పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి: అరవై ఏళ్ళ అక్షర యాత్ర గురించి ఉణుదుర్తి సుధాకర్ అభిప్రాయం:

    05/12/2021 9:51 am

    అటు ప్రాచీన సాహిత్యంతోనూ, ఇటు పాశ్చాత్య సాహిత్య ధోరణులతోనూ సజీవ సంబంధం, విశేషమైన జీవితానుభవం కలిగిన రచయిత – ఏదో ఒక ప్రభావంలో కొట్టుకుపోకుండా తన స్వంత దృష్టికోణాన్నీ, శైలినీ, అన్వేషణా మార్గాన్నీ ఏర్పరచుకుంటే అదెలా ఉంటుంది? అనేకానేక విశిష్టతలనూ, ప్రత్యేకతలనూ కలిగి ఉంటుందని మాత్రం చెప్పగలం. అలా ఎదిగిన క్రమాన్ని ఒడిసిపట్టుకోవడం సాహితీ చరిత్రకారులకూ, విమర్శకులకూ కష్టసాధ్యం. ఆ పనిని సాధించడంలో విజయవంతం అయ్యాడు మిత్రుడు కె. సురేష్. పతంజలిశాస్త్రి కథల్లాగే ఈ ఆవిష్కరణకూడా – అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్లుగా కాకుండా – పాఠకుల ఊహకు అధిక శాతం వదిలిపెడుతూ, వారి వివేచనను తక్కువగా అంచనా వెయ్యకుండా – సాగింది. జీవితపు అసంపూర్ణతల మధ్య సంచరిస్తూ, అసంబద్ధతలను పరికిస్తూనే తనదైన స్పష్టతను కలిగిఉన్నప్పటికీ దాన్ని పాఠకుల మీద రుద్దకుండా, వారి హృదయాలనూ, ఆలోచనలనూ సున్నితంగా మెలిపెట్టే పద్ధతిని పతంజలి శాస్త్రి అనుసరిస్తారని నాకనిపిస్తుంది. సురేష్ ఈ రహస్యాన్ని వెల్లడించాడు. అభినందనలు.

  2. తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి: అరవై ఏళ్ళ అక్షర యాత్ర గురించి శ్రీధర్‌ కొప్పిరెడ్డి అభిప్రాయం:

    05/12/2021 8:38 am

    శాస్త్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరెన్నో కథా సంకలనాలు వారి నుండి ఆశిస్తున్నాము.

  3. తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి: అరవై ఏళ్ళ అక్షర యాత్ర గురించి Amarendra Dasari అభిప్రాయం:

    05/12/2021 7:25 am

    ఎంతో అవసరమైన వ్యాసం.
    పాఠకులకు అపారమైన ప్రయోజనం చేకూర్చే వ్యాసమిది.

  4. తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి: అరవై ఏళ్ళ అక్షర యాత్ర గురించి చందు తులసి అభిప్రాయం:

    05/12/2021 6:47 am

    పతంజలి శాస్త్రి గారి గురించి కొత్త సంగతులు తెలిశాయి సార్. వ్యాసంలో మీ మార్కు స్పష్టంగా ఉంది.
    కథని ఊరబెట్టడం కొత్తగా అనిపించింది

  5. తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి: అరవై ఏళ్ళ అక్షర యాత్ర గురించి మోహన్ బాబు అభిప్రాయం:

    05/12/2021 4:55 am

    సురేష్ అతి చక్కటి విశ్లేషణ. సమయానికి తగిన మాటలు. రెండో భాగం గురించి కూడా ఎదురు చూస్తూ ఉంటాం.

  6. తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి: అరవై ఏళ్ళ అక్షర యాత్ర గురించి Chiranjeevi varma అభిప్రాయం:

    05/12/2021 1:44 am

    శాస్త్రిగారు రాసిన ముందుమాటలు కూడా వున్నాయి. నా ‘కాకిబొడ్డు’కి అతి బలవంతం మీద రాసారు. అది అదృష్టం, గురువుగారికి జన్మదినశుభాకాంక్షలు.

  7. ది గుడ్ స్టోరీ గురించి ధీరజ్ కశ్యప్ అభిప్రాయం:

    05/11/2021 5:32 pm

    హ్మ్…. సో, కళాకారుడు అంటే ఒక మామూలు మనిషి. మామూలు మనిషి అంటే? అలిసిపోయిన మనిషి!

  8. అస్తిత్వన్యాయం గురించి Gireesh K. అభిప్రాయం:

    05/09/2021 7:13 am

    కథ, కథనం….. అన్నీ చాలా బావున్నాయి.

  9. అస్తిత్వన్యాయం గురించి Sudha అభిప్రాయం:

    05/06/2021 7:31 am

    Thank you srinivas garu, bhaskar garu, Masiddhique garu, venlateswarlu garu, Sunitha garu for your insightful comments

  10. అస్తిత్వన్యాయం గురించి Sudha అభిప్రాయం:

    05/06/2021 7:23 am

    Lyla garu, I am quite delighted and kind of surprised to see your comment. as you know the outer subjective attributes can`t add any value (even to glow/ grow) to the art. In fact, these things become instruments to trigger and mislead unnecessarily.
    Any way sometimes thinkers’ hearts shadowed by their emotional intelligence and it`s quite understandable.