రా. నా. రె. గారూ,
“వెచ్చని మనసులు” కధని మెచ్చుకున్న మీరు ఈ ప్రశ్న అడగడం నాకు కాస్త ఆశ్చర్యం కలగజేసింది. ఈ కధ నాక్కూడా నచ్చిందనుకోండీ. కానీ మనం చెప్పుకున్న ప్రక్రియలేవీ ఈ కధలో లేవు కదా? అలాగే, ఎంతో మంది మెచ్చుకున్న “మిధునం” కధలో కూడా అటువంటి ప్రక్రియలు లేవు. దీనర్థం ఈ “లిటిల్ సైంటిస్టు” కధని పై కధల పక్కన కూర్చోబెడుతున్నట్టు కాదు. అలాగే నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారు రాసిన అనేక కధలు కూడా. సోమరాజు సుశీల గారు రాసిన ఇల్లేరమ్మ కధలు కూడా. కోట్ చెయ్యలేను గానీ, శ్రీపాద వారివీ, చలం గారివీ కొన్ని కధలు ఇలాంటి ప్రక్రియలు లేకుండా చదివినట్టు గుర్తు. ఇంకా చదివినవి గుర్తు లేవు. కొన్ని కదలు ఆహ్లాదంగా వుంటాయి. మొహంలో ఒక చిరునవ్వుని పూయిస్తాయి. అవి నిజ జీవితంలోంఛీ వచ్చిన కొన్ని చిన్న చిన్న అనుభవాలతో కలిసి, కాసిని కబుర్లు ఆత్మీయంగా చెప్పుకున్నట్టుగా వుంటాయి. గొప్ప మలుపులూ, గొప్ప నీతులూ, ఉత్కంఠ కలిగించే విషయాలూ వుండవు. నా దృష్టిలో అలా అన్నీ వుండ నక్కరలేదు కూడా. అలాంటివి వున్న కధలని నేను విమర్శించడం లేదు కూడా. ఆ ప్రక్రియలు కూడా బాగానే వుంటాయి. ఇవీ ఆ మాటలు అనడం వెనుక నున్న నా వుద్దేశ్యం.
చాన్నాళ్లతరువాత ఒక మంచి కవిత చదివాను,
మీ కవితలొ చక్కటి పదచిత్రాలు ఉన్నాయి
ఉదా:టీ డికాషనై మారటం, పత్తికాయలా పగలటం, ఆకాశానికి బెలూనై వేలాడటం మార్వలెస్ ఇమేజెస్.
నవ్యంగానూ, హృద్యంగానూ ఉన్నాయి.
కాని చిన్న అబ్యంతరం
ఆ అమ్మాయికి ఇపుడు అద్దంలో తనబొమ్మ తప్ప ఏమీ పట్టదు అని చెప్పటం అంత అందంగా లేదు. అది పెంపక లోపంగా అనిపించదూ. యవ్వనంలో యువత అద్దానికి అంటుకుపోవటం సహజమైనా, సత్యమైనా మీ కవితమొత్తం ఒక మూడ్ లో ఉంటే ఆ రెండు లైన్లు మిస్ ఫిట్ అయినట్లు గా అనిపిస్తూంది. తప్పైతే క్షమించండి.
మరోచోట పిచ్చినాన్న అనిపించటం వ్యంగ్యంగా కాక ప్రేమగానే తీసుకున్నాను సుమా!
నా బ్లాగును విసిట్ చేసి, దయచేసి మీ కామెంట్శ్ వ్రాయండి.
చందమామను మనింట్లోని పాపతో పోల్చి, వర్ణించటం నచ్చింది.
వ్యక్తీకరణ అందంగా ఉంది.
కానీ చందమామ కు సంబందించిన వివిధ అంశాలైన, పౌర్ణమి, అమావస్య, శుక్లపక్షం, కృష్ణపక్షం, వెన్నెల, నెలవంక, హేమంతరుతువు, ఆటుపోట్లు మొదలైనవాటిని కూదా కవితలో చొప్పించగలిగితే ఇదొక అద్భుతమైన కవితగా మిగిలిపోతుంది.
