పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. తాటిపండుకల్లు గురించి S A RAHMAN,CHITTOOR అభిప్రాయం:

    02/24/2017 9:53 am

    ముచ్చటైన కవిత చాల బాగుంది.

  2. గులకరాళ్ళు గురించి S A RAHMAN,CHITTOOR అభిప్రాయం:

    02/24/2017 9:48 am

    చక్కటి కవితలు. నిజంగా గులక రాళ్ళు కాదు, గులక రత్నాలు.
    es.e.rahamaan,chittUru.

  3. శ్రీనాథుని చాటుపద్యములు గురించి Vijayasaradhi అభిప్రాయం:

    02/24/2017 4:13 am

    నాకు శ్రీనాధుని పద్యాలలో గరికపాటివారు చెప్పిన ఒక పద్యం కావాలి. అందులొ ప్రతి పాదంలో ఒక్కొక్క రకమైన స్త్రీ ని ఒక్కొక్క పదం తో వర్ణించారని ఆ పద్యం వినాలని ఉంది. దయచేసి అందిచగలరు.

  4. నాకు నచ్చిన పద్యం: కవిరాజశిఖామణి కవిత్వశక్తి గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    02/23/2017 10:39 am

    అదేమిటండోయి, లైలా గారు మన్మధుడు బాణాలు వేసాడనీ, మీరు వేయలేదనీ అంటూ ఉంటే, నేను చదివిన కధ గుర్తు ఉన్నంతలో గుర్తుచేస్తే, నా కేసు డిస్ మిస్సుడు!! ఇద్దరు వ్యాఖ్యోద్ధతుల మధ్య నేను సమిధనై పోయినట్టున్నానే? 🙂
    Should I be seeking an ombudsman?

  5. బుఱ్ఱకథ నాజర్‌గారి రెండు ఇంటర్‌వ్యూలు గురించి కామేశ్ సి అభిప్రాయం:

    02/20/2017 12:08 am

    ఎప్పటి వలెనే అప్పటికప్పుడు విచ్చిన మల్లెల మొగ్గల ఘుమఘుమ, మీ తేనెల సోనల మాటల మాయాజాలం, కఠోర పరిశ్రమతో కూడిన పరిశోధన నుండి వెలువడిన వ్యాసాలు – ఎప్పటివలెనే అద్భుతంగా అనిపించాయి. జోహార్లు

  6. బుఱ్ఱకథ నాజర్‌గారి రెండు ఇంటర్‌వ్యూలు గురించి కామేశ్ సి అభిప్రాయం:

    02/19/2017 11:33 pm

    నాజరు గారి పేరు అంతగా పరిచయం లేక పోయినా, ఆయన గొంతు లోని ఉద్వేగం, అంత వయసులోనూ కట్టి పడేసేటట్టు ఉన్న పట్టు, అద్భుతంగా ఉన్నాయి. ప్రజలలోకి చొచ్చుకుపోయి, ప్రజా చైతన్యం తీసుకురాగలిగే అలాంటి కధాకథనాలు, చెప్పగలిగే కళాకారులు, చెప్పించగలిగే నిర్మాతలూమరిక రారేమో! ఇది అందించిన శ్రీనివాస్ గారికి ధన్యవాదములు. చివరగా, చాప కూడు లేదా చాప కూటి సిద్ధాంతమేమో కదండీ?

  7. నాకు నచ్చిన పద్యం: కవిరాజశిఖామణి కవిత్వశక్తి గురించి వేలురి వేంకటేశ్వర రావు అభిప్రాయం:

    02/18/2017 9:14 pm

    ఇప్పుడు కామేశ్వర రావు, మురళీధర రావూ కుమ్మక్కయి పోయి వ్యాఖ్యాతల నోరు కట్టిపడేసారు. “ ఆహా ఏమి ఈ ఉద్ధతుల మాయ! ఏమి ఈ వైపరీత్యం?” అని మనం సరిపెట్టుకోవాలని కాబోలు!

    ఈ ఇద్దరు ఉద్ధతులకీ , “శ్రీశ్రీ, ఆరుద్ర; శ్రీశ్రీ, మల్లారెడ్డి; అరసం, విరసం; ‘కాగితప్పులి విరసం’, వేలూరి; నారా, గుడిపాటి, వేలూరి; నారా,చలసాని, వేలూరీ, వగైరా, వగైరా …” సాహిత్యసమరాలు తెలియవని అంటే నమ్మశక్యంకాదు. సాహిత్యవివాదాలలో ఇలా “కుమ్మక్కు” అవటం, క్షమించరాని నేరం అంటాను. ఈమాట పాఠకులూ! మీరేమంటారు?

    కామేశ్వర రావు ఉవాచ: As is the case most of the times, comments in Eemaata, transcend the essay!

    అయితే transcend అన్న మాట, go beyond the limits అన్న అర్థంలో ఆయన వాడి ఉంటే, నేను Amen! అని అంటాను. మరి ఆ limits ఏవో నిర్థారించి, అమలుపరిచే బాధ్యత సంపాదకవర్గానిదే కదా! Let us en masse blame them!

    శర్మ దంతుర్తి చందమామ(?)లో చదివిన జ్ఞాపకాలు గుర్తుచేసుకొని, అదేదో శివపురాణం ముచ్చటలు తెచ్చిపెట్టారు; అసలు వివాదం శివపురాణానికి సంబంధించినది కాదని తెలిసికూడా! మరొక్కవిషయం. చందమామ లోకథలన్నీ ఒకేఒక్కరు రాసేవారు. నాకుతెలిసినంతలో, ఆనాటి చందమామ రచయితకన్నా, శర్మ దంతుర్తి కే సంస్కృతం బాగావచ్చు! ఆ చందమామ కథలు రాసిన ఆయనతో నాకు పరిచయం ఉన్నది. ఆ మహానుభావుడికి, మన పురాణాల మీద పెద్ద గౌరవం లేదని నేను ఘంటాపథంగా చప్పగలను. ఆయనంటే, నాకు ఇతరత్రా చాలా గౌరవం ఉంది సుమా!

    Mr. Sarma! Your arguments are based on extraneous, non-relevant epics and unreliable modern references! So, your case is dismissed, with no prejudice.

    వేలురి వేంకటేశ్వర రావు

  8. నాకు నచ్చిన పద్యం: కవిరాజశిఖామణి కవిత్వశక్తి గురించి కామేశ్వరరావు అభిప్రాయం:

    02/18/2017 2:36 am

    వ్యాఖ్యాతలందరికీ ధన్యవాదాలు. ఏల్చూరిగారు అన్నట్టు అతనికి నేను ఆత్మీయుడినీ, ఆయన నాకు గౌరవనీయులు. అంచేత వేలూరివారి సమరాశని తీర్చే ఉద్ధతులు వేరెవరైనా రావలసిందే!
    As is the case most of the times, comments in Eemaata, transcend the essay!!

  9. నాయం హంతి న హన్యతే గురించి ayyavaru అభిప్రాయం:

    02/17/2017 3:08 pm

    చాల బాగుంది. రమణ తత్త్వం గుర్తొచ్చింది.

  10. సత్య దర్శనం గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    02/15/2017 1:29 pm

    అన్యగామి గారు,

    చాలా సంతోషం. ఈమాటలో ఇటువంటివి మరో కొన్ని ఉన్నాయి. ఇదే పేజీలో నా పేరు (కధ కింద రచయిత పేరు) మీద నొక్కితే మొత్తం డొంక అంతా కదులుతుంది. 🙂 వెడలెను కోదండపాణి, దానవోద్రేక స్థంభకుడు, యద్భావం తద్భవతి అనేవి, మరికొన్ని మీకు నచ్చవచ్చేమో. వీలున్నప్పుడు చూడండి.