పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16452

  1. తడి గురించి raviteja అభిప్రాయం:

    07/05/2008 3:20 am

    first of all thanks for providing a site for telugu.
    When comes to the katha, it is very fine and cute and nice.

  2. పలాయనం గురించి chokkakula venkataprasad అభిప్రాయం:

    07/04/2008 5:49 pm

    ప్రవాన ఆంధ్రుల ఆత్మకథ (ఘోష) చాలా క్లుప్తంగా, సరళంగా,చక్కగా చెప్పారు. అయినా అ(జనా)రణ్యంలో వనవాసం చేస్తూ అక్కడ కూడ అమ్మచేతి కమ్మని వంట లాంటి వంటే కావాలంటే అది కలలోనే సాధ్యం మరి. మార్పుకోరుతూ ఇక్కడకొచ్చి మార్పుని మళ్లీ గుంజకి కట్టేద్దామంటే సాధ్యం కాదు. అయినా నరులు శాంతించరు. అందుకే రాత్రంటూ ఒకటి పెట్టి, ఒంటికి అలసట, కంటికి కునుకు తప్పనిసరి చేసేసేడు ఆ పైవాడు. లేకపోతె కలలు ఉండేవి కావు కలలోని కమ్మని ఊహలు ఉండేవి కావు. మీ సుబ్బారావు మళ్ళీ మళ్ళీ నిద్రపోయి మరిన్ని కలలు కనాలని కోరుకొంటూ నిద్రకుపక్రమిస్తున్నాను

  3. తెలుగు భాషాభివృద్ధికి వ్యూహాలు గురించి కె.మహేష్ కుమార్ అభిప్రాయం:

    07/04/2008 6:53 am

    చాలా వివేకం ఉన్న వ్యాసం. ఆచరించదగ్గ సూచనలు.

    మీరు చెప్పిన సూచనలలో మొదటి మూడూ, కేంద్ర ప్రభుత్వ పాఠశాలలైన జవహర్ నవోదయా విద్యాలయాల్లో అమలవుతున్నాయి. 80% తెలుగు మాధ్యమం విధ్యార్థులు 6 వ తరగతిలో ప్రవేశిస్తే, 9 వతరగతికి వారు ఆంగ్ల మాధ్యమంలో చదివేలా తయారు చెయ్యడం జరుగుతుంది.ఈ సమయంలో వీరు హిందీ కూడా నేర్చుకుంటారు. 9 నుంచీ 12 వ తరగతి వరకు తెలుగు ఒక విషయంగా కొనసాగుతుంది. ఇవి చాలా మంచి ఫలితాల్ని సాధిస్తున్నాయి కూడా.

    కానీ ఇలాంటి పాఠాల్ని నేర్చుకోవడానికి మన ప్రభుత్వం తయారుగా ఉందంటారా? ఇప్పటి వీరి నిర్ణయానికి ఆర్థిక కారణమే (ఇలా చేస్తే కేంద్ర ప్రభుత్వ నిధులొస్తాయి) తప్ప సైద్ధాంతిక ఆలోచన ఉందంటారా? ఒక వేళ ఉన్నా, ప్రస్తుతం ఉన్న విద్యా విధానం, స్కూళ్ళ పరిస్తితీ, ఉపాధ్యాయుల స్థాయిని దృష్టిలో ఉంచుకుంటే అసంభవమేమో అనిపిస్తుంది.

    ఈ విషయం పై నా స్వీయానిభవాన్ని నా బ్లాగులో పొందుపరిచాను.

  4. రాంగోపాల్ వర్మ చిత్రాల్లో కథానాయకుడి పరిణామక్రమం – ఒక సామాజిక విశ్లేషణ గురించి కె.మహేష్ కుమార్ అభిప్రాయం:

    07/04/2008 4:36 am

    @రాజేంద్ర, నా చిన్న ప్రయత్నాన్ని ఆదరించినందుకు మొదటిగా నెనర్లు.
    ఇక మీరు అడిగిన
    1) వర్మ అండర్ వరల్డ్ ను గ్లొరిఫై చేస్తున్నాడా డాక్యుమెంట్ చేస్తునాడా?
    2) వర్మ చిత్రాలలో స్త్రీ పాత్రలను ఎందుకు అలా (వ్యక్తిత్వం మూర్తీభవించిన మహిళలుగా కాక) చిత్రీకరిస్తాడూ?
    అనే ప్రశ్నలకు వివరంగా సమాధానం ఇవ్వాలంటే, మరో రెండు వ్యాసాలు పడుతుందనుకుంటాను. కానీ చర్చ మొదలయ్యింది గనక అతని ఇంటర్వ్యూలలోని రెండు స్టేట్ మెంట్లు ఇక్కడ చెప్పి, మీరడిగిన ప్రశలకి కొంత సమాధానం సజెస్ట్ చేస్తాను.

