చాలా బాగుంది, దీనిని అందించినందులకు ధన్యవాదాలు. ఆధునిక కవిత – అభిప్రాయవేదిక అనే పుస్తకంలో ఆరుద్రగారు మరి కొందరితో చర్చను జరిపారు. దీనిని నా వ్యాసములో కూడ ఉదహరించాను. ఇందులో రాయప్రోలు, దాశరథి, శ్రీశ్రీ, ఆరుద్ర, సినారె, దివాకర్ల, శేషేంద్ర్రశర్మ, కుందుర్తి, వేదుల, మహీధర, నార్ల, ఆధునిక కవిత్వంపై తమ భావాలను వెలిబుచ్చారు. ఈ ఆడియోలో ఉన్నవి కొన్ని ఇంకా విడమర్చబడి ఉన్నాయి పుస్తకంలో. తప్పక చదవండి. – మోహన
శ్రీ గారు, మీ నిశిత దృష్టికి జోహార్లు. ఇలాంటి తప్పుల్ని goof-ups (గూఫులు) అంటారు. అసిస్టెంట్ డైరెక్టర్లు కంటిన్యుటీ సరిగ్గా రాసుకోక, ఇలా ఓకే ప్రొడక్షన్ కారుని రెండు సీన్లలో ఉపయోగించేసుంటారు. నిజానికి అది రాంగోపాల్ వర్మ తప్పుకాకపోయినా, కేప్టెన్ ఆఫ్ ద షిప్ గా బాధ్యత మాత్రం తనదే !
‘కంపెనీ’ మంచి సినిమానే. ఇక్కడ నేను తీసుకున్న విషయం, వర్మ తెలుసుకున్న సమాజంలోని మాఫియా పార్శ్వం, తద్వారా మారిన తన చిత్ర కథానాయకుడి పరిణామక్రమం, ‘సత్య’ వర్మ యొక్క most evolved protagonist అని నా అభిప్రాయం. ఆ తరువాత వచ్చిన, లేక ఇప్పటికీ తీస్తున్న ఏ సినిమాలోనూ వర్మ ఇంత profound statement ఇవ్వలెదని నా భావన. సత్య తరువాత వచ్చిన సినిమాలన్నీ శివ, గాయం, సత్య సినిమాలలోని పాత్రల్నీ, భావాల్నీ, ఆలోచనల్నీ కొనసాగించిన చిత్రాలుగా మాత్రమే అనిపిస్తాయి. Other films are just a continuation or reminiscences of what he has already done in Shiva, Gaayam and Satya.
ఇంకా చెప్పాలంటే, ‘సత్య’ అనే ఉన్నత శిఖరాన్నెక్కిన వర్మ, అక్కడి నుండీ క్రిందకి దిగుతున్నట్టుందే తప్ప, దాన్ని మించిన ఎత్తుకు ఆ తరువాత తీసిన సినిమాలు, సృష్టించిన పాత్రలూ ఉన్నాయంటారా?
మొదటి పేజీ చదివి, కొంచెం ఈ నాటి కవిత్వం లోనించి కూడా ఉదాహరణలు ఇస్తే బాగుండునే అనుకున్నాను. తరువాతి పేజీల్లో ఈ ముచ్చట కూడ తీర్చారు. వ్యాసం సమగ్రంగా ఉంది. ఉదాహరణలు యథోచితంగా ఉన్నాయి.
ఆముక్తమాల్యదలో రాయల వారు భాష పరంగా చేసిన్ ఇంకో ప్రక్రియ నేను గమనించాను. ఈయన పదాల్ని ఒక ప్రెస్సులో పెట్టి నొక్కేస్తాడు. ఇల్లాంటి నొక్కుళ్ళు విచిత్రమైన పదబంధాల్ని సృష్టిస్తాయి. అలాంటి పలుకుబళ్ళు ఇంకెక్కడా కనబడవు.
