పాఠకుల అభిప్రాయాలు

హనుమంతరావు results: 290

  1. A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    11/13/2008 11:04 pm

    మాలతి గారికి,

    I did not find the exact reasons why you wrote in English – I might have missed. In your foreword, you did mention Women Writing in India and Knit India through Literature as two major works that set Telugu women’s writing in the larger context; I assumed you wanted to supplement them with a more critical analysis and hence you wrote in English.

    మీకు పుస్తక సమీక్ష అంటే పుస్తక పరిచయం. నాకు సమీక్ష అంటే గుణదోష విచారణ చేసేది, కేవలం పరిచయం చేసేది కాదు. నిఘంటువు ప్రకారం సమీక్ష అంటే తీవ్రమైన చూపు, జాగ్రత్తగా పరిశీలించేది.

    కొడవళ్ళ హనుమంతరావు

  2. A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu గురించి baabjeelu అభిప్రాయం:

    11/12/2008 6:05 am

    కొడవళ్ళ హనుమంతరావు గారూ, నమస్తే. మీరు రాసినట్టు ఈ పుస్తకాన్ని తెలుగులో రాసినట్టుంటే మరీ బాగుండేది. వేలూరి గారు ఇచ్చిన synopsis బాగుందనడం మాత్రం బాగోలేదు.

    She concludes it with clear understanding of feminism అని వేలూరి వారు వొప్పుకున్న paragraph ని ఎలా వొప్పుకోవాలీ? “blaming it on entirely on male population” lopsided ఎలా అయిందీ? మగవాళ్ళ వల్ల కాకపోతే ఇంకెవరివల్ల ఆడవాళ్ళు అలా వున్నారు? పశు పక్ష్యాదులూ, చెట్లూ చేమలూ అష్టదిక్పాలకులూ మరియూ పంచభూతములూ మధ్యలో జొరబడలేదే?
    లూషన్ చెప్పింది అక్షరలక్షలు కదా? ఆడపిల్ల పాడయిపోయిందని సంఘం బాధపడి పోవడం మగవాడివల్లేకదా? పాడైపోయింది, పాడైపోయింది. మన పరువు గంగలో కలిసిపోయింది అని గగ్గోలు పెట్టేది ఆ ఆడపిల్లని పుట్టించిన వాడూ, ఆ పిల్ల టోడబుట్టిన మగవాళ్ళూ కాదా? కాదా?

    ఆయనెవరో, “లక్ష్మన్న” గారి “రే” వ్యాసం కి రాసిన అభిప్రాయంలో ఇక్కడంతా పాత తరం అనీసేరు. నిజవేఁ కాబోలు. కానీ ఇంత పాత తరం అనుకోలేదు. పుస్తకాన్ని సమీక్ష చెయ్యడం అంటే అబ్బో అబ్బో అని పొగడక్కర్లేదు. వొప్పుకోని విషయాల్లో ? పెట్టలి సమీక్షకుడో, synopsis రాసేవాళ్ళో.

    హనుమంతరావుగారూ, మీరు చెప్పినట్టు ఈ పుస్తకం needs more critical review. అయినా 2008 లో డెబ్భయ్యైదు ముందు నవలామణులు రాసిన వాటి గురించి రాసిన పుస్తకం పాచి బూరి. పర్లేదు, బానేవుంది అనడం “సరస్పతికి” అపచారం. అలా అనడం వలన నిడదవోలు మాలతి గారిని అవమానించినట్టు కాదు. మనలోని lopsidedness ఇంకా అలాగేవుందని వొప్పుకోడం.
    హనుమంతరావుగారూ, మీరొప్పుకుంటారేమో గానీ, నేనొప్పుకోను.

  3. A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    11/11/2008 9:19 pm

    Congratulations to Malathi గారు on completing the project she started a quarter century ago! I wish she wrote this in Telugu as it would have gained a much wider well-deserved discussion. Veluri గారు gave a good synopsis of the work but what the book needs is a more critical review.

    Kodavalla Hanumantha Rao

  4. పదేళ్ళ “ఈమాట” మాట గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    11/08/2008 11:49 am

    వ్యాసాల్లో వైవిధ్యం

    ఈమాట జన్మానికి కారకులైన రామారావు గారికి అభినందనలు, కృతజ్ఞతలు. “వ్యాస విభాగం రాశిలోనూ, వాసిలోనూ పటిష్టంగా, ప్రతిష్టాత్మకంగా వుంది… వస్తువైశాల్యంతో పాటు …,” అని వారు అన్న దానితో నాకు భేదాభిప్రాయం ఉంది.

