పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. పొదుపు సమీకరణాలు గురించి lakshmi అభిప్రాయం:

    04/21/2012 10:34 pm

    చాలా బావుంది . కడుపుబ్బ నవ్వుకున్నాము.

  2. కినిమా పత్రిక నుంచి – 2 గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:

    04/21/2012 1:24 pm

    Radha Krishna garu,

    I try in vain to find some kind of justification for harboring baseless likes and dislikes, especially in matters of non pragmatic pursuits. To find a kindred liking in others urges us to share and to exchange.
    Here I must admit that what I possess is not information but curiosity. Hence I can give only an attempt at a clumsy response.

    Once you get dislocated to a distant university for studies, you miss your native place; You turn nostalgic. Nostalgia gives rise to mawkish longing and to chauvinism.

    Any thing out side the syllabus was entertainment. Out of my chauvinistic zeal for the dialect and for the region, I searched for Keyurabahu Chariitra, Daggupalli Duggana, Bhattu murthy, Jayapa and his sisters [you fail to align your zeal to the accomplishments in Kshretrayya] Among the local names there cropped up one Daliparti Pichchihari. But his recorded music was unavailable. After many sets of foolish questions, I was directed one summer vacation to other players of the same instruments. First to K.P.Arunachalam; You are mesmerized by his Abheri. Then to Saida Pet S.Natarajan; Then to Namagiri pettai K.Krishnan, whose Sudhdha dhanyasi leaves you in a trance. Lastly, long after you have found your craving to be unassailable, you are introduced to T.N.Rajaratnam Pillai. Such a haphazard introduction culminates in uneducated, baseless addiction of a coarse, maverick course.

    The awe and the infatuating indulgence in the sensuous timbre and the delicate maneuvering have been so happened due to the disorderly acquisition of our tapes and LPs; and due to our random introduction to the art of nadaswaram.

    As it is in the case of poetry, music caters to emotion, rather than to reasoning faculty. Once you start pampering your self with sensual indulgence, your faculties of reasoning take a beating. You become less pragmatic and more and more utopian.

    –Siddineni Bhava Narayana

  3. కొవ్వుపుంజి గురించి శారద అభిప్రాయం:

    04/20/2012 4:49 pm

    మంజుల గారూ, నాసీ గారూ, భావ నారాయణ గారూ,
    అనువాదాన్ని చదివి మీ అభిప్రాయం పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    నాసీ, – మీరు ప్రస్తావించిన చలం కథ చదివిన గుర్తు లేదు. ఏం కథ అది?

    భావ నారాయణ గారూ, – మీ థీసిస్ లో నా అభిమాన రచయితలున్నారు! వీళ్ళని పోలుస్తూ నేను కొన్నేళ్ళకింద విపుల పత్రికలో రాసిన వ్యాసం చదివి మీ అభిప్రాయం చెప్పగలరు వీలైతే! లిటరేచర్ విద్యార్థులైన మీ అభిప్రాయంతో నా వ్యాఖ్యానాన్ని validate చేసుకోవలన్న ఆశ, అంతే!

    శారద

  4. త్రిపురాంతకేశ్వరా! గురించి sridevi అభిప్రాయం:

    04/20/2012 10:17 am

    Namaskaram.

    This is just wonderful. Is there anyway I can get the MP3 of this kruthi?

    Thanks so much,
    Sridevi

  5. కినిమా పత్రిక నుంచి – 2 గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    04/20/2012 6:24 am

    The following comment is more about TN Rajaratnam Pillai than on the original essay. First a couple of quick links … The magazine “Sruti” published by Music Academy in Madras brought out a special issue in December 1998, commemorating his birth centenary. It can be purchased on-line I believe. Then, Randor Guy, the phenomenal film/cultural historian has an informative writeup in The Hindu.

