ఐతే, శుక్లాంబర ధరం.. శ్లోకం తరువాత కొందరు చదివే అగజానన పద్మార్కం[…] అన్న శ్లోకాన్ని ఎక్కడా ఎందుకు ప్రస్తావించలేదో?
“అగజానన పద్మార్కం…” ఘంటసాల పాడడం వల్ల అది శుక్లాంబరధరం తరువాత వచ్చే శ్లోకం అయ్యింది తప్ప, ఈ రెండు శ్లోకాలు నాకు తెలిసి ఏ పురాణంలో పక్కపక్కనే కనిపించవు. ఉదాహరణకు, స్కాందపురాణంలో శుక్లాంబరధరం తరువాత జనార్దనని స్తుతి (విష్ణుస్తుతి) కనిపిస్తుంది.
చక్కని వ్యాసం. ఆలోచింపజేసింది. కొలిచాల సురేష్ గారు, గణపతిని ఇప్పుడు అందరూ ముందుగా కొలిచే ఆచారం ఒకప్పుడు లేదని ఎన్నో తార్కాణాలతో విశదీకరించారు. కాలక్రమేణా నమ్మకాలు మారి కొత్తపద్ధతులు పురాణాలలో చేరిపోయాయి. ఏమైనప్పటికీ, వినాయకుడిని తొలిదేవుడిగా మలచడం ఒక అద్భుతమైన సృజనాత్మకత.
మీతో నాకు ఇదే పరిచయం. ఈ కథ బాగుంది. కథ ఏముంది అయినా? ముందైతే వ్యాసం రాయబోయి కథ రాశారేమో అనిపించింది, ముఖ్యంగా ఆ పుస్తకాల వివరాల దగ్గర. అయినా మొత్తంగా కథనం బాగుంది. ఎంత బాగుందంటే మీరింకా ఏం రాశారా అని వెనక్కి వెళ్లాను. అప్పుడే ‘లింఫోమా’, ‘ఎవరో’ కథలు చదివేశాను కూడా. అవి ఇంకా ఎక్కువ నచ్చాయి. ముందు ఇవి అనువాద కథలై ఉంటాయా అని పొరబడ్డాను. మూల రచయిత్రి ఎవరైనా ఉన్నారా అని స్పెల్లింగులు మారుస్తూ ఎన్నో కాంబినేషన్లలోనో వెతికాను. Nisi Shawl పేరొకటి వస్తోంది కూడా. కానీ తర్వాత బెజవాడ, తెలుగు ప్రస్తావనలు వస్తున్నకొద్దీ నిసి మీ కల్పనా విశేషం అని అర్థమైంది. అదే పేరెందుకు? నిసి డైరీలో ఇంకా బోలెడన్ని పేజీలు చదువుకోవడానికి ఉన్నాయని నాకు ఉత్సాహంగా ఉంది. అన్నట్టూ, ముందటి నా ఆరోపణ, ‘వ్యాసం రాయబోయి’ని ఉపసంహరించుకుంటున్నా.
అమెరికా / కెనడా లాంటి దేశంలోకి కొత్తగా వచ్చే వలసదారులకి ఇమ్మిగ్రేషన్ నార్మ్స్, మోరల్ & ఎథికల్ బెహేవియర్ గురించి కలిగించే అవగాహన గురించి చక్కగా తెలియజేసారు. ధన్యవాదాలు.
కాని అంత మాత్రాన్నే అప్పాదురై ముత్తులింగంగారు రాసిన “బలిసిన మేకను పట్టుకుంటాను“ కథలో జరిగిన సంఘటన లాంటి వాటిని పూర్తిగా నివారించగలిగాయా అనేది ప్రశ్న.
