పాఠకుల అభిప్రాయాలలో, దేశికాచారి గారు ఇక్కడ ఇచ్చిన పద్యం నన్ను ఆనందపరచింది. అందువల్ల రాస్తున్నాను.
“(…) compelling poem is one that has already set itself to music” a part of closing line of a chapter in James Longenbach’s in his book “How poems get made.”
దేశికాచారి గారిచ్చిన పంక్తులు నాకు అలా వినిపించాయి. పద్యం అసంపూర్తిగా ఉంటేనేం అక్కడికే నన్ను రంజించాయి.
ఈ సంచికలోనే ‘పటాభి కవిత్వం’ గురించి మనకు తెలుపుతూ, అతని కవిత్వాన్ని నిరసించినవారు పురాతన పద్యకవిత్వానికి అలవాటు పడి ఉన్నందున వారికి అసహనత కలిగిందని, విమర్శకులు వాడ్రేవు పినవీరభద్రుడు ఒక అభిప్రాయం వెలిబుచ్చారు. పినవీరభద్రుడుగారి సాహిత్య విమర్శలు నాకు బాగుంటాయి. దేశికాచారి అటువంటి బయాస్ కి లోనైనారా? ఆయన అంటున్నమాటలు నిజమేనా? అని మేగజీన్ లో పైనిచ్చిన “కిరాతి ఖడ్గాన్నోయ్” అన్న రచన చదివాను. అప్పుడు నాకు దేశికాచారి గారిచ్చిన పద్యం ఇంకా నచ్చింది. “Poem’s insight or information may be shockingly relevant…” అని మొదలయిన జేమ్స్ వాక్యం తోచి మళ్లీ నవ్వించింది.
ఇంతకీ, మొత్తానికి తన వాక్యంలో జేమ్స్ ఉద్దేశం, పద్యంలోని సమాచారం ఎంత నిజమైనా, దాని ఆకర్షణ శక్తి పంక్తిలోని సంగీతం నుండే వస్తుందని. ఐతే, ‘పద్యంలోని సంగీతం’ అంటే ఏమిటి? అని తెలుసుకోటానికి, ‘song’ అన్న chapter మాత్రమే కాకుండా, Diction, Syntax, Voice, Figure, Rhythm, Echo, Image, Repetition, Tone, Prose, Poetry, అన్న ఛాప్టర్లన్నీ, -అంటే మొత్తం పుస్తకం చదవాలి.
I finished reading James Longenbach’s book. Now I am enjoying a book by Ellen Bryant Voigt – “The art of syntax.”
ఈ రచయిత్రికి సంగీతమూ వచ్చు. కవిత్వమూ వచ్చు. ఆమెను చదువుతూ, కవిత్వానికి, భాషకు సంబంధించిన ప్రత్యేకమైన మాటలను మర్యాదగా అప్పటికప్పుడు డిక్షనరీలో చూసి, తెలుసుకుంటూ మరీ చదువుతున్నాను.
As I am reading these books on poetry, I am also reading/cross referencing – Borges on writing, Two of Bernstein’s books on Music, I am revise-reading couple of chapters from books on Beethoven, And Mahler, which discuss usage of poetry in some of their symphonies.
పై వీరందరి మూలానా – కవి సమయాలు తమకి గిట్టక పోయినా, ఏ సందర్భాలలో మనోరంజకంగా ఉండేదీ; రెలిజన్ తమకి ఎంతమాత్రమూ నచ్చకపోయినా ఎవరి కవిత్వంలో దైవం సాక్షాత్కరించేదీ; సరస్వతిని, కాళి ని తలిచి జడిపించినంత మాత్రాన ప్రతి రాత పొయెట్రీ అవదనీ; ఓయ్, కోయ్ అని నోటికొచ్చిందల్లా అనేస్తే verse Libre కాదనీ; meter కీ rhythm కీ ఉన్న అంతరాలు, poetic Form కీ poetic Structure కీ ఉన్న తేడాలు, కవిత్వ వాక్యాలలో చిన్న చిన్న syllabic groups, పెద్ద పెద్ద phrases మధ్య తగువుల ఆకర్షణలు; ఈ విషయాలు చక్కగా స్పృహ లోకి వస్తున్నయ్యి.
కవిత్వం జడత్వం లేకుండా మారుతూ ఉన్నందుకూ, శతాబ్దాల మీద మారిన, రకరకాల అందమైన కవిత్వాలు పై పుస్తకాలలో చదివగలుగుతున్నందుకూ నాకు సంతోషం కలిగింది.