    “I want my hero’s to be powerful” : గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి ఒక లారీ గూండాలను, ఒక్క దుడ్డుకర్రతో కొట్టిన ‘పవర్’ కాక ఎదుటివాళ్ళని, లేక వ్యవస్థనే తన మాటలతో,చూపులతో,చేష్టలతో శాసించే ‘పవర్ ఫుల్’ పాత్రల్ని వర్మ సృష్టించాలనుకున్నాడు కాబోలు. నిజానికి అశోక చక్రవర్తి (బాలకృష్ణ), భాషా(రజనీకాంత్) లాంటి అండర్ వరల్డ్ ని స్వచ్చంగా ‘గ్లామరైజ్’ చేసే సినిమాకన్నా, వర్మ సినిమాలు నిజానికి దగ్గరగా గగుర్పొడిచేలా ఉండవంటారా?

    “I want my heroin’s to be sensuous. They are body to me, I don’t care about their brains”: ఈ ధోరణిని విశ్లేషించాలంటే, కొంత guess work తప్పదు. బహుశా వర్మ తన వ్యక్తిగత జీవితంలో ఎక్కడా చాలా బలమైన వ్యక్తిత్వమున్న స్త్రీ తో గడపలేదేమో ! అందుకే ఒకటీ అరా పాత్రలు మినహా (అవికూడా స్క్రిప్ట్ వేరే వాళ్ళు రాయడం వలనేమో) అతడి సినిమాలోని స్త్రీ పాత్రలు చాలా ‘తేలిగ్గా’ అనిపిస్తాయి.

    ఇంకా లోతుగా ఈ విషయాల గురించి చర్చించాలంటే, కొంత రిసెర్చ్ అవసరం. ఈ పంధాలో నా ఆలోచనల్ని నడిపినందుకు ధన్యవాదాలు. కొంత శోధన తరువాత ఈ విషయాల్ని క్రోడీకరించి మరిన్ని వివరాలతో ఇంకో వ్యాసం రాయడానికి ప్రయత్నిస్తాను.

  5. తెలుగు వార్తాపత్రికలు – ఒక ప్రసంగం గురించి rama అభిప్రాయం:

    07/04/2008 2:15 am

    శ్రీరంగం గోపాలరత్నం గారి గొంతుని వినే అవకాశం, పాత తెలుగు పత్రికలని గురించిన విలువైన సమాచారం అందించారు మీరు. చాలా సంతోషం శ్రీనివాస్ గారు. మీరు ఇటువంటి మరికొన్ని పాత విషయాలున్న ఎటువంటి వివరాలనైన ఇవ్వగలిగితే, పరిశోధకులకి వుపకారం జరుగుతుంది. అయితే పాత పత్రికలు ఇవాళ లభ్యం అవుతాయా అన్నది సందేహమే.

    బ్రౌన్ దొర గారు పత్రికని కూడా పెట్టి పండితుల చేత సాహిత్య సంగతులని మట్లాడించినట్లు నమశ్శివాయ గారి ప్రసంగం వలన తెలిసిన కొత్త విషయం. చాలా విలువైన సమాచారం ఉన్నది గూడూరి వారి ప్రసంగంలో.

    ఇవాళ సాహిత్యం కోసం పత్రికలు లేవు. పత్రికలలోని సాహిత్యపు పేజీలు తప్ప. కవులు, పండితులకి సాహిత్యం గురించి మాట్లాడుకుందికి ఒక స్థలం కావాలన్నా తపన ఎక్కడ లేదు ఇవ్వాళ. బాధగా అనిపించే వాస్తవం కదా ఇది.

    మంచి సమాచారాన్ని నలుగురితో పంచుకున్న మీకు నా కంగ్రాట్స్ చెపుతూ,

    రమ.