కథలో శ్రీలంక నుండి ( ?? ) కెనడా వలసవచ్చిన గణేశరత్నం పాత్ర మనో వేదనే నాకు కనిపించింది. తను కావాలని ఏ సందర్భంలో కూడా అసభ్యంగా కాని, అవినీతిగా కాని ప్రవర్తించినట్లు కనిపించలేదు. రాళ్ళు మోసి అయినా తన కుటుంబాన్ని పోషించుకోవాలని తపిస్తున్న ఓ కాందిశీకుడి, ఓ వలసపక్షి ఆర్తనాదం ఇందులో నాకు వినిపిస్తోంది. మానవ నైజాలు, పరిస్థితుల ప్రభావాలు, బలహీనతలు వంటివాటిని రచయిత చిత్రీకరించారే కాని పనికట్టుకుని వాటిని సమర్థిస్తూ రాసినట్లు ఎక్కడా కనిపించలేదే. మానవ దౌర్భల్యాలనూ, ఉద్రేకాలను రెచ్చగొట్టే ప్రయత్నం ఎక్కడైనా కనిపించిందా?
అన్నమయ సంకీర్తనల అభిమాని, అమాయక చక్రవర్తి అని తన మిత్రులు అభిమానంగా పిలుచుకునే అవినేని భాస్కర్ యీ కథను అనువదించారంటేనే దానికో విశిష్టత ఉన్నట్లు నాకనిపించింది.
ఇలాంటి కథను ఏ సోమర్సెట్ మాం కాని, ఏ హెమింగ్వే కాని, ఏ నబకోవ్ కాని, మరే గొప్ప రచయిత కాని రాసినా ఆ రచయితను ఇంతలా తూలనాడుతూ పాఠకులు స్పందిస్తారా అని నాకు ఓ చిన్న అనుమానం కలుగుతోంది. తప్పుగా అనుకోకండి.
అయ్యా నమస్కారం! ఈ 3వ కాలిఫోర్నియా సాహితీ సదస్సు యొక్క ముఖ్యమైన అంశాలైన రామాయణ కల్పవృక్షం శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారి శైలిపై ఉపన్యాసాలు వంటివి దృశ్య, శ్రావ్య మాధ్యమ రూపాల్లో ఉన్న లింకులు కొన్ని ఇక్కడ ఇస్తే బాగుండేదండి. వీలయితే ఇచ్చి తెలియపరచగలరు.
మూల కథకుడు ఎన్నో దేశాలు చూసివుండొచ్చు కాని అక్కడి జీవితాల గురించి ఏమాత్రం తెలుసుకోలేకపొయాడనేది స్పష్టంగా చూపుతోందీ కథ. కాకుంటే అతను తనకెన్నో దేశాలు చూసిన పరిజ్ఞానం ఉందని చెప్పుకుని పాఠకుల్ని మోసం చెయ్యటంలో విజయం సాధించి వుండొచ్చు. ఈకథకో సంకలనానికో బహుమతులు కూడ వచ్చివుండొచ్చు. ఇలాటి వాళ్లకి కూడ కథకులుగా గుర్తింపు రావటం (లేకుంటే దీన్ని అనువదించి వుండేవారు కారని నా assumption; అది తప్పైతే, ‘ఇంత చెత్త కథలు కూడ రాసేవాళ్లున్నారు’ అని చెప్పటానికి దీన్ని అనువదించి వుంటే అనువాదకులు అభినందనీయులు) దౌర్భాగ్యం.
జయసింహ చిత్రానికి విశ్వనాథ సత్యనారాయణగారి వీరపూజ మూలమన్నది అవాస్తవమండి. చిత్రపు టైటిల్స్^లో కూడా పేర్కొనలేదు. వారి కుటుంబసభ్యులను అడిగితే కాపీ కావచ్చును. హక్కులు ఇవ్వలేదు అని అన్నారు. వికీపీడియాలో ఈ విషయమై పరిశీలిస్తే ఈక్రింది విధంగా ఉన్నది. “The story of this film is loosely based on Viswanatha Satyanarayana’s novel Veerapuja. However his name is not credited in the titles.”
అనుశాసనిక పర్వం,దానధర్మపర్వ,మృత్యుగౌతమ్యాదిసంవాదం ఉన్న పై లంకెలో నాకు పాము కు పేరు ఎక్కడా దొరకలేదు.[వేరే పాఠంలో ఉండవచ్చేమో!] ఇంక బూదరాజు వారి పురాతన నామకోశములో, రేణుకం అనే ఆరోపానికి ఈ క్రింది వివరణ ఉంది.