    వ్యాసాల్లో ఎక్కువ భాగం సంగీత, సాహిత్య, విజ్ఞాన శాస్త్రాలకి పరిమితం. అది చాలదా, అంతకన్నా వైవిధ్యమేముంటుంది? అనిపించవచ్చు. కాని ఇవి ‘విషయభారమైన’ వ్యాసాలు; కొన్నయితే, జర్నల్స్ పేపర్లలాగా రెఫరెన్సుల జాబితాలతో సహా ఉంటాయి. 🙂 మహానుభావులు, విజ్ఞానవేత్తలు, కళాకోవిదులు – వీళ్ళ ప్రస్తావన లేని వ్యాసం అరుదు. ఇది ప్రవాసాంధ్రులలో ఉన్న లోపమా అన్న అనుమానం వచ్చింది.

    కాని తన వచనం తన కవితలకే మాత్రమూ తీసిపోదని గర్వంగా చెప్పుకున్న దేవులపల్లి కృష్ణశాస్త్రి వ్యాసావళిని చూస్తే వాళ్ళ ఊళ్ళోని రావిచెట్టు మీద చెప్పిన ఓ అమూల్యాభిప్రాయం లాంటి ఒకటి రెండింటిని మినహాయిస్తే, మళ్ళా మహావ్యక్తులు, కవుల పరంపర, కవితా ప్రశస్తి – వాటికే ప్రాధాన్యత. వచనం చెప్పుకోదగ్గదేగాని, వైవిధ్యమెక్కడ?

    కుప్ప తెప్పలుగా వ్యాసాలు రాసిన కొడవటిగంటి కుటుంబరావు ని తిరగేస్తే, “కళలు-శాస్త్రీయ విజ్ఞానం,” “సాహిత్య ప్రయోజనం,” “చరిత్ర వ్యాసాలు,” … – మళ్ళా అన్నీ విషయభారమైనవే!

    సాహితీ ప్రక్రియలన్నిటిలోకీ సుళువైనదీ, అనేకానేక విషయాలకి అనువైనదీ, వ్యాసం: “There are as many kinds of essays as there are human attitudes or poses, as many essay flavors as there are Howard Johnson ice creams. The essayist arises in the morning and, if he has work to do, selects his garb from an unusually extensive wardrobe: he can pull on any sort of shirt, be any sort of person, according to his mood or his subject matter — philosopher, scold, jester, raconteur, confidant, pundit, devil’s advocate, enthusiast.” — EB White.

    ఈమాట వ్యాసాల్లో కూడా వైవిధ్యం పెరగాలి. ఇప్పుడు రాస్తున్న వాళ్ళు వేరే విషయాల మీద కూడా దృష్టిసారించాలి. రాయనివాళ్ళు ఇదో బ్రహ్మవిద్య కాదని గ్రహించి ప్రయత్నించాలి.

    అలాగని వ్యాసాలు రాసి పేరుప్రతిష్టలు గడించాలనుకుంటే అది దురాశే. ఆ భాగ్యం కలగాలంటే కవితలూ, కథలూ, నవలలూ రాయండి. “ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు?” అన్న పాదం మన భాష ఉన్నన్నాళ్ళూ నిలుస్తుంది. పూలు పూసినంత కాలం “ఓ పువ్వు పూసింది” చదువుకుంటాం. “అతడు-ఆమె,” మనం, మధ్య సంబంధాల మాటొచ్చినపుడల్లా శాంతం గారు మన మనసులో మెదులుతూనే ఉంటారు. అందుకే వాటికున్న యోగ్యత వ్యాసాలకి లేదు, ఉండబోదు.

    అందుకే సాహిత్యకారుల్లోకెల్లా కవులకీ, కథకులకీ, నవలాకారులకీ పెద్ద పీట. అందుకు తగ్గట్టుగా ఈమాట రచయితలు ఎదుగుతారని ఆశిస్తూ,

    కొడవళ్ళ హనుమంతరావు

  5. విన్నపము గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    11/04/2008 11:51 pm

    అగ్నిహోత్రుడు గారూ,

    నేను మిమ్మల్ని తూలనాడ లేదు; మీ పరిహాసం అనుచితం అని విమర్శించాను – ఆత్మీయంగా కాకపోయినా, నాదృష్టిలో సహేతుకంగా.

