పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16458

  1. ఒక మరిచిపోలేని వాక్యం గురించి nagamurali అభిప్రాయం:

    11/01/2018 8:05 am

    చాలా సామాన్యంగా కనపడే ఒకే ఒక్క వాక్యం ఎంత చరిత్రని కళ్ళకి కట్టించింది!!

    నేనొకసారి యాదృచ్ఛికంగా ఎవరితోనో అన్న మాటని నాకు మళ్ళీ గుర్తు చేసింది.

    చిన్నప్పుడు మా ఊళ్ళో ఉదయాన్నే, పరికిణీ ఓణీలు వేసుకుని, పువ్వులు పెట్టుకుని, ఆడపిల్లలు గుంపులు గుంపులుగా సైకిళ్ళమీద టైప్ ఇన్ స్టిట్యూట్లకి వెడుతూ కనిపించేవారు, ఇప్పుడు ఆ దృశ్యమే మాయమైపోయింది – అని.

    ఇరవై, ముప్ఫై ఏళ్ళ క్రితం మనసులో ముద్రించుకున్న కొన్ని చిత్రాల్ని తవ్వి తీస్తే, ఎంత మార్పు, ఎంత చరిత్ర కనిపిస్తుంది!!

  2. పుస్తక పరిచయం: అడవి నుండి అడవికి గురించి Kotnana Simhachalam Naidu అభిప్రాయం:

    11/01/2018 7:25 am

    ఈ సమీక్ష చదివాక అభినందనలు ఎవరికి చెప్పాలి అని సందేహం కలిగింది… అడవి పూలు పూస్తే గాలి పుప్పొడి మోసుకొచ్చినట్టు మీరు జయతి గారి అన్వేషణకు అర్థం చెప్పే ప్రయత్నం చేసారు….నిజానికి తన మనసుకు నచ్చినట్టు అడవులు, పల్లెలు, వాగులు, వంకలు తిరిగి ఒక స్వేచ్ఛా విహంగంలా ఎక్కడ నచ్చితే అక్కడ వాలి తనకు అనిపించినవి తనను అలరించినవి కూర్చి పెట్టినట్టుంది ఈ అడవి నుండి అడవికి లో……పుస్తకం త్వరగా చదవాలని ఊరించినట్టుగా ఉంది… పరవా లేదు…అమృతం రావటానికి చాల సమయం పడుతుంది….అప్పుడే జయతి మనసులో మాట ఆమె అన్వేషణకు అర్థం మనకు తెలుస్తాయి.

    నిజానికి ఈ పుస్తకం నా మనసుకు చాల దగ్గరగ ఉంది….అర్థ రాత్రి పన్నెండు గంటల వరకు నాగావళి ఏటి మధ్యలో వెన్నెల్లో ఇసుక దిబ్బల మీద కూర్చుని తెల్ల వారక పొతే బాగుంటుంది అనుకునే వాడిని…

    కొండ రాళ్ల పక్కన వేప చెట్టు నీడలో కూర్చుని పిలవటానికి ఎవరు రాక పొతే బాగుణ్ణు అనుకునే వాడిని…

    ఇలా ఎన్నో….అనుభూతులు….అనుభవాలు…ఎందరి ప్రయాణాలకో ఆనవాళ్లు ….

  3. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ రేడియో ప్రసంగం గురించి Dr. Y. Kameswari అభిప్రాయం:

    11/01/2018 3:36 am

    ఎంత మంచి ప్రసంగం వినిపించారు. ఆ అన్నమాచార్య పదం ఎన్నడూ విన్నది కాదు. ధన్యవాదాలు . మిగిలిన ప్రసంగాలకోసం ఎదురుచూస్తాను.

  4. గడినుడి – 25 గురించి Amarendra Dasari అభిప్రాయం:

    11/01/2018 2:15 am

    భలే!! ఈ ప్రయోగం దా నికదే సరి.

  5. కేనాపారా గురించి Amarendra Dasari అభిప్రాయం:

    11/01/2018 2:06 am

    ఈ రచనకు కేంద్ర బిందువు పూర్ణ ఫోటో పెట్టమని రచయితకు విజ్ఞప్తి.

  6. నవంబర్ 2018 గురించి Amarendra Dasari అభిప్రాయం:

    11/01/2018 1:27 am

    ఇరవై యేళ్ళు… ప్రమాణాలతో… రాజీ లేకుండా… Not a small thing! Congrats to all those associated with ఈమాట.

  7. కేనాపారా గురించి Amarendra Dasari అభిప్రాయం:

    11/01/2018 1:17 am

    మనిషి మూలాలు శోధించే రచనా శకలం… ఫోటోలు బావున్నాయి.

  8. గజేంద్ర మోక్షం: వెక్కిళ్ళ పురాణం గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    10/31/2018 3:01 pm

    నేను ఇంతకుముందు వరకు ఈ కథని వినలేదు – ఈ చివరి అభిప్రాయం చూశాక కుతూహలం కలిగి విన్నాను. తర్వాత మిగిలిన అభిప్రాయాలు కూడ చదివాను.

