పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16479

  1. పలుకుబడి: సంఖ్యాపదాలు – 3 గురించి Raja Piduri అభిప్రాయం:

    11/05/2011 1:38 am

    పదింబదిగ (లేదా) పది పదికి (లేదా) పదివేలకు : ఈ ప్రయోగాలకి “అన్ని విధాల, గట్టిగా, చక్కగా” అన్న అర్థాలిచ్చాడు బ్రౌన్ గారు. అది ఇక్కడ సరిపోతుందా సార్?

  2. కినిమా మాసపత్రిక: భానుమతిపై వ్యాసం గురించి Rohiniprasad అభిప్రాయం:

    11/05/2011 12:11 am

    Raja garu. Your observations are very perceptive.
    చందమామతో బాటుగా కినిమా బాధ్యతలు కూడా చేపట్టినందువల్లనేమో గాని ఈ వ్యాసంలో కొంతభాగం మరెవరో రాసి జత చేసినట్టుగా అనిపించింది. పత్రికకే తప్ప రచయితలకు పేరు రాకూడదనే చక్రపాణి పట్టింపు కారణంగా పూర్తిగా ఒకరే రాయాలనే నియమం పక్కన పెట్టినట్టుగా అనిపిస్తుంది. చందమామలో విచిత్ర కవలలు అనే సీరియల్ రాసిన రాజారావు గురించి కూడా ఎవరికీ తెలియదు.

  3. గాన సూర్యకాంతి: బాలమురళి గురించి srinivasaraov,khammam అభిప్రాయం:

    11/04/2011 3:48 pm

    getting two feelings happy and misery. It is our curse for not exploiting him.

  4. కినిమా మాసపత్రిక: హాస్యనటుల అనుభవాలు గురించి srinivasaraov,khammam అభిప్రాయం:

    11/04/2011 3:34 pm

    Sir,

    My father acted in JEEVANNMUKTI, BALANAGAMMA(GEMINI), BHUKAILAS(1st), and CHANDIKA. Can I get photos or songs of Master ViSWAM. It’s the greatest help for me.Or, any suggestions please?

  5. పహాడీ రాగం అందాలు గురించి srinivasaraov,khammam అభిప్రాయం:

    11/04/2011 3:20 pm

    I eagerly await articles from KRP, Paruchuri. I am one such person who uses list of ragas (sent) by Paruchuri and eemaata essays of KRP and trying something on my old harmonium. Please do continue sir. I am able to know something from the experiences of sri KRP. Thanq very much sir, for sharing information. People like me are benefiting from your incomparable analytical articles.

  6. తిక్కన భారతంలో పలుకులపొందు గురించి Tahataha అభిప్రాయం:

    11/04/2011 3:07 pm

    నా ఒళ్ళు పులకించిన అభిప్రాయాన్ని సహృదయంతో అర్థం చేసుకున్న మీకు కృతజ్ఞతలు. విశ్వనాథ చెళ్ళ పిళ్ళ వారిని గురించి రాస్తూ “…సమీచీన్య పథ్యా గతున్డై మరియు తానై కైత కొగ్గన్…” అని రాసారు. ఈ పదబంధానికి నిజమైన అర్థం ఆచార్య భద్రిరాజు వ్యాసం సోదాహరణంగా సోపపత్తికంగా తెలియజేసింది. వారికి నా ధన్యవాదాలు. అలా సామీచీన్య పథ్యా గతుడై మరియు తానై కైత కొగ్గిన మొట్ట మొదటి తెలుగు కవి తిక్కనే అని గూడా తెలిసింది.

  7. లోపలి పిలుపు విని గురించి Raja Piduri అభిప్రాయం:

    11/04/2011 2:35 pm

    మళ్ళీ మళ్ళీ వింటున్నాము ప్రసాద్ గారూ !
    మునుపు శతాబ్దాల నించి ఎవరో తత్వాన్వేషకులు మహతి మీటుకుంటూ మీ హృదయాల్లోంచీ నరాల్లోంచీ
    తీగ సాగారనిపిస్తోంది.
    పదాలు అర్థమయ్యీ కాకుండా అంతా ఏదో మార్మికం గా ఉంది.
    ఊపని ఊయల , రాజేయని అగ్గి, రాత్రి పవలు దీని చిచ్చు….

    ఆగిన తలపుల నడుమన నీ అడుగుల సడి విన్నట్లు ..

    కృతజ్ఞతలు స్వామీ !

