పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. అమ్మ గురించి satyam అభిప్రాయం:

    09/09/2010 5:38 pm

    Very nice Sarada, started reading your stories… I like the story! Actually these are very realistic…

  2. తోడు గురించి రీడర్‌ అభిప్రాయం:

    09/09/2010 12:09 pm

    నాకు నచ్చని విషయం ఇంకొకటి వుంది ఈ కధలో. కొడుకు పెళ్ళి చేసుకోమని తల్లిని సతాయిస్తూ వుంటాడు. అది ఆ కొడుకు దృష్టిలో అభ్యుదయం అనుకోండీ. పెద్దవాళ్ళు ఏ వయసులో నైనా ప్రేమతో పెళ్ళి చేసుకుంటే, దాన్ని సమర్థించడం తప్పకుండా అభ్యుదయమే. పిల్లల్ని కని, వాళ్ళని పెంచి, వాళ్ళ పెళ్ళి చూశాక, తమ జీవితం అయిపోయిందనుకోనక్కర్లేదు. తల్లుల పెళ్ళిళ్ళనీ, తండ్రుల పెళ్ళిళ్లనీ (అవి ప్రేమతో జరిగినప్పుడు మాత్రం) పిల్లలు భరించలేకపోతే, అది వాళ్ళ ఖర్మ. అయితే, అలా అభ్యుదయంగా వుండడం కోసం, ఒక కొడుకు, “అమ్మా, పెళ్ళి చేసుకో, పెళ్ళి చేసుకో, పెళ్ళి చేసుకో” అని అనడం చాలా ఎబ్బెట్టుగా, అసహ్యంగా వుంటుంది. నాకు తెలుసున్న ఒక రచయిత అయితే, కొడుకు అడగడాన్ని ఇలా రాస్తాడు, “అమ్మా, ఏంటే! మళ్ళీ పెళ్ళీ చేసుకోవే! నా పెళ్ళాంతో నేనుంటే నీకు దిక్కెవరే? నువ్వు కూడా పెళ్ళి చేసుకోవే. బాగుంటుందే. నీకో తోడుంటుందే!” అంటూ. ఇలాంటి రాతలు చదవడానికి ఎంత జుగుప్స కలుగుతుందో.
    పెళ్ళయ్యాక కూడా పెద్దవాళ్ళతో కలిసి వుండేంత వాతావరణం, సంస్కారం, చైతన్యం లేకపోతే (ఇవి వుండటం ఆదర్శ వంతమే అయినా, ప్రస్తుత కాలంలో ఇవి లేకపోవడం చాలా సహజమైన విషయం గానే వుంది), పెద్దవాళ్లకి కొంచెం దూరంగా వుంటూ, వాళ్ళతో సంబంధలో వుంటూ, వాళ్ళ కష్టసుఖాలు కనుక్కుంటూ, పట్టించుకుంటూ వుండొచ్చు. అంతేగానీ వాళ్ళకి ఎలాగో ఒకలాగా పెళ్ళి చేసెయ్యాలని చూడ్డం చాలా అభ్యంతర కరం. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళతో వాళ్ళ పెళ్ళి గురించి మాట్టాడ్డం వేరూ, పిల్లలు వాళ్ళ పెద్దవాళ్ళతో ఆ పెద్దవాళ్ళ పెళ్ళి గురించి మాట్టాడ్డం వేరూ. చిన్నంతరం, పెద్దంతరం అంటారే, అలాంటివి ఇటువంటి విషయాల్లోనే పాటించాలి. లేకపోతే, “వరుడు” అనే కొత్త సినిమాలో అల్లు అర్జున్‌ తల్లి సుహాసినితో ఎలా వెకిలిగా మాట్టాడుతాడో, అలా తయారవుతారు పిల్లలు దరిద్రంగా.

    పెద్దవాళ్ళు ప్రేమతో పెద్ద వయసులో పెళ్ళి చేసుకుందామని నిశ్చయించుకున్నప్పుడు, పిల్లలు సపోర్టింగుగా వుండటం మాత్రమే అభ్యుదయం.

