పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. థాయ్‌లాండ్ యాత్రాగాథ – 4 గురించి Amarendra అభిప్రాయం:

    11/11/2019 4:38 pm

    కల్యాణిగారూ, ఇలాంటి ‘ఉక్రోషాలే’ నాలాంటివాళ్లకు ప్రాణవాయువులు… many thanks!

  2. థాయ్‌లాండ్ యాత్రాగాథ-1 గురించి Amarendra అభిప్రాయం:

    11/11/2019 4:35 pm

    Thank you Raju garu… మీ వ్యాఖ్య నాకు కొత్త శక్తి ఇస్తోంది!!

  3. మరొకసారి గంగ నేలకు దిగింది గురించి lyla yerneni అభిప్రాయం:

    11/10/2019 1:47 pm

    వాడ్రేవు ఈ పత్రికలో ప్రచురించిన రచనలు నేను ఆసక్తితో చదువుతాను. ఈ ‘ముందు మాట’ చదువుకోటానికి బాగుంది. “కాళీ పదములు” అన్న కవితా సంకలనానికి ఈయన ఈ ముందుమాట రచించారు. వ్రాసిన తీరు నింపాదిగా, అనేక విషయాలు సేకరించి, పరిశీలించినదిగా ఉంది.

    ఐతే, అంతా చదివిన తర్వాత, ఈ కవితలకు పరిచయాన్ని రామకృష్ణుని జీవిత చరిత్ర ప్రస్తావన, ఆయన భగవంతుని గురించి బోధనో, పాటో, -ఆ కొటేషన్స్‌తో ఎందుకు మొదలు పెట్టారో తెలియదు. ముందే తెలియక్కర్లేదు కాని, ఎప్పటికో ఒకసారి, కనీసం చిట్టచివరికన్నా తెలియాలి కదా?

    బెంగాల్ లో ఉద్భవించిన కాళి భక్తి, అందుకు సంబంధించిన వంగ సాహిత్యావతరణ, విదేశీయ రీసెర్చ్ స్కాలర్స్ రచనలు- ఈ అంశాలు ఇంటరెస్టింగ్‌గా ఉన్నై. అందుకు అవి ‘నిజం’ ఐ ఉండాల్సిన అవసరం కూడా లేదు. రెలిజియస్ ఐకాన్స్, భక్తి, మతం, సంబంధించిన పరిశోధనలలో నిజమేమిటి? అబద్ధమేమిటి?

    సరే, కవితల పుస్తకమా అంటే తెలుగు కవిత్వపు పుస్తకం. పుస్తక ప్రచురణ విజయవాడలో. రిలీజ్ విజయవాడలో. రచయిత్రి కూడా చిన్నప్పుడు విజయవాడ (బెజవాడ) లో ఉండి వచ్చినట్టున్నారు. మరి ఆమె పుస్తకానికి ముందుమాటగా బెంగాలీ కాళీ ప్రసక్తి ఎలావచ్చింది? బెజవాడలో ఇంటి వెనకాల కొండమీద గుడిలో వెలసిన కనకదుర్గమ్మ -కాళి కాదా? కాని ఆ దేవత, ఆమె చరిత్ర, ఆమెపై భక్తి సాహిత్యం ఉందో లేదో విమర్శకులు ఎత్తనే లేదు. మరి బెజవాడ దుర్గ ఎలా ఉద్భవించిందో, బెంగాలీ కాళి, బెజవాడ కాళి ఒకరో కారో, అలాటి సంగతులు ఈ ముందుమాట రాసినవారు చెప్పనే లేదు. చెప్పమని కాదు కాని, -ఈ కవితలలో బెజవాడ కాళిని కాదు, ఆ బెంగాలీ కాళిని తల్లిగా ఊహించి, ఈ కవయిత్రి స్మరిస్తున్నది సుమా, అని ముందుమాటలో మనకు స్పష్టం చేస్తున్నారా అని నా సందేహం. ఒకవేళ రచయిత్రి గాని బెంగాల్లో ఉండి, కలకత్తా కాళిపై గాని బెంగాలీ భక్తి సాహిత్యంపై గాని ఆసక్తి జనించి కవితలు రాసారా? ఈ ముందుమాటలోని బెంగాలీ సాహిత్యానికి, ఈ రచయిత్రి కవిత్వానికీ ఉన్న లింక్ ఏమిటో తెలియటం లేదు. ఈ పత్రికలోనే ప్రచురించబడిన ‘కాళీ పదాలు’ కవితలు కొంచెం కూడా ఆ సందేహాన్ని నివారణ చెయ్యలేదు.