    In fact, Rohiniprasad gaaru wrote some brief intro in his blog some years ago: A large number of his audio recordings are available on-line. Just give his name in Google. 20+ live concerts of his are available at sangeethapriya.org

    To end, there is a good doctoral dissertation (Univ. of Washington, 1992) from Y. Terada; “Multiple Interpretations of a Charismatic Individual: The Case of the Great Nagasvaram Musician, TN Rajaratnam Pillai”. He also published a paper on TNR: T. N. Rajarattinam Pillai and Caste Rivalry in South Indian Classical Music; Ethnomusicology; Vol. 44, No. 3; 2000. Terada’s work goes beyond analyzing TNR’s music.

    Regards, Sreenivas

  6. స్నానాల గదిలో గురించి శారదా కిషోర్ అభిప్రాయం:

    04/20/2012 5:09 am

    ఆవిరి నిండిన ఈ గదిలో నేనొక్కదానినే

    ఈ లైను. ఎవరికయినా యిక్కడ దొరికే ఏకాంతం మరెక్కడా దొరకదు. నీటితొట్టెలో నీళ్ళోసుకుంటూనే అర్కేమేడీసు పెద్ద ఫార్ములా కనిపెట్టాడు. ఈ కవిత ఆశు కవిత్వం లాగ ఉంది. ఇలాంటి కవితలు మరిన్ని రాస్తారని ఆశిస్తూ…

  7. కడపసీమలో అపురూపమైన కలివి కోడి గురించి Anand Kalinadhabhatla అభిప్రాయం:

    04/19/2012 2:16 pm

    ఈ చిత్రాలు ఆఫ్రికా లో నివసించే Double-banded Courser పక్షివి. కడప జిల్లా లోని Cursorius bitorquatus కాదు.

  8. పిలూ రాగం గురించి ramakrishna అభిప్రాయం:

    04/19/2012 9:54 am

    రొహిణీ ప్రసాద్ గారికి నమస్కరాలూ ధన్యవాదాలూ! పిలూ రాగంలో నాకు ‘విరహం’ వినిపిస్తుంది – అందులో నేను విన్న compositions వల్ల కావచ్చు. 1967 లో వచ్చి బాగా పేరు పొందిన Call of the valley ఆల్బం లో కూడా పిలూ స్వరూపాన్ని సంక్షిప్తంగా వివరించారు Pt. హరి ప్రసాద్ చౌరసియా, Pt. శివకుమార్ శర్మ, Pt. బ్రిజ్ భూషణ్ కాబ్రా.

  9. కొవ్వుపుంజి గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:

    04/19/2012 8:45 am

    శారదగారూ,
    మొపాసా కథ, అందునా Bowle de Suif ఎన్నుకొన్నందుకు మీకూ, ప్రచురించినందుకు ఈ మాట వారికీ అభినందనలు.

    మీకు తెలిసిఅన విషయాలే – నవలా,పోయిట్రీ, కథానికా; ఈ మూడు ప్రక్రియల్లోనూ మొపాసా జీనియస్ అమోఘంగా వికసించినది కథానికలోనే. నడి వయసులో కాలం[46వ ఏట, 1893లో] చాలించిన ఈ అసమాన ప్రతిభావంతుడు కథానికా ప్రక్రియకి దిశా నిర్దేశం చేశాడు. నేను ఏరియా స్టడీలో లేకున్నా నా సిద్ధాంతవ్యాసం [Art and Artifice in W. S. Maugham] కోసం తప్పని సరై చెఖొవ్, మొపాసాలని చదవ వల్సి వచ్చింది.

    We used for our area study the only version available that was translated into English by Albert M.C. Mc Master and A.E.Hendeson. Boule de suif was adopted in 1945 as a French historical drama, a film by the same title; and was directed by Christian-Jacque.

    In Maupassant, the neutral tone of the narrator stands in contrast to the cynical stoicism underlying the theme. His endings, often reversing the significance OF THE EVENTS with retrospective results, are means to an end. His handling of the narration, in pieces like “The Chair Mender“, implies at the limitations of the human spirit and the inadequacies in human relations. His plots unfold the essential component of hollowness in human effort and the futility in physical triumph. Often, the very victory nullifies the motive for the struggle. And the creative genius is at its best in handling the nuances in human emotions.