ఎమర్సన్ -ఉత్తమకళను గ్రహించగలిగిన విజ్ఞులు ప్రపంచంలో అసంఖ్యాకంగా ఉంటారు, కానీ ఎప్పటికీ కళాకారుల సంఖ్య బహుతక్కువేనని అంటాడు. ఐతే ఏం పోయె, ఎప్పటికప్పుడు కొందరైనా ఉంటున్నారు కదా, చాలు.
ఇంతకీ దేశికాచారిగారిచ్చిన పద్యమెవరిదో! అది వారు రచించినదా? అది నాకు తెలియదు.
Lyla
ధర్మోదకాలు
గురించి తుమరాడ నరసింహ మూర్తి అభిప్రాయం:
07/22/2019
9:13 am
అనిల్ అట్లూరి గారికి, రాఘవ గారికి, సంతోష్ గారికి, గుంటూరు శ్రీనివాస రామకృష్ణ గారికి ధన్యవాదాలు. రామకృష్ణ గారు రాసిన మాటలతో మరీ కడుపు నిండిపోయింది. 🙂
ధర్మోదకాలు
గురించి గుంటూరు శ్రీనివాస రామకృష్ణ అభిప్రాయం:
07/20/2019
9:05 pm
కమ్మటి కథ చదివాను. అభినందనలు.
దిక్కుమాలిన కథలు చూసీ చూసీ విసుగెత్తి, చాలా కాలంగా కథలు చదవడమే మానేశాను.
కాకతాళీయంగా ఈ వెబ్ సైటుకొచ్చాను. మీ కథ నాకు మంచి అనుభూతినిచ్చింది. ధన్యవాదాలు.
నా వయస్సు అరవై నాలుగు. మధ్యలో నావయస్సు ప్రసక్తి ఎందుకొచ్చిందీ అంటే, గత యాభై అయిదు సంవత్సరాలలో చాలానే చదివాను గనుక, మంచి కథ చదివితే పొందే ఆనందమూ, తృప్తీ అనుభవించినవాడినని చెప్పటం కోసమే.
బిక్ష ఇచ్చేవారుంటేనే సన్యాసులు మనగలరు.
బిక్ష ఇవ్వటానికి గృహస్థులుండాలి. నేల దున్ని పంట పండించాలి. ఆతనికి తన ఇంట్లో అన్ని విధాలా తోడ్పడటానికి, వండి వడ్డించటానికి ఇల్లాలు ఉండాలి. వారిద్దరిని వృద్ధాప్యంలో కనిపెట్టుకుని చూసుకోవటానికి వారికి పిల్లలుండాలి.
అందరూ సన్యాసులైతే మానవ సమాజమే అంతరించిపోదా?
నీ ‘సరస్వతి తల్లి’ బొమ్మ బాగుంది. పోతే ఒక అభిమాన పాఠకుడిగా నీ కధల పరిచయం కూడా బాగుంది. పుస్తకం ఎక్కడ దొరుకుతుందో చెబితే బాగుండేది. పరవాలేదులే, నేను చెబుతాను. చి న
శ్రీనాథుని చాటుపద్యములు గురించి Acharya Dr.Sudhakar Rao, MD అభిప్రాయం:
07/23/2019 1:51 pm
ఈ పద్యం శ్రీనాథుడిదదేనా అన్న సంశయం:
ప్రౌఢి పరికింప సంస్కృత భాష యండ్రు
పలుకు నుడిగారము ఆంధ్ర భాష యండ్రు,
ఎవ్వరేమనుకున్న నాకేమి కొరత,
నా కవిత్వము నిజము కర్ణాట భాష.
ఇది భీమేశ్వర పురాణం లోనిదా, లేక ఆల్లసాని పెద్దన గారిదా?
కృతజ్ఞడను
సుధాకరరావు
కిరాతి ఖడ్గాన్నోయ్ గురించి Lyla yerneni అభిప్రాయం:
07/22/2019 12:34 pm
పాఠకుల అభిప్రాయాలలో, దేశికాచారి గారు ఇక్కడ ఇచ్చిన పద్యం నన్ను ఆనందపరచింది. అందువల్ల రాస్తున్నాను.
“(…) compelling poem is one that has already set itself to music” a part of closing line of a chapter in James Longenbach’s in his book “How poems get made.”
