ఎక్కడా ఆపకుండా చదివించారు! భిన్న సంస్కృతుల వల్ల పిల్లలు లోనయ్యే అయోమయం చాలా చక్కగా వివరించారు.. కిరణ్ తుపాకీ గురించి, నల్ల వాళ్ళ గురించి తన వాదన వినిపించడం చూస్తే ఒక క్షణం తమకు అంతా తెలుసన్నట్టు, ఆ మరుక్షణమే అసలేమీ తెలియనట్టు ఉండే ఇక్కడి పిల్లల మనస్తత్వం కళ్ళకి కట్టినట్లుంది..
కర్ణాటక గాత్రసంగీతం వింటున్నప్పుడు తెలుగు సాహిత్యం ఏ కారణంవల్లనైనా చెడితే తెలుగువారికి కలిగే బాధను అర్థంచేసుకోవచ్చు. అయితే శైలి ఏదైనప్పటికీ శాస్త్రీయసంగీతంలో సాహిత్యానికుండే విలువ చాలా తక్కువ. ముఖ్యంగా హిందుస్తానీ పద్ధతిలో పదాలు ఒకంతట అర్థం కావు కూడా. రాగప్రధానంగా, గమక విన్యాసాలతో సాగే శాస్త్రీయసంగీతంలో మనం ఎక్కువగా విని ఆనందించవలసినవి సాహిత్యేతర అంశాలే. భావగీతాల్లోనూ, లలితసంగీతంలోనూ మాత్రం సాహిత్యభావం ముఖ్యమైనదిగా ఉంటుంది.
కొన్ని త్యాగరాజ కీర్తనల్లో ట్యూన్ ముందుగా చేసి తరవాత పదాలను కూర్చినట్టుగా అనిపించే ఉదాహరణలు కనిపిస్తాయి. దీన్నిబట్టి చూస్తే పెద్ద వాగ్గేయకారులు కూడా కొన్ని సందర్భాల్లో సాహిత్యానికి చిన్నపీట వేశారనిపిస్తుంది.
ఇవన్నీ వింటున్న మనవంటి పామరులు సాహిత్యం అందంగా వినిపిస్తున్నప్పుడు సంతోషిస్తూ, వినిపించనప్పుడు సంగీత అంశాలను ఆస్వాదిస్తూ ఉండాలే కాని పరిష్కారాలు వెతకడం వృథా ప్రయాస కావచ్చు.
ఈ వ్యాసం ఇచ్చిన ప్రేరణతో, తెలుగుభాష పరిరక్షణ గురించి ఒక బ్లాగు మొదలుపెట్టాలన్న ఆలోచన వచ్చింది. ప్రభుత్వం ఏది చెయ్యాలన్నా, ముందు ప్రజలలో దానిగురించి కదలిక రావాలని నా విశ్వాసం. ఈ సమస్య ప్రధానంగా చదువుకొని పట్టణాలలో జీవిస్తున్నవారిది కాబట్టి, దీని ప్రచారానికి ఇంటర్నెట్టు ఒక మంచి మాధ్యమం అనే నమ్మకంతో, తెలుగుభాష పరిరక్షణగురించిన ఆలోచనలకీ విస్తృత ప్రచారానికీ ఒక వేదికగా ఉంటుందనే ఆలోచనతో, “తెలుగువీర లేవరా” (http://teluguviralevara.blogspot.com) అనే బ్లాగుకి అంకురార్పణ చేసాను. ఆసక్తి ఉన్నవారందరూ తలా ఓ చెయ్యీవేస్తే, దీన్ని ముందుకు తీసుకువెళ్ళవచ్చు.
ఈ వ్యాసం చదివాక ఆలోచిస్తే కొన్ని సందేహాలు కలిగాయి. ఇది నా అవగాహనా లోపమే కావొచ్చు కానీ, నివృత్తిచేసుకోవాలనే తహతహతో ఇక్కడ పెడుతున్నాను:
ఇండియా టుడే సర్వే ఫలితాలకి, భద్రిరాజుగారే అన్నట్టు చాలాకారణాలు ఉండవచ్చు. మరి మాతృభాష మాధ్యమం కాకపోవడం ప్రధాన కారణమని ఎలా అనగలం? సర్వేలో ఎంపికచేసిన అన్ని పాఠశాలలూ ఇంగ్లీషుమాధ్యమం గలవే కదా. వాటిని మాతృభాషమాధ్యమం గల పాఠసాలలతో ఎలా పోల్చడం మరి?
అభివృద్ధి చెందిన దేశాల ఆర్థికవ్యవస్థ స్వయం సమృద్ధమైనది. కాబట్టి వారికి పరభాషమీద ఆధారపడాల్సిన అవసరం ఎక్కువలేదు. భారతదేశ పరిస్థితి అదికాదు కదా. మరి ఈ ఆర్థికవ్యవస్థ మారనంతకాలం, భాష విషయంలో వాళ్ళునడచిన దోవనే మనం నడవగలమా?
పరాయిభాషలో విద్య నేర్చుకోవాలంటే ముందా భాషని నేర్చుకొన్న తర్వాతనే అందులో ఇతర విషయాలు నేర్చుకోగలం. ఆ రకంగా ఆలోచిస్తే మాతృభాషలో విద్యాబోధన సులువయ్యే మాట నిజమే. కానీ, ఇంగ్లీషు మాధ్యమమున్న బడులు, దీనికిప్పుడు మరో మార్గాంతరం అమలుచేస్తున్నాయి. అదేవిటంటే, మాతృభాష ఎలా అయితే వ్యాకరణాదులు ప్రత్యేకించి నేర్చుకోకుండానే మనకి వస్తుందో, ఇంగ్లీషూ అలాగే వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాయి. దీనికోసం ఇంట్లో కూడా తల్లిదండ్రులని పిల్లలతో (L.K.G నుంచి) ఇంగ్లీషులో మాట్లాడాలని ఆదేశిస్తున్నాయి. దీనివల్ల పిల్లలకి తెలుగుకన్నా కూడా ఇంగ్లీషే అతి సహజంగా వస్తుందని! ఇదినా సొంత అనుభవం. మరి దీనికేవిటి విరుగుడు?
పూర్వం తెలుగుమాధ్యమంలో చదువుకున్నవాళ్ళకి కూడా, ఇప్పుడు ఇంగ్లీషుమాధ్యమంలో చదువుకున్నవాళ్ళకన్నా ఎక్కువ భాషాజ్ఞానం ఉండేదన్న విషయం అందరూ ఒప్పుకునేదే. అయితే, ఇతర విషయాల (గణితం, సైన్సు వంటివి) మాటేవిటి? ఈ కాలంలో వీటికి ఎక్కువ ప్రాధాన్యం