పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. హరీన్ చటో గురించి Lyla yerneni అభిప్రాయం:

    08/30/2021 5:38 pm

    Mickey Mouse! O! No! Sir!

    “ప్రాక్పశ్చిమాలు విస్తారించి ప్రేమించ పాఠాలు నేర్పిన పంతులమ్మ” – ఆమె అలా అనవచ్చునా!
    No. No. “అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడజాతశత్రుడే అలిగిన నాడు…” – అట్టి మహాత్ముని ఆమె అలా అనవచ్చునా.
    No. no no no no. She needs a spanking! Like this greatest dancing teacher gives his student.

    “అప్పుడు నీవు అంబికకు ఆంగిక లాస్య విశేష పాఠముల్
    జెప్పుచు నాయికల్ బ్రియులజేరుట లాడుచు జూపువేళ క
    న్రెప్పలమాటు నవ్వు లలరించిన ఆ సుకుమారి మేనిపై
    చప్పున దెబ్బ వేసితివి సాక్షి గణాధిపు దల్తు ధూర్జటీ!”

    Siva! Spanking the Spouse! In the middle of a teaching session! Whose poem is this తహ్!
    – Lyla

  2. హరీన్ చటో గురించి తఃత అభిప్రాయం:

    08/29/2021 10:31 pm

    “గాంధి గారిని ‘మిక్కిమౌస’న్న కూనలమ్మ”ను నేను జత చేయవచ్చా డా. ఎర్నేని?

    తఃతః

  3. హరీన్ చటో గురించి Lyla yerneni అభిప్రాయం:

    08/29/2021 2:13 pm

    పరుచూరి ఇక్కడ హరీన్ గురించి చేసిన పరిచయం చారిత్రకంగా సంతోషదాయకమైనా, శ్రీశ్రీ ఏదో ఎన్నో ఉత్సవానికి, ఈయన ప్రసిడెంట్ గా ఉన్నాడంటంతో, నా ఆసక్తిలో చిన్న డెంట్ పడింది.

    Why preside over such events? I cannot warm up to Sri Sri’s poetry to this day. He is a typical pretend local rebel – with a world class bum philosophy. What would have Harin said to the attendees? Dear Friends: Hate and be jealous of other humans who are richer than you.? Love humans only when they are fallen, downtrodden, ridden with sorrow? I cannot reconcile with such childish thought process.

    Really, Come on! Harin with individual achievements, his own artistic works, need not be known thru eavesdropping on Sri Sri’s names dropping.

    ఐనా, ఏం చేద్దాం! హరీంద్రనాథ్ సంభాషణ రికార్డింగ్, ప్రయత్నించినా వినపడలేదు. ట్రాన్స్క్రిప్ట్ ఉండి ఉంటే చదువుకునే పని. లేనందున, హరీన్ ఏం చెప్పారన్నది తెలియదు. సంభాషణ ఇంగ్లిష్ లో ఉన్నట్టు, ఆ భాషలో అప్పటి రచయితలకు రచనలు చెయ్యటం ‘ఇట్ ఈజ్ వెరీ డిఫికల్ట్’ అని ఆయన అంటున్నట్టు అప్పుడప్పుడూ వినిపించింది. But even that could be an auditory guess.

    హరీన్ ఛటో -కుటుంబ వ్యక్తుల పర్సనల్ హిస్టరీలు చూస్తే, అప్పటి సమాజపు కస్టమ్ అండ్ క్రీడ్; కులం మతం; భాష, రాష్ట్రం; బాదరేషన్ లేకుండా, ముందు ప్రేమించి తర్వాత పెళ్లాడి ఆ వ్యక్తులతో సహజీవనం చేసినట్టు తెలుస్తున్నది. వీరి రాజకీయ హిస్టరీలు చూస్తే, ఎవరూ మరొకరికి కార్బన్ కాపీలు కారు. బంధుత్వాలున్నా, రక్తసంబంధీకులైనా, వీరి పొలిటికల్ ఫిలాసఫీలు వేరు వేరు. ఇండియా స్వాతంత్ర పోరాటంలో, ప్రపంచ యుద్ధాలలో వీరు ఎవరి బుద్ధికి తోచినట్టు వారు చరించినట్టు అగుపడుతూంది.