దేశికాచారి గారిచ్చిన పంక్తులు నాకు అలా వినిపించాయి. పద్యం అసంపూర్తిగా ఉంటేనేం అక్కడికే నన్ను రంజించాయి.
ఈ సంచికలోనే ‘పటాభి కవిత్వం’ గురించి మనకు తెలుపుతూ, అతని కవిత్వాన్ని నిరసించినవారు పురాతన పద్యకవిత్వానికి అలవాటు పడి ఉన్నందున వారికి అసహనత కలిగిందని, విమర్శకులు వాడ్రేవు పినవీరభద్రుడు ఒక అభిప్రాయం వెలిబుచ్చారు. పినవీరభద్రుడుగారి సాహిత్య విమర్శలు నాకు బాగుంటాయి. దేశికాచారి అటువంటి బయాస్ కి లోనైనారా? ఆయన అంటున్నమాటలు నిజమేనా? అని మేగజీన్ లో పైనిచ్చిన “కిరాతి ఖడ్గాన్నోయ్” అన్న రచన చదివాను. అప్పుడు నాకు దేశికాచారి గారిచ్చిన పద్యం ఇంకా నచ్చింది. “Poem’s insight or information may be shockingly relevant…” అని మొదలయిన జేమ్స్ వాక్యం తోచి మళ్లీ నవ్వించింది.
ఇంతకీ, మొత్తానికి తన వాక్యంలో జేమ్స్ ఉద్దేశం, పద్యంలోని సమాచారం ఎంత నిజమైనా, దాని ఆకర్షణ శక్తి పంక్తిలోని సంగీతం నుండే వస్తుందని. ఐతే, ‘పద్యంలోని సంగీతం’ అంటే ఏమిటి? అని తెలుసుకోటానికి, ‘song’ అన్న chapter మాత్రమే కాకుండా, Diction, Syntax, Voice, Figure, Rhythm, Echo, Image, Repetition, Tone, Prose, Poetry, అన్న ఛాప్టర్లన్నీ, -అంటే మొత్తం పుస్తకం చదవాలి.
I finished reading James Longenbach’s book. Now I am enjoying a book by Ellen Bryant Voigt – “The art of syntax.”
ఈ రచయిత్రికి సంగీతమూ వచ్చు. కవిత్వమూ వచ్చు. ఆమెను చదువుతూ, కవిత్వానికి, భాషకు సంబంధించిన ప్రత్యేకమైన మాటలను మర్యాదగా అప్పటికప్పుడు డిక్షనరీలో చూసి, తెలుసుకుంటూ మరీ చదువుతున్నాను.
As I am reading these books on poetry, I am also reading/cross referencing – Borges on writing, Two of Bernstein’s books on Music, I am revise-reading couple of chapters from books on Beethoven, And Mahler, which discuss usage of poetry in some of their symphonies.
పై వీరందరి మూలానా – కవి సమయాలు తమకి గిట్టక పోయినా, ఏ సందర్భాలలో మనోరంజకంగా ఉండేదీ; రెలిజన్ తమకి ఎంతమాత్రమూ నచ్చకపోయినా ఎవరి కవిత్వంలో దైవం సాక్షాత్కరించేదీ; సరస్వతిని, కాళి ని తలిచి జడిపించినంత మాత్రాన ప్రతి రాత పొయెట్రీ అవదనీ; ఓయ్, కోయ్ అని నోటికొచ్చిందల్లా అనేస్తే verse Libre కాదనీ; meter కీ rhythm కీ ఉన్న అంతరాలు, poetic Form కీ poetic Structure కీ ఉన్న తేడాలు, కవిత్వ వాక్యాలలో చిన్న చిన్న syllabic groups, పెద్ద పెద్ద phrases మధ్య తగువుల ఆకర్షణలు; ఈ విషయాలు చక్కగా స్పృహ లోకి వస్తున్నయ్యి.
కవిత్వం జడత్వం లేకుండా మారుతూ ఉన్నందుకూ, శతాబ్దాల మీద మారిన, రకరకాల అందమైన కవిత్వాలు పై పుస్తకాలలో చదివగలుగుతున్నందుకూ నాకు సంతోషం కలిగింది.
ఎమర్సన్ -ఉత్తమకళను గ్రహించగలిగిన విజ్ఞులు ప్రపంచంలో అసంఖ్యాకంగా ఉంటారు, కానీ ఎప్పటికీ కళాకారుల సంఖ్య బహుతక్కువేనని అంటాడు. ఐతే ఏం పోయె, ఎప్పటికప్పుడు కొందరైనా ఉంటున్నారు కదా, చాలు.