    కవయిత్రిని, ‘మరొకసారి గంగ నేలకు దిగింది’ లాటి ఇమోషనల్ పదజాలంతో అభినందిస్తూ వాడ్రేవు ఆకస్మికంగా తనే కవి ఐపోటం కొంచెం తబ్బిబ్బు కలిగించింది. గంగావతరణం కథ బాగానే చదివిన నాకు ఆ మాటలు ఆయన వాడటంలో కూడా ఆయన చెప్పదలచిందేమిటో తెలియలేదు.

    ఈ కవితల పుస్తకానికి ఆయనను ముందుమాట రాయమని అభ్యర్ధించిన వారికి, ఏవో సాహిత్యపరమైన కారణాలు ఉండే ఉంటాయి. అడిగిందెవరైనాగాని, కవయిత్రి అనుమతి లేకుండా, ప్రచురణకర్తలు, ఆమె కవితల సంకలనానికి వీరి ముందుమాటను జోడించరు కదా. ఈ ముందుమాటకు, కవితలకు అసలు జోడీ ఏదీ?

    -Lyla

  4. ఒక సంస్కారవంతమైన కథ గురించి MURALIKRISHNA అభిప్రాయం:

    11/10/2019 11:59 am

    ఇంట్లో ఉన్న బూజు దులిపి కన్విన్స్ చేయలేనివాడు వదులుకున్న అమ్మాయ్ పొందు కోరడం, స్వార్థం కాదా?

    విసిగి వేసారి వద్దన్నవాడితో పొందు, వ్యక్తిత్వం వదులుకోవడం కాదా?

  5. థాయ్‌లాండ్ యాత్రాగాథ – 4 గురించి kalyani sj అభిప్రాయం:

    11/10/2019 1:05 am

    “మనమీద మనకే అసూయ కలిగేలాంటి అతి చక్కని సంధ్యాసమయం అది! తనివి తీరలేదే… ” క్లుప్తంగా ఈ వాక్యంలో నా మనసులోని భావాలన్నిటినీ చెప్పేశారు అమరేంద్రగారూ, ఇక ఏం చెప్పడానికీ నా దగ్గర పదాలు మిగలనంత బాగా చెప్పేశారని ఉక్రోషంగా ఉంది.

  6. నో-బుల్ బహుమతి గురించి Vasu అభిప్రాయం:

    11/09/2019 10:06 am

    అంతా యథాతథంగా బాగుంది, గానీ నోబెల్ అనే మాటను నో-బుల్ అని రాయడనికి కారణం నాకైతే అర్థమవలేదు. నేను మూలం చదవలేదు.
    -వాసు-

  7. ద్వాసుపర్ణా: అనువాద కవిత్వం గురించి Vasu అభిప్రాయం:

    11/08/2019 10:22 am

    ఈ అనువాదం వల్ల మూలంలో ఉన్న భావం తెలుగులో పాఠకుడికి అందదు. అందువల్ల, ఈ అనువాదాలు తెలుగు పాఠకుల కోసం, ప్రత్యేకించి కవిత్వాన్ని చదివే పాఠకుల కోసం చేశారనుకుంటే, ఈ పుస్తకం ప్రధాన లక్ష్యం సౌభాగ్య కవిత్వాన్ని తెలుగులోకి తీసుకురావడం కాకుండా, అతని కవిత్వాన్ని తెలుగులో, కవిత్వంగా అందజేయడం అయి ఉండాల్సింది.