    కొందరు పాఠకులు గోరంతని కొండంతలు చేస్తూ, సైకాలజిస్టుల వేషాలేసుకుని మరీ రచయిత్రి దీన్ని రాయటం వెనకున్న దురాలోచనల్ని పసిగట్టి కసిపెట్టి ఉతికి ఆరేశామని అనుకోవటం చూశాను.

    ఎవరో ఒకరు ఏదో చిన్న ప్రయోగాత్మక కథ, అదీ ఒక మాదిరి కథ, రాసినంత మాత్రానే పోతన గారి భాగవతం అపహాస్యం పాలౌతుందని భావించే ఈ మహానుభావులకి భాగవతం మీద ఎంత గాఢనమ్మకమో అర్థం ఔతూనే వుంది వారి ఆవేశం బట్టి. ఒకరు భాగవతంతో సమానంగా రాస్తే కాని దాని జోలికి వెళ్లకూడదని రచయిత్రి మీదికి ఒంటికాలిపై లేచారు కూడ. ‘కాపీ – పేస్ట్ ‘ ఎంత తేలికో సెలవిచ్చిన వారు తాము చేసిన కాపీ-పేస్ట్ లో ఎన్ని తప్పులు చేశారో ఒకసారి చూసుకుంటే కాపీ-పేస్ట్ కూడ అంత తేలిక కాదని వారికే అర్థం ఔతుంది. ఈ రెంటిలోనూ తప్పులున్నయ్ – గమనించండి :

    “మంధ దండాయమాన మంధర వసుంధరాధర పరిభ్రమణ వేగ వియన్మండల సుధారాసి కల్లోల శీకారాకార భాసుర కేసరుండును…”

    “సత్వరితాకంపిత భూమిచక్రము మహోద్యద్విస్ఫులింగఛ్ఛటా పరిభూతాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండ భాండఛ్ఛటాంతర నిర్వక్రము బాలితాఖిల సుధాంశ్చక్రమున్ జక్రమున్…”

    మీకు నిజంగా తెలుగు సాహిత్యాన్నీ సంస్కృతినీ నిలబెట్టాలనే దీక్షే వుంటే వాటిని బాగా చదవండి, అర్థం చేసుకోండి, ముందు తరాలు వాటిని గుర్తుంచుకోవటానికి మీరు చెయ్యగలిగిన కృషి చెయ్యండి – ముందు మీ పిల్లలు, పిల్లల పిల్లల్తో మొదలుపెట్టి.

    పోతన గారు ఎవరో తెలియని వారు వారి భాగవతం మీద ఎవరో రాసిన ఏదో వ్యాసం వల్లో కథ వల్లో చెడిపోయి మన సంస్కృతినీ సాహిత్యాన్నీ మంటగలిపెయ్యరు. ఆ పోతన గారు ఎవరో ఆయన చేసిన గొప్పపని ఏమిటో ముందు వాళ్లకి తెలియాలి కదా ! మీరు ఆవేశంగా పేస్ట్ చేసిన పద్యాలు మీ ఇంట్లో ఎవరికైనా కంఠతా వచ్చేట్లు చేస్తే అప్పుడు మీరు పోతన గారి ఋణం తీర్చుకున్నట్టు, ఒక రచయిత్రి రాసిన ప్రసిద్ధ కథ చదివి ఉత్సాహపడి తెలుగువారికి ఆ విధానాన్ని పరిచయం చేద్దామని చిరుప్రయత్నం చేసిన వారిమీద మీ కుహనా విద్వత్ప్రతాపజ్వాలలు కురిపిస్తే కాదు. ఉతికాం, ఆరేశాం అని జబ్బులు చరుచుకుంటే అసలే కాదు.

    ఇది ఏ ఒక్కరినీ ఉద్దేశించింది కాదు, కత్తులు నూరుతున్న అందరినీ.

  9. గడినుడి – 24 గురించి Rama Rao Alla అభిప్రాయం:

    10/31/2018 12:19 am

    ఆర్యా

    చాలా సహనంతో సందేహాలు తీర్చినందుకు ధన్యవాదములు

    భవదీయుడు

    రామారావు ఆళ్ళ

  10. గజేంద్ర మోక్షం: వెక్కిళ్ళ పురాణం గురించి శ్రీ అయ్యగారి నాగేంద్రకుమార్ అభిప్రాయం:

    10/30/2018 9:41 pm

    ఇది ఆధ్యాత్మిక సాహిత్యాన్నీ, అందులో తెలుగువారికత్యంత ఇష్టమైన పోతన భాగవతాన్నీ.. అంతే కాదు, భగవంతునియందు ఆర్తి కలిగినవాళ్లనీ, పోతననూ, కిఞ్చపరచే ప్రయత్నం సుస్పష్టం. ఇది సరదాకో హాస్యానికో వాడే వస్తువుకాదు తరించడానికుపయోగపడేవస్తువు. రచయిత, సంపాదకులు సమర్థించుకోవడం ఏమాత్రమూ అంగీకారమూ, క్షమార్హమూకాదు.