పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. మూడు ఆత్మకథలు: 1. మంచీ మర్యాదా గురించి కె.వి.గిరిధరరావు అభిప్రాయం:

    08/01/2019 1:15 pm

    ఒకరకంగా నాకిలాంటి అనుభవమే ఎదురైంది.
    కొన్నేళ్ళ క్రితం కాస్ట్కొలో, కొనబోయే వస్తువుల బండితో లైన్లో నుంచున్నాను. నా వెనక ఉన్నతని బండిలో ఒక వస్తువే ఉంది. పైగా వయసులో చాలా పెద్దాయన. నా బండి నిండుగా కొనబోయే వస్తువులున్నాయి.
    ఒక వస్తువు కొనే అతన్ని ముందు వెళ్ళమన్నాను.
    అతను ‘ఆర్యూ షూర్?’ అని నా కన్ఫర్మ్ చేసుకుని, వరసలో నా ముందుకు వెళ్ళాడు. అతని వెనకున్నతను నన్ను దాటి వరసలో ముందుకు వెళ్ళాడు. ‘ఎందుకలా?’ అన్న నా ప్రశ్నార్ధకపు మొహానికి ‘నేను అతని వెనక వున్నాను. అతని తర్వాత వంతు నాదే’ అని చెప్పాడు. చెప్పినదాంట్లో తర్కం వుందనిపించింది. అతన్ని, అతని వెనకున్న మరొక తర్కవేత్తను(ఇక్కడ వ్యంగ్యం లేదు) వెళ్ళనిచ్చి తర్వాత నేను వెళ్ళాను.
    పాఠం బాగా అర్థమైంది.
    అప్పట్నుంచి ఏ వరసలోనైనా నాస్థానాన్ని మరొకరికి త్యాగం చెయ్యలేదు!

  2. మూడు ఆత్మకథలు: 1. మంచీ మర్యాదా గురించి Lyla yerneni అభిప్రాయం:

    08/01/2019 9:53 am

    They just stepped out of their cars into the parking lot of that small shopping mall, around the same time. As they were walking towards the ATM they both appraised each other, quickly, about their age, sex, race, wealth, their hometowns, based on their appearances, make of their cars, license plates, without making each other aware.
    The parking lot is nearly empty. There isn’t a person around.
    They both more or less reached the door to the ATM – which is in an enclosed corridor of a building – at the same time. The man purposely reached the door sooner, so he can open the heavy door for her.
    She said Good morning! And thank you! – With a smile.
    He silently let her pass thru. Inside, she stepped aside, with a small gesture of hand indicating he should go first to the machine.
    He didn’t.
    She said – I can’t put you at disadvantage twice in a row. It is not fair.
    He said – I can’t be half a gentleman. I may as well be all the way.
    She laughed out loud and finished her ATM withdrawal fast and went back to her car.

    (The true episode written out – only to say a friendly Hi to పూడూరి రాజిరెడ్డిగారు.)

  3. నాకు నచ్చిన పద్యం: అభినవ పోతన అభివ్యక్తి సొగసు గురించి జ్ఞానేశ్వర్ అభిప్రాయం:

    07/31/2019 9:48 am

    సార్ నమస్కారం మీ వివరణ లు చాలా బాగున్నాయి మాలాంటి నేటి యువతరానికి భాషాభిమానులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి దయచేసి ఒక విన్నపం మీరు ప్రతి పద్యాన్ని ఆడియో రూపంలో కూడా అందిస్తే బాగుంటుంది వేలవేల నమస్కారాలతో దయచేసి ఆడియో కూడా అందించండి

  4. తెలుగు భాష వయస్సెంత? గురించి జయశ్రీ అల్లు అభిప్రాయం:

    07/30/2019 1:19 am

    చక్కటి వివరణాత్మకమైన వ్యాసం. ధన్యవాదములు సురేష్ గారు

  5. ధర్మోదకాలు గురించి Prem Sagar అభిప్రాయం:

    07/27/2019 2:56 am

    ఎన్నో కథలు చదివిన నాకు ఈ కథ కథలా లేదు! ఆన్ని సీన్స్ కళ్ళ ముందు ఆడుతున్నాయి! Wonderful expression at every stage!Complete originality. Pl. accept my heartfelt congratulations. pl.keep it up.

  6. గడినుడి – 33 గురించి Rama Rao Alla అభిప్రాయం:

    07/27/2019 1:45 am

    సరిచూపు సౌకర్యం కలిగించగలరు.

    [ సరిచూపు సౌకర్యం సచేతనం చేసినాము. — సం.]

  7. కొడుకుల శివరాం భాగవత గానం గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    07/26/2019 11:07 pm

    సుప్రసిద్ధ సాహితీమూర్తి శ్రీ ఇంద్రకంటి శ్రీకాంత శర్మ జూలై 25, 2019 న హైదరాబాద్ లో కన్నుమూసారు! పైన ఇచ్చిన పోతనగారి పద్యాల్లో ఒకటైన “కుప్పించి ఎగసిన…” పద్యం ఆధారంగా ప్రముఖ చిత్రకారుడు బాపు ఇంట్లో గోడకు ఒక చిత్రపటం ఉండేదిట!

    దాన్ని సమీక్షిస్తూ శ్రీ ఇంద్రకంటి ” ఈ బొమ్మ వేయాలంటే శ్రీకృష్ణుడు ఒక్కడూ తెలిస్తే చాలదు! భీష్ముడూ తెలియాలి. పోతనా తెలియాలి. కవిత్వం పేరిట అక్షరాలు, వాక్యాలు, శిల్పమే కాక, కవుల మనసును చదవగలిగే బాపు మాత్రమే వేయగల బొమ్మ అది” అని వ్యాఖ్యానించారు!

    శ్రీ ఇంద్రకంటి ధన్యజీవి అనటానికి ఇంతకన్న సాక్ష్యాలు ఏం కావాలి?

    ( ఈ మాటలు మళ్ళీ గుర్తు తెచ్చిన శ్రీ ఎర్రాప్రగడ రామకృష్ణ గారికి కృతజ్ఞతలతో)

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  8. పెరటి తలుపు గురించి శశిధర్ పింగళి అభిప్రాయం:

    07/24/2019 2:18 pm

    చాలా బాగుంది.

  9. ధర్మోదకాలు గురించి శశిధర్ పింగళి అభిప్రాయం:

    07/24/2019 1:53 pm

    చక్కటి కథ, మంచి అనుభూతినిచ్చింది.

  10. కిరాతి ఖడ్గాన్నోయ్‌ గురించి Indrani Palaparthy అభిప్రాయం:

    07/24/2019 12:51 pm

    దేశికాచారి గారికి, లైలా గారికి-

    మీ విలువైన సూచనలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.🙏వాటిని దృష్టిలో ఉంచుకుని, నా కవిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి మున్ముందు ప్రయత్నిస్తాను.

    పాలపర్తి ఇంద్రాణి.