ఇంతకీ దేశికాచారిగారిచ్చిన పద్యమెవరిదో! అది వారు రచించినదా? అది నాకు తెలియదు.
Lyla
ధర్మోదకాలు గురించి తుమరాడ నరసింహ మూర్తి అభిప్రాయం:
07/22/2019 9:13 am
అనిల్ అట్లూరి గారికి, రాఘవ గారికి, సంతోష్ గారికి, గుంటూరు శ్రీనివాస రామకృష్ణ గారికి ధన్యవాదాలు. రామకృష్ణ గారు రాసిన మాటలతో మరీ కడుపు నిండిపోయింది. 🙂
ధర్మోదకాలు గురించి గుంటూరు శ్రీనివాస రామకృష్ణ అభిప్రాయం:
07/20/2019 9:05 pm
కమ్మటి కథ చదివాను. అభినందనలు.
దిక్కుమాలిన కథలు చూసీ చూసీ విసుగెత్తి, చాలా కాలంగా కథలు చదవడమే మానేశాను.
కాకతాళీయంగా ఈ వెబ్ సైటుకొచ్చాను. మీ కథ నాకు మంచి అనుభూతినిచ్చింది. ధన్యవాదాలు.
నా వయస్సు అరవై నాలుగు. మధ్యలో నావయస్సు ప్రసక్తి ఎందుకొచ్చిందీ అంటే, గత యాభై అయిదు సంవత్సరాలలో చాలానే చదివాను గనుక, మంచి కథ చదివితే పొందే ఆనందమూ, తృప్తీ అనుభవించినవాడినని చెప్పటం కోసమే.
మరోసారి అభినందనలు.
ధర్మోదకాలు గురించి సంతోష్ అభిప్రాయం:
07/19/2019 5:12 am
చాలా బాగుంది
సంస్కృతాంగ్లాల మధ్య నలుగుతూన్న తెలుగు గురించి లక్కంట జగన్ అభిప్రాయం:
07/18/2019 8:40 am
మంచి వివరాలు తెలిపారు గురువులు
మన భాషలో అంకెలు, సంఖ్యలు గురించి లక్కంట జగన్ అభిప్రాయం:
07/18/2019 8:23 am
అంకెలకు సంబంధించిన వివరాలు చాలా బాగా వివరించారు.
కొన్ని కథలు వినిపిస్తా, వింటావా? గురించి సిద్దు అభిప్రాయం:
07/17/2019 10:59 am
ఏమని చెప్పను …. మీ రచన చమత్కారం …మా మనసు దాసొహం ఐయ్యింది…..
సౌందర్యం గురించి CBS Venkataramana అభిప్రాయం:
07/17/2019 9:33 am
బిక్ష ఇచ్చేవారుంటేనే సన్యాసులు మనగలరు.
బిక్ష ఇవ్వటానికి గృహస్థులుండాలి. నేల దున్ని పంట పండించాలి. ఆతనికి తన ఇంట్లో అన్ని విధాలా తోడ్పడటానికి, వండి వడ్డించటానికి ఇల్లాలు ఉండాలి. వారిద్దరిని వృద్ధాప్యంలో కనిపెట్టుకుని చూసుకోవటానికి వారికి పిల్లలుండాలి.
అందరూ సన్యాసులైతే మానవ సమాజమే అంతరించిపోదా?
కొన్ని కథలు వినిపిస్తా, వింటావా? గురించి Anil అట్లూరి అభిప్రాయం:
07/16/2019 8:27 pm
నీ ‘సరస్వతి తల్లి’ బొమ్మ బాగుంది. పోతే ఒక అభిమాన పాఠకుడిగా నీ కధల పరిచయం కూడా బాగుంది. పుస్తకం ఎక్కడ దొరుకుతుందో చెబితే బాగుండేది. పరవాలేదులే, నేను చెబుతాను. చి న
పుస్తకం కావల్సిన వారికి ప్రచురణకర్త చిరునామా.
Visalandhra Publishing House,
33-22-2, Chandram Buildings,
Chuttugunta, Vijayawada 520 004
Ph: 0866 – 243 0302
email: vphpublish@gmail.com
Price Rs: 270.00
You could also find it online here and buy:
https://www.telugubooks.in/products/satyavathi-kathalu?_pos=1&_sid=dd3ab0090&_ss=r