  6. రాంగోపాల్ వర్మ చిత్రాల్లో కథానాయకుడి పరిణామక్రమం – ఒక సామాజిక విశ్లేషణ గురించి కె.మహేష్ కుమార్ అభిప్రాయం:

    07/04/2008 12:08 am

    @చంద్ర, ‘కంపెనీ’, ‘అంతం’ సినిమాలపై మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. ఇక్కడ వర్మ చిత్రాల హీరో పరిణామం గురించి, తన త్రిచిత్రాల (trilogy) మాధ్యమంగా మాత్రమే చర్చించడం జరిగింది గనక ఆ సినిమాల ప్రస్తావన రాలేదు. వీలుంటే వాటి గురించి ప్రత్యేకంగా రాయడానికి ప్రయత్నిస్తాను.

    @మంజుల, ‘సత్య’ is surely not an underrated film in India by any standards. అంత dispassionate గా తీసాడు గనకనే, ఈ సినిమాకొక importance ఉంది.

  7. రాంగోపాల్ వర్మ చిత్రాల్లో కథానాయకుడి పరిణామక్రమం – ఒక సామాజిక విశ్లేషణ గురించి రాజేంద్ర కుమార్ దేవరపల్లి అభిప్రాయం:

    07/04/2008 12:07 am

    గొప్ప విశ్లేషణ అనలేము కానీ చాలా మంచి ప్రయత్నం ఇది.చలన చిత్రాలను సమకాలీన సామాజిక,ఆర్ధిక,రాజకీయ,సాంస్కృతిక అంశాలతో మేళవిస్తూ గతంలోలా ఇవ్వాళ పత్రికల్లో వ్యాసాలు రావటం దాదాపు అరుదయ్యింది.గతంలో సుప్రభాతం పత్రికలో ఎక్కువగా,ఇప్పుడు తెలుగు బ్లాగుల్లో,నవతరంగం.కాం లో మాత్రమే తరచూ సినిమాలను పలు కోణాల్లో పరిశీలిస్తూ రచనలు వస్తున్నాయి.అలాంటి మరొక మంచి ప్రయత్నాన్ని మొదలు పెట్టిన మహేష్ ను,ఈమాట సంపాదకవర్గాన్ని అభినందిస్తున్నాను.
    మాయలూమంత్రాలూ,దెయ్యాలూభూతాల కధలతో తనపేరుతోఒకబ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్న విఠలాచార్య తన బాణీకి విరుద్ధంగా తీసిన బీదలపాట్లు ను జనం తిరగ్గొట్టారు,సుమారు వందవరకూ(అందులో అధిక భాగం కృష్ణ కధానాయకుడు)క్రైంధ్రిల్లరల్ను రూపొందించిన కె.యస్.ఆర్.దాస్ గిరిజాకళ్యాణం లాంటి నవలాచిత్రాలకు దర్శకత్వం వహిస్తే ప్రేక్షకాదరణ లభించలేదు.వీళ్ళిద్దరూ ఒక ప్రత్యేకమైన బాటలో మొదటి నుంచీ పయనించిన వారు.మరలా శివ చిత్రం ద్వారా నిన్నమొన్నటి సర్కార్ రాజ్ వరకూ రాం గోపాల్ వర్మ తనదైన పంధాను కొనసాగిస్తున్నారు.ముఖ్యంగా అండర్ వరల్డ్,మాఫియా అనేవి ఇతనికి అభిమానవిషయాలు.
    కాలేజీల్లోని రాజకీయనాయకుల,రౌడీగ్యాంగుల ముఠాలను ఎదుర్కోవటానికి శివకుమార్ అనే కళాశాల విధ్యార్ధి తనూ ఒకగూండా గా మారితే,శివ సినిమా ఆనాటి చాలా మంది యువకులను గూండాలుగా మార్చింది.విశాఖపట్నం లో ఆనాడు వెలసిన శివ గ్యాంగు నాయకుడు ఇవ్వాళ జీవితఖైదు అనుభవిస్తున్నాడు.గుంటూరు,విజయవాడ,ఒంగోలు తదితర ప్రాంతాల్లో ఆరోజుల్లో ఇలాంటి శివగ్యాంగులు వీధికొక్కటిగా వెలిసాయి.ఒక్క సినిమా,అదీ తన మొదటి సినిమాతో అంతటి సామాజికసంచలనం సృష్తించినవి రాం గోపాల్ వర్మ సినిమాలు.