    పైనున్న మాటల్లో సమీక్షకుల ఆంతర్యం నాకు పూర్తిగా అవగతం కాలేదు. వేలూరి గారు ఎంత పొరుగునున్న రాష్ట్రమైనా మరొక భాషకు చెందిన కవిని (అంటే వేరే సాహిత్య సంప్రదాయలూ, అభిరుచులూ గల ప్రజల మధ్యనున్న కవిని) అనువాదం చెయ్యడంలో ఎంత చెయ్యగలరో అంతా చేశారనే నాకు అనిపిస్తోంది. ఏ అనువాద కవితనైనా చదివిన వెంటనే అది అనువాదమన్న విషయం ఇట్టే తెలిసిపోతుంది. ఇక్కడ వెల్చేరు గారిని quote చెయ్యడమూ నాకు పూర్తిగా అందలేదు. ఇది నా అభిప్రాయం.

    -వాసు-

  8. ఇంతింతైన ఇల్లేరమ్మ గురించి Dr Mula Ravi Kumar అభిప్రాయం:

    11/08/2019 8:21 am

    ఇల్లేరమ్మగారి ఇంపాక్ట్ ఫేక్టర్
    By: Dr Mula Ravi Kumar, Asst. Professor, SV Veterinary University

    స్వర్గీయ డా. సోమరాజు సుశీలగారు (1945-2019) తెలుగు రచయిత్రిగా పెన్ను పట్టుకుందికి పాతికేళ్ళముందే రసాయనశాస్త్రవేత్త. తన యాబయ్యో ఏట రచయిత్రిగా కలం పట్టుకొని, రెండో పుస్తకంతో ఇల్లేరమ్మగా, తెలుగు ఇళ్ళలో స్థిరపడిపోయారు.

    ఆ రసాయన శాస్త్రవేత్త 1974లో ఆవిడ దురదృష్టం, మన అదృష్టం వల్ల చిన్నపరిశ్రమ పెట్టేరు. ఆవిడ దురదృష్టం ఎందుకంటే, భార్యాభర్తలు ఇద్దరూ శాస్త్రవేత్తలుగా ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ, ప్రభుత్వ డబ్బుతో పరిశోధనలు చేస్తూ, ఆ “ఫలితాలు నివేదించటానికి” విమాన ప్రయాణాలు, అప్పుడప్పుడూ విదేశ ప్రయాణాలు చెయ్యటం ఎంత హాయైన పని?

    అది వదిలి చిన్నపరిశ్రమ పెట్టటం వల్లే కదా ఆవిడలో పోరాట పటిమ మెరుగుపెట్టబడింది? అల్లకల్లోల సముద్రంలోనే నావికుడు రాటుదేలుతాడని ఇంగ్లీషు సామెత కూడా ఉందికదా? అలా, ఆ పాతికేళ్ళ చిన్నపరిశ్రమ కష్టం లేకపోతే ఆవిడలో వేదాంతి, రచయిత్రి, చమత్కారి కట్టకట్టుకొని ఆవిడ యాబయ్యో ఏట బయటపడేవారా? ఆవిడ ఉద్యోగం వదిలి ఉండకపోతే, ఈ ప్రతిభ అంతా శాస్త్రవేత్తల పాలయ్యేది. ఆవిడ కలం నుండి కేవలం పరిశోధనా వ్యాసాలు, ఓ కెమిస్ట్రీ పుస్తకం, మహా ఐతే తెలుగులో “నిత్యజీవితంలో రసాయనశాస్త్రం” అనే ఒక పుస్తకం వచ్చేవేమో.