    తెలుగు ప్రాచీన హోదా గురించి నాకు తెలియదు; ABK ఎలాంటి మార్క్సిస్టో – కరడుగట్టిన వాడో, సుతిమెత్తని వాడో గూడా తెలియదు. మీ ప్రతిస్పందన చదివింతర్వాత, ABK 70, 80 లలో రాసిన సంపాదకీయాలు చాలా చూశాను – తెలుగు విశ్వవిద్యాలయం, గిడుగు, గురజాడ, వ్యవహారిక భాష, గాంధీ, భావే, వివేకానందుడు, … ఇలాంటి చాలా విషయాల మీద.

    అవి చదివితే, మీ పరిహాసం అనుచితమైనదన్న భావన మరికాస్త బలపడింది!

    కొడవళ్ళ హనుమంతరావు

  6. విన్నపము గురించి bhEsghajaM agnihOtruDu అభిప్రాయం:

    11/04/2008 8:42 am

    హనుమంతరావు గారూ!
    గాంధీ గురించి కమ్మ్యూనిష్టులు ఇదివరలో చేసిన పరిహాసం, ఇప్పటికీ కరుడు గట్టిన మార్కిస్టులు చేస్తున్న పరిహాసం ( ఎ.బి.కె. ప్రసాద్ కి ఈ విషయం స్వానుభవం!), ప్రచారం తెలిసి వుంటే, హనుమంత రావు గారు నన్ను ఇంత ఆత్మీయంగా ” తూలనాడేవారు” కారు. అమర్త్య సేన్ పై గాంధీ, మార్క్స్ ల ప్రభావం ఉండటం ఆశ్చర్య పడవలసినది కాదు. అతను academician. మార్కిస్ట్ అవునో కాదో నాకు తెలియదు. సుందరయ్య గారి సంగతి నాకు తెలియదు; క్షంతవ్యుణ్ణి.

    నంబూద్రిపాద్ గాంధిపై ఒక చక్కని పుస్తకం రాసాడు. అప్పట్లో మార్కిస్టు సిద్ధాంతులు అతణ్ణి గేలి చేసి న విషయం, నాకు బాగా తెలిసిన విషయం.

    “మార్కిస్టుల” పై గాంధీ ప్రభావం పరిశీలనాంశం అని మీరన్నది ముమ్మాటికీ నిజం, కరుడు గట్టిన మార్కిస్టులు ఏమంటారో? ఈ విషయంపై చలసానినో, వరవరరావునో కదిలించి చూడాలి!

    విధేయుడు,
    భేషజం అగ్నిహోత్రుడు

  7. విన్నపము గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    11/03/2008 11:00 pm

    భేషజం అగ్నిహోత్రుడు గారి ఆశ్చర్యంతో కూడిన పరిహాసం చదివి ఇది రాస్తున్నాను. స్వంత భాషల వాడుక గురించి గాంధీకీ, మార్క్స్ కీ అభిప్రాయాల్లో చుక్కెదురా? మార్క్సిస్టు అయునవారెవరూ ఏ విషయంలోనూ గాంధీ గారి నుండి స్ఫూర్తి పొందకూడదా? నాటి కమ్యూనిస్టు సుందరయ్య నుండి నేటి నోబెల్ లారేట్ అమర్త్య సేన్ దాకా చాలా మంది గాంధీ, మార్క్స్ లిద్దరి చేతా ప్రభావితులయ్యారంటే చెయ్యాల్సింది పరిహాసం కాదు, పరిశీలన.

    కొడవళ్ళ హనుమంతరావు

  8. ఈమాట – నామాట గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    11/02/2008 8:11 pm

    ఈమాట సంపాదక, రచయిత, పాఠక వర్గానికి పదో జన్మదిన శుభాకాంక్షలు. నాలుగు కాలాల పాటు ఈ పత్రిక వెలగాలని కోరుకుంటున్నాను. ప్రతి సంచికకీ రాత్రింబవళ్ళూ శ్రమించే సంపాదకులకి, ముఖ్యంగా నాకెక్కువ సాయపడే సురేష్ కీ, పద్మ గారికీ, కృతజ్ఞతలు. ఎంత చిన్న విషయాన్నయినా తేలిగ్గా తీసుకోకుండా ఉన్నత స్థాయిలో ప్రచురించాలనే వారి దీక్ష మెచ్చుకోదగ్గది. వాళ్ళు మార్చినది బాలేదని నేను పేచీ పెడ్తే ఓపిగ్గా సమాధానం ఇచ్చి సామరస్యంగా పరిష్కరించడం సంతోషకరం. వారి ఉద్యోగ బాధ్యతలని నిర్వర్తిస్తూ, బహుశా కుటుంబ బాధ్యతలని కొంతవరకు నిర్లక్ష్యం చేస్తూ ఈమాట కోసం పాటుపడుతున్న సంపాదకుల అంకిత భావం స్ఫూర్తిదాయకం.