బొల్లోజు బాబా
నమష్కారములు.
వూడితేగాని పన్ను విలువ తెలియదు, వదిలితేగాని తెలుగు విలువ తెలియదు. ఇక్కడకు వచ్చాక మంచి సాహిత్యం ఈమాట ద్వారా చదివే అవకాశం కలిగినందుకు ఆనందంగా వుంది. కృతజ్ఞతలు.
లైలా యెర్నేని గారి అభిప్రాయంలోని దూషణా, తిరస్కారాలని పక్కన పెడితే, అందులో రెండు ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది – ‘నేను’ అనే పాత్ర స్వయం ప్రతిపత్తి గురించి. రెండోది – ఆడవాళ్ళ కష్టం తినడం గురించి.
తోలూ, సూదీ, దారం అనే మాటల వెనుక వుండే అసలు అర్థం ఏమిటంటే, బి. యస్సీ రెండో యేడాది చదివే ఓ కుర్రాడు ఎందుకు ఏ మాత్రమూ సంపాదించుకోలేక పోయాడు అని. ఆ కుర్రాడు ఎందుకు తన చెప్పులు తానే కొనుక్కోలేక పోయాడూ అనేది ముఖ్య విషయం. దీనికి కారణాలు కధలో స్పష్టంగా లేవు. వున్న విషయాలని బట్టి కొంచెం వూహించుకోవాల్సిందే. ఆ కుర్రాడికి కాలేజీలో ఏదో స్కాలర్ షిప్ వస్తూ వుండి వుండొచ్చు. ఆ డబ్బంతా, ఇంట్లో ఇచ్చేస్తూ వుండి వుండొచ్చు. అమెరికాలో వున్న ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’ ఇండియాలో ఆ రోజుల్లో లేదు. ఇప్పుడు కూడా ఎక్కువగా వుందని నేననుకోను. మొత్తానికి పేపర్లు పంచో, మిల్క్ బాటిల్స్ పంచో, సైకిల్ షాపులో గాలి కొట్టో, వేరే అలాంటి పని చేసో, డబ్బు సంపాదించడం మధ్య తరగతి కుటుంబాల వాళ్ళకి నామోషీగా వుంటుంది. అటువంటి పనులకి ఆ కుర్రాడి తల్లీ, అక్కా ఒప్పుకోక పోవచ్చును కూడా. ఆ కుర్రాడు వాళ్ళని ఎదిరించ లేక పోవచ్చును కూడా. అయితే ఇవొక్కటే మార్గాలా అనే ప్రశ్న వస్తుంది. మధ్య తరగతి వాళ్ళు కూడా నామోషీ పడకుండా, కాస్త డబ్బు సంపాదించే మార్గాలు లేవా అన్నది ప్రశ్న. ఎందుకు లేవూ? వున్నాయి. వాటిలో ముఖ్యమైనది చిన్న క్లాసు పిల్లలకి ప్రైవేట్లు చెప్పడం. బి. యస్సీ చదివే కుర్రాడు ఈ పని, నామోషీ లేకుండా, తప్పకుండా చెయ్య గలిగి వుంటాడు. కానీ ఈ కధలో కుర్రాడు ఆ పని చెయ్యలేదు. కష్టాలని భరిస్తూ, నిబ్బరంగా వున్నాడే గానీ, వాటి లోంచి తప్పించుకునే పని చెయ్యలేదు. కారణం కూడా స్పష్టంగా లేదు కధలో. వూహించుకోవాల్సిందే. “నీకెందుకూ ఆ ప్రైవేట్లూ? సంపాదించే పని నేను చూసుకుంటాను గానీ, నువ్వు చదువు మీదే దృష్టి పెట్టుకో” అని అక్క చెప్పి వుండవచ్చు. లేదా తను ప్రైవేటు చెప్పిన పిల్లలు పరీక్షల్లో పాసవక పోతే, తనకి చెడ్డ పేరొస్తుందనే భయంతో, ఆ భాధ్యత తీసుకోవడానికి ఆ కుర్రాడే భయపడి వుండొచ్చు. చదువుకునే పిల్లలందరికీ వేరే చిన్న పిల్లలకి చదువు చెప్పే సామర్థ్యం వుండక పోవచ్చు కూడా. కారణాలేమైనా, తనకి చేతనైన పని చేసి, అంతో, ఇంతో సంపాదించాలని ప్రయత్నించక పోవడం ఆ కుర్రాడి తప్పే ముమ్మాటికీ. కాబట్టి, లైలా యెర్నేని గారి పాయింటు ఈ విషయంలో కరెక్టే. అయితే తోలూ, సూదీ, దారం లాంటివి సంపాదించి, చెప్పులు స్వయంగా కుట్టుకోవాలి అనేది అర్థం లేని విషయం.