    అంచేత ఈవిడా, డా రంగారావుగారూ నాయుడమ్మగారి స్పూర్తితో లక్షణమైన ప్రభుత్వ శాస్త్రవేత్త ఉద్యోగాలు వదులుకున్నప్పుడే తెలుగు లోగిళ్ళలో ఇల్లేరమ్మ గృహప్రవేశానికి భవిష్యత్తులో ముహూర్తం పెట్టబడింది, అని ఒక హేతువాదిగా నేను చెబుతున్నాను. ఆ ముహూర్తం పెట్టినది దేవుడే అని ఒక నాస్తికుడిగా చెబుతున్నాను. ఆవిడ శ్రమజీవి/ వేతనజీవి స్థాయి వదిలి పెట్టుబడిదారుగా మారడంలో గొప్ప సామాజిక ప్రయోజనముందని ఒక వామపక్షవాదిగా చెపుతున్నాను.

    ఇంతకీ ఈవ్యాసానికి “ప్రభావం” లాంటి లక్షణమైన తెలుగుపేర్లు వదిలి ఇంపాక్ట్ ఫేక్టర్ అనే అప్రాచ్యపు పదం (ప్రాచ్యం అంటే తూర్పు, అప్రాచ్యం అంటే పడమర, అంతే) ఎందుకు పెట్టానంటే, ఒక శాస్త్రవేత్త రాసిన పరిశోధనా పత్రాన్ని ఎంతమంది తమ ఇతర పరిశోధనల్లో ఉటంకిస్తారో, (లేదా) ఒక సైన్సు పత్రికలో పడ్డ వ్యాసానికి ఎంత ఎక్కువమంది చదివే అవకాశం ఉందో, దానిని ఇంపాక్ట్ ఫేక్టర్ అంటారు. ఉదాహరణకి నా పత్రం పదిమందీ, నా మిత్రుడి పత్రం వందమందీ ఉదహరిస్తే, అతడి ఇంపాక్ట్ ఫేక్టర్ నాకు పదింతలు. కవనశర్మగారి భాషలో చెప్పాలంటే నేను రాసిన కేజీ పేపర్ల బరువుకి అతడు రాసిన వందగ్రాములు సరిపోతాయి.

    ఇప్పుడు ఇల్లేరమ్మగారి ఇంపాక్ట్ ఫేక్టర్ రచయిత్రిగా ఎంతో చెప్పాలంటే శ్రీరమణగారి వాక్యం, దీపశిఖ ముందుమాటలో, “ఇంత స్వల్ప వ్యవధిలో ఇలా దూసుకురావడం మీద కొందరికి తీవ్ర అభ్యంతరాలున్నా…” శ్రీరమణగారి వాక్యం విశదీకరిస్తే, ఆవిడకన్నా పాతికేళ్ళ ముందు కలం పట్టుకొని, తమని తులాభారం తూచటానికి సరిపడా పుస్తకాలు రాసిపారేసి, రచనారంగంలో పరుగులు పెడుతున్నామనుకున్నవారిని ఒక్క అంగలోనే దాటేసి మూడో పుస్తకం నాటికే సీనియారిటీని తుంగలో తొక్కి ప్రముఖరచయిత్రి ఐపోయారు. నేను మాట్లాడేది ఆ ఇంపాక్ట్ గురించి కాదు.