ఉదా. మంగళ కైశికి ఉపాఖ్యానం నుండి మాలదాసరి భగవంతుని స్తుతించే వర్ణన
శా. గండా భోగముల న్ముదశ్రులహరుల్గల్ప న్నుతుల్పాడి యా
దండ న్వ్రేగులు డించి భక్తిజనితోద్యత్తాండవం బాడు నా
చండాలేతర శీలుడుత్పులకియై చాండాలికన్మీటుచున్
గుండుల్నీరుగనెండ గాలి పసి తాకుం జూడ కాప్రాహ్ణమున్.
చాలా బావుందండీ.
ఐతే పిల్లి మెళ్ళో గంట కట్టే ధీరుడెవ్వడు?
మన రాష్ట్ర రాజకీయ దురంధరులకి అసలు రాష్ట్రంలో విద్య అనే లాంటి అల్ప విషయాలు పడతాయా? అదీ కాక ప్రతి నగరంలోనూ పట్టణంలోనూ వేళ్ళూని విస్తరించిన విద్యా వ్యాపారం .. బహుశా వేల కోట్లలో సాగుతున్న ఈ వ్యాపారానికి ఎవరు ఎదురొడ్డుతారు? మా తోటి వాళ్ళందరూ ఇంగ్లీషు బళ్ళల్లో చదువుకుంటూ ఉంటే, ఆ చదువు లోని డొల్ల తెలిసిన మా నాన్న గారు మమ్మల్నందర్నీ తెలుగు బడిలోనే చదివించారు 10 వరకూ. ఇప్పుడు ఆ ధైర్యం ఎవరి కుంది?
We cannot hear the voices. Please improve the voice quality.
HM
[ అడోబీ ఫ్లాష్ ప్లేయర్ (Adobe Flash Player) కొత్త వెర్షన్ లో ఇది బాగానే వినిపిస్తుంది. అడోబీ వారి డౌన్‌లోడ్ సెంటర్ నుండి తాజా ఫ్లాష్ ప్లేయర్ పొందవలసిందిగా మనవి. — సం. ]
రాం గోపాల్ వర్మ సినిమాల గురించి చాలా బాగా రాసారు.
శివ సినిమా రిలీజ్ రోజు రాత్రి 12కి నెల్లూరులో చూసాను.తరువాత అదే సినిమాని 4 సార్లు చూసాను.సినిమాలో ప్రతి “షాట్” గుర్తుంది నాకు,రాం చాలా అద్భుతంగా తీసాడు.
నాగార్జున అన్న కూతురిని సైకిల్ లో తీసుకుపోతున్నపుడు భవాని గ్రూప్ కార్ లో చేజ్ చేస్తారు.అపుడు వాళ్ళు “అంబాసడర్ కార్ ప్లేట్ 2345” వాడుతారు.తర్వాత శివ గాంగ్ తయారయినపుడు శివ గాంగ్ అదే కారు వాడుతారు.శివ గాంగ్ భవాని వాళ్ళ కారుని లాగేసుకున్నారా? లేక రాం గోపాలవర్మ తప్పు చేసాడా? మీరేమంటారు?
మీరు రాసిన 3 సినిమాలే కాకుండా “కంపెనీ” సినిమాని కుడా చాలా బాగా తీసాడు.ఇది మీకు నచ్చలేదా?
ఇంతకన్నా సమగ్రంగా, విపులంగా, సెన్సిబ్‌ల్ గా ఈ విషయాన్ని ఎవరూ వివరించలేరేమో.
నేను మద్రాసులో 1964లో 11వ తరగతి పూర్తి చేశాను. మాకు ఇంగ్లీషు, తెలుగు, హిందీ (ఇందులో సున్నా మార్కులొచ్చినా పరవాలేదు కాని ఫయినల్ పరీక్ష రాసి తీరాలి). తెలుగు గ్రాంథికంలో ఉండేది కనక కాస్త ఆముదం తాగిన మొహంతోనే చదివాననుకోండి. అయితే అప్పట్లో ఆ మాత్రమైనా క్లాసిక్స్ చదవడం మంచిదని ఆ తరవాత గ్రహించాను. కాలేజీ స్థాయిలో తెలుగు కన్నా హిందీ ‘సులభం’ అని అనుభవజ్ఞులు చెప్పిన మీదట బీ.ఎస్ సి దాకా హిందీ చదివాను. గ్రామరూ, ఛందస్సూ, సాహిత్యచరిత్రా చాలా నేర్పేవారు. ఫిజిక్స్ మెయిన్ అయినప్పటికీ. ఇంగ్లీషులో షేక్స్పియర్ నాటకాలు రెండేసీ, మిల్టన్ పేరడైజ్ లాస్ట్, బోలెడంత ప్రోజూ వగైరాలుండేవి. సైన్సుతోబాటు ఇంత ‘లాంగ్వేజి బరువు’ ఉన్నా ఇబ్బంది అనిపించలేదు.
