పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16473

  1. ప్రధాన సంఖ్యలలో కవలలు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    07/01/2015 1:28 pm

    వేమూరి గారికి:

    ఇంత చక్కని వ్యాసం ప్రాధమిక సంఖ్యల మీద రాసినందుకు అభినందనలు. మరీ సంఖ్యాశాస్త్రం గురించి అందరు చదువరలకి తెలియక పోయినా చెపుతున్న విషయం సూటిగా చెప్పటానికి మీరు వాడిన భాష బాగుంది. తెలుగులో సాంకేతిక విషయాలను ప్రధానంగా ఎంచుకున్న రచనల్లో తేలికగా చదివించే గుణం పుష్కళంగా ఉండటం అరుదు. మీ వ్యాసం ఆ లోటుని పూడ్చింది.అందుకనే మీ రచన ఆకట్టుకుంది.

    మీ వ్యాసం పరిచయం చదువరులకి సంఖ్యాశాస్త్రం తెలియకపోయినా అర్ధమవుతుందని నమ్ముతున్నా. అయితే, వ్యాసం చివర ప్రస్థావించిన విషయాల అవగాహనకు చదువరులకు కొంత గణితంతో పరిచయం అవసరం.

    తెలుగులో ఇటువంటి వ్యాసాలు రాస్తున్న కొద్దిమంది రచయితలలో, మీకు ప్రత్యేక స్థానం ఉంది.

    అభినందనలతో,

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  2. గుప్పెట్లో తూనీగ గురించి అవినేని భాస్కర్ అభిప్రాయం:

    07/01/2015 12:54 pm

    తూనిగలా చక్కగా ఉంది కవిత!

  3. నాకు నచ్చిన పద్యం: అమరపతి చేత ఆవరసం త్రాగించిన కవిదిగ్గజం గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    06/29/2015 10:25 am

    లైలా గారు అప్పుడు ఇంద్రుడు మారు వేషంలో రావటానికి, ఇప్పుడు జనాలు మారుపేర్లతో రాయటానికి గల పోలికను ప్రస్తావించడం ఆశ్చర్యపరిచింది, ఆలోచింపజేస్తుంది. పురాణాల్లో మారువేషాలు ధరించడం కనిపించినంతగా పూర్వపు కవులు మారుపేర్లతో రాయడం కనపడుతుందా, అసలు మారుపేరుతో, కాదు, కలంపేరుతో రాయడం అనేది, గత శతాబ్దము నుండి మొదలైన పద్ధతో తెలియదు. ఏది ఏమైనా తెనాలి రామకృష్ణుని తరానికి ఇప్పటి తరానికి మరొక్క తేడా కూడా ఉందనిపిస్తుంది. ఇంద్రుడు “వృద్ధ మహీసుర వేషధారియై” వచ్చాడు అని తెనాలి రామకృష్ణుడు అప్పుడు రాయగలిగాడు. మరి ఇప్పుడో? ఇప్పటి తరం ముసలివాళ్ళను ముసలివాళ్ళు, వృద్ధులు అని అంటే వాళ్ళకు నచ్చదు. పైగా కోపం కూడా రావచ్చు. Senior citizens అని అంటుంటారు, అనమంటారు. కవులు రచయితలు కూడా మారుతున్న తరాన్ని బట్టి, వృద్ధులు, కాదు, సీనియర్ పౌరుల అభిరుచులకు అనుగుణంగానే రచనలు చేస్తారనిపిస్తుంది.
    ==========
    విధేయుడు
    _శ్రీనివాస్

  4. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 2 గురించి nagamurali అభిప్రాయం:

    06/23/2015 1:03 pm

    అయనాంశ విషయంలో మీకు కావలసిన సమాచారమేమిటో తెలియచేస్తూ నాకు ఈ-మెయిల్ చెయ్యండి (vadavalli_nm at yahoo.com).

    నాకు తెలిసినంతలో సహాయపడడానికి ప్రయత్నిస్తాను.

  5. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 2 గురించి Pelluri Venkata Ramana. అభిప్రాయం:

    06/23/2015 4:44 am

    అయ్యా నమస్కారము,

    అయనాంశ విషయంలో మీ దగ్గర తెలుగులో ఉంటే కొద్దిగా సహాయం చేయగలరు.

    ఠంక్ you
    Ramana

  6. మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    06/20/2015 7:35 pm

    Bhavanarayana gaaru,

    I have somehow missed your above comment.Also, I am not able to access the video you refer to. My anti-virus system classifies it as a potential threat. But, I think, I understand your question. Yes, I do also have the song as Ghantasala solo. In the film song book it is referred to as “Gramophone paaTa” (/background song). As you speculated, it could be a repetition of the same song, or I was wrong. The film song book doesn’t give any hint that a duet version exists.

    Unfortunately the Telugu video print of this film has not been found so far. What we have is the Tamil video version, commercially available in the market. So, some creative people have superposed the Telugu audio file onto the Tamil video track and posted on Youtube. I am aware of 3 such audios/videos from “పరోపకారం”: హృదయమా సాగిపొమ్మా! భావవేగాన సాగిపొమ్మా!, జోడెడ్ల నడుమ జోరైన రగడ, వలపుల కథకిది తొలి పిలుపు. May be I should (re)watch the Tamil film to check if the song in discussion exists in 2 versions.

    My earlier comment was based on my hand-written notes from early 2000s when I came across a list of gramophone records with a Hyderabad based person which included the disc numbers. As per my notes:
    తీయని యీ కాపురమే దివ్యసీమ – ఎ. ఎమ్‌. రాజా, ఎ.పి. కోమల – HMV N 69117
    హృదయము ఊగిసలాడే (2 ప్రక్కలా) – ఘంటసాల, ఎ. ఎమ్‌. రాజా, పి. లీల, ఎ.పి. కోమల – HMV N69118
    హృదయమా సాగిపొమ్మా! & వలపుల కథకిది – ఘంటసాల – HMV N69116
    నరజన్మ అత్యున్నతమురా (మాధవపెద్ది) & కనులు కాయలు కాచినా (లీల) –
    Columbia GE27174.

    If I come across more details I’ll inform you.

    Regards, Sreenivas

  7. గంధర్వులెవరు? గురించి lyla yerneni అభిప్రాయం:

    06/20/2015 11:55 am

    The random/shuffle play pulled this tiny essay from 1999 for me.

    గంధర్వులెవరు? అన్న పేరు చూసి చదివాను. It’s fun.

    లైలా

  8. నాయుడు – రాయుడు గురించి Rao Vemuri అభిప్రాయం:

    06/20/2015 1:16 am

    శ్రీనివాస్

    రాయుడు బొబ్బిలి వాడు అనడంలోనూ, నాయుడికీ రాయుడికీ పడదనడం లోనూ రాస్తూన్నప్పుడు ముఖ్యమంత్రి ద్వయం నా మనస్సులో మెదలక పోలేదు. కథా గమనానికి ముఖ్యం కాదని ఆ కోణాన్ని చదువరుల ఊహకి వదిలేసేను. ధన్యవాదాలు – వేమూరి

  9. దేశభక్తి గేయాలు గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    06/19/2015 4:58 pm

    విద్యానాథ్-గారు,మీరు నాకొక e-mail రాయండి. నా e-mail: sreeni AT gmx DOT de
    భవదీయుడు, శ్రీనివాస్

  10. నాయుడు – రాయుడు గురించి వురుపుటూరి శ్రీనివాస్ అభిప్రాయం:

    06/19/2015 1:56 pm

    నాయుడు-రాయుడు అంటే – ముఖ్యమంత్రి ద్వయం గురించి వ్యంగ్య కథ కాబోలుననుకున్నాను.:)

    చెహోవ్ కథకు ఓహెన్రీ కొసమెరుపు అతికించినట్లున్నది.