నలనుతంకిచడం సందర్భోచితముగాను మరియు ఆ ప్రశ్నల సమకాలీనతను స్మరింపజేస్తున్నది. ఇక భూమి మీద ఆయాచితంగావచ్చేఆదాయం, భూదాహం మనిషిని దయారహితంగానూ, బంధరహితంగానూ తయారుచేస్తుందనే ఆబ్జర్వేషన్ చెప్పుకోదగినది. ఇక శేషారెడ్డి లోకపరిశీలనకు మచ్చుతునకగ ” వుప్పూ పులుసు తినే మనిషి కదా! ఈ వూర్లో యే వూర్లో అయినా ఆస్తుల కతంటే రంకు బొంకుల పురాణమే ” అని ఆయన మాటలనుదహరించడం బాగుంది. కథను టూకీగా చెప్పడంలో మీరు కృత కృత్యులయ్యరనే భావిస్తున్నాను. నవలకు తగ్గ సమీక్ష రాసినందుకు మీకు హృదయపూర్వక అభినందనలు.

  8. ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం! గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    07/12/2014 1:07 am

    మాన్యతమశ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారికి
    నమస్కృతులతో,

    వ్యాసాన్ని ఆసాంతం దయతో చదివి ఔదార్యంతో సంస్పందించిన మీకు మనఃపూర్వక నమఃపూర్వక ధన్యవాదాలు!

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

  9. మనభాష – మనపద్యం గురించి samavarthi అభిప్రాయం:

    07/11/2014 1:10 pm

    మాతృభాషపై మక్కువను పెంచిన మా గురువులకు నా రచనకైన సాధువాదములు చెందుగాక. శ్రీతమ్మినేని వారికిధన్యవాదాలు.

    సమవర్తి

  10. కొండదారిలో! గురించి Azeez అభిప్రాయం:

    07/11/2014 1:52 am

    1) గాలి అన్ని దిక్కుల్లోంచి వీస్తూ మొక్కలు అటూ ఇటూ ఊగుతున్నప్పుడు? మొక్కలు ముందుకూ వెనక్కూ పక్కకూ కదలడం, వాటి మధ్యలో నుండి గాలి అంటుకునేందుకా అన్నట్లు పరుగులు తీయడం ఈ అక్షరాలు చూపెడుతోన్న దృశ్యం. ఏ ఆటో తేల్చుకోలేని వాళ్ళ కోసం “కాబోలు” ఎలాగూ ఉంది.

    2) “ఎవరో పేనిన ఊడల ఉయ్యాల” కదూ. గాలికి నిశ్చయంగా ఊగుతుంది. ఊగితే కొమ్మకు కదలిక తప్పదు ? ఇవి నేలలోకి పాతుకుపోయిన ఊడలు కావు. గాల్లో వేలాడుతూండగా ఎవరి చేతుల్లోనో పడి ఉయ్యాలైన ఊడలు అని తోస్తోంది. తమిళనాడు పల్లెల్లో ఇదొక సర్వసాధారణమైన దృశ్యం.

    3) రెండు లేదా అంత కన్నా ఎక్కువ సర్పాలు ఒకే ప్రాంతంలో, ఒకే మైదానంలో కుబుసాలు విడుచుకోవడం విచిత్రమైన విషయం కాదు. అసాధ్యం అసలే కాదు.

    4) “వడివడిగా నడచిపోయిన” – కడియాల చప్పుడు ఎందుకు వచ్చిందో కూడా చెప్పారు కవితలోనే?

    Best Regards.