ఈమధ్య విశాఖలోనే ఇంజనీరింగు దాకా చదువుకున్న ఒకతను తాను తెలుగు గబగబా చదవలేనని చెప్పుకున్నాడు. నా మద్రాసు తెలుగే నయమనిపించింది.
సమకాలీన సంఘటనల్లో పత్రికల మీద గూండాయిజం అని చోట్లా మామూలయింది. ముంబయిలో లోక్ సత్తా మీద ఇటీవలే దాడి చేశారులోఈ మధ్య ఆంధ్రజ్యోతి…పూర్వం విరసం రచయితల మీద అమలు జరిపిన దమనకాండ అందరికీ తెలిసినదే పత్రికలకు కూడా ఈ విషయంలో ‘తనదాకా వస్తే…’ అన్న పద్ధతిలో సెలెక్టివ్ మెమరీ ఉన్నట్టుగా అనిపిస్తోంది.
ఆరుద్ర తో ముఖాముఖీ గురించి mOhana అభిప్రాయం:
07/02/2008 9:09 am
చాలా బాగుంది, దీనిని అందించినందులకు ధన్యవాదాలు. ఆధునిక కవిత – అభిప్రాయవేదిక అనే పుస్తకంలో ఆరుద్రగారు మరి కొందరితో చర్చను జరిపారు. దీనిని నా వ్యాసములో కూడ ఉదహరించాను. ఇందులో రాయప్రోలు, దాశరథి, శ్రీశ్రీ, ఆరుద్ర, సినారె, దివాకర్ల, శేషేంద్ర్రశర్మ, కుందుర్తి, వేదుల, మహీధర, నార్ల, ఆధునిక కవిత్వంపై తమ భావాలను వెలిబుచ్చారు. ఈ ఆడియోలో ఉన్నవి కొన్ని ఇంకా విడమర్చబడి ఉన్నాయి పుస్తకంలో. తప్పక చదవండి. – మోహన
రాంగోపాల్ వర్మ చిత్రాల్లో కథానాయకుడి పరిణామక్రమం – ఒక సామాజిక విశ్లేషణ గురించి కె.మహేష్ కుమార్ అభిప్రాయం:
07/02/2008 9:06 am
శ్రీ గారు, మీ నిశిత దృష్టికి జోహార్లు. ఇలాంటి తప్పుల్ని goof-ups (గూఫులు) అంటారు. అసిస్టెంట్ డైరెక్టర్లు కంటిన్యుటీ సరిగ్గా రాసుకోక, ఇలా ఓకే ప్రొడక్షన్ కారుని రెండు సీన్లలో ఉపయోగించేసుంటారు. నిజానికి అది రాంగోపాల్ వర్మ తప్పుకాకపోయినా, కేప్టెన్ ఆఫ్ ద షిప్ గా బాధ్యత మాత్రం తనదే !
‘కంపెనీ’ మంచి సినిమానే. ఇక్కడ నేను తీసుకున్న విషయం, వర్మ తెలుసుకున్న సమాజంలోని మాఫియా పార్శ్వం, తద్వారా మారిన తన చిత్ర కథానాయకుడి పరిణామక్రమం, ‘సత్య’ వర్మ యొక్క most evolved protagonist అని నా అభిప్రాయం. ఆ తరువాత వచ్చిన, లేక ఇప్పటికీ తీస్తున్న ఏ సినిమాలోనూ వర్మ ఇంత profound statement ఇవ్వలెదని నా భావన. సత్య తరువాత వచ్చిన సినిమాలన్నీ శివ, గాయం, సత్య సినిమాలలోని పాత్రల్నీ, భావాల్నీ, ఆలోచనల్నీ కొనసాగించిన చిత్రాలుగా మాత్రమే అనిపిస్తాయి. Other films are just a continuation or reminiscences of what he has already done in Shiva, Gaayam and Satya.