రెండవ విషయం – ఒక మగ పిల్లాడు, ఆడవాళ్ళ కష్టం, అదీ తన తల్లీ, సోదరిల కష్టం తింటే, అది అతనికి అవమానమా? అదే ఒక ఆడపిల్ల, మగ వాళ్ళ కష్టం, అదీ తన తండ్రీ, సోదరుల కష్టం తింటే, అది ఆమెకి అవమానం కాదా? లైలా గారి అభిప్రాయం ప్రకారం కాదు మరి! వయసులో పెద్దవాళ్ళు, అంటే అన్న చెల్లెలి కష్టం తింటే, తప్పు పట్టొచ్చు. అది తమ్ముడి కష్టం తిన్నా తప్పే మరి. అన్న వుద్యోగం చేస్తూ, చెల్లెలిని పోషిస్తూ, చదివించుకోవడంలో లేని అవమానం, ఒక అక్క వుద్యోగం చేస్తూ, తమ్ముడిని పోషిస్తూ, చదివించుకోవడంలో ఎందుకు వుందీ? ఆడవాళ్ళ కష్టం తినడం అంత హీనమయిన విషయమా? అలా అని ఆడవాళ్ళే అనడం ఏం అర్థమయిన విషయం? ఆడవాళ్ళ కష్టం, మగవాళ్ళ కష్టం అనే వేరు వేరు పదాలే అర్థం లేనివి. కుటుంబ బాధ్యతని ఆడపిల్లైనా తీసుకోవచ్చు, మగ పిల్లాడైనా తీసుకోవచ్చు. అది కుటుంబంలో వారి వయసుని బట్టి వుంటుంది. జీవితాలన్నీ ‘అంతులేని కధ’ సినిమాలోని జయప్రద పాత్ర జీవితాల్లాంటివి కావు. ఇక్కడ కుటుంబంలో రెండో సంతానం ఏదో ఒక చిన్న పని చేసి, ఎంతో అంత సంపాదించడం గురించి మాట్టాడ్డం లేదు. ఎందుకంటీ, ఈ సద్విమర్శ, ‘ఆడవాళ్ళ కష్టం’ తినే విషయం లోనూ వుంటుంది, ‘మగవాళ్ళ కష్టం’ తినడం అనే విషయం లోనూ వుంటుంది. మగవాళ్ళ కష్టం తినడం ఆడవాళ్ళకి అవమానం కానప్పుడు, ఆడవాళ్ళ కష్టం తినడం మగవాళ్ళకి కూడా అవమానం కాకూడదు. నిజానికి ఒకరి కష్టం ఇంకొకరు తింటూ కూర్చుంటే, అది ఎప్పుడూ అవమానకరమైన విషయమే. ఆ సంగతి కూడా మాట్టాడ్డం లేదు ఇక్కడ. ఒక ఆడపిల్ల కుటుంబ భాధ్యతని తీసుకుంటే (జీవితాంతం తన జీవితాన్ని సినిమాల్లో లాగా త్యాగం చేసి కాకుండా), ఆ కుటుంబంలో వున్న చిన్నవాళ్ళకి సిగ్గు పడాల్సిన విషయం కాదు అది. తండ్రి పనీ, పాటూ లేకుండా, కూతురి సంపాదన మీద ఆధారపడి, బతికితే అది తప్పు విషయం. అదే తప్పు కొడుకు సంపాదన మీద ఆధారపడి వున్నపుడు కూడా వుంటుంది. అయితే, శారీరక సమస్యల తోటో, వృద్ధ్యాప్యాల సమస్యల తోటో ఆధారపడే విషయం గురించి కాదు మాట్టాడేది. సాధారణంగా తల్లులయితే, ఇంట్లో పనులూ, అవీ చేస్తూ వుంటారు కాబట్టి, వారి విషయంలో ఈ విమర్శ వర్తించదు. అలాగే చిన్న పిల్లలకి కూడా వర్తించదు. చదువయ్యాక, సంపాదన మొదలెట్టాక, తమని పోషించిన తోబుట్టువుల పట్ల కృతజ్ఞతా రహితంగా ప్రవర్తిస్తే, అది ఎప్పుడూ హీనమైన విషయమే.
