పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. మా అమ్మంటే నాకిష్టం! గురించి kothapalli ravibabu అభిప్రాయం:

    12/05/2018 12:47 pm

    చాలామందికి స్వానుభవమైన సంఘటనలతో నిండిన శబ్దచిత్రం. మిగిలిన కథలు కూదా వెంటనే చదవాలనిపిస్తోంది.

  2. అనేక రామాయణాలు: పునర్నిర్మాణాలు, ప్రతి నిర్మాణాలు – శూర్పణఖ ఉదంతం గురించి Bhaskar Kompella అభిప్రాయం:

    12/05/2018 10:58 am

    Dear Ramayya garu, Greetings!

    Thank you for introducing Ms. Satyavathi garu. I admire here abilities after knowing about her. We need such thinkers and writers.

    However, my question was about the evidence provided for the statement made. I want to read the arguments that substantiate the statement.

    regards
    Bhaskar

  3. మా అమ్మంటే నాకిష్టం! గురించి P c s Reddy అభిప్రాయం:

    12/05/2018 2:20 am

    ఈ కథ చదవడం మొదలుపెట్టాను. నా బాల్యం గుర్తుకు వచ్చింది. కొంత చదివాక నవ్వొచ్చింది. కామిడీ కథ అనిపించింది. ఈ కథకి “చెడ్డి రాస్కెల్” అని పేరు పెడితే బాగుండేది అనిపించింది. కానీ తరువాత చదువుతూ వుంటే చాలా బాధ కలిగింది. హృదయం ద్రవించింది. కండ్లల్లో నీళ్లు తిరిగాయి. తిరగడమే కాదు. ప్రస్తుతం మా అమ్మ అక్క దగ్గర వుంది ఇంచుమించు అదే పరిస్థితి. కానీ అమ్మకు మాత్రం తెలియదు.

    ఒకే విషయం పై నవ్వించి ఏడిపించ గలగడం అసామాన్యం.

    చంద్ర శేఖర రెడ్డి.
    9391305249.
    9848605279

  4. అనేక రామాయణాలు: పునర్నిర్మాణాలు, ప్రతి నిర్మాణాలు – శూర్పణఖ ఉదంతం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    12/04/2018 10:48 pm

    ప్రియమైన కొంపెల్ల భాస్కర్ గారు!

    స్త్రీవాద రచయితలలో అగ్రగణ్యురాలు బెజవాడ పి. సత్యవతి అక్కయ్య గారు.

    స్త్రీని, ఆమె ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకొని మనసును తాకి, మెదడును మేల్కొలిపే రచనలు (ఎంతో సమ్యమనంతో) రాస్తారు అని పేరొందారు కదా. (తన వాదనకు అడ్డొస్తే శ్రీశ్రీ, కొ.కు. నాయన, పురాణం సుబ్రహ్మణ్య శర్మ గార్లనైనా దులిపేసే మా మరో అక్కలా కాదు తను). గుడిపాటి చలం, కొ.కు. నాయన, చక్రపాణి, త్రిపురనేని గోపిచంద్‌, ఆలూరు బైరాగి, జి.వి. కృష్ణారావు, హితశ్రీ, సంజీవదేవ్, శారద లాంటి వాళ్లనెందరినో మనకిచ్చిన తెనాలి ప్రాంత సాంసృతికిక, సాహిత్య వారసురాలు మన సత్యవతి అక్కయ్య.

    స్వేచ్చ పేరిట, సమానత్వం పేరిట అనైతికతను, విశృంఖలతను పాటించవచ్చు అని పాఠకులకు (స్రీలకు కాని, పురుషులకు కాని) చెప్పే వారు కాదు అక్కయ్య.

    కాని వారు రాసిన యీ క్రింది వాదనను ఎదిరించి చూపగల ప్రతివాదన నాశక్తికి మించిన పని.

    “తరచూ చెప్పే ఒక సూక్తి ప్రకారం ఒక స్త్రీ బాల్యంలో తండ్రి అదుపులో వుంటూ రక్షణ పొందాలి. అట్లాగే యౌవ్వనంలో భర్తను, వార్ధక్యంలో కుమారుడిని అనుసరిస్తూ రక్షణ పొందాలి. స్త్రీకి స్వతంత్రంగా జీవించే అర్హత లేదు.(మను స్మృతి V.147 IX.3) అలాగని మంచి స్త్రీ ఎప్పుడూ ఆబల కాదు. శక్తిహీనురాలు కాదు. ఆమె శక్తిస్వరూపిణి. ఒక మాటలో చెప్పాలంటే ఆమె పవిత్రతా, సంరక్షణ స్వభావాలే ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. కానీ, పురుషస్వామ్య సమాజ లక్ష్యాలను కాపాడుకోవాలంటే ఆమె శక్తిని అదుపులో వుంచాలి. ఆమె లైంగిక వాంఛలు భర్త ద్వారా కేవలం సంతానోత్పత్తి కోసమే తీర్చుకోవాలి. అది ఆమె ధర్మం. సాంస్కృతిక కోణంలోనుంచి చూసినట్లయితే, స్త్రీల లైంగికత పట్ల హిందూ వైఖరి, మంచి-చెడు, పవిత్రత-అపవిత్రత, శుభము-అశుభము, అనే ద్వంద్వాల మధ్య వుండే సంబంధం అర్థమౌతుంది”.