    ఇల్లేరమ్మగారి గురించి అందరూ మాట్లాడుతారు కనుక కాసేపు ఆ “నిత్య బాలిక”ని పక్కనబెట్టి, “డా. సోమరాజు సుశీలగారి” ఇంపాక్ట్ ఫేక్టర్ చూద్దాం. ఆవిడ రాసిన చిన్నపరిశ్రమలూ పెద్దకథలూ నా మనసులో తిష్ట వేసేసింది. ఎంతగా అంటే, ఆ పుస్తకం యాబై కాపీలు (ఆవిడ ఎకౌంటులో బలవంతంగా డబ్బులు వేసి) కొని, నలుగురికీ పంచేంత. నా వృత్తిలో భాగంగా నన్ను కలిసేవారిలో కొంతమంది “పదేళ్ళు ఉద్యోగంచేసి కూడబెట్టిన డబ్బు”తో వ్యాపారం చేద్దామన్న సదుద్దేశ్యంతో, “ఏ యూనిట్ పెట్టుకోవచ్చంటారు?” అని నన్ను సలహా అడుగుతూ ఉంటారు (అందులో నా ప్రజ్ఞ కన్నా వారి భ్రమే ఎక్కువ). అలా వచ్చినవారికి ఈ పుస్తకం ఇచ్చి, అందులో కొన్ని పేరాలు అండర్‌లైన్ చేసి చూపించి, ఇవి ఒకటికి నాలుగుసార్లు చదువుకొని, ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా ఎదుర్కోవాలో నిర్ణయించుకొని అప్పుడు ముగ్గులోకి దిగమని హితవు చెబుతూ ఉంటాను. అలా, ఎంతమందిని రక్షించానో, లేదా ఎంతమందిని కోటీశ్వరులు కాకుండా అడ్డంపడ్డానో తెలీదు. మంచో చెడో, ఇంపాక్ట్ ఫేక్టర్ అంటే ఇంపాక్ట్ ఫేక్టరే.

    ఒకవేళ నన్ను కలిసేనాటికే చిన్న పరిశ్రమలు నడుపుతున్న వారి పరి-శ్రమ కష్టాలు విన్నప్పుడు వారికి ఒక కాపీ ఇస్తూ ఉంటాను. పుస్తకం చదివిన మర్నాడు నాకు ఫోను చేసి, సార్ ఈవిడెవరో గానీ, నేను పడుతున్న కష్టాలు ఎలా రాసేసారు అని ఆశ్చర్యపడిపోయి, ఈ పుస్తకం నీడలో ఓదార్పు పొందుతూ ఉంటారు.

    నేను పనిచేసిన పాడిపరిశ్రమ, పశువైద్యం నేపథ్యంలో రాసిన కథలకు స్పూర్తి ఎవరూ అంటే, ఒకటి, ముళ్ళకుర్చీలు రాసిన ఎలక్ట్రాన్ (పింగళి వెంకటరమణారావు గారు), రెండు, డా సోమరాజు సుశీలగారు.

    సోమరాజు సుశీలగారి భర్త డా రంగారావుగారు, నాకు తెలియకుండానే గొప్ప ఉపకారం చేసారు. అదేమిటంటే, మీది యాంత్రిక (మెకానికల్) స్వభావం, ఎమోషన్స్ లేవు, అని మా ఆవిడ అంటే, సోమరాజు సుశీలగారి పుస్తకాల్లో డా రంగారావుగారి గురించి వచ్చిన వాక్యాలు మా ఆవిడకి చూపించి, తాత్కలికంగా బయటపడుతూ ఉంటాను. ఈ మధ్య ఆవిడ రాసిన అత్తగారి జ్ఞాపకాలు చదివి, అలాంటి అత్తగారు దొరికినందుకు మీరు ఎక్కువ అదృష్టవంతులా, మీరు దొరికినందుకు ఆవిడా అని ఫేసుబుక్కులో అడిగితే, “మా ఇద్దరికన్నా మా ఆయన అదృష్టవంతులు” అన్నారు. ఎంత గొప్పనిజమో కదా!

    మరి అలాంటి ఆవిడ స్ఫూర్తితో నేను రాసిన చింతలవలస కథలు ఆవిడచేత (బలవంతంగానైనా) చదివించెయ్యకుండా ఎలా ఉండగలను? అదిగో, అప్పుడే ఆవిడ సహృదయతకి ప్రత్యక్షసాక్షిని.

