పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. ద్వంద్వాలు గురించి సాంఘిక అభిప్రాయం:

    10/31/2019 8:35 pm

    ప్రకృతి, వైరాగ్యం మిళితం చేయ్యడం బాగుంది!

  2. తెలుగు సినిమా పాటకి సుతీ మతీ లేవా? గురించి సాంఘిక అభిప్రాయం:

    10/31/2019 8:28 pm

    I read this article only today. Noted the broad criteria used for analysis and conclusions. Telugu film lyricists world is dominated by male for decades and it still is the case to date. Female lyricist voice is absent in the Telugu film industry and the entry seems extremely difficulty. Talking about ప్రేమ – it was always the male perspective. If female are to write the lyrics, I would think that సుతీ మతీ would be significantly different!?

    Perhaps the three authors come together one more time to review as a follow up?

    Enjoyed reading the article and the comments. Thank you.

  3. పఠాభి కవిత్వం: మళ్ళీ కొత్తగా కొన్ని ఆలోచనలు గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    10/27/2019 12:46 am

    కొంత ఆలస్యంగా చదివినా ఆలోచింపజేసే వ్యాసం చదివానన్న భావన కలిగింది. విశ్వనాథ పఠాభిని అర్థం చేసుకున్నట్టుగా ఇతర సాహితీవిమర్శకులు అర్థం చేసుకోలేదని అనటం కూడ చాలా వరకు సమంజసంగానే అనిపించింది. పఠాభి, ముఖ్యంగా ఫిడేలు రాగాల డజన్ లో అప్పటివరకు వున్న కవిసమయాల్ని చించిచెండాడాడనేది ఇప్పుడు మనకు ఆశ్చర్యంగా అనిపించకపోవచ్చు గాని అప్పటి విమర్శకులు ఎక్కువమంది ఆ రచనలకి ప్రేరకాలు, కారణాలు అన్వేషిస్తూ రకరకాల నిర్హేతుక ప్రతిపాదనలు చెయ్యటం వాస్తవం, చినవీరభద్రుడు గారు అలాటి చాలా ప్రతిపాదనల్ని ఇక్కడ ప్రస్తావించారు కూడ.

    ఐతే, నాకు రెండు విషయాల్లో ఈ వ్యాసం అసంపూర్ణంగా అనిపించింది. ఒకటి – విశ్వనాథ ప్రతిపాదనకి, తను చేస్తున్న ‘గ్రోటెస్క్’ అన్న ప్రతిపాదనకి సంబంధం వివరించకపోవటం, రెండు – అసలు గ్రోటెస్క్ లిటరెచర్ అంటే ఏమిటో, పఠాభి రచనలు ఆ కోవలోకి ఎందుకు వస్తాయో వివరించక పోవటం.

    ఆన్ లైన్ లో వెదగ్గా కనిపించిన అనేక చోట్లలో, ఈ కిందిది నాకు ‘గ్రోటెస్క్ లిటరెచర్‘కి మంచి క్లుప్తమైన వివరణలా అనిపించింది – The Grotesque is both an artistic and literary term, and is a bit difficult to describe, as it is less of a solid definition, and more of a range between a number of different qualities. The Grotesque is primarily concerned about the distortion and transgression of boundaries,be they physical boundaries between two objects, psychological boundaries, or anything in between. Exaggeration also plays a role.

    There are two main ways to define something as Grotesque, as evidenced by the diagrams: The Grotesque fits in between the real and the fantastic (non-real). The Grotesque simultaneously fits somewhere between being funny and being frightening. (This is a bit more difficult to gauge, as what is funny to one person is frightening to another, so maintaining a bit of an open mind is helpful).

    వ్యాసకర్త ‘డిస్టార్షన్’గురించి చాలా చెప్పారు కాని గ్రొటెస్క్ గురించి అంతగా మాట్లాడలేదు ఎందుకో మరి. అలాగే వారు చెప్పిన డిస్టార్షన్ కూడ పైన వివరణలో చెప్పిన సరిహద్దుల డిస్టార్షన్ కాదు. ఆ వివరణలో వున్న రెండు లక్షణాల గురించి ఎలాటి ప్రసక్తి కూడ రాలేదు. ఇక విశ్వనాథ ప్రతిపాదనకీ ఈ వ్యాసకర్త చెప్పిన డిస్టార్షన్ కీ సంబంధం గురించి ఒక్క ముక్క కనిపించదు.