పోతనగారు చాలా చాకచక్యంతో “నీవు గుణరహితుండవు” అని వ్యాజస్తుతి చేశారు. మఱిన్ని వివరాలకై దివాకర్ల వేంకటావధానిగారి “పోతన వ్యాజస్తుతి-వ్యంగ్య వైభవము” అన్న వ్యాసమును “భాగవత వైజయంతిక” లో చదువవచ్చు.
యెర్నేనిగారూ, కృతజ్ఞతలు. ‘ఘనసింహంబుల’ పద్యాన్ని నేను తప్పుగా వుటంకించాను.
రుక్మిణి సోదరుడు రుక్మి “గోపాలకా, వెన్నదొంగా” -అంటూ కృష్ణుని వెంబడించి, “కొమ్మనిమ్ము నీవు గుణరహితుండవు, విడువు విడువవేని…” అని బెదిరించడం, ఆతరువాత కృష్ణుడు రుక్మిని చంపబోతే రుక్మిణి వచ్చి, “ముకుందుడు మాకు అల్లుడయినాడని సంతోషించు నాతల్లిదండ్రులకు పుత్రశోకం కలిగించకుమ”ని ప్రాధేయపడటం, కృష్ణుడు దయదలచి రుక్మి తలవెండ్రుకలు, గడ్డము,మీసాలను పాయలుపాయలుగా ఖండించడం … ఇది తలవంపులపనే కదా!
లిటిల్‌సైంటిస్టు గురించి జె.యు.బి.వి. ప్రసాద్ అభిప్రాయం:
04/30/2008 6:34 pm

ప్రసాద్
బ్లాగుల గురించి – నా మాట గురించి chavakiran అభిప్రాయం:
04/30/2008 6:17 pm
[చావా కిరణ్ గారికి కృతజ్ఞతలు — సంపాదకులు]
బాబా గారికి,
ఈ మాట బ్లాగు కాదు! ఇది ఒక పత్రిక.
మీ రచనలు ఈమాటకు పంపాలంటే సూచనల పేజీ చూడండి.
ఇతర వెబ్ పత్రికల కోసం ఈ లింకు చూడండి.
బ్లాగుల జాబితా కోసం ఇది చూడండి.
బ్లాగుల గురించి – నా మాట గురించి bollojubaba అభిప్రాయం:
04/30/2008 11:32 am
మీ బ్లాగు బాగుంది
మంచి క్వాలిటీ ఉన్న రచనలే ఉంటున్నాయి.
మీ బ్లాగుకు నేను కవితలు పంపవచ్చా లేక నాబ్లాకు లింక్ ఇస్తే సరిపోతుందా? తెలుపగలరు.
బొల్లోజు బాబా
http://sahitheeyanam.blogspot.com/
పిచ్చి నాన్న గురించి bollojubaba అభిప్రాయం:
04/30/2008 11:26 am
మూర్తిగారికి
చాన్నాళ్లతరువాత ఒక మంచి కవిత చదివాను,
మీ కవితలొ చక్కటి పదచిత్రాలు ఉన్నాయి
ఉదా:టీ డికాషనై మారటం, పత్తికాయలా పగలటం, ఆకాశానికి బెలూనై వేలాడటం మార్వలెస్ ఇమేజెస్.
నవ్యంగానూ, హృద్యంగానూ ఉన్నాయి.