  10. కినిమా పత్రిక నుంచి – 2 గురించి ఈమాట అభిమాని అభిప్రాయం:

    04/18/2012 5:18 pm

    సంపాదక వర్గానికి,
    ఈమాట అంటే కాస్త నాణ్యతకి విలువనిస్తారనీ, ప్రచురించే ప్రతీ వ్యాసమూ వేరెవరిచేతనయినా ప్రచురణకి ముందు సమీక్షిస్తారన్న నమ్మకం ఉండేది. ఈ నమ్మకం ఒట్టి భ్రమేనని ఈ వ్యాసం చదివాక తెలిసింది.
    కుటుంబరావు గారు నాలాంటి వాళ్ళెందరికో అభిమాన రచయిత. ఏభయ్యేళ క్రితం నాటి రచనలు కూడా ఇప్పటికీ చదివి ఆనందిస్తాను.

    ఆయన కినిమా పత్రికలో రాసిన పాత కాలం నాటి వ్యాసం ప్రచురించారు. అంతవరకూ బానే వుంది. కానీ – “అరవయ్యేళ్ళ క్రితం ఎన్.టి.రామారావు” ఉప శీర్షిక క్రింద రాసినవి మీ సమీక్షకుల దృష్టినీ, మీ సూక్ష్మ దృష్టినీ ఎలా తప్పించుకున్నాయోననీ ఆశ్చర్యం కలిగింది. ఏ సంఘటనకయినా ప్రత్యక్ష సాక్షం లేని విషయాలు చెప్పేటప్పుడు “ట” చివర్న చేరుస్తాం. అంటే దానికి సాధికారత లేదని పరోక్షంగా చెప్పడం. మరి మీరు ఇటువంటిది ఏ నాణ్యతా సూత్రాలననుసరించి ప్రచురించారు? అలాగే – రామారావు కొడుకు రామకృష్ణ 500 రూపాయిల సైకిలు తొక్కుకునే విషయానికీ, కుటుంబరావు గారి రాసినదానికీ ఏవైనా సంబంధం వుందా? ఇంకా -ఎబ్బెట్టుగా తోచిన మరో వాక్యం – “రామారావు, నాగేశ్వరరావు సరదాగా టెన్నిస్ ఆడడం కె.వి.రెడ్డి గమనించారనీ, అందులో ఒక బాల్ మిస్ అయిన రామారావు కోపంతో దాన్ని దూరంగా పడేట్టు బాదాడనీ, అది చూసి రెడ్డిగారు పాతాళభైరవిలో నాగేశ్వరరావుకు బదులుగా రామారావును తీసుకున్నారనీ ఎక్కడో చదివాను.”. ఇందులో రామారావు బాల్ మిస్ అయి దూరంగా బాదితే కె.వి.రెడ్డి గారికి పాతాళభైరవిలో నాయక పాత్రని ఎన్నుకోవడం అనేది, సాహిత్య జ్నాపకంగా నెమరు వేసుకోవడం చూస్తే నవ్వొచ్చింది.

    ఇటువంటి సాధికారతలేని విషయాలు బ్లాగుల్లో చూస్తూ వుంటాం. “ట”, “ఎక్కడో చదివాను”, “చెప్పగా/అనుకోగా విన్నాను” వంటివి గాసిప్స్ గా చెప్పుకోడానికి బావుంటాయి. అంతే కానీ సాహిత్య పత్రికలో ఇటువంటి వాటికి చోటివ్వడం బాధాకరం. ఇంకా గట్టిగా చెప్పాలంటే – నాణ్యతని తుంగలో తొక్కేయడం. కుటుంబరావు గారి పేరుక్రింద ఇలాంటివి చొప్పించడం ఆయన రచనలకి ఏ మాత్రం గౌరవాన్నివ్వదు. సరికదా చులకన అభిప్రాయం కలగచేస్తుంది. రేప్పొద్దున్న మరొకరు గతంలో వచ్చిన శ్రీశ్రీ వ్యాసం పేరుచెప్పి ఇటువంటివి రాస్తే మీరు ప్రచురిస్తారా?

    ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. సమాధానం అవసరం లేదు. చర్యలని మించిన జవాబుదారీలుండవు ఈ ప్రపంచంలో!

    -ఈమాట అభిమాని