    చాలా కాలం కింద వచ్చిన ఒక కధలో, ఒక తండ్రి పెద్ద జబ్బు చేసి, తేరుకున్నాక, తనని కనిపెట్టుకుని వుండటం కోసం ఒక వితంతువుని పెళ్ళి చేసుకుంటాడు. ఆ పెళ్ళిని ఆ తండ్రి అమెరికాలో, ఒక పెద్ద వయసులో వున్నాయన ప్రేమతో (ఆ పెళ్ళి చేసుకునే మనిషి కనీసం అలా భావించాడు, అది సరైన ప్రేమ అవునా, కాదా అనే సంగతి పక్కన పెడితే) చేసుకునే పెళ్ళితో పోల్చుకుంటాడు. తన కొడుకు తన పెళ్ళిని సమర్థిస్తాడనుకుంటాడు. ఆ కొడుకొక జడ్డి. అలా అయోమయంగా వుంటుంది ఆ కధ.

    ఈ విషయంలో ఈ కధా అంతే.

  3. శతకందసౌరభము గురించి mOhana అభిప్రాయం:

    09/09/2010 9:17 am

    మనోహర్ గారూ, నమస్కారాలు. మనం ఈమెయిల్ ద్వారా మాట్లాడుకొంటే బాగుంటుంది. jkmrao ఎట్ యాహూ డాట్ కాం కు రాస్తే మీకు కొన్ని సూచనలను ఇవ్వగలనేమో? – మోహన

  4. ప్రేమ కవితలు గురించి O.D.kondal Rao అభిప్రాయం:

    09/09/2010 7:47 am

    మీ కవిత చూస్తుంటే మీరు ఎవ్వరినో బాగా ప్రేమించినట్లున్నారు. చాల బాగుంది. హృదయాన్ని తాకింది.

  5. బందీ గురించి prasuna అభిప్రాయం:

    09/09/2010 5:54 am

    నయాగరా గురించి అని తెలిశాక మరలా కవిత చదువుతుంటే ఎంత బాగా వర్ణించారు అని ఇంకా అనిపిస్తోంది.

  6. శతకందసౌరభము గురించి manohar అభిప్రాయం:

    09/09/2010 3:17 am

    మోహన గారూ,
    సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వీడెవడు తెలిసీ తెలియని వాడిలా మాట్లాడుతున్నాడనుకుంటారేమో ,అసలు పట్టించుకుంటారో లేదో అనుకున్నాను.

    వృత్తిరీత్యా ఐ.టి. ఇంజినీర్ గా పని చేస్తున్నాను. ఎప్పటికైనా పద్యం రాయడం నేర్చుకోవాలని కోరిక. ప్రస్తుతం కందపద్యాలు వ్రాయడం నేర్చుకుంటున్నాను. మీరు చెప్పిన విషయాలు గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తాను. చంధస్సు మీద మీరు రాసిన వ్యాసాలు అంతర్జాలంలో దొరుకుతాయా? తెలుపగలరు.

    మొత్తం చదివి మళ్ళీ నా అభిప్రాయం చెప్తాను. స్పందించినందుకు మరొక్కసారి ధన్యవాదాలు.

  7. ఆత్మ ఘోష గురించి Vamsi Krishna Prakhya అభిప్రాయం:

    09/09/2010 1:59 am

    చాలా చక్కని-చిక్కని భావాన్ని కవితగా అందించినందుకు ధన్యవాదాలు. మంచి కవితల కోసం ఎదురుచూస్తున్న నన్ను పన్నీటి జల్లులా ఈ కవిత ఒక్కసారి తట్టిలేపింది. ప్రతి పాదంలోను అద్భుత ప్రయోగాలున్నాయి.

    అత్తరు వేసిన నీ ఆలోచనల తొక్కిసలాటలో
    నూర్పిడి మిట్టనై నలిగిపోతున్నా

    ఇది చాలా అద్భుతమైన ప్రయోగం.
    – వంశీకృష్ణ ప్రఖ్య

  8. బందీ గురించి Gandhi అభిప్రాయం:

    09/08/2010 11:28 pm

    నారాయణ గారు,
    కవిత చదువుతుంటే మొదట్లో వస్తువు గురించి చాలా ఊహలు చేసాను.
    చాలా బాగుంది. ఇంకా ఎన్నో వ్రాస్తారని ఆశిస్తున్నాను.
    ఆశీర్వాదాలు.. గాంధీ.

  9. బడి పిల్లల అయోమయం గురించి kanna అభిప్రాయం:

    09/08/2010 1:38 pm

    చాలా బాగుంది. మంచి కథను అందించినందుకు కృతజ్ఞతలు.

  10. తోడు గురించి Varun అభిప్రాయం:

    09/07/2010 11:20 pm

    శర్మ గారూ
    మీరేం చెప్పదలచు కున్నారండీ?