మనము ఎవరు లేక దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తే వారు లేక అవి కలలోకి వచ్చే అవకాశముంటుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని నల్లవారికి, స్వేఛ్చావాయువులు పీల్చే కొత్త జీవితాన్నిచ్చిన లింకన్ మహాశయుడు దేవుడు లాంటివాడే, మానవతావాదులకు. రాజా లింకన్ దేవుడికే పూజ చేసినా,ఆ మహనీయుడు దానికర్హుడే. కథ – కథనం బాగుంది.
మీ అనుభవాలు బాగా రాసారు. కొ.కొ గారి ‘చదువు’ లొ సుందరం చదివే స్కూలు లొ ఇంగ్లీషు వారికీ, ఫ్రెంచు వారికీ మధ్య జరిగిన యుద్దంలో ఎవరు గెలిస్తారో అంటూ జరిగిన మీమామంస ఘట్టం లో,.. సుందరం..’ ఒక వేళ ఫ్రెంచు వాళ్ళు గెలిస్తే, ఫ్రెంచు నేర్చుకోవాలేమో.’. అనుకోవటం.. గుర్తొచ్చింది.
అంతర్మథనం
గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
05/04/2008
7:35 am
రాజారావు గారికి:
మీ కథ చాలా బాగుంది. కథ చెప్పిన పద్ధతి, శైలి, భాష అన్నీ బాగున్నాయి. చక్కటి ముగింపు కూడా. మీ కథా ఇతివృత్తం చూస్తుంటే, మీరు నివాసాంధ్రులు అనిపిస్తోంది. ఏది ఏమైనా, మీరు మరింత విరివిగా కథలు రాయండి.
స్ఫూర్తికి, చౌర్యానికీ మధ్య ఉన్నది చాలా సన్నటి గీత. ఉదా: మాయాబజార్ల̍లోని ‘వివాహ భోజనంబు’ పాట. పాత సినిమా పాటలకు నడిచే నిఘంటువు లాంటి వి.ఎ.కె.రంగారావు గారి మాటల్లో- “1930 ప్రాంతాల బ్రిటన్, అమెరికా దేశాల్లో రంగస్థలంమీద చిన్న ప్రహసనాల్లాంటివి చేసేవారు. ఆయా నటులు వాళ్ల దుస్తుల్ని ఒక తోపుడు బండిలో వేసుకొని రంగస్థలం మీదికి తోసుకుంటూ వచ్చేవారు. వస్తున్నప్పుడు ఆ బండి చక్రాల ధ్వని వినిపించకుండా దానిమీద వాద్యగోష్ఠి వచ్చేది. అది ‘వివాహ భోజనంబు’ వరస, మీటరూ! అటు తర్వాత ఆ ట్యూనును ‘మెక్సికన్ మెర్రి గో రౌండ్’ అనే పాటగా మలిచారు. ఆ వినోద కాలక్షేపాలు మన దేశంలో కూడా ప్రదర్శింపబడినప్పుడు, ఆ ట్యూనును మన వాళ్లు గ్రహించి వుంటారు.” (సంగ్రహించి?:-)
కొంతమందికి సమాజంలోని అన్యాయాలూ, అసమానతలూ, బాధలూ మాత్రమే హృదయానికి హత్తుకోవచ్చు, అవి లేని కథలు వెలితిగా అనిపించవచ్చు. అందులో ఇబ్బంది లేదు. కానీ అలాటి వాటిని “అసహజ”మైనవి అనడం సరికాదని నా ఉద్దేశం.
నాకూ లైలా, జె.యు.బి.ప్రసాద్ గార్లు వెలిబుచ్చిన అభిప్రాయాలతో చాలా యిబ్బందులున్నాయి. అంతకంటే యిక్కడ చెప్పలేను, చెప్పడం యిష్టంలేదు. ఎందుకంటే ఏది అనుసరణ/అనుకరణ, ప్రేరణ, చౌర్యం అనే అంశాలపై ఒక నాలుగేళ్ళుగానో, యింకా పైనో తర్జన భర్జనలు పడుతున్నాను, ముఖ్యంగా సినిమా పాటల విషయంలో ఈ మాటల్ని కొండొకచో బాధ్యతారహితంగా వాడుతున్నారు అని నా బాధ.
సాహిత్యం విషయంలోకొచ్చేసరికి వేరుగా చూస్తారని మరో బాధ.
దేవులపల్లి పాట ప్రస్తావనకు వచ్చింది కాబట్టి … బహుశ మీలో చాలామందికి తెలిసే వుంటుంది. “లేపకే నా యెంకి లేపకే నిదరా, ఈ పాటి సుకము నేనింతవరకెరగనే” అనే ఎంకిపాట ఈ సినీగేయానికి ప్రేరణ అని ఆ కాలంలో కొన్ని విమర్శలు వెలువడ్డాయి. 🙂
లింకన్ తో ఓ రాత్రి గురించి cbrao అభిప్రాయం:
05/04/2008 6:31 pm
మనము ఎవరు లేక దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తే వారు లేక అవి కలలోకి వచ్చే అవకాశముంటుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని నల్లవారికి, స్వేఛ్చావాయువులు పీల్చే కొత్త జీవితాన్నిచ్చిన లింకన్ మహాశయుడు దేవుడు లాంటివాడే, మానవతావాదులకు. రాజా లింకన్ దేవుడికే పూజ చేసినా,ఆ మహనీయుడు దానికర్హుడే. కథ – కథనం బాగుంది.