    నాకు వారితో ప్రత్యక్ష పరిచయం లేదుకాని చినవీరభద్రుడు గారు పేరున్న సాహితీ విమర్శకులని విన్నాను. వారు ఎలాటి పాఠకులని ఉద్దేశించి ఈ వ్యాసం రాశారో కూడ తెలియదు (నేననుకుంటున్నది ఇంకెక్కడో ప్రచురితమైన వ్యాసాన్ని ఇక్కడ పునఃప్రచురించారని). కనుక వారు ఈ పత్రికని చూస్తే వారికి నా మనవి – వారి దృష్టిలో గ్రొటెస్క్ కవిత్వం ఏమిటో, ఆ భావానికి విశ్వనాథ ప్రతిపాదనకి సంబంధం ఏమిటో, సామాన్యంగా గ్రొటెస్క్ రచన అనే పదానికి వున్న డెఫినిషన్ కి వారిది భిన్నమైతే ఎందుకు అలా చేయవలసివచ్చిందో కొంతైనా వివరిస్తే ఇంకా సంతృప్తికరంగా వుంటుందని. కవిత్వానికి తర్కం అక్కరలేదు గాని సాహిత్యవిమర్శకి తర్కం అత్యవసరమని నమ్మే నా లాటి వారికి మార్మికత కన్న తార్కికత ఉంటే బాగుంటుందని.

  4. చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 3 గురించి Bolloju Baba అభిప్రాయం:

    10/27/2019 12:42 am

    Wonderful analysis sir. Saving it. Thank you

  5. త్యాగరాజయ్య సాహిత్యము: సాహిత్యమును వెనుకకు నెట్టి నూతన సృష్టి చేసిన త్యాగయ్య గానప్రతిభ గురించి lyla yerneni అభిప్రాయం:

    10/26/2019 7:03 pm

    త్యాగరాజు పట్ల వీరి అభిమానం, ఇతరులపై preconceptions ఈ మొదటి paragraphsలో కనిపిస్తున్నాయి.

    అటువంటిదేమీ లేదు. ఒకరిని గురించి చెప్పాలంటే మరో ఇద్దరో ముగ్గురో ‘సమ ఉజ్జీల’ గురించి ప్రస్తావించాల్సి వస్తుంది. అప్పుడు ఎవరో ఒకరిని తక్కువ చేసినట్టు, కొందరికి అనిపిస్తుంది.

    ధర్మరాజు, భీముడు, అర్జునుడు – అవటానికి అందరూ ఇంద్రులే. కాని వారిలో ఎంతెంత తేడాలు! ఎవరు ఎక్కువ తక్కువ కాకపోయినా, ఆ తేడాలబట్టి, మనలో ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇష్టులవుతారు.

    ఒకప్పుడు కవిత్రయం కన్నా, నాచన సోముడు గొప్పవాడని కొందరు పండితులకు అమాంతంగా ఎందుకో అతని మీద ప్రేమ పుట్టుకు వస్తే, ఎందుకు కాదో రాళ్లపల్లి రచనల్లో చెప్పారు. నేను చదివిన రెండు వ్యాసాలలో ఆయన మాటలలో -సోమన దూషణ నాకు కనిపించలేదు. పొగడ్త కూడా కనిపించలేదు. నాచన సోమన రచనాస్వభావపు విశ్లేషణ ఎంతో బాగా చేసారు అనిపించింది. రాళ్లపల్లి రచనలో హాస్య ప్రియత్వం ఉంటుంది. He has an inner laughter.

    త్యాగరాజుపై ఈ వ్యాసం నాకు నచ్చింది. చాలాసార్లు చదివాను. ‘త్యాగయ్య గారి నాద సుధారసం’ అన్న వ్యాసం (ఉపన్యాసం) కూడా చాలా బాగున్నది. అందులో త్యాగరాజు -రామభక్తి, కవిత, గానం, ఈ మూడింటి తత్త్వం గురించి రాళ్లపల్లి ఆలోచనలు ఎంత వివరంగా ఉన్నవో. ఆ వ్యాసం రాయటం ఇంకా కష్టం అనిపిస్తుంది. రెండు వ్యాసాలూ ఒకదాని వెంట మరోటి చదవాలి. అదింకా మంచిపని.

    ఆ మరో వ్యాసం చివరలో రాళ్లపల్లి ఇలా అన్నారు. “..కవిత్వం రసింపగలిగితే తెలుగు తెలిసిన వారానందిస్తారు. కాని త్యాగయ్య గారి నాద సుధ దొరికితే – హిందువులే కాదు మనుష్యజాతే తరించి పోతుంది..” ఇంకా బాగా లేదూ! కాని ఆ నాదసుధ కూడా కొంతలో కొంత అది భారతీయతతో ముడిపడి ఉంది.