  8. కినిమా మాసపత్రిక: భానుమతిపై వ్యాసం గురించి Raja Piduri అభిప్రాయం:

    11/04/2011 12:49 pm

    శైలి పరంగా చూస్తే ఈ వ్యాసం (కనీసం చాలా భాగం) కొ. కు. వ్రాసిందే అనిపించకమానదు. కేతు వారు చెప్పినట్లు “ప్రథమ పురుష లో.. ఆత్మీయంగా.. చెప్పే ..జానపద కథకుడి అలవోక ధోరణి ” చాలా వాక్యాలలో చూడవచ్చు. ఇది కాక కొ. కు. కే ప్రత్యేకమైన పద ప్రయోగాలకీ, వాక్య నిర్మాణాలకీ ఉదాహరణలు కూడా ఈ వ్యాసం లో చాలానే ఉన్నాయి.
    “పని పెట్టుకుని అభ్యసించలేదు”
    “చేరినాక…..చదువుకోసాగింది”
    “చాలించి, … ఉంచి, … వెతకసాగారు. ”
    “లేదుపొమ్మన్నారు”
    “కాంచన మాలచిత్రమైతే, అడిగారూ ? ”
    శక్తి “ఇంత” ఉన్నది గనక
    “కొంత నటించి ఉన్నది”
    “గుప్పెడు పొట్టి”
    బరువు “దిగిపోయిన దానల్లే”
    “హీరో ఉండరాదు ! ”
    పాత్ర “కు” నటించేసింది
    “వేషం వెయ్యనన్నావటనే ? ”
    పుచ్చుకున్నది
    హెచ్చు గా వుంటుందని అప్పుడే తెలుసు
    “ఇంకేం ! ”
    పెళ్ళాడదలచలేదు
    పెళ్ళాడగోరుతున్నట్లు
    మనసు రాయి చేసుకుని కూర్చున్నది
    “ఇట్లాగుటే జరగవలసింది ? ”

    వాక్యాలనీ, శైలి ని అటుంచి, వ్యక్తి లోని అత్యంత కీలకమైన, ముఖ్యమైన లక్షణాన్ని సూటిగా చెప్పగలగడం కొ.కు. కు మాత్రమే సాధ్యం అనిపిస్తుంది. -“అయిన దానికీ కానిదానికీ ఉబ్బి తబ్బిబ్బు అయే అలవాటు ఆమెకు లేదు. .. తనను చూసి తానే విస్మయంచెందే మనస్తత్వం ఆమెకు లేదు. “- ఈ వాక్యం భానుమతి వ్యక్తిత్వానికి దర్పణం. ఆయువుపట్టు.
    ఇందులో వ్యక్తం చేసిన భావాల లో కొ. కు. కి పేచీ ఉండే వే మీ లేవ నే అనిపిస్తోంది, – వ్యాసం చివరలో సెప్టెంబర్ నెల లో పుట్టిన వాళ్ళను గురించి రాసింది తప్ప.
    ఈ ఒక్క పేరా లో మాత్రం ఇంకెవరో ఈ రచనలో ” చెయ్యి చేసుకున్నా”రనిపిస్తుంది. కానీ, వేరే వాళ్ళ వత్తిడుల వల్లా, బలవంతం వల్లా కొ. కు. కొన్ని సినిమా సమీక్షలు రాసారని విన్నాను. ‘చంద్ర హారం’ లో కత్తి యుద్ధాలు బాగున్నాయనీ, “అ. చే. ప. కూ.” ఒక సమగ్ర హాస్య చిత్రమనీ ఇత్యాది – వాటి జాబితా లో దీన్ని (కనీసం సెప్టెంబర్ నెల లో పుట్టిన వాళ్ళని గురించిన ప్రస్తావన) వేసుకోవచ్చేమో !
    ఇంత విలువైన వ్యాసాన్ని అందించినందుకు కృతజ్ఞతలు.

  9. ఒంటిచెట్టు గురించి మోహన అభిప్రాయం:

    11/04/2011 11:24 am

    చాల బాగుంది మీ కవిత. మీరిలాగే వ్రాస్తూ ఉండండి, మీకు నా జోహారులు. విధేయుడు – మోహన

  10. పహాడీ రాగం అందాలు గురించి Rohiniprasad అభిప్రాయం:

    11/04/2011 8:14 am

    రాజాగారూ, మీరన్నది నిజమే. ఎవరైనా తూలీ సోలెను తూరుపు గాలీ వినాలనుకుంటే ఇక్కడ నొక్కండి.