పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. ఆమె ఇల్లు గురించి Amaravathi అభిప్రాయం:

    02/11/2022 6:13 am

    కథ బాగుంది. యథాప్రకారం స్త్రీకి విలువ లేదు, వాళ్ళ ఆలోచనకు అభిప్రాయానికి విలువలేదు.
    కానీ ఒక వయస్సులో ఎవరికైనా సొంత ఇల్లు కావాలనే ఆలోచన స్త్రీలలో వస్తుంది. కానీ వారి అభిప్రాయానికి విలువ వుండదు.

  2. నాలుకలు! గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    02/11/2022 5:34 am

    ఆ పడికట్టు పదాల్ని భలేగా పట్టుకున్నారు!

  3. నాలుకలు! గురించి Sujata అభిప్రాయం:

    02/10/2022 10:21 pm

    Mind blowing! థాంక్యూ మూర్తిగారు.

  4. వోర్టెక్స్‌లో వాన గురించి Amarendra Dasari అభిప్రాయం:

    02/10/2022 2:48 am

    మంచి కథనం..మంచి అమరిక..
    కానీ ఎక్కడో ఒక link తగ్గింది..

  5. ఆమె ఇల్లు గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    02/09/2022 10:12 pm

    ఆడవాళ్ళకు ఇల్లు అన్నది కేవలం నివసించే చోటు కాదు; అదొక మాయల వనం అని భావిస్తూ… తనదైన తనకంటూ ఓ సొంత ఇంటికోసం కలలు కన్న అహల్యను కుటుంబ సభ్యులెవరూ అర్ధం చేసుకోలేక పోవటం ఎందరో స్త్రీల జీవితం లోని అంతర్వాహిని విషాదం. చదువుకుని, ఉద్యోగం చేస్తూ సంపాదనాపరురాలై సంసార భారాన్ని తనవంతుగా మోస్తున్నా… నేటి సమాజంలో స్త్రీ అస్తిత్వానికి, ఆశలకి తగిన గుర్తింపు లేకపోవటాన్ని ఆర్తిగా చిత్రించిందీ కథ.

    ఎస్. రామకృష్ణన్ గారి తమిళ కథ “అవళదు వీడు”ను అవినేని భాస్కర్ తెలుగులోకి “ఆమె ఇల్లు” గా అనుసృజన చేసినది చదువుతుంటే “బాలిక, కన్య, ప్రౌఢ, ముగ్ధ, వృద్ధ… ప్రతి దశలోనూ ఏదో ఒక అండ ఉండాల్సిందేననీ, బాధ్యతలే తప్ప, హక్కుల గురించి నోరెత్తరాదనీ, తలదాచుకోవడమే తప్ప, తన ఇల్లని యెప్పుడూ భ్రమపడకూడదనీ కఠినంగా చెప్పే సంకెళ్లమీద సహేతుకంగా పడిన సమ్మెట దెబ్బ – కవనశర్మ గారి “ఆమె ఇల్లు” కథ గుర్తుకొచ్చింది.

    మరో మంచి తమిళ కథను పరిచయం చేసినందుకు అవినేని భాస్కర్ గారికి ధన్యవాదాలు.

  6. వోర్టెక్స్‌లో వాన గురించి శ్రీనివాస్ అభిప్రాయం:

    02/08/2022 8:56 pm

    Thank you సుధగారూ, మీ సూచనని గుర్తుంచుకుంటాను.

  7. కుటుంబరావు ఆలోచనని హత్య చేశాడా? లేక రేకెత్తించాడా? గురించి vshyamkumar అభిప్రాయం:

    02/08/2022 9:34 am

    Nice to read . Thought provoking I feel . Betterment of people’s lives is more important than rigid traditional chains . Wish we become more free , adopt new thoughts and solutions for our problems . Life is more important than only love, which is part of life .I think , we can make life more enjoyable , along with love Thoght provoking elaborate article , supporting koku garu . Very nice analysis .Thank you sir .

  8. రెండు అక్షరసామ్య యతులు గురించి Desikachary అభిప్రాయం:

    02/08/2022 9:29 am

    తః తః గారూ,
    ‘వర్ణంబులకు సారూప్య సామీప్య ప్రత్యాహారైకస్థాన తద్భవ సంబంధ బాంధవంబులు విచారించియతులు నిర్ణయించి నిలుపవలయు’ అని లక్షణశిరోమణికారుడు చెప్పినట్లుగా, యతికి దేశ్య,తత్సమశబ్దముల వివక్ష ప్రధానము గాదు. సంస్కృతములోని యతివలె గాక, తెలుగులో యతిమైత్రి శ్రవణసుభగత్వమునకై నిర్దేశింపబడిన నియమము గావున దీనికి ధ్వని సామ్యతయే ముఖ్యము. టవర్గ, తవర్గ, పవర్గములందలి తొలి నాల్గక్షరములు బిందుపూర్వకములైనప్పుడు మాత్రమే నాయావర్గములందలి పంచమాక్షరము ధ్వనించుచుండుటచే, ఇటువంటి బిందుపూర్వక యతులు చెప్పబడినవి. ఆ అక్షరములు బిందుపూర్వకములు గానిచో పంచమాక్షరముతో ధ్వనిసామ్యత లేనందువలన మొదటి నాల్గక్షరములకు పంచమాక్షరముతో యతిమైత్రి చెప్పబడలేదు.

  9. ఆమె ఇల్లు గురించి Rajeswari అభిప్రాయం:

    02/08/2022 8:06 am

    మంచి కథ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. కథ ఎంత బావుందో, ఎంత మంది ఆడవాళ్లు వారిదైన ఇంటి కోసం ఎదురు చూస్తారో!

  10. ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 4 గురించి రాజేశ్వరి అభిప్రాయం:

    02/07/2022 11:55 pm

    చాలా బాగా రాస్తున్నారు. మొత్తానికి చదువులు ఇప్పటికీ అప్పటికీ పెద్ద మారలేదు. వాళ్లకి తెలియని విషయాలు ఉపాధ్యాయులు ఇప్పుడు కూడా అంత ఇంపార్టెంట్ కాదనే చెప్తున్నారు😀