ఇంకా చెప్పాలంటే, ‘సత్య’ అనే ఉన్నత శిఖరాన్నెక్కిన వర్మ, అక్కడి నుండీ క్రిందకి దిగుతున్నట్టుందే తప్ప, దాన్ని మించిన ఎత్తుకు ఆ తరువాత తీసిన సినిమాలు, సృష్టించిన పాత్రలూ ఉన్నాయంటారా?
కవిత్వ భాష తీరుతెన్నులు గురించి కొత్తపాళీ అభిప్రాయం:
07/02/2008 8:09 am
మొదటి పేజీ చదివి, కొంచెం ఈ నాటి కవిత్వం లోనించి కూడా ఉదాహరణలు ఇస్తే బాగుండునే అనుకున్నాను. తరువాతి పేజీల్లో ఈ ముచ్చట కూడ తీర్చారు. వ్యాసం సమగ్రంగా ఉంది. ఉదాహరణలు యథోచితంగా ఉన్నాయి.
ఆముక్తమాల్యదలో రాయల వారు భాష పరంగా చేసిన్ ఇంకో ప్రక్రియ నేను గమనించాను. ఈయన పదాల్ని ఒక ప్రెస్సులో పెట్టి నొక్కేస్తాడు. ఇల్లాంటి నొక్కుళ్ళు విచిత్రమైన పదబంధాల్ని సృష్టిస్తాయి. అలాంటి పలుకుబళ్ళు ఇంకెక్కడా కనబడవు.
ఉదా. మంగళ కైశికి ఉపాఖ్యానం నుండి మాలదాసరి భగవంతుని స్తుతించే వర్ణన
శా. గండా భోగముల న్ముదశ్రులహరుల్గల్ప న్నుతుల్పాడి యా
దండ న్వ్రేగులు డించి భక్తిజనితోద్యత్తాండవం బాడు నా
చండాలేతర శీలుడుత్పులకియై చాండాలికన్మీటుచున్
గుండుల్నీరుగనెండ గాలి పసి తాకుం జూడ కాప్రాహ్ణమున్.
88 ఏళ్ళ యువకులు గురించి కొత్తపాళీ అభిప్రాయం:
07/02/2008 7:45 am
అద్భుతమైన విషయాలు చెప్పారండీ. మిగుల ధన్యవాదములు!
తెలుగు భాషాభివృద్ధికి వ్యూహాలు గురించి కొత్తపాళీ అభిప్రాయం:
07/02/2008 7:44 am
చాలా బావుందండీ.
ఐతే పిల్లి మెళ్ళో గంట కట్టే ధీరుడెవ్వడు?
మన రాష్ట్ర రాజకీయ దురంధరులకి అసలు రాష్ట్రంలో విద్య అనే లాంటి అల్ప విషయాలు పడతాయా? అదీ కాక ప్రతి నగరంలోనూ పట్టణంలోనూ వేళ్ళూని విస్తరించిన విద్యా వ్యాపారం .. బహుశా వేల కోట్లలో సాగుతున్న ఈ వ్యాపారానికి ఎవరు ఎదురొడ్డుతారు? మా తోటి వాళ్ళందరూ ఇంగ్లీషు బళ్ళల్లో చదువుకుంటూ ఉంటే, ఆ చదువు లోని డొల్ల తెలిసిన మా నాన్న గారు మమ్మల్నందర్నీ తెలుగు బడిలోనే చదివించారు 10 వరకూ. ఇప్పుడు ఆ ధైర్యం ఎవరి కుంది?
అమెరికా పర్యాటకుల రెండు పుస్తకాలు – I గురించి Happy Man అభిప్రాయం:
07/02/2008 5:38 am
మీ సమీక్ష చాల హృద్యం గా వున్నది.
HM
ఆరుద్ర తో ముఖాముఖీ గురించి Happy Man అభిప్రాయం:
07/02/2008 5:28 am
We cannot hear the voices. Please improve the voice quality.