    నా పుస్తకం పట్టుకొని ఆవిడ ఇంటికి వెళ్ళాను (2012 జూన్ అని గుర్తు). అదే రోజు కన్నెగంటి అనసూయగారి పుస్తక రిలీజ్ ఐతే అక్కడికి వెళుతున్నారు. పొత్తూరి విజయలక్ష్మిగారు ఆ కార్యక్రమంలో వేదికమీద ఉండాలి, వీరిద్దరూ కలిసివెళ్ళాలని అనుకున్నారుట. నేను వెళ్ళిన అరగంటలోనే వాళ్ళు బయలుదేరే సమయం. ఈ అరగంటలోనే నాకు వారి స్వగృహంలో ఉన్న ఆల్ఫాన్సో చెట్టు మామిడిపళ్ళు కోసి పెట్టారు. నేను ఆల్ఫాన్సో తిన్నది అదే మొదటిసారి. అంతలో పొత్తూరి విజయలక్ష్మిగారు వీరి ఇంటికి వచ్చి అదే కారులో కూకట్‌పల్లిలో పుస్తకావిష్కరణకి బయలుదేరారు. ఆవిడకి ఎంత సహృదయం లేకపోతే, ఆ రోజే చూసిన నాలాంటి అరటిక్కట్టు రచయితని తమతో కారులో తీసుకెళతారు. అందునా, మిగిలిన ముగ్గురూ నాకన్నా పాతిక ముప్పై ఏళ్ళ పెద్దవాళ్ళు. మూడో వ్యక్తి పొత్తూరి విజయలక్ష్మిగారి భర్త శివరావుగారు, రైల్వేలో పేద్దహోదాలో పదవీవిరమణ చేసినాయన.