కాని చిన్న అబ్యంతరం
ఆ అమ్మాయికి ఇపుడు అద్దంలో తనబొమ్మ తప్ప ఏమీ పట్టదు అని చెప్పటం అంత అందంగా లేదు. అది పెంపక లోపంగా అనిపించదూ. యవ్వనంలో యువత అద్దానికి అంటుకుపోవటం సహజమైనా, సత్యమైనా మీ కవితమొత్తం ఒక మూడ్ లో ఉంటే ఆ రెండు లైన్లు మిస్ ఫిట్ అయినట్లు గా అనిపిస్తూంది. తప్పైతే క్షమించండి.
మరోచోట పిచ్చినాన్న అనిపించటం వ్యంగ్యంగా కాక ప్రేమగానే తీసుకున్నాను సుమా!
నా బ్లాగును విసిట్ చేసి, దయచేసి మీ కామెంట్శ్ వ్రాయండి.
బొల్లోజు బాబా
http://sahitheeyanam.blogspot.com/
ఓ చందమామ గురించి bollojubaba అభిప్రాయం:
04/30/2008 11:15 am
కవిత చాలాబాగుంది
చందమామను మనింట్లోని పాపతో పోల్చి, వర్ణించటం నచ్చింది.
వ్యక్తీకరణ అందంగా ఉంది.
కానీ చందమామ కు సంబందించిన వివిధ అంశాలైన, పౌర్ణమి, అమావస్య, శుక్లపక్షం, కృష్ణపక్షం, వెన్నెల, నెలవంక, హేమంతరుతువు, ఆటుపోట్లు మొదలైనవాటిని కూదా కవితలో చొప్పించగలిగితే ఇదొక అద్భుతమైన కవితగా మిగిలిపోతుంది.
బొల్లోజు బాబా
http://sahitheeyanam.blogspot.com/
రచయితలకు సూచనలు గురించి chokkakula prasad అభిప్రాయం:
04/30/2008 9:12 am
నమష్కారములు.
వూడితేగాని పన్ను విలువ తెలియదు, వదిలితేగాని తెలుగు విలువ తెలియదు. ఇక్కడకు వచ్చాక మంచి సాహిత్యం ఈమాట ద్వారా చదివే అవకాశం కలిగినందుకు ఆనందంగా వుంది. కృతజ్ఞతలు.
చొక్కాకుల ప్రసాద్
మాంట్రియల్, కెనడా
చెప్పులు గురించి జె.యు.బి.వి. ప్రసాద్ అభిప్రాయం:
04/29/2008 7:21 pm
లైలా యెర్నేని గారి అభిప్రాయంలోని దూషణా, తిరస్కారాలని పక్కన పెడితే, అందులో రెండు ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది – ‘నేను’ అనే పాత్ర స్వయం ప్రతిపత్తి గురించి. రెండోది – ఆడవాళ్ళ కష్టం తినడం గురించి.
తోలూ, సూదీ, దారం అనే మాటల వెనుక వుండే అసలు అర్థం ఏమిటంటే, బి. యస్సీ రెండో యేడాది చదివే ఓ కుర్రాడు ఎందుకు ఏ మాత్రమూ సంపాదించుకోలేక పోయాడు అని. ఆ కుర్రాడు ఎందుకు తన చెప్పులు తానే కొనుక్కోలేక పోయాడూ అనేది ముఖ్య విషయం. దీనికి కారణాలు కధలో స్పష్టంగా లేవు. వున్న విషయాలని బట్టి కొంచెం వూహించుకోవాల్సిందే. ఆ కుర్రాడికి కాలేజీలో ఏదో స్కాలర్ షిప్ వస్తూ వుండి వుండొచ్చు. ఆ డబ్బంతా, ఇంట్లో ఇచ్చేస్తూ వుండి వుండొచ్చు. అమెరికాలో వున్న ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’ ఇండియాలో ఆ రోజుల్లో లేదు. ఇప్పుడు