అటో యిటో గురించి రాజారావు తాడిమేటి అభిప్రాయం:
05/04/2008 3:24 pm
బాగుందండీ. ఒకే ఇతివృత్తంపై పలువురు రచయిత(త్రు)ల కథలు చదువుతుంటే గమ్మత్తుగా ఉంది.
లింకన్ తో ఓ రాత్రి గురించి malathi అభిప్రాయం:
05/04/2008 2:54 pm
బాగుంది రాయ్ గారికి నివాళి. శీర్షిక కూడా చాలా బాగా కుదిరింది. అభినందనలు.
మా ఫ్రాన్స్ అనుభవాలు గురించి sujata అభిప్రాయం:
05/04/2008 12:19 pm
మీ అనుభవాలు బాగా రాసారు. కొ.కొ గారి ‘చదువు’ లొ సుందరం చదివే స్కూలు లొ ఇంగ్లీషు వారికీ, ఫ్రెంచు వారికీ మధ్య జరిగిన యుద్దంలో ఎవరు గెలిస్తారో అంటూ జరిగిన మీమామంస ఘట్టం లో,.. సుందరం..’ ఒక వేళ ఫ్రెంచు వాళ్ళు గెలిస్తే, ఫ్రెంచు నేర్చుకోవాలేమో.’. అనుకోవటం.. గుర్తొచ్చింది.
అంతర్మథనం గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
05/04/2008 7:35 am
రాజారావు గారికి:
మీ కథ చాలా బాగుంది. కథ చెప్పిన పద్ధతి, శైలి, భాష అన్నీ బాగున్నాయి. చక్కటి ముగింపు కూడా. మీ కథా ఇతివృత్తం చూస్తుంటే, మీరు నివాసాంధ్రులు అనిపిస్తోంది. ఏది ఏమైనా, మీరు మరింత విరివిగా కథలు రాయండి.
ఈమాటలో మరిన్ని మీ కథల కోసం ఎదురు చూస్తూ,
విష్ణుభొట్ల లక్ష్మన్న
సడిచేయకే గాలి గురించి డా.స్మైల్ అభిప్రాయం:
05/04/2008 5:31 am
స్ఫూర్తికి, చౌర్యానికీ మధ్య ఉన్నది చాలా సన్నటి గీత. ఉదా: మాయాబజార్ల̍లోని ‘వివాహ భోజనంబు’ పాట. పాత సినిమా పాటలకు నడిచే నిఘంటువు లాంటి వి.ఎ.కె.రంగారావు గారి మాటల్లో- “1930 ప్రాంతాల బ్రిటన్, అమెరికా దేశాల్లో రంగస్థలంమీద చిన్న ప్రహసనాల్లాంటివి చేసేవారు. ఆయా నటులు వాళ్ల దుస్తుల్ని ఒక తోపుడు బండిలో వేసుకొని రంగస్థలం మీదికి తోసుకుంటూ వచ్చేవారు. వస్తున్నప్పుడు ఆ బండి చక్రాల ధ్వని వినిపించకుండా దానిమీద వాద్యగోష్ఠి వచ్చేది. అది ‘వివాహ భోజనంబు’ వరస, మీటరూ! అటు తర్వాత ఆ ట్యూనును ‘మెక్సికన్ మెర్రి గో రౌండ్’ అనే పాటగా మలిచారు. ఆ వినోద కాలక్షేపాలు మన దేశంలో కూడా ప్రదర్శింపబడినప్పుడు, ఆ ట్యూనును మన వాళ్లు గ్రహించి వుంటారు.” (సంగ్రహించి?:-)
అంతర్మథనం గురించి అనిలు అభిప్రాయం:
05/04/2008 4:32 am
ఇంకా విరివిగా వ్రాస్తుండండి.
అంతర్మథనం గురించి జ్యోతి అభిప్రాయం:
05/04/2008 3:49 am
రాజారావుగారు ,
కథ చాలా బావుంది. ఇలాగే రాస్తుండండి..
పేరు గలవాడేను మనిషోయ్ గురించి Kameswara Rao అభిప్రాయం:
05/04/2008 2:30 am
కొంతమందికి సమాజంలోని అన్యాయాలూ, అసమానతలూ, బాధలూ మాత్రమే హృదయానికి హత్తుకోవచ్చు, అవి లేని కథలు వెలితిగా అనిపించవచ్చు. అందులో ఇబ్బంది లేదు. కానీ అలాటి వాటిని “అసహజ”మైనవి అనడం సరికాదని నా ఉద్దేశం.
సడిచేయకే గాలి గురించి Paruchuri Sreenivas అభిప్రాయం:
05/04/2008 1:29 am

— శ్రీనివాస్