HM
[ అడోబీ ఫ్లాష్ ప్లేయర్ (Adobe Flash Player) కొత్త వెర్షన్ లో ఇది బాగానే వినిపిస్తుంది. అడోబీ వారి డౌన్‌లోడ్ సెంటర్ నుండి తాజా ఫ్లాష్ ప్లేయర్ పొందవలసిందిగా మనవి. — సం. ]
రాంగోపాల్ వర్మ చిత్రాల్లో కథానాయకుడి పరిణామక్రమం – ఒక సామాజిక విశ్లేషణ గురించి శ్రీ అభిప్రాయం:
07/02/2008 5:21 am
రాం గోపాల్ వర్మ సినిమాల గురించి చాలా బాగా రాసారు.
శివ సినిమా రిలీజ్ రోజు రాత్రి 12కి నెల్లూరులో చూసాను.తరువాత అదే సినిమాని 4 సార్లు చూసాను.సినిమాలో ప్రతి “షాట్” గుర్తుంది నాకు,రాం చాలా అద్భుతంగా తీసాడు.
నాగార్జున అన్న కూతురిని సైకిల్ లో తీసుకుపోతున్నపుడు భవాని గ్రూప్ కార్ లో చేజ్ చేస్తారు.అపుడు వాళ్ళు “అంబాసడర్ కార్ ప్లేట్ 2345” వాడుతారు.తర్వాత శివ గాంగ్ తయారయినపుడు శివ గాంగ్ అదే కారు వాడుతారు.శివ గాంగ్ భవాని వాళ్ళ కారుని లాగేసుకున్నారా? లేక రాం గోపాలవర్మ తప్పు చేసాడా? మీరేమంటారు?
మీరు రాసిన 3 సినిమాలే కాకుండా “కంపెనీ” సినిమాని కుడా చాలా బాగా తీసాడు.ఇది మీకు నచ్చలేదా?
తెలుగు భాషాభివృద్ధికి వ్యూహాలు గురించి Rohiniprasad అభిప్రాయం:
07/02/2008 3:14 am
ఇంతకన్నా సమగ్రంగా, విపులంగా, సెన్సిబ్‌ల్ గా ఈ విషయాన్ని ఎవరూ వివరించలేరేమో.
నేను మద్రాసులో 1964లో 11వ తరగతి పూర్తి చేశాను. మాకు ఇంగ్లీషు, తెలుగు, హిందీ (ఇందులో సున్నా మార్కులొచ్చినా పరవాలేదు కాని ఫయినల్ పరీక్ష రాసి తీరాలి). తెలుగు గ్రాంథికంలో ఉండేది కనక కాస్త ఆముదం తాగిన మొహంతోనే చదివాననుకోండి. అయితే అప్పట్లో ఆ మాత్రమైనా క్లాసిక్స్ చదవడం మంచిదని ఆ తరవాత గ్రహించాను. కాలేజీ స్థాయిలో తెలుగు కన్నా హిందీ ‘సులభం’ అని అనుభవజ్ఞులు చెప్పిన మీదట బీ.ఎస్ సి దాకా హిందీ చదివాను. గ్రామరూ, ఛందస్సూ, సాహిత్యచరిత్రా చాలా నేర్పేవారు. ఫిజిక్స్ మెయిన్ అయినప్పటికీ. ఇంగ్లీషులో షేక్స్పియర్ నాటకాలు రెండేసీ, మిల్టన్ పేరడైజ్ లాస్ట్, బోలెడంత ప్రోజూ వగైరాలుండేవి. సైన్సుతోబాటు ఇంత ‘లాంగ్వేజి బరువు’ ఉన్నా ఇబ్బంది అనిపించలేదు.
ఈమధ్య విశాఖలోనే ఇంజనీరింగు దాకా చదువుకున్న ఒకతను తాను తెలుగు గబగబా చదవలేనని చెప్పుకున్నాడు. నా మద్రాసు తెలుగే నయమనిపించింది.
ప్రజాస్వామ్యం – పత్రికాస్వాతంత్ర్యం గురించి Rohiniprasad అభిప్రాయం:
07/02/2008 2:44 am