ఈమాట సంపాదకులకు నమస్కారం! ఈమధ్యనే ఈమాట గురించి తెలుసుకొని అభిమానినయ్యాను. మా గ్రామం లో ఇంటర్ నెట్ సదుపాయం లేదు. కాబట్టి ఈమాట సంచికలు పుస్తకరూపంలో(ఆన్ లైన్ లో కాకుండా) ఉంటే చెప్పగలరు. ప్రస్తుతానికి కొన్ని నెల సంచికలను ప్రింటు తీసుకొని మా వూరి గ్రంథాలయంలో మీ పేరు మీద ఉంచాను. ఇదేమైనా copy rights ఉల్లంఘన అయినట్లయితే తక్షణమే తెలుగుపగలరు.
-చంద్రశేఖరం
[దురదృష్టవశాత్తూ ఈమాట సంచికలు పుస్తకరూపంలో లేవు. మీరు ప్రింటు తీసుకొనడానికి ఏ అభ్యంతరమూ లేదు. ఈమాటపై మీ అభిమానానికి కృతజ్ఞతలు – సం.]
చాలా బాగుంది దమయంతి గారూ. ఏదో లోకంలోకి తీసికెళ్ళారు. మా చిన్నతనం దాదాపుగా అలాగే ఉండేది. ఆ తలంటి పోయటము, ఆ రాగి కాగులో వేడి నీళ్ళు కాగటమూ, కంట్లొ కుంకుడు రసము పడితే రాళ్ళౌప్పు నోట్లొ వెయ్యటము… పేరంటానికి నేనే వెళ్ళి పిలిచేదాన్ని. బొమ్మల పేరంటము, భోగీపళ్ళు పోయించుకోవటం, ఆ బంతిపూల రెక్కలు, చిల్లర పైసలు ఏరటము, పెద్దవాళు కోప్పడటము అంత జ్ఞాపకము చేసారు. ధన్యవాదములు చిన్నతనాన్ని జ్ఞాపకం చేసినందుకు.
నూజివీడు నుంచి బెజవాడ యెర్రని యెండాకాలంలొ చేసిన బస్సు ప్రయాణాలు గుర్తొచ్చినయ్.
ఒక సారి: బస్సులొ చోటు లేదు అనడం అబద్ధం. చీమ దూరే సందు లేదు అనటం కొంత నిజం. ఒక ముసలామె కట్టె సాయంతో ఎలాగో ఎక్కి నుంచుందో, వంగిందో, కూచుందో తెలియటం లేదు. నూజివీడు నుంచి బెజవాడకు రెండు బస్సు తోవలు. ఒక తోవ ఆగిరిపల్లి మీదుగా, రెండోది ఈదర మీదుగా. కండక్టర్ వచ్చాడు. ‘యేమ్మా యేడకి?’, ‘ఆగిరిపిల్లికోటికెట్టీ బాబూ’, సన్నని మాట వినిపించింది. ‘ఈ బస్సు ఆగిరిపిల్లి మీదగా ఎల్దు ఇదీదరామీదగా, దిగు దిగు’. ‘పోన్లే బాబూ యీదర్లో గూడా మా సుట్టాలున్డారు’.
I apologize for commenting again. This is not to point out any deficiencies in the above presentations but I started remembering that I saw the name several times in Indian documentaries long ago and started googling. Because of his peripatetic life, probably information about him is scattered around the world. From Internet it seems that at least two of his sons accompanied him on occasions and there is documentary by one of his sons. The trailer is here. It would be good to know more about him, his contributions and influence.
నాగరత్నం గారిపై వ్యాసం గురించి మాటలు వెతుక్కోవలసి వస్తోంది. మా సాహిత్య, సాంస్కృతిక సంస్థ ‘తెలుగు రథం’ ద్వారా నిర్వహించె శాస్త్రీయ సంగీత కార్యక్రమాల్లో భాగంగా నాగరత్నం గారిపై ప్రత్యెక కార్యక్రమాన్ని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాము. ధన్యవాదాలు.
కొంపెల్ల శర్మ
ఈమాట గురించి గురించి chandu అభిప్రాయం:
02/18/2012 3:45 pm
ఈమాట సంపాదకులకు నమస్కారం! ఈమధ్యనే ఈమాట గురించి తెలుసుకొని అభిమానినయ్యాను. మా గ్రామం లో ఇంటర్ నెట్ సదుపాయం లేదు. కాబట్టి ఈమాట సంచికలు పుస్తకరూపంలో(ఆన్ లైన్ లో కాకుండా) ఉంటే చెప్పగలరు. ప్రస్తుతానికి కొన్ని నెల సంచికలను ప్రింటు తీసుకొని మా వూరి గ్రంథాలయంలో మీ పేరు మీద ఉంచాను. ఇదేమైనా copy rights ఉల్లంఘన అయినట్లయితే తక్షణమే తెలుగుపగలరు.