కూడా ఎక్కువగా వుందని నేననుకోను. మొత్తానికి పేపర్లు పంచో, మిల్క్ బాటిల్స్ పంచో, సైకిల్ షాపులో గాలి కొట్టో, వేరే అలాంటి పని చేసో, డబ్బు సంపాదించడం మధ్య తరగతి కుటుంబాల వాళ్ళకి నామోషీగా వుంటుంది. అటువంటి పనులకి ఆ కుర్రాడి తల్లీ, అక్కా ఒప్పుకోక పోవచ్చును కూడా. ఆ కుర్రాడు వాళ్ళని ఎదిరించ లేక పోవచ్చును కూడా. అయితే ఇవొక్కటే మార్గాలా అనే ప్రశ్న వస్తుంది. మధ్య తరగతి వాళ్ళు కూడా నామోషీ పడకుండా, కాస్త డబ్బు సంపాదించే మార్గాలు లేవా అన్నది ప్రశ్న. ఎందుకు లేవూ? వున్నాయి. వాటిలో ముఖ్యమైనది చిన్న క్లాసు పిల్లలకి ప్రైవేట్లు చెప్పడం. బి. యస్సీ చదివే కుర్రాడు ఈ పని, నామోషీ లేకుండా, తప్పకుండా చెయ్య గలిగి వుంటాడు. కానీ ఈ కధలో కుర్రాడు ఆ పని చెయ్యలేదు. కష్టాలని భరిస్తూ, నిబ్బరంగా వున్నాడే గానీ, వాటి లోంచి తప్పించుకునే పని చెయ్యలేదు. కారణం కూడా స్పష్టంగా లేదు కధలో. వూహించుకోవాల్సిందే. “నీకెందుకూ ఆ ప్రైవేట్లూ? సంపాదించే పని నేను చూసుకుంటాను గానీ, నువ్వు చదువు మీదే దృష్టి పెట్టుకో” అని అక్క చెప్పి వుండవచ్చు. లేదా తను ప్రైవేటు చెప్పిన పిల్లలు పరీక్షల్లో పాసవక పోతే, తనకి చెడ్డ పేరొస్తుందనే భయంతో, ఆ భాధ్యత తీసుకోవడానికి ఆ కుర్రాడే భయపడి వుండొచ్చు. చదువుకునే పిల్లలందరికీ వేరే చిన్న పిల్లలకి చదువు చెప్పే సామర్థ్యం వుండక పోవచ్చు కూడా. కారణాలేమైనా, తనకి చేతనైన పని చేసి, అంతో, ఇంతో సంపాదించాలని ప్రయత్నించక పోవడం ఆ కుర్రాడి తప్పే ముమ్మాటికీ. కాబట్టి, లైలా యెర్నేని గారి పాయింటు ఈ విషయంలో కరెక్టే. అయితే తోలూ, సూదీ, దారం లాంటివి సంపాదించి, చెప్పులు స్వయంగా కుట్టుకోవాలి అనేది అర్థం లేని విషయం.
రెండవ విషయం – ఒక మగ పిల్లాడు, ఆడవాళ్ళ కష్టం, అదీ తన తల్లీ, సోదరిల కష్టం తింటే, అది అతనికి అవమానమా? అదే ఒక ఆడపిల్ల, మగ వాళ్ళ కష్టం, అదీ తన తండ్రీ, సోదరుల కష్టం తింటే, అది ఆమెకి అవమానం కాదా? లైలా గారి అభిప్రాయం ప్రకారం కాదు మరి! వయసులో పెద్దవాళ్ళు, అంటే అన్న చెల్లెలి కష్టం తింటే, తప్పు పట్టొచ్చు. అది తమ్ముడి కష్టం తిన్నా తప్పే మరి. అన్న వుద్యోగం చేస్తూ, చెల్లెలిని పోషిస్తూ, చదివించుకోవడంలో లేని అవమానం, ఒక అక్క వుద్యోగం చేస్తూ, తమ్ముడిని పోషిస్తూ, చదివించుకోవడంలో ఎందుకు వుందీ? ఆడవాళ్ళ కష్టం తినడం అంత హీనమయిన విషయమా? అలా అని ఆడవాళ్ళే అనడం ఏం అర్థమయిన విషయం? ఆడవాళ్ళ కష్టం, మగవాళ్ళ కష్టం అనే వేరు వేరు పదాలే అర్థం లేనివి. కుటుంబ బాధ్యతని ఆడపిల్లైనా తీసుకోవచ్చు, మగ పిల్లాడైనా తీసుకోవచ్చు. అది కుటుంబంలో వారి వయసుని బట్టి వుంటుంది. జీవితాలన్నీ ‘అంతులేని కధ’ సినిమాలోని జయప్రద పాత్ర జీవితాల్లాంటివి కావు. ఇక్కడ కుటుంబంలో రెండో సంతానం ఏదో ఒక చిన్న పని చేసి, ఎంతో అంత సంపాదించడం గురించి మాట్టాడ్డం లేదు. ఎందుకంటీ, ఈ సద్విమర్శ, ‘ఆడవాళ్ళ కష్టం’ తినే విషయం లోనూ వుంటుంది, ‘మగవాళ్ళ కష్టం’ తినడం అనే విషయం లోనూ వుంటుంది. మగవాళ్ళ కష్టం తినడం ఆడవాళ్ళకి అవమానం కానప్పుడు, ఆడవాళ్ళ కష్టం తినడం మగవాళ్ళకి కూడా అవమానం కాకూడదు. నిజానికి ఒకరి కష్టం ఇంకొకరు తింటూ కూర్చుంటే, అది ఎప్పుడూ అవమానకరమైన విషయమే. ఆ సంగతి కూడా మాట్టాడ్డం లేదు ఇక్కడ. ఒక ఆడపిల్ల కుటుంబ భాధ్యతని తీసుకుంటే (జీవితాంతం తన జీవితాన్ని సినిమాల్లో లాగా త్యాగం చేసి కాకుండా), ఆ కుటుంబంలో వున్న చిన్నవాళ్ళకి సిగ్గు పడాల్సిన విషయం కాదు అది. తండ్రి పనీ, పాటూ లేకుండా, కూతురి సంపాదన మీద ఆధారపడి, బతికితే అది తప్పు విషయం. అదే తప్పు కొడుకు సంపాదన మీద ఆధారపడి వున్నపుడు కూడా వుంటుంది. అయితే, శారీరక సమస్యల తోటో, వృద్ధ్యాప్యాల సమస్యల తోటో ఆధారపడే విషయం గురించి కాదు మాట్టాడేది. సాధారణంగా తల్లులయితే, ఇంట్లో పనులూ, అవీ చేస్తూ వుంటారు కాబట్టి, వారి విషయంలో ఈ విమర్శ వర్తించదు. అలాగే చిన్న పిల్లలకి కూడా వర్తించదు. చదువయ్యాక, సంపాదన మొదలెట్టాక, తమని పోషించిన తోబుట్టువుల పట్ల కృతజ్ఞతా రహితంగా ప్రవర్తిస్తే, అది ఎప్పుడూ హీనమైన విషయమే.
ఇంతకన్నా చెప్పడానికి ఏమీ వుంటుందని నేననుకోను.
– ప్రసాద్
మన ఛాందసులు గురించి sathish అభిప్రాయం:
04/29/2008 10:00 am
తెలుగు కవుల గురించి చాలా చక్కగా వివరిచారు. అయితే తెలుగు వ్యాకరణం గురించి ఇంకా చక్కగా విపులీకరించి వుండాల్సింది.
నాకు నచ్చిన పద్యం: పారిజాతాపహరణంలో సత్యభామ గురించి వాడపల్లి శేషతల్పశాయి అభిప్రాయం:
04/29/2008 9:29 am
పోతనగారు చాలా చాకచక్యంతో “నీవు గుణరహితుండవు” అని వ్యాజస్తుతి చేశారు. మఱిన్ని వివరాలకై దివాకర్ల వేంకటావధానిగారి “పోతన వ్యాజస్తుతి-వ్యంగ్య వైభవము” అన్న వ్యాసమును “భాగవత వైజయంతిక” లో చదువవచ్చు.
నమస్సులతో,
వాడపల్లి శేషతల్పశాయి.
నాకు నచ్చిన పద్యం: పారిజాతాపహరణంలో సత్యభామ గురించి రానారె అభిప్రాయం:
04/29/2008 7:34 am