  5. పాతికేళ్ళ ప్రేమకథ గురించి Amarendra Dasari అభిప్రాయం:

    12/04/2018 9:30 pm

    భావనారాయణ గారూ, ఆల్టర్నేట్ నంబర్ 9493504746. ప్రయత్నించండి.

  6. అనేక రామాయణాలు: పునర్నిర్మాణాలు, ప్రతి నిర్మాణాలు – శూర్పణఖ ఉదంతం గురించి Bhaskar Kompella అభిప్రాయం:

    12/04/2018 8:39 pm

    రామయ్యగారూ!
    అది ప్రస్తుత పరిశోధనాంశానికి ముఖ్యమైన విషయం కాదు గాబట్టి అనిర్ధారితమైన దేశకాల సమాచారాన్ని ప్రచురించకపోవడమే మంచిది. కాని, ఈ తెగని సమస్యల పట్ల మన రచయితలకి ఎందుకో మక్కువ ఎక్కువ.
    -BK

  7. మా అమ్మంటే నాకిష్టం! గురించి మహేంద్ర కుమార్ అభిప్రాయం:

    12/04/2018 7:05 pm

    ధారణీయ, ఆధారణీయ, వేగాలు అని శరీర క్రియల్లో ఉన్నాయి. తుమ్ము, దగ్గు, ఆవలింతల్లాగా అపాన వాయువు, మల మూత్రాదులను పరిగణించే విద్యను అలవర్చుకోవడం (సంస్కారం,కామన్ సెన్స్) అవసరం. అంతగా స్పృశించని టాపిక్‌ని అలవోకగా ఫాబ్రికేట్ చేశారు వసుధేంద్ర గారు. అనువాదకులకు ధన్యవాదాలు.

  8. నేనొక చిత్రమైన చిక్కుముడి: 2. ఆలోచనను ఆలోచిస్తున్న ఆలోచన గురించి కామేశ్వరరావు అభిప్రాయం:

    12/04/2018 12:46 pm

    Thank you very much for your valuable comment Ramarao garu. రాబోయే వ్యాసాలలో మీ సూచనలను తప్పక దృష్టిలో ఉంచుకుంటాను. ఈ డైలాగుని సిసలైన డైలాగుగా పదనుపెట్టేందుకు ‘నేను’ మరికాస్త కృషి చెయ్యాలి! :-))

  9. మా అమ్మంటే నాకిష్టం! గురించి యాళ్ల అచ్యుతరామయ్య అభిప్రాయం:

    12/04/2018 8:34 am

    గుండెల్ని పిండేసిస కథ! మూల రచయితకు, అనువాద రచయితకు అభినందనలు.

  10. నేనొక చిత్రమైన చిక్కుముడి: 2. ఆలోచనను ఆలోచిస్తున్న ఆలోచన గురించి Ramarao Kanneganti అభిప్రాయం:

    12/04/2018 7:44 am

    Really nice way of explaining. We should ask others how much they understood. Perhaps taking just one concept and beating it to death may make it palatable to folks who think of it as mathematics (whereas it is in the nexus of language, philosophy, and even literature).

    Perhaps, this dialogue can be diluted (it covers several topics) focusing on just one topic at a time and explained as a series to people. And, this kind of dialogue is a wonderful way of exposition. However, it was just one sided. Check out Proofs and Refutations by Imre Lakatos, where he arrives at progressively better answers through dialogue between three students and a professor. A definition offered. A question raised. The definition is amended or new definition is made.

    Make it a series!

    Recursion and fixed point — a way of explaining recursion (self reference through computation) is the gift of Tarski. And, if we reject law of excluded middle, it not only leads to True, False, Neither, and also unknown (addressing another paradox of Russell — teapot). It goes to Intuitionism and constructive mathematics, which to me can be related to our literature and life very nicely… I will stop here.

    Thanks again,
    Excitedly yours.