    Peer Review గురించి: సంపాదకులకి తలకి మించిన పనిభారం వలన గానీ, పరిమిత విషయ పరిజ్ఞానం వలన గానీ, కొన్నిటిని వేరే వాళ్ళని సమీక్షించమంటే సరే, కాని అది పత్రిక పద్ధతిగా పెట్టుకుంటే, నాదొక సందేహం. ఇది సాహితీ పత్రికలలో సాధారణంగా చేస్తారా? ఉన్నత ప్రమాణాలున్న, తెలుగులో లేకపోతే ఇంగ్లీషులోనే తీసుకోండి, ఇతర సాహితీ పత్రికలలో ఇదేనా ఆనవాయితీ? నాకు నిజంగానే తెలియకే అడుగుతున్నాను.

    ఈమాట సంపాదక వర్గం అంతా, రచయితల్లో చాలా మందీ, బహుశా పాఠకుల్లో కూడా చాలా వరకూ, విజ్ఞానశాస్త్రాల్లో విద్యాధికులూ, నిష్ణాతులూనూ. కాని సాహితీ పత్రిక అన్ని రంగాల వాళ్ళనీ ఆకర్షించేదిగా ఉండాలి. ఈమాటని Physical Review ప్రమాణాలతో నడుపుతాం అంటే శాస్త్రరంగాలలో లేనివాళ్ళకి కాస్త “భయం” కలగొచ్చు. The New Yorker పద్ధతిన నడుపుతాం అంటే బహుశా అందరికీ ఆమోదయోగ్యం కావొచ్చు.

    కొడవళ్ళ హనుమంతరావు

  9. తెలుగు గ్రామాలు – ఒక అవలోకనం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    10/26/2008 10:58 pm

    మంచి గతమున కొంచెమేనోయ్”

    చంద్రశేఖర రెడ్ది గారి వ్యాసంలో భాష చక్కగా ఉంది. పల్లె జీవితం కళ్ళకు కట్టినట్టుగా ఉంది. అయితే జీవితం బహుముఖమైనది. వారి వ్యాసం చదివి, పల్లెటూళ్ళ గురించి బొత్తిగా తెలియని వాళ్ళు, “గుప్తుల కాలం స్వర్ణయుగమందురు” అన్నట్లు, ఒకప్పటి పల్లెలు స్వర్గసీమలని భ్రమపడే ప్రమాదముంది. దానిక్కాస్త విరుగుడుగా నా చిన్నతనంలో, స్వాతంత్ర్యం వచ్చిన పాతికేళ్ళకి, మా ఊళ్ళో జీవితం ఎలా ఉండేదో కాస్త రాస్తాను.

    కాలకృత్యాలకీ, బర్రెగొడ్లని కడగడానికీ, చాకిరేవుకీ – అన్నిటికీ ఊరిచెరువే! జబ్బునపడితే మాఊళ్ళోనయితే కనీసం మంచి వైద్యులున్నారు. పొరుగు ఊళ్ళ వాళ్ళకి నాటువైద్యులే దిక్కు.

    అతివృష్టీ,, కాకపోతే అనావృష్టీ. ఎండాకాలంలో రెండు మూడు మైళ్ళు పోయి మంచినీళ్ళు తెచ్చుకునేవాళ్ళం.

    ఈ వ్యాసంలో పెద్దగా కనబడని వాళ్ళు మాలమాదిగ వాళ్ళు. ఊరికి వెలిగా ఉండేవాళ్ళు. కూలీలుగా రైతుల ఇళ్ళలో పాలేర్లుగా, జీతగాళ్ళుగా పనిచేసేవాళ్ళు. వీళ్ళని అన్ని కులాలకన్నా అతి హీనంగా చూసేవాళ్ళు.

    బళ్ళో “ఆంటరానితనం మహా పాపం,” అని వల్లె వేసేవాళ్ళం. బడి బయట విధిగా అంటరానితనాన్ని పాటించేవాళ్ళు! నాకిప్పటికీ గుర్తు; పెద్ద బజార్లో హోటల్లో పెద్ద మనుషులంతా పేపర్లు చదువుతూ, అన్ని వ్యవహారాలూ మాట్లాడుకునే వాళ్ళు. వాళ్ళెదుటనే, గూట్లో వేరేగా గ్లాసులుండేవు. పబ్లిక్ ప్రదేశాలలోనే అలా ఉంటే ఇళ్ళల్లో విషయం చెప్పేదేముంది? నేను కాలేజీ సెలవులకి ఊరికెళ్ళినప్పుడు, ఓ పెద్దమనిషి, మాలా మాదిగోళ్ళని “ఒరేయ్” అనడానికి జంకాల్సొస్తుందని వాపోయాడు.

