పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16440

  1. పేకాట గురించి రానారె అభిప్రాయం:

    05/24/2007 11:54 am

    తప్పుచేశామనే భావనను కప్పిపుచ్చుకుంటున్నప్పుడు – దానిగురించి ఎవరేం మాట్లాడినా భుజాలుతడుముకుని, ఆత్మన్యూనత పెంచుకొని, కొన్నిసార్లు అసహనమూ కోపమూ ప్రదర్శించి తప్పించుకోవాలనుకోవడం, దొరికిపోతామేమోననే భయం ఉన్నా మేకపోతుగాంభీర్యం ప్రదర్శించడం, ఇంతా చేశాక దొరికిపోతే అయోమయానికి గురవడం, అప్పటికీ ఈగోను వదల్లేకపోవడం … ఇలాంటి భావాల్ని సునిశితంగా హాస్యభరితంగా చెప్పుకొచ్చిన ఈ కథనం నాకు బాగా నచ్చింది.

  2. పేకాట గురించి Lyla Yerneni అభిప్రాయం:

    05/23/2007 7:35 pm

    ఏమిటి విప్లవ్ ! ఈ కధలేమిటి ? ఈ గొడవేమిటి?
    బుష్ , రస్సర్ట్ సంగతి సరేగాని -పవిత్ర భారతదేశంలో -శిల్పాషెట్టిని,
    రిచర్డ్ గేర్, రెండు ముద్దులు పెట్టుకుంటే అంత గొడవ చేశారేమిటి?
    కధ బాగుంది విప్లవ్! Sporty!

  3. శ్రీ శ్రీ కవిత్వంపై … మరో వ్యాసం గురించి jilukara Sreenivas అభిప్రాయం:

    05/22/2007 6:59 pm

    అరుదైన వ్యాసం. ఇంకా శ్రీశ్రీ కవిత్వం గురించి ఆనాటి విమర్శకుల విశ్లేషణలు పొందుపరచాలని కోరుతున్నా.

  4. పేకాట గురించి Anitha అభిప్రాయం:

    05/22/2007 8:44 am

    నర్మగర్భితమైన హాస్యంతో బాగా రాశారు…కథ చెప్పిన తీరులో ఒక స్టైలుంది..టీవీ షోతో పోల్చుతూ…అలా అబ్‌రప్ట్ గా వదలడమే బావుంది.

  5. కడపసీమలో అపురూపమైన కలివి కోడి గురించి రానారె అభిప్రాయం:

    05/22/2007 8:28 am

    ఇంటర్నెట్లో వెతికితే, కలివికోడి (Jerdon’s Courser) శాస్త్రీయనామం ఈ వ్యాసంలో చెప్పినట్లు Cursorius bitorquatus అని కాక Rhinoptilus bitorquatus అని కనబడుతున్నది వికీపీడియాలోనూ, మరిన్ని ఇతర వెబ్సైట్లలోనూ!!?

  6. కడపసీమలో అపురూపమైన కలివి కోడి గురించి రానారె అభిప్రాయం:

    05/22/2007 7:47 am

    కొన్నేళ్ల క్రితం చిన్నపిల్లకోసం రాస్ట్రవ్యాప్తంగా రెడియోలో ప్రసారమైన ఒక విజ్ఞాన ధారావాహిక కార్యక్రమంలో కలివికోడి, బట్టమేకల గురించి తెలుసుకున్నాను. మళ్లీ ఇక్కడ చూస్తున్నాను. నాకు అమిత సంతోషం కలిగించినవి – అరుదైన ఆ పక్షి ఛాయాచిత్రాలు. కోనేటిరావుగారికీ ఈమాట సంపాదకవర్గానికీ కృతజ్ఞతలు. రెండు దశాబ్దాల క్రితం మన గ్రామాల్లో మనుషులకంటే జంతు సంపద ఎక్కువగీ ఉండేదని చెబుతారు. ఈ విషయం నాకూ అనుభవంలోనిదే. ఇవాళ పరిస్థితి మనకు తెలుసు. భూగోళాన్నంతటినీ మనిషి ఆక్రమిస్తున్న ఈ పోకడలో తమ ఉనికిని కోల్పోతున్న జీవాలెన్నో! సర్వేజనాః మాత్రమేకాదు సర్వప్రాణికోటీ సుఖీభవ – అనే స్పృహను కలిగించడంలో ఇలాంటి వ్యాసాలు సహాయపడగలవని ఆశిద్దాం.

  7. కడపసీమలో అపురూపమైన కలివి కోడి గురించి రానారె అభిప్రాయం:

    05/22/2007 7:41 am

    కొన్నేళ్ల క్రితం చిన్నపిల్లకోసం రాస్ట్రవ్యాప్తంగా రెడియోలో ప్రసారమైన ఒక విజ్ఞాన ధారావాహిక కార్యక్రమంలో కలివికోడి, బట్టమేకల గురించి తెలుసుకున్నాను. మళ్లీ ఇక్కడ చూస్తున్నాను. నాకు అమిత సంతోషం కలిగించినవి – అరుదైన ఆ పక్షి ఛాయాచిత్రాలు. కోనేటిరావుగారికీ ఈమాట సంపాదకవర్గానికీ కృతజ్ఞతలు. రెండు దశాబ్దాల క్రితం మన గ్రామాల్లో మనుషులకంటే జంతు సంపద ఎక్కువగీ ఉండేదని చెబుతారు. ఈ విషయం నాకూ అనుభవంలోనిదే. ఇవాళ పరిస్థితి మనకు తెలుసు. భూగోళాన్నంతటినీ మనిషి ఆక్రమిస్తున్న ఈ పోకడలో తమ ఉనికిని కోల్పోతున్న జీవాలెన్నో! సర్వేజనాః మాత్రమేకాదు సర్వప్రాణికోటీ సుఖీభవ – అనే స్పృహను కలిగించడంలో ఇలాంటి వ్యాసాలు సాయపడగలవని ఆశిద్దాం.

  8. పేకాట గురించి Sowmya అభిప్రాయం:

    05/21/2007 12:05 am

    ఏమిటో…. సడెన్ గా అయిపోయినట్లు అనిపించింది. కథలో చెప్పదలుచుకున్న విషయం ఏమిటో నాకు అర్థం కాలేదు.

  9. లోపలికి గురించి Lyla Yerneni అభిప్రాయం:

    05/20/2007 4:08 pm

    ఒహో! కవిత్వంపై కవిత్వం. అన్నీ బాగున్నాయ్ .
    బాగా రాసారు జయ గారు!

  10. లోపలికి గురించి jayasimha అభిప్రాయం:

    05/18/2007 3:14 am

      కల
    అలసి ఉన్న నన్ను చూసి అమ్మ జోల పాడినట్లు
    చందమామ చెంతకొచ్చి వెన్నెలంత ఇచ్చినట్లు
    పూవులన్ని రేకులిప్పి నన్నుచూసి విచ్చినట్లు
    మబ్బులోన నీటిచ్చుక్క బుగ్గమీద రాలినట్లు
    పిల్లగాలి పక్కనుంచి పలకరించి పోయినట్లు
    కొమ్మమీది కోయిలమ్మ గొంతుఎత్తి పాడినట్లు
    సామన్యులు చెయ్యలేని సాహసాలు చేసినట్లు
    తరాలన్ని తరలివచ్చి తలనిమిరీ వేసినట్లు
    కైలాసం కరిగివచ్చి నాదేశం కడిగినట్లు
    పరబ్రహ్మే పరుగునొచ్చి ఈరాతలు రాసినట్లు
    జయ