    ఏమైనా, వినగా వినగా; ‘పాలారగించరా’ అనో ‘తులసీదళములతో’ అనో, వాగ్గేయకారుడు కవిత్వం రాస్తే, సంగీతపు సంగతులు వేస్తే, అవి వేరే మథన, వేరే రసన; అంతేకాని విగ్రహాలమీద కడవలతో పాలు పొయ్యటం, తులసి ఆకులు తుంపుకు వచ్చి నెత్తినో కాళ్లమీదో ఉంచటం మాత్రం ఈ కవిత్వపు, సంగీతపు ఉద్దేశం కాదు, అని అంతమట్టుకైనా నాకు తెలిసింది. అది తెలియనివాళ్లు, ఆ మరో విధమైన తెలుగుతనం, భారతీయత గలవాళ్లు ఇప్పటికీ లక్షలు.

    -Lyla

  6. త్యాగరాజయ్య సాహిత్యము: సాహిత్యమును వెనుకకు నెట్టి నూతన సృష్టి చేసిన త్యాగయ్య గానప్రతిభ గురించి తః తః అభిప్రాయం:

    10/24/2019 5:37 am

    శ్రీ ఆఖిల్ ఇలా అన్నారు:

    ఆర్ద్రతలో శ్యామశాస్త్రిగారిని మించినవారు లేరు. త్యాగరాజువారు తత్వం చెప్పారు, అలంకారాలు వేసారు, ఎన్నో ప్రయోగాలు చేశారు. … ముత్తుస్వామి దీక్షితార్ వారి విషయానికి వచ్చేసరికి, యావత్ దేశం వినగలిగే సాహిత్యం …”

    మీరు మూడు ముక్కలలో కర్ణాటక సంగీత త్రిమూర్తుల గురించి చాలా చక్కగా చెప్పారు. త్యాగరాజు, “మరచే వాడనా” అంటూ మొదలు పెట్టి “రాని నీ దయ మరచే వాడనా” అంటూ ముగించటం వంటి చమత్కారాలు గూడా చేసారు.

    ‘త్యాగరాజు తత్వం చెప్పారు’ అన్నారే, నా మటుకు నేను ఈ వాగ్గేయకారుల్లో thought content అంటూ ఉన్నది ఒక్క త్యాగరాజు వారికే అని అనుకుంటాను. ఈ మధ్యన మళ్ళీ “శ్రీ నీలోత్పల నాయికే”, శ్రీ దుం దుర్గే” వింటున్న నాకు శ్రీశంకరులవారు గూడా అమ్మ వారిని ఇంత అందమైన మాటల కూర్పుతో కొలవ లేదనిపించింది. దీక్షితార్ వారి గురించి మీరన్న ‘యావత్ దేశం వినగలిగే సాహిత్యం’ అన్న మాట ఎంతో ఆనందాన్ని కలగచేసింది.

    నమస్కారాలతో – తః తః

  7. కర్త కర్మ క్రియ గురించి Bheem rao అభిప్రాయం:

    10/19/2019 7:10 am

    స్టోరీ చాలా బాగుంది.

  8. నిండైన జీవితం గురించి సుందర్ అభిప్రాయం:

    10/16/2019 4:49 pm

    ఇంద్రగంటి గారూ, ధన్యవాదాలు. కొన్ని కథలు చదవడానికి అవకాశం కలిగింది.

    కృతజ్ఞతలు

  9. నిండైన జీవితం గురించి ఇంతి పేరు ఇంద్రగంటి అభిప్రాయం:

    10/16/2019 3:52 pm

    అబ్బూరి ఛాయాదేవిగారి రచనలు కొన్ని ఆన్‌లైనులో చదవవచ్చు.
    కథానిలయంలో అబ్బూరి ఛాయాదేవి కథలు
    డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో అబ్బూరి ఛాయాదేవి కథలు

    — ఇంతి పేరు ఇంద్రగంటి
    ఆశ్వయుజ బహుళ తదియ, వికారి

  10. నిండైన జీవితం గురించి Sundar Manthravadi అభిప్రాయం:

    10/16/2019 7:50 am

    సత్యవతిగారూ,
    చక్కటి వ్యాసం రాసారు. ఛాయాదేవిగారి రచనలు ఇప్పుడు ఎక్కడ లభ్యం అవుతాయో తెలపగలరా? నేను తెలుగు సాహిత్యం కొంత చదివినా ఛాయాదేవిగారి కథలు ఒకటో రెండో తప్ప చదవలేదు. నేను లండన్ నివాసిని. ధన్యవాదాలు.
    సుందర్