    ప్రస్తుతం, అంతర్జాతీయ మహిళ ల కళ గురించి నేను మిక్కిలి ఆసక్తితో వింటున్నాను. ఇంకెక్కడ! ఈ పత్రికలోనే. మృణాలిని చెపుతుంటే చెవులు రిక్కించుకుని వింటున్నాను. అందుకని ఈ తరుణంలో, ఇప్పుడో, మరో సంచికలోనో,

    “భారతీయ కళా ప్రాభవమ్మొలికించి తీయగా పాడిన కోయిలమ్మ
    కమనీయ వంగ వంగడమెల్ల మూర్తిలో ప్రసరించినట్టి మేల్ పసిడి కొమ్మ
    స్వారాజ్య వీర విహార రంగము లోన కోరి దూకిన తెల్గు కోడలమ్మ…”

    ఆ వనితను, ఆ పాటను, -పరుచూరి శ్రీనివాస్ పరిచయం చేస్తారని ఆశిస్తాను. ఆ పాట origins గురించి తెలిసిన వారు, ఏం విశేషాలు చెపుతారనేది నాకు వినాలని ఉంది.

    -లైలా.

    PS: (తహ్! ఇక్కడ ప్రచురించబడిన మీ (తః తః ) రచనలలో మీరు చెప్పిన రెండు ఇంగ్లిష్ పద్యాలు లేవే. దయచేసి తప్పక వినిపించండి. తాత్సారమెందుకు?)

  4. శంభో తవారాధనం గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    08/29/2021 9:05 am

    మీ పద్యాలు వాట్సాప్ మీద కొంతమందికి పంపాను (కట్ పేస్ట్ ద్వారా). మీ అన్నగారి ధూర్జటి శతకం ఎక్కడ దొరుకుతుందో అడిగారు. వీలున్నప్పుడు లింక్ ఇవ్వగలరు.

  5. శంభో తవారాధనం గురించి తః తః అభిప్రాయం:

    08/29/2021 6:15 am

    శ్రీ శర్మ దంతుర్తి :
    మీరు ‘శంభో తవారాధనం’ బాగున్నదనటం నాకు నిజంగా బాగున్నది. ఉ.,చం.,శా.,మ… లను వాడకపోవటానికి పెద్దగా కారణం ఏమీలేదు. మీరు పేర్కొన్న అయిదు పాదాల పద్యం ‘చం’. తెలుగులో నాలుగు కన్నా (చాలా) ఎక్కువ పాదాలు గల చం.,ఉ. లు తరచుగా కనపడుతునే ఉంటాయి. ‘దాశరథీ’లో ‘భండన భీము’డయిదు పాదాల ఉ.
    నమస్కారాలతో –
    తః తః

  6. శంభో తవారాధనం గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    08/28/2021 9:47 am

    అద్భుతం. ఎనిమిదో పద్యం నవ్వు తెప్పించింది – “నిన్ను జేపట్టిన రాచ పట్టి చలువన్ పరమేశ్వరుడైతి ధూర్జటీ,” అన్నప్పుడు. ఒక చిన్న సందేహం. ఈ పద్యాలు రాసేటపుడు ఏ పద్యం ఏ వృత్తానికి చెందినది అనేది ఎందుకు రాయలేదండీ? ఉదాహరణకి తొమ్మిదో పద్యం ఏం వృత్తం? సాధారణంగా పుస్తకాలలో (నాలాంటి అర్భకులకి అర్ధమవడానికి) ముందు ఉ. క. ఆ. చ. తే. అనేవి రాసి ఆ పద్యం ఏం వృత్తమో రాస్తారు కదా? అయిదు వరసల పద్యం ఉత్సాహవృత్తమా? దయచేసి రాయగలరు.