    ఇంతకీ తనకెంతో ప్రీతిపాత్రమైన మాఫియా సినిమాల్లో అండర్ వరల్డ్ కార్యకలాపాలను రాం గోపాల్ వర్మ గ్లోరిఫై చేస్తున్నాడా,లేక కేవలం డాక్యుమెంట్ చేస్తున్నాడా అన్నది ఒకప్రశ్న కాగా,ఎక్కడో ఒక సత్య సినిమాలో తప్ప స్త్ర్రీపాత్రలను ఎందుకలా చిత్రీకరిస్తాడు అన్నది మరొక ప్రశ్న.సత్య సినిమా అంటే గుర్తుకొచ్చింది అంతం లోని నాగార్జున,ఊర్మిళల పాత్రలకు మరింతమేలైన పొడిగింపు సత్య చిత్రం.రంగీలా జనరంజకమైన చిత్రమైనా ఆపంధాను అరుదుగానన్నా అలాంటి సినిమాలు కూడా తీయక తను నమ్ముకున్నమాఫియా చిత్రాలనే కొనసాగిస్తున్నాడు.ఇంతకీ అసలు రాద్దామనుకున్న కామెంటు మొదలే కాలేదు కానీ ఇప్పటికే ఈమాటవారి విలువైన స్థలాన్ని చాలా ఆక్రమించాను.ప్రస్తుతానికి శెలవు.

  8. తెలుగు భాషాభివృద్ధికి వ్యూహాలు గురించి సుధాకర బాబు అభిప్రాయం:

    07/03/2008 11:10 pm

    నేను, నాలాంటి ఎందరో చాలా తీవ్రంగా ఆక్రోశించే సమస్య ఈ ఆంగ్ల భాషా మాధ్యమం బోధన – ఈ వ్యాసంలోని విషయాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నాకు అనిపించిన మరికొన్ని విషయాలు-

    1) “ఇంగ్లీషులో చదువు”ల వల్ల కలుగుతున్న ప్రయోజనాలు – అని చాలా మంది అనుకొనేవి నిజానికి “చదువు” వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రమే. ఇంగ్లీషు మీడియం వల్ల అవి కలుగుతున్నాయన్న భ్రమ వ్యాపించింది.

    2) అసలు తెలుగు మీడియంలో అధికంగా చదువడం వలన సమాజానికీ, వ్యక్తికీ కలిగే ఉపయోగాలు ప్రస్తుతం దాచిపెట్టిన నిధిలాంటివి అనుకొంటాను. దేశంలో కోటి మంది (అ)విద్యావంతుల బదులు నూరుకోట్ల విద్యావంతులు ప్రభవించే అవకాశాన్ని మనం గొయ్యి తీసి కప్పెట్టి ఉంచేసుకొంటున్నాము.

    3) ఒక సినిమా చూసి వచ్చిన చిన్నపాటి పట్టణంలోని కుర్రవాడిని ఆ సినిమా కధ ఆంగ్లంలో చెప్పమనండి. ఇంగ్లీషు మీడియం అనేది వట్టి మాయ అని క్షణాలలో తేలిపోతుంది.

    4) ఇప్పటి వరకు ఒక్క ప్రభుత్వానికి కూడా ఈ విషయంలో కృతనిశ్చయం లేకుండా పోయింది. ఇక ముందు కలుగుతుందన్న ఆశ లేదు.

    5) నేను పదవ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివాను. ఇంటర్‌లో రెండవ భాషగా తెలుగు చదివాను. నేను చాలా తెలుగు పుస్తకాలు, ఇంగ్లీషు పుస్తకాలూ చదివాను. దేని గొప్పతనం దానిది. కాని నేను చదివిన తెలుగు రచనలు ఈనాటికీ నా మదిలో ఉన్న నేస్తాలు. ఇంగ్లీషు పుస్తకాలు ప్రయాణంలో కలిసి విడిపోయిన పరిచయాలు.

  9. 88 ఏళ్ళ యువకులు గురించి Madhu అభిప్రాయం:

    07/03/2008 9:40 pm

    చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదములు.

  10. పలాయనం గురించి Rangababu అభిప్రాయం:

    07/03/2008 5:19 pm

    వంటింటి కథ లో పోపు బాగానే వుంది.