-చంద్రశేఖరం
[దురదృష్టవశాత్తూ ఈమాట సంచికలు పుస్తకరూపంలో లేవు. మీరు ప్రింటు తీసుకొనడానికి ఏ అభ్యంతరమూ లేదు. ఈమాటపై మీ అభిమానానికి కృతజ్ఞతలు – సం.]
అలనాటి పాట: ఊర్మిళాదేవి నిద్ర గురించి Krishnamohanreddy అభిప్రాయం:
02/18/2012 4:22 am
నేను చిన్నప్పుడు విన్న చెక్క భజన పాటలు గుర్తుకొస్తున్నాయి. పాట పాడిన విధము కూడా బాగుంది.
భోగి తలంట్లు గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:
02/17/2012 10:21 pm
అవును. కుంకుడు రసం కంట్లో పోవడం..ఉప్పు రాయిని బుగ్గనుంచుకోడం… ఒక చేత్తో కన్ను మూసుకునే.. .అలా ఒంటి కన్నుతో ఇల్లంతా తిరగడం… ఆ కథంతా ఒక్కసారిగా గుర్తుకొచ్చింది, మీరన్నాక! ! మరుగైన మరో జ్ఞాపకాన్ని గుర్తుచేసినందుకు, థాంక్సండి, విష్ణు వందన గారూ! మీ పేరు బాగుంది! గుర్తుపెట్టుకునేలా..
శుభాకాంక్షలతో-
ఆర్.దమయంతి.
భోగి తలంట్లు గురించి vishnuvandana అభిప్రాయం:
02/17/2012 11:20 am
చాలా బాగుంది దమయంతి గారూ. ఏదో లోకంలోకి తీసికెళ్ళారు. మా చిన్నతనం దాదాపుగా అలాగే ఉండేది. ఆ తలంటి పోయటము, ఆ రాగి కాగులో వేడి నీళ్ళు కాగటమూ, కంట్లొ కుంకుడు రసము పడితే రాళ్ళౌప్పు నోట్లొ వెయ్యటము… పేరంటానికి నేనే వెళ్ళి పిలిచేదాన్ని. బొమ్మల పేరంటము, భోగీపళ్ళు పోయించుకోవటం, ఆ బంతిపూల రెక్కలు, చిల్లర పైసలు ఏరటము, పెద్దవాళు కోప్పడటము అంత జ్ఞాపకము చేసారు. ధన్యవాదములు చిన్నతనాన్ని జ్ఞాపకం చేసినందుకు.
విష్ణు వందన.
స్మరణ: కథ నచ్చిన కారణం గురించి prabandh అభిప్రాయం:
02/17/2012 8:55 am
Hello,
If you dont mind, could you please tell me where I can get this book?
ప్రయాణం గురించి తఃతః అభిప్రాయం:
02/16/2012 2:59 pm
నూజివీడు నుంచి బెజవాడ యెర్రని యెండాకాలంలొ చేసిన బస్సు ప్రయాణాలు గుర్తొచ్చినయ్.
ఒక సారి: బస్సులొ చోటు లేదు అనడం అబద్ధం. చీమ దూరే సందు లేదు అనటం కొంత నిజం. ఒక ముసలామె కట్టె సాయంతో ఎలాగో ఎక్కి నుంచుందో, వంగిందో, కూచుందో తెలియటం లేదు. నూజివీడు నుంచి బెజవాడకు రెండు బస్సు తోవలు. ఒక తోవ ఆగిరిపల్లి మీదుగా, రెండోది ఈదర మీదుగా. కండక్టర్ వచ్చాడు. ‘యేమ్మా యేడకి?’, ‘ఆగిరిపిల్లికోటికెట్టీ బాబూ’, సన్నని మాట వినిపించింది. ‘ఈ బస్సు ఆగిరిపిల్లి మీదగా ఎల్దు ఇదీదరామీదగా, దిగు దిగు’. ‘పోన్లే బాబూ యీదర్లో గూడా మా సుట్టాలున్డారు’.
వేణునాదం ఆగింది! గురించి Gaddeswarup అభిప్రాయం:
02/16/2012 5:28 am
I apologize for commenting again. This is not to point out any deficiencies in the above presentations but I started remembering that I saw the name several times in Indian documentaries long ago and started googling. Because of his peripatetic life, probably information about him is scattered around the world. From Internet it seems that at least two of his sons accompanied him on occasions and there is documentary by one of his sons. The trailer is here. It would be good to know more about him, his contributions and influence.
ఒక నేను, కొన్ని నువ్వులు గురించి Anusha అభిప్రాయం:
02/15/2012 4:25 pm
శీర్షిక చాలా బాగుంది. కథ బాగుంది కాని వేరు వేరు సందర్భాలని వివరించారనిపించింది. కాని అంతా ఒకటే కథ అన్న భావం రాలేదు అని నా ఉద్దేశము.
వేణునాదం ఆగింది! గురించి Gaddeswarup అభిప్రాయం:
02/15/2012 5:56 am
The Wikipedia article has some nice links to his work.
విద్యాసుందరి గురించి k b s sarma అభిప్రాయం:
02/15/2012 4:42 am