  7. శంభో తవారాధనం గురించి తః తః అభిప్రాయం:

    08/26/2021 5:21 am

    శ్రీ యదుకుల భూషణ్,
    బడి నుంచి ఇంటికి వెళ్లగానే అమ్మ దగ్గరకు తీసుకుని ఏ పకోడీలో, మరమరాల ఉండలో ఇస్తుంది తినటానికని. బడి ఆఖరి గంట ‘ఇంటి బెల్లు’ కొట్టంగానే ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళే – పాత రోజుల్లోని – పిల్లవాడి మనసులా ఉంటుందనుకుంటా రచయితల మనసు తమ రచనలు అచ్చులో కనపడగానే. మీ మాటలు ఆ రోజుల్నీ, ఆ ఆనందాన్నీ గుర్తుకు తెచ్చాయి. ఇప్పుడు సంతోషంగా “పద్యాలకు ఛందస్సు పిల్లలకు పీజ్జా లాంటిది
    అమరులకు సురాపానం లాంటిది” అని ఒక 18 సార్లు రాసుకుంటాను.
    మిత్రుడు
    తః తః

  8. శంభో తవారాధనం గురించి తమ్మినేని యదుకులభూషణ్ అభిప్రాయం:

    08/25/2021 10:23 pm

    తః తః గారు :

    వస్తుతః, భావతః , తః తః పుట్టించే పద్యాలు ; సగాలదేవర అనడంలో గణితాత్మ కనిపించినా – హాస్యప్రియత్వం చవితి చంద్రునిలా తొంగి చూస్తోంది. ఎనిమిదవ పద్యం ముఖ్యంగా ఎన్నదగినది. అలాగే – 3, 5, 6, 9 , 13. తొలుత, ధూర్జటితో మొరపెట్టుకుని , నడుమ భావనా సంచారం చేసి, చివరికి, శాంభవితో ఆత్మీయ సంభాషణలో ముగించడం బావుంది.

    తమ్మినేని యదుకులభూషణ్

  9. శంభో తవారాధనం గురించి తః తః అభిప్రాయం:

    08/25/2021 9:20 am

    శ్రీ పినాకపాణి:
    “ఎవరూ ఏమీ చెప్పలేదేమిటా” అని ”పప్పులు నమలుటలు గావు పద్య రచనముల్”ను 107 సార్లు ఇంపోజిషన్ రాశాను. 108వ సారి చూద్దును గదా అల్పాక్షరాలలో అనల్పమైన మీ అభినందన కనబడింది.
    తః తః

  10. నాకు నచ్చిన పద్యం: మనుచరిత్రలో సాయంకాల వర్ణన గురించి Lyla yerneni అభిప్రాయం:

    08/24/2021 12:23 pm

    M. వెంకటేశ్ on August 24, 2021 at 6:01 am

    “ఇట్లు పారవైచితివే మిన్నులు పడ్డ చోట” దీనికి అర్థం చెప్పండి. ఇది ఎందులోనిదో తెలియచేయండి.

    మనుచరిత్రము. తృతీయాశ్వాసము. 17 వ పద్యము. ఆ సీసపద్యము కిందున్న గీతి.

    యతిథిసంతర్పణంబు లేమయ్యెనొక్కొ!
    యగ్నులేమయ్యెనొక్కొ ! నిత్యంబులైన
    కృత్యముల బాపి, దైవంబ! కినుక నిట్లు
    పాఱవైచితె! మిన్నులు పడ్డ చోట!

    మిన్నులు పడ్డచోటు అంటే ఆకాశం పడిన చోటు, అంటే ఆకాశాన్నంటే ఎత్తున్న హిమాద్రి, అంటే నేలమీద పూజాపునస్కారాలు చేసుకునే మనిషిని, నామీద కోపగించి ఇక్కడ హిమాలయాల్లో పారేశావేమిటి దైవమా! అని, ప్రవరుడు చింతిస్తున్నాడు. (అమెరికాలో మా పిల్లాపాపలతో ఉండాల్సిన వాళ్లం, ఆఫ్ఘనిస్తానులో దించావేంటయ్యా ప్రెసిడెంటూ, ఇంటికెళ్లేదెలా! అని కొందరు విలపిస్తున్నట్టు.)

    Have a nice day! – Lyla