పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. చెదురుబాటు నుండి కుదురుబాటుకు గురించి సూరపరాజు రాధాకృష్ణమూర్తి అభిప్రాయం:

    06/02/2020 9:02 pm

    నా కంటే యిక్కడ ఎక్కువ తెలిసినవారు ఎక్కువగా ఉన్నారు అన్న ఎరుకతో సాగితే కష్టం ఉండదు.

  2. పుస్తక పరిచయాలు గురించి తః తః అభిప్రాయం:

    06/02/2020 2:54 pm

    ” రస పట్టు లో తర్కం కూడదు ”
    అయినా
    “నేనూ ఆమె ఒప్పందానికి రెండు షరతులు విధించుకున్నాం
    మొదటిది: ఆమె ఎప్పుడైనా దానిని తెంచుకోవచ్చు
    రెండవది: ఎప్పుడూ నేను దానిని తెంచుకోకూడదు
    ………
    కానీ ఇంతవరకూ ……,
    ఆమె తరఫు షరతు ఆమె నిలబెట్టుకోలేదు
    రెండవ నిబంధనతో ఇప్పుడు నేనేమి చెయ్యాలి?
    ఒప్పందం కేవలం ఒప్పందమేనా? – ”
    మూలం లో ఎలా ఉందో నాకు తెలియదు కానీ అనువాదం లో తార్కికం గా దోషం కనపడుతోంది .
    ” తెంచుకోవచ్చు ” అంటే తెంచుకు తీరాలన్న నిబంధన లేదు ,కాబట్టి ఆమె తరఫు ‘షరతు’ ను ఆమె నిలబెట్టుకున్నట్టే. .
    తః తః

  3. ముక్కోణాలు గురించి ,padmapv అభిప్రాయం:

    06/02/2020 11:49 am

    గొప్ప కాదు, అలవాటు అంతే. ఎంత బాగా రాశారు రేఖ, కొందరు మనుషులు గురించి! అభివందనం.

  4. చెదురుబాటు నుండి కుదురుబాటుకు గురించి సాయి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:

    06/02/2020 9:01 am

    రచయిత మహాశయా!

    బావుంది మీ మాధ్యమ బహిష్కరణా, వెనువెంబడి నిర్ణయాలూ. వెరశి మాధ్యమ వైరాగ్యమూ.

    ప్రతీ మనిషికీ అనేక పార్శ్వాలు ఉన్నట్లే, మనుషుల చేత నిర్మింపబడిన లేదా సృజన చేయబడన వస్తువులు లేదా ఆలోచనలకీ అనేక రంగులుంటాయి.

    వ్యాసంలో చెప్పబడినట్లుగా సోషల్ మీడియా మరీ అంత దౌర్భాగ్యంగా లేదు. దాని ప్రయోజనాలు దానికున్నాయి. ఒక అడవిలో ప్రవేశించినప్పుడు పూలూ, ముళ్ళూ, పండ్లూ, కాయలూ (మంచివీ, కుళ్ళినవీ), రామచిలకలూ, నెమళ్ళూ, లేళ్ళూ, ఏనుగులూ, సింహాలూ, గోముఖవ్యాఘ్రాలూ, వ్యాఘ్రాలూ, నక్కలూ, పాములూ ఇలా సమస్త జీవకోటీ ఉంటాయి. మన గమ్యం, మార్గం మనకి తెలిసినపుడు మన పని ముగించుకు వచ్చేయాలి. కానీ మన వాకిట్లో తిరిగినట్లుగా అడవిలో తిరగడం వలనే సమస్యలన్నీ.

    కరోనా వచ్చినప్పుడు ఎంతో మంది నిరాశ్రయులకి తెలుగు రాష్ట్రాల్లో సాయం చేసారు కొంతమంది వలంటీర్లు. మనబోటి వాళ్ళకి ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఏదైనా సాయం చెయ్యాలనుకునేవారికి. దూరంగా ఉన్నా, ఎంతో మంది సాయం చేసారు. పాతికేళ్ళ క్రితం ఇంత వెసులుబాటు లేదు. బ్రతకడం అనే అన్వేషణలో చాలావాటికి దూరమవుతాం. ఊళ్ళూ, బంధువులూ, స్నేహితులూ, పరిచయస్తులూ, ఇలా ఎంతమందో? అనుభవాలూ, జ్ఞాపకాలూ ఎంత వదుల్చుకుందామనుకున్నా వదలవు. ఒక చిన్ననాటి స్నేహితుడూ, పక్కింటి మిత్రుడూ వీళ్ళందరనీ మనముందుకు లాక్కోచ్చింది ఈ సోషల్ మీడియా అనబడే మహమ్మారి. ఇలా మంచివీ ఉన్నాయి.

    వీటికి మరో పార్శ్వం కూడా ఉంటుంది. మనుషులకున్నట్లే. పైకి కనిపించినట్లుగా, మాట్లాడినట్లుగా అంతరంగాలూ, అహాలూ ఉండవు.

    మనకేం కావాలో మనకి తెలియాలి. మనల్ని మనం తెలుసుకొని హంసలా మారగలగాలి. మన కళ్ళే మనకి మార్గదర్శకాలు. ఏం చూడాలీ, ఏం మాట్లాడాలి అన్నది మనిష్టం. అదుపు మనచేతి ఆయుధం. ఎదుటవారికి కాదు.