    బాబాయ్, పిన్నాం, ఇలా వరస పెట్టి పిలుచుకునేవాళ్ళు – వేరే కులమయినా. కాని ఎవరి స్థాయి ఏమిటో అందరికీ తెలుసు. కుల ధర్మం తప్పక పాటిస్తారు. కులాంతర వివాహాలు అసంభవం; కులాంతర వివాహేతర సంబంధాలు మాత్రం అతి సామాన్యం!

    ఊరి ప్రెసిడెంటుకి ఎన్నికలు జరిగేవి. రెండు పార్టీల వాళ్ళూ ఒకరికొకరు దాయాదులే. ఎన్ని తరాలు గడిచినా వేరే వాళ్ళు నిలబడే ప్రసక్తే లేదు. అసలా మాటే ఎక్కడా రాదు. ఈ మధ్యనే ఓ మాల ఆయన ప్రెసిడెంటు అయ్యాడు – రిజర్వేషన్ మూలాన. పెద్దమనుషుల చెప్పుచేతల్లో ఉండకుండా పోలేడు.

    ధర్మవ్యాధుణ్ణి ప్రస్తావించారు కనుక చెప్తాను. మన సంస్కృతిలో కింద వర్ణాల వారిని పైవారు హీనంగా చూస్తే ఆశ్చర్యం లేదు – అది సంస్థాగతం. కాని తమని తామే హీనంగా భావించుకోవడం – “హీన యోనిజుండనయ్యును నిర్మలుండనైతిం” అని ధర్మవ్యాధుడు సగర్వంగా చెప్పుకోడంలో ఉంది విషాదమంతా.

    చాకళ్ళు, మంగళ్ళు, కుమ్మర్లు – వీళ్ళంతా పండక్కీ పబ్బానికీ ఆసాముల ఇళ్ళకి బుట్టతో పొయ్యేవాళ్ళు. “వండుకున్న అమ్మకి ఒక్కటే కూర; అడుక్కునమ్మకి అరవై కూరలు,” అన్న సామెతని బట్టి ఇదెంత గౌరవప్రదమైనదో తెలుస్తుంది. లాండ్రీ షాపో, బార్బర్ షాపో, గిన్నెల కొట్టో, లేకపోతే ఆ దిక్కుమాలిన వృత్తులకి సంబంధించకుండా కాస్త చదువుకొని నాలుగు రాళ్ళు సంపాదించుకుంటే గాని ఆ జీవితాలకి విముక్తి లేదు. అందుకు పల్లెటూళ్ళని వదిలి పారిపోతే విచారమెందుకు?

    “మాలపల్లి” లో సంగందాసు అన్నట్లు, “సర్వేగుణాః కాంచన మాశ్రయంతే అని ధనాకర్షణ మార్గాలు చూపించందే, తక్కిన మంచి గుణాలు అలవాటుపడవు.”

    కొడవళ్ళ హనుమంతరావు

  10. మనకు తెలియని మన త్యాగరాజు -1 గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    10/07/2008 10:04 pm

    karvera babu గారి వాదన ప్రకారం తాత ముత్తాతలు గల వాళ్ళని గూడ నేను తెగడినట్లే!

    జీవిత చరిత్రలో పూర్వీకుల గురించి ఉంటే నష్టమేమిటి? గిబ్బన్ అంతటి వాడే సమర్థించలేదా?

    “Nor does the man exist who would not peruse with warmer curiosity the life of a hero from whom his name and blood were lineally derived. The Satirist may laugh, the Philosopher may preach; but reason herself will respect the prejudices and habits which have been consecrated by the experience of mankind.”
    — From “Family History,” in “Memoirs of My Life,” by Edward Gibbon.

    ఎటొచ్చీ గిబ్బన్ ఏం రాసినా చదవడానికి చాలా ఇంపుగా ఉంటుంది. ఈ వ్యాసంలో నాకు నచ్చనవి, నేను gory details అని విమర్శించినవి చాలా dry గా ఉన్నాయి. సాయి గారు వంశవృక్ష పటాన్ని అనుబంధంలో ఉంచి, ఇతరులు చేసిన పొరబాట్లని footnotes లో ప్రస్తావించి, అసలు కథని బిగువుగా నడిపిస్తే ఇంకా రక్తి గడుతుంది.

    కొడవళ్ళ హనుమంతరావు