రేణుకం : గొప్ప సర్పం.విధి,నీతి మొదలగు వాటి గురించి దిగ్గజాలని ప్రశ్నిస్తుంది.-భార
బూదరాజు వారు ఉదహరించిన ప్రశ్నించే గొప్ప సర్పం, ఇదో,లేక మహా భారతంలో ఇంకెక్కడైనా పిట్ట కథల్లో, ఈ పేరున్న పాము ఉందేమో?
తః తః గారు చెప్పిన ఎల్లమ్మ తోట గురించి ఒక రెండు మాటలు.ఆయన తెలిసిన వారు కాబట్టి దాని “జగదంబా జంక్షన్” అనారు గాని, మా విశాఖపట్నం వాళ్ళమందరూ దాన్ని “జగదాంబా జంక్షన్” అనే పిలుస్తాం. [దకారానికి ఒక అవసరం లేని దీర్ఘం ఇస్తాం. తిరుమల రామచంద్ర గారంతటి వైయాకరణి ఇది తప్పు అని మొత్తుకున్నా సరే పట్టించుకోకుండా!]
అయితే ఎల్లమ్మ, జగదాంబ గా పేరు మార్చుకోడం వెనుక ఉన్న కారణం మాత్రం కాకతాళీయమే, అక్కడ ఆ పేరుతో ఒక సినిమా హాలు రావటం,క్రమేపీ అక్కడ సినిమాలు చూడ్డానికి జనాలు రావటం మొదలెట్టడంతో, ఆ ప్రాంతాన్ని, ఆ పేరుతో పిలవటం జరిగాయి. ఈ విషయం చెప్పుకోపోతే,ఒక ప్రమాదం జరగటానికి అవకాశం ఉంది. ఒక వందేళ్ళ తర్వాత, అక్కడ ఆ సినిమా హాలు, కాలగర్భంలో కలిసిపోయి, ఆ ప్రాంతం పేరు మాత్రం, జగదంబ గా ఉండిపోయిందనుకుందాం!దీన్ని గురించి పరిశొధించే తర్వాతి తరం, చరిత్ర కారులూ,anthropologist లూ,ఇండాలజిస్టులూ తదితరులు, ఈ పేరులో మార్పు కూడా, ” సింధు నాగరికత అంతం నుంచి ప్రారంభించబడి, నేటి కాలం దాకా, తెరలు తెరలుగా జరుగుతూ వస్తున్న జానపద పురాణ గాథల,బ్రాహ్మణ వైదిక మతం తలెత్తటానికి ముంందు నుండీ ఉన్న ద్రావిడ పదాల,కథల యొక్క సంస్కృతీకరణ/హైందవీకరణలో” భాగంగానే జరిగిందని సిద్ధాంతీకరించే అవకాశం లేకపోలేదు.
గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-5 గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
10/10/2018 7:31 am
“అగజానన పద్మార్కం…” ఘంటసాల పాడడం వల్ల అది శుక్లాంబరధరం తరువాత వచ్చే శ్లోకం అయ్యింది తప్ప, ఈ రెండు శ్లోకాలు నాకు తెలిసి ఏ పురాణంలో పక్కపక్కనే కనిపించవు. ఉదాహరణకు, స్కాందపురాణంలో శుక్లాంబరధరం తరువాత జనార్దనని స్తుతి (విష్ణుస్తుతి) కనిపిస్తుంది.
గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-5 గురించి Dr. I.A.P.S. Murthy అభిప్రాయం:
10/10/2018 6:28 am
చక్కని వ్యాసం. ఆలోచింపజేసింది. కొలిచాల సురేష్ గారు, గణపతిని ఇప్పుడు అందరూ ముందుగా కొలిచే ఆచారం ఒకప్పుడు లేదని ఎన్నో తార్కాణాలతో విశదీకరించారు. కాలక్రమేణా నమ్మకాలు మారి కొత్తపద్ధతులు పురాణాలలో చేరిపోయాయి. ఏమైనప్పటికీ, వినాయకుడిని తొలిదేవుడిగా మలచడం ఒక అద్భుతమైన సృజనాత్మకత.
ఐతే, శుక్లాంబర ధరం.. శ్లోకం తరువాత కొందరు చదివే
అగజానన పద్మార్కం గజాననమహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే
అన్న శ్లోకాన్ని ఎక్కడా ఎందుకు ప్రస్తావించలేదో?