    ఎంతైనా మనిషి సంఘజీవి. ఇంకో మనిషీ, మమతా, భుజమ్మీద చెయ్యేసే స్నేహమూ, అభిమానం పెల్లుబికితే ఆలింగనమూ ఇవన్నీ మనిషికి అవసరం. అటులనే అభిప్రాయాలూ, ఆలోచనలూ కూడా. అసలు సమస్య పంచుకోవడంలో కాదు. వాటిని చదివి మనుషుల్నీ అంచనా గట్టడం. ఆవేశపడడం. అవి నచ్చకపోతే మనకి నచ్చిన వారితో వెనకబాటున మాట్లాడ్డం ఇలా అనేక పార్శ్వాలుంటాయి. ఒక అభిప్రాయమూ, ఒకేఒక్క ఆలోచనా, ఒక మనిషితో ప్రవర్తనా ఆ మొత్తం మనుషుల్ని నిర్ధారించవు. అలాగే వారి ఆలోచనలూ, వ్యక్తిత్వమూ. మనుషులందరికీ రాగద్వేషాలు ఉంటాయి.

    ఒక మనిషికి ఇంకో మనిషి కావాలి. ఒక ఆలోచనకి మరోటి తోడవ్వాలి. అంతెందుకూ, ఈ వ్యాసం కూడా రాయకుండా ఉండచ్చు. అలా జరగలేదే? కానీ మీ అభిప్రాయమూ, ఆలోచన పంచుకోవాలన్న లౌల్యమూ, తపనా లేదా బాధా లేదా అవసరమూ కనిపించాయి. ఇది తప్పు కాదు. మనిషికి మనిషే పెద్ద సమస్య. మనం ఎదుటి వారికంటే కాస్త ఎక్కువ అనుకోవడమూ, అది రుజువు చేసుకోవడంలోనే అసలు సమస్య. అది సాహిత్యం కావచ్చు, కళలు కావచ్చు, విజ్ఞానం కావచ్చు.

    అభిప్రాయాలు కంటపడకుండా పారిపోయే అవకాశం అందరికీ ఉంటుంది. మన అభిప్రాయం అందరూ తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఎదుటివారిక్కూడా మన చెవిని ఇవ్వాలి. మీ అభిప్రాయంతో నాకు పనిలేదని పారిపోవడానికి. లేదంటే మనల్ని తప్పించుకు తిరుగుతారు. అందుకే ఇక్కడే, ఇప్పుడే మీకు చెవిన వేద్దామని…

    ఇక్కడ ఈమాట వారు ఈ బాక్స్ అనే మాధ్యమం ఇవ్వకబోతే నా ఈ అభిప్రాయం చేరిది కాదు కదా? మీకూ, మిగతా వారికీ.

    నమస్కారాలతో

    -సాయి బ్రహ్మానందం గొర్తి

  5. పుస్తక పరిచయాలు గురించి AtreyaSarma U అభిప్రాయం:

    06/02/2020 8:44 am

    ముకుంద రామారావుగారు వివిధ భారతీయ భాషలనుంచి విశిష్టమైన కవితలను మథించి అనువదించి వెలువరించిన బృహద్గ్రంథానికి మరో ఈ సమీక్ష నిండు చంద్రునికి సమర్పించే ఓ నూలుపోగులాంటిది.

  6. ముక్కోణాలు గురించి సురేష్ కృష్ణ అభిప్రాయం:

    06/02/2020 8:00 am

    ఎంత బాగా రాసారో!! గుండె కలుక్కుమంది 😢💝

  7. చెదురుబాటు నుండి కుదురుబాటుకు గురించి అవినేని భాస్కర్ అభిప్రాయం:

    06/02/2020 3:11 am

    ఆలోచింపజేసే వ్యాసం.

    ఇందులోని అంశాలు చాలా మందికి ఉపయోగపడతాయి.

  8. పుస్తక పరిచయాలు గురించి ప్రొఫెసర్ రామా చంద్రమౌళి అభిప్రాయం:

    06/02/2020 2:33 am

    ముకుంద రామారావు గారు తనదైన రీతిలో ఇదివరకు నోబెల్ కవిత్వాన్నీ, ఇతర ప్రపంచ కవుల కవిత్వ విపులతనూ పరిచయం చేసినట్టుగానే ఇప్పుడు ఈ ‘ అదే నేల ‘ గ్రంథంలో తెలుగేతర భారతీయ భాషల్లోని కవిత్వ మాధుర్యాన్ని చాలా లోతుగా పరిచయం చేశారు. ఇంత విస్తృతంగా ఒకే ఒక్క మనిషి ఎట్లా చేశాడబ్బా అని ఆశ్చర్యం కలిగించే రీతిలో ఈ పుస్తకం విస్తరించింది. ఇంతవరకు ఎవరూ ఇంత వైశాల్యంతో కవిత్వ విశ్లేషణను చేసింది లేదు. ఇటువంటి రచన చేయడానికి ఎంతో మగ్నతతో కూడిన తపస్సమాన దీక్ష కావాలె. అటువంటి లీనతతో రామారావు ఈ ఘన కార్యాన్ని సాఫల్యపర్చారు. ఈ సందర్భంగా నాకు మంచి మిత్రుడైన రామారావు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

  9. చెదురుబాటు నుండి కుదురుబాటుకు గురించి విన్నకోట నరసింహారావు అభిప్రాయం:

    06/01/2020 10:57 pm

    సోషల్ మీడియా వ్యసనం నుండి బయటపడాలనే ఇంద్రాణి గారి గట్టి సంకల్పం, సాధించాలనే పట్టుదల, సాధించిన తీరు నిజంగా మెచ్చుకోదగినవి.

  10. పుస్తక పరిచయాలు గురించి గుండె బోయిన శ్రీనివాస్ అభిప్రాయం:

    06/01/2020 10:50 pm

    బాగుంది సా‌ర్