    అలా అప్పుడు ఆవిడని మొదటిసారి కలిసాకా, ఎలాగైనా, మా ఆవిడకి కూడా సోమరాజు సుశీలగారిని చూపించాలి అని అనుకున్నాను. ఆవిడని పరిచయం చేద్దామని ఇల్లేరమ్మ కథలు చదివించాను. నేను చిన్నపరిశ్రమలు పుస్తకానికెంత అభిమానినో, మా ఆవిడ ఇల్లేరమ్మకి అంత అభిమాని అయిపోయింది. మా నివాసం రాజమండ్రి, ఇల్లేరమ్మగారిది హైదరాబాదూ అవటం వల్ల, 2012 నుండీ అనుకుంటూ ఉన్నా 2018లో మాత్రమే ఆ భాగ్యం దక్కింది. అప్పటికి రెండేళ్ళ ముందు నుంచీ ఆవిడ ఫేసుబుక్కులో ఉంటూ, అప్పుడప్పుడూ ఫోను చేసేస్తూ మీరు రాజమండ్రి ఎప్పుడొస్తారు, ఎప్పుడొస్తారు అని నెలకోసారైనా అడుగుతూ ఉంటే, మొత్తానికి క్రితం నవంబరులో వాళ్ళ తమ్ముడి రిటైర్మెంటు మరియు షష్టిపూర్తికి వస్తున్నానని చెప్పారు. వాళ్ళ తమ్ముడి ఇంటికి వెళ్ళి కలవడానికి అనుమతి తీసుకున్నాను. ఇల్లేరమ్మకథల్లో ఆఖరి కథలో, పుట్టి, పుట్టీపుట్టగానే తన నలుగురు అక్కలకీ భవిష్యత్తులో రావలసిన రెండెకరాలకూ గండికొట్టిన ఆ తమ్ముడిదే రిటైర్మెంటు. కరువు కథలో, ఏ కొడుకైతే గౌహతీ నుంచి నెలకోసారి రాసిన ఉత్తరాన్ని, మరో ఉత్తరం వచ్చే వరకూ వాళ్ళమ్మగారు భగవద్గీతలా పారాయణ చేసేవారో ఆ తమ్ముడే ఆయన. ఆయన పేరు కూడా రవి అని తెలిసి ఇంకా సంతోషించాను. ఆరోజు వాళ్ళు అన్నవరం వెళ్ళి, తిరిగి వచ్చేసరికి రాత్రి పది అయింది. రోజంతా ప్రయాణం చేసారు, అలసిపోయి ఉంటారు అనే మొహమాటం లేకుండా, వాళ్ళు రావటానికి అరగంట ముందు వాళ్ళింటిదగ్గర మాటువేసి మరీ వెళ్ళి తలుపు కొట్టేసాం. అలా బుద్ధిలేకుండా వచ్చేసారు అని విసుక్కుందికి ఆవిడ మామూలు గృహిణి కాదుకదా! ఇల్లేరమ్మగారు!! ఇలాంటివాళ్ళని ఎంతమందిని ఆవిడ విసుగుపడకుండా భరించారో గానీ, ఆవిడగాని, ఆవిడ తమ్ముడుగారు గాని మేమున్న అరగంటా మమ్మలిని పట్టుపట్టి పిలిచిన అతిథులకిచ్చేంత మర్యాదా ఇచ్చి మరీ మాట్లాడారు. ఆవిడ ఫేస్బుక్కులో రాసిన చిన్నప్పటి క్రిస్మస్ జ్ఞాపకాలు నేను ప్రస్తావిస్తే, ఆవిడైతే, తన పదో ఏట స్కూల్లో నేర్చుకున్న క్రిస్మసు పాటలు (తెలుగువి) పాడేసారు. ఆవిడా, ఆవిడ తమ్ముడూ, తమ్ముడి భార్యా మాతో అంత ఆదరంగా మాట్లాడ్డం నిజంగా మా అదృష్టమే. ఎందుకంటే, ఆ ఇంటి తలుపు కొట్టేముందు, మా ఆవిడతో, “మనం వాళ్ళని ఈ టైములో కలిసి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాం. ఆవిడ గాని, వాళ్ళ తమ్ముడి కుటుంబం గాని మనతో సరిగ్గా మాట్లాడకపోతే, అది ఈ టైం వల్లే తప్ప అది వారి స్వభావం కాబోదు.” అని మానసికంగా సిద్ధంచేసి తీసుకెళ్ళేను. నా అంచనా తప్పు అయినందుకు చాలా సంబరపడిపోయాం. ఆరోజు మా అమ్మాయికి (8 Years) నిద్ర ముంచుకొస్తూ ఉంటే ఇంక తప్పక బయలుదేరాం. వాళ్ళు కూడా, ఇంకా మాట్లాడాలని ఉంది అని మనస్పూర్తిగానే అన్నారు. “మీ తమ్ముడుగారి ఇంటికి మళ్ళీ వస్తారు కదా, ఈసారి పగటిపూట వస్తాం” అని నేను అంటే, వాళ్ళతమ్ముడు, “అబ్బే లేదు, రిటైరైపోయాను కదా, నేనే మరో నెలలో హైదరాబాదు అక్కకి దగ్గరగా వెళ్ళిపోతాను” అంటూ నా ఆశలమీద నీళ్ళు చల్లేసారు, పెట్రోలియం కంపెనీ విశ్రాంత డీజీఎం.

    దీపశిఖ కథాసంకలనంలో, సోమరాజు సుశీలగారు కోకా కృష్ణమోహన్‌గారి నీతి, నిబద్ధత, నిరాడంబరత గురించి స్మరించుకుంటూ ఒక ఒయాసిస్సు గురించి అని రాసారు. నేను స్వయంగా చూసిన ఒయాసిస్సు మాత్రం ఇల్లేరమ్మగారే.

  9. ద్వాసుపర్ణా: అనువాద కవిత్వం గురించి sreehari అభిప్రాయం:

    11/06/2019 6:51 am

    Nice balanced review Mrs Manasa

  10. నో-బుల్ బహుమతి గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    11/05/2019 2:32 pm

    అష్టాదశ అధికార్లూ
    మీకు నో- బుల్
    ఇస్తే, గిస్తే
    వాళ్లకి మీరిచ్చే
    లంచం
    గించం
    ఏదీ? చెప్పరే?
    ఇంతటి నో – బుల్
    కవిత్వంలోనూ
    అది మరిచారో,
    అదమరిచారో
    లేక
    రాసి అవతల పారేశారో
    మా బుర్రకి తట్టట్లే
    ఎంతటి
    హోలీ-కౌ !!!