ది సర్జ్ గురించి పూడూరి రాజిరెడ్డి అభిప్రాయం:
10/09/2018 5:03 am
లైలా యెర్నేని గారూ,
మీతో నాకు ఇదే పరిచయం. ఈ కథ బాగుంది. కథ ఏముంది అయినా? ముందైతే వ్యాసం రాయబోయి కథ రాశారేమో అనిపించింది, ముఖ్యంగా ఆ పుస్తకాల వివరాల దగ్గర. అయినా మొత్తంగా కథనం బాగుంది. ఎంత బాగుందంటే మీరింకా ఏం రాశారా అని వెనక్కి వెళ్లాను. అప్పుడే ‘లింఫోమా’, ‘ఎవరో’ కథలు చదివేశాను కూడా. అవి ఇంకా ఎక్కువ నచ్చాయి. ముందు ఇవి అనువాద కథలై ఉంటాయా అని పొరబడ్డాను. మూల రచయిత్రి ఎవరైనా ఉన్నారా అని స్పెల్లింగులు మారుస్తూ ఎన్నో కాంబినేషన్లలోనో వెతికాను. Nisi Shawl పేరొకటి వస్తోంది కూడా. కానీ తర్వాత బెజవాడ, తెలుగు ప్రస్తావనలు వస్తున్నకొద్దీ నిసి మీ కల్పనా విశేషం అని అర్థమైంది. అదే పేరెందుకు? నిసి డైరీలో ఇంకా బోలెడన్ని పేజీలు చదువుకోవడానికి ఉన్నాయని నాకు ఉత్సాహంగా ఉంది. అన్నట్టూ, ముందటి నా ఆరోపణ, ‘వ్యాసం రాయబోయి’ని ఉపసంహరించుకుంటున్నా.
శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 24 గురించి ramarao alla అభిప్రాయం:
10/09/2018 5:02 am
శ్రీశ్రీ పదబంద ప్రహేళిక 24 కు సరిచూడు బొత్తాము లేదు గమనించ గలరు.
[సరి చేశాము. తప్పు చూపినందుకు కృతజ్ఞతలు- సం.]
బలిసిన మేకను పట్టుకుంటాను గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
10/09/2018 3:19 am
ప్రియమైన శ్రీ దంతుర్తి శర్మ గారు,
అమెరికా / కెనడా లాంటి దేశంలోకి కొత్తగా వచ్చే వలసదారులకి ఇమ్మిగ్రేషన్ నార్మ్స్, మోరల్ & ఎథికల్ బెహేవియర్ గురించి కలిగించే అవగాహన గురించి చక్కగా తెలియజేసారు. ధన్యవాదాలు.
కాని అంత మాత్రాన్నే అప్పాదురై ముత్తులింగంగారు రాసిన “బలిసిన మేకను పట్టుకుంటాను“ కథలో జరిగిన సంఘటన లాంటి వాటిని పూర్తిగా నివారించగలిగాయా అనేది ప్రశ్న.
కథలో శ్రీలంక నుండి ( ?? ) కెనడా వలసవచ్చిన గణేశరత్నం పాత్ర మనో వేదనే నాకు కనిపించింది. తను కావాలని ఏ సందర్భంలో కూడా అసభ్యంగా కాని, అవినీతిగా కాని ప్రవర్తించినట్లు కనిపించలేదు. రాళ్ళు మోసి అయినా తన కుటుంబాన్ని పోషించుకోవాలని తపిస్తున్న ఓ కాందిశీకుడి, ఓ వలసపక్షి ఆర్తనాదం ఇందులో నాకు వినిపిస్తోంది. మానవ నైజాలు, పరిస్థితుల ప్రభావాలు, బలహీనతలు వంటివాటిని రచయిత చిత్రీకరించారే కాని పనికట్టుకుని వాటిని సమర్థిస్తూ రాసినట్లు ఎక్కడా కనిపించలేదే. మానవ దౌర్భల్యాలనూ, ఉద్రేకాలను రెచ్చగొట్టే ప్రయత్నం ఎక్కడైనా కనిపించిందా?
అన్నమయ సంకీర్తనల అభిమాని, అమాయక చక్రవర్తి అని తన మిత్రులు అభిమానంగా పిలుచుకునే అవినేని భాస్కర్ యీ కథను అనువదించారంటేనే దానికో విశిష్టత ఉన్నట్లు నాకనిపించింది.
ఇలాంటి కథను ఏ సోమర్సెట్ మాం కాని, ఏ హెమింగ్వే కాని, ఏ నబకోవ్ కాని, మరే గొప్ప రచయిత కాని రాసినా ఆ రచయితను ఇంతలా తూలనాడుతూ పాఠకులు స్పందిస్తారా అని నాకు ఓ చిన్న అనుమానం కలుగుతోంది. తప్పుగా అనుకోకండి.
3వ కాలిఫోర్నియా సాహితీ సదస్సు – ఒక పరిచయం గురించి SATYA SAI VISSA అభిప్రాయం:
10/09/2018 1:49 am
అయ్యా నమస్కారం! ఈ 3వ కాలిఫోర్నియా సాహితీ సదస్సు యొక్క ముఖ్యమైన అంశాలైన రామాయణ కల్పవృక్షం శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారి శైలిపై ఉపన్యాసాలు వంటివి దృశ్య, శ్రావ్య మాధ్యమ రూపాల్లో ఉన్న లింకులు కొన్ని ఇక్కడ ఇస్తే బాగుండేదండి. వీలయితే ఇచ్చి తెలియపరచగలరు.
భవదీయుడు
సత్యసాయి విస్సా
హైద్రాబాదు.
బలిసిన మేకను పట్టుకుంటాను గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
10/08/2018 4:33 pm
మూల కథకుడు ఎన్నో దేశాలు చూసివుండొచ్చు కాని అక్కడి జీవితాల గురించి ఏమాత్రం తెలుసుకోలేకపొయాడనేది స్పష్టంగా చూపుతోందీ కథ. కాకుంటే అతను తనకెన్నో దేశాలు చూసిన పరిజ్ఞానం ఉందని చెప్పుకుని పాఠకుల్ని మోసం చెయ్యటంలో విజయం సాధించి వుండొచ్చు. ఈకథకో సంకలనానికో బహుమతులు కూడ వచ్చివుండొచ్చు. ఇలాటి వాళ్లకి కూడ కథకులుగా గుర్తింపు రావటం (లేకుంటే దీన్ని అనువదించి వుండేవారు కారని నా assumption; అది తప్పైతే, ‘ఇంత చెత్త కథలు కూడ రాసేవాళ్లున్నారు’ అని చెప్పటానికి దీన్ని అనువదించి వుంటే అనువాదకులు అభినందనీయులు) దౌర్భాగ్యం.
ఈమాటలో రాదగ్గది కాదు ఈ కథ.
విశ్వనాథ కథన కౌశలం: రచయిత్రితో ముఖాముఖి గురించి yaddanapudi kameswari అభిప్రాయం:
10/08/2018 12:58 pm
త:త: గారికి,
జయసింహ చిత్రానికి విశ్వనాథ సత్యనారాయణగారి వీరపూజ మూలమన్నది అవాస్తవమండి. చిత్రపు టైటిల్స్^లో కూడా పేర్కొనలేదు. వారి కుటుంబసభ్యులను అడిగితే కాపీ కావచ్చును. హక్కులు ఇవ్వలేదు అని అన్నారు. వికీపీడియాలో ఈ విషయమై పరిశీలిస్తే ఈక్రింది విధంగా ఉన్నది. “The story of this film is loosely based on Viswanatha Satyanarayana’s novel Veerapuja. However his name is not credited in the titles.”
అహం బ్రహ్మాస్మి గురించి సాహిత్ అభిప్రాయం:
10/08/2018 11:57 am
కథ చదువుతుంటే కళ్లముందు సజీవ చిత్రంలా తెలిసిన పాత్రల్లా కదలాడుతున్నాయి. శైలి బాగుంది.
ఏకవీర నవలకు, నవలానాయికకు ఆ పేరే ఎందుకు? గురించి వీరభద్రం అభిప్రాయం:
10/08/2018 10:56 am
సంస్కృత మహాభారతములో కూడా ఈ పాముకు పేరున్నట్టు లేదు.