వెల్చేరు నారాయణరావు గారి అభిప్రాయాన్ని జత చేయడం చాలా బావుంది. పాఠకులకు శక్తి లేకపొవడం, వారికి శక్తి లేకపోవడం తప్పే కాదన్న వాదనలు బయలుదేరడం ఈ స్థితికి కారణం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రాచీనమైన తెలుగు కవిత పోయిన వన్నెచిన్నెలు పట్టి తెచ్చి తన పరిధి ఒప్పిన మేరకూ, కొన్ని సందర్భాల్లో ఒప్పకున్నా ఒప్పించుకుని మరీ ఆ మేరకు తెలుగు సినీ కవిత్వంలో ప్రవేశపెట్టిన వేటూరి పాటల గురించీ వాటికి దక్కిన ఆదరణ గురించీ గుర్తు చేసుకుంటే ఆ సమస్య తేలుతుంది. “ఆరేసుకోబోయి పారేసుకున్నాను కోకెత్తు కెళ్ళింది కొండగాలి” అన్న పల్లవి గణాలే కాక ప్రాసయతి, యతీ కుదిరిన సీస పద్యమని చెప్పినప్పుడు చాలామంది దిమ్మెరపోయి దాన్ని చాన్నాళ్ళు తలచుకోవడం నాకు గుర్తే.(గూఢ కవిత్వం కామోసు) “గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన” కూడా సీసమే. “శృంగారం వాగైనది, ఆ వాగే వైగైనది” అంటూ ఏకంగా నాలుగేసి అక్షరాలు అంత్యంలో ప్రాసచేసి విచిత్రమైన పూర్వ కవుల ఆదరణాపాత్రమైన శబ్దాలంకారాలు.(ఇక్కడ చిత్రకవిత్వమో, బంధకవిత్వమో ఉందని కాదు) చూసినప్పుడు జనం పొందిన ఆనందం దాన్ని ధృవీకరిస్తుంది.
కవిత్రయం ఏం సాధించారో మామూలు ప్రజకి అర్ధం కావడం కష్టం.
మామూలు ప్రజకి చాలా కాలాల పాటు అర్థమయింది కనుకనే కవిత్రయంగా ఉన్నారు. పురాణ పఠన సంప్రదాయం గురించి బాగా తెలుసుకోండి. ఓ నలభై ఏళ్ళ నుంచి జరుగుతోందే తెలుగు సాహిత్య చరిత్రా కాదు, ఆంధ్ర మహా భారత చరిత్రా కాదు. వెల్చేరు నారాయణరావు గారి “తెలుగులో కవితా విప్లవాల స్వరూపం” దొరుకుతోంది, చదివి చూడండి. కొంతమేరకు అవగాహన కలగవచ్చు – మనకేం తెలియదు అన్న విషయమైనా.
ఈ వ్యాసంపై చర్చ జరగకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. చాలా మంచి వ్యాసం. సాధారణంగా ఇలా ఓ ప్రతిపాదనను ఖండిస్తూ రాసే ప్రతిస్పందనాత్మక వ్యాసాల్లో ప్రతిపాదనలతో పాటుగా, ఎవరి వ్యాసాన్ని ఖండిస్తున్నామో వారి ఉద్దేశం ఊహించి దానిని కూడా ఖండించే ప్రయత్నాలు లేకపోవడం ఆహ్లాదకరంగా ఉంది.
ఐతే ఏలూరెళ్ళాలి, లేడీ కరుణాకరం, బదిలీ అనే మూడు కథలు ఒకానొక మానవ స్వభావాన్ని(అవసరం కోసం ఏ నీతీ లేకపోవడం వంటివి) రికార్డు చేయడానికే రాసాడని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ముఖ్య (స్త్రీ) పాత్రల ప్రవర్తనల పట్ల చాసో ఎటువంటి సానుభూతి కలిగివున్నాడో లేదూ ఏమాత్రం దూరం కలిగివున్నాడో అన్న విషయంపై స్పష్టమైన ప్రతిపాదన ఏమీ చెయ్యలేదు.
“మీ అన్నయ్య.”
ఈ ట్విస్ట్ బాగుంది.
జీవితంలో ఒక కాలాన్ని గుర్తించడానికి “జయప్రద” ని మరో చరిత్రని వాడుకున్నారు. కాలేజి రోజుల్లో అందులోను ఆ రోజుల్లో అవి చరిత్రని సృష్టింనవే కదా! ఒక విధంగా ఆ రోజుల్లో అవి ఆ రోజుల్లో సాధారణమే! కాని ఈ రోజుల్లో అలా లేదు.
Times have changed. So did so called loving more of puppy love. Felt the story to be more cinematic.
కానీ ఆసాంతం చదివించింది. గుమ్మ్మంలో బొమ్మ కథ మలుపు తిప్పింది.
హెలో యదుకుల భూషణ్ మరియు ఇతర మిత్రులారా,
మీ వ్యాసాలు ఇలా వుంటే ఎలా చదవాలి ? తెలుగులో రాయచ్చు కదా, పోనీ శుద్ధ ఆంగ్లంలో అయినా నా రాయండి.
కొండేపూడీ నిర్మల
[మీరు RTS స్క్రిప్ట్ చూస్తున్నారు, బహుశా. ఆ పేజిలోనే ఈమాట పేరు కింద ఉన్న బూడిద రంగు డబ్బాలో కుడివైపు Read this page in Telugu script అని ఒక లింక్ ఉంది. దానిమీద నొక్కితే మీరు తెలుగులో వ్యాసాన్ని చూస్తారు. లేదూ, ఈ లింక్ నొక్కండి. — సం.]
సందర్భొచితసమాస గ్రథనమే ఇక్కడ జరిగినదని మనవి.”ఇందులొ తిట్లు ఉన్నయ్యేమో” నన్న సందేహంతో నైనా వారిలో ఒకరైనా చదువుతారని అక్కడ ఆసమాసం వేశాను. కవితను మీరు చదివి అభిప్రాయం తెలిపినందుకు వినయపూర్వక ధన్యవాదములు.
చిత్ర కవిత్వం ఒక చిరుపరిచయం గురించి Pavan Santhosh.S అభిప్రాయం:
09/29/2014 2:43 pm
వెల్చేరు నారాయణరావు గారి అభిప్రాయాన్ని జత చేయడం చాలా బావుంది. పాఠకులకు శక్తి లేకపొవడం, వారికి శక్తి లేకపోవడం తప్పే కాదన్న వాదనలు బయలుదేరడం ఈ స్థితికి కారణం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రాచీనమైన తెలుగు కవిత పోయిన వన్నెచిన్నెలు పట్టి తెచ్చి తన పరిధి ఒప్పిన మేరకూ, కొన్ని సందర్భాల్లో ఒప్పకున్నా ఒప్పించుకుని మరీ ఆ మేరకు తెలుగు సినీ కవిత్వంలో ప్రవేశపెట్టిన వేటూరి పాటల గురించీ వాటికి దక్కిన ఆదరణ గురించీ గుర్తు చేసుకుంటే ఆ సమస్య తేలుతుంది. “ఆరేసుకోబోయి పారేసుకున్నాను కోకెత్తు కెళ్ళింది కొండగాలి” అన్న పల్లవి గణాలే కాక ప్రాసయతి, యతీ కుదిరిన సీస పద్యమని చెప్పినప్పుడు చాలామంది దిమ్మెరపోయి దాన్ని చాన్నాళ్ళు తలచుకోవడం నాకు గుర్తే.(గూఢ కవిత్వం కామోసు) “గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన” కూడా సీసమే. “శృంగారం వాగైనది, ఆ వాగే వైగైనది” అంటూ ఏకంగా నాలుగేసి అక్షరాలు అంత్యంలో ప్రాసచేసి విచిత్రమైన పూర్వ కవుల ఆదరణాపాత్రమైన శబ్దాలంకారాలు.(ఇక్కడ చిత్రకవిత్వమో, బంధకవిత్వమో ఉందని కాదు) చూసినప్పుడు జనం పొందిన ఆనందం దాన్ని ధృవీకరిస్తుంది.
కవుల వాగ్వాదాల్లోంచి కవిత్వం – గీరతం గురించి Pavan Santhosh.S అభిప్రాయం:
09/29/2014 2:11 pm
మామూలు ప్రజకి చాలా కాలాల పాటు అర్థమయింది కనుకనే కవిత్రయంగా ఉన్నారు. పురాణ పఠన సంప్రదాయం గురించి బాగా తెలుసుకోండి. ఓ నలభై ఏళ్ళ నుంచి జరుగుతోందే తెలుగు సాహిత్య చరిత్రా కాదు, ఆంధ్ర మహా భారత చరిత్రా కాదు. వెల్చేరు నారాయణరావు గారి “తెలుగులో కవితా విప్లవాల స్వరూపం” దొరుకుతోంది, చదివి చూడండి. కొంతమేరకు అవగాహన కలగవచ్చు – మనకేం తెలియదు అన్న విషయమైనా.
చాసో పాత్రలు వెల్చేరువారి ఆరోపణ గురించి Pavan Santhosh.S అభిప్రాయం:
09/29/2014 1:23 pm
ఈ వ్యాసంపై చర్చ జరగకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. చాలా మంచి వ్యాసం. సాధారణంగా ఇలా ఓ ప్రతిపాదనను ఖండిస్తూ రాసే ప్రతిస్పందనాత్మక వ్యాసాల్లో ప్రతిపాదనలతో పాటుగా, ఎవరి వ్యాసాన్ని ఖండిస్తున్నామో వారి ఉద్దేశం ఊహించి దానిని కూడా ఖండించే ప్రయత్నాలు లేకపోవడం ఆహ్లాదకరంగా ఉంది.
ఐతే ఏలూరెళ్ళాలి, లేడీ కరుణాకరం, బదిలీ అనే మూడు కథలు ఒకానొక మానవ స్వభావాన్ని(అవసరం కోసం ఏ నీతీ లేకపోవడం వంటివి) రికార్డు చేయడానికే రాసాడని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ముఖ్య (స్త్రీ) పాత్రల ప్రవర్తనల పట్ల చాసో ఎటువంటి సానుభూతి కలిగివున్నాడో లేదూ ఏమాత్రం దూరం కలిగివున్నాడో అన్న విషయంపై స్పష్టమైన ప్రతిపాదన ఏమీ చెయ్యలేదు.
పెద్దక్క ప్రయాణం గురించి gurunath rao అభిప్రాయం:
09/29/2014 5:30 am
పెద్దక్క ప్రయాణం pdf ప్రతి సైటులో లేదేమండి?
అమెరికా ఇల్లాలి ముచ్చట్లు: ప్లాస్టిక్ బ్యాగులు గురించి Satyavani vadrevu అభిప్రాయం:
09/27/2014 9:44 am
శ్యామలగారు , అన్ని ఆంశాలు చక్కగా cover చేసారు. ఛాలా thanks
కొందరి లొ నైనా తప్పకుండా మార్పు వస్తుంది , ఇలాంటివి చదవడం వల్ల.
కోనసీమ కథలు: రెండు ప్రేమ కాట్లు గురించి అనిల్ Anil Atluri అభిప్రాయం:
09/26/2014 12:40 pm
“మీ అన్నయ్య.”
ఈ ట్విస్ట్ బాగుంది.
జీవితంలో ఒక కాలాన్ని గుర్తించడానికి “జయప్రద” ని మరో చరిత్రని వాడుకున్నారు. కాలేజి రోజుల్లో అందులోను ఆ రోజుల్లో అవి చరిత్రని సృష్టింనవే కదా! ఒక విధంగా ఆ రోజుల్లో అవి ఆ రోజుల్లో సాధారణమే! కాని ఈ రోజుల్లో అలా లేదు.
Times have changed. So did so called loving more of puppy love. Felt the story to be more cinematic.
కానీ ఆసాంతం చదివించింది. గుమ్మ్మంలో బొమ్మ కథ మలుపు తిప్పింది.
జ్ఞాపకాల వాసన గురించి ananth mallavarapu అభిప్రాయం:
09/25/2014 1:00 pm
మనిషిలో ఉన్న “కామ పిశాచి” దాని తాలూకు చేదు అనుభవాలు/జ్ఞాపకాలు, తమల్ని తాము దహించుకుంటే కాని తప్పించుకోలేరన్నమాట! ఏమిటో ఈ కథ అంతరార్థం! అంతా మాయ!
జయప్రభశబ్ద కవిత్వం గురించి nirmala kondepudi అభిప్రాయం:
09/25/2014 11:12 am
హెలో యదుకుల భూషణ్ మరియు ఇతర మిత్రులారా,
మీ వ్యాసాలు ఇలా వుంటే ఎలా చదవాలి ? తెలుగులో రాయచ్చు కదా, పోనీ శుద్ధ ఆంగ్లంలో అయినా నా రాయండి.
కొండేపూడీ నిర్మల
[మీరు RTS స్క్రిప్ట్ చూస్తున్నారు, బహుశా. ఆ పేజిలోనే ఈమాట పేరు కింద ఉన్న బూడిద రంగు డబ్బాలో కుడివైపు Read this page in Telugu script అని ఒక లింక్ ఉంది. దానిమీద నొక్కితే మీరు తెలుగులో వ్యాసాన్ని చూస్తారు. లేదూ, ఈ లింక్ నొక్కండి. — సం.]
ఒంటరి గురించి Dr. CBS Venkataramana అభిప్రాయం:
09/25/2014 7:57 am
కధ వ్రాయబడిన పదమూడు ఏళ్ళ తరువాత చదివాను. చాలా సున్నితంగానూ, హృద్యంగానూ వుంది. అభినందనలు.
కానీ, ముగింపు అర్ధం కాలేదు. నాయకుడు, నాయిక ప్రేమను అంగీకరించినట్లేనా, కాదా?
????
మంజుఘోష గురించి samavarti అభిప్రాయం:
09/23/2014 1:12 pm
గౌరవనీయులైన కామేశ్వర రావు గారికి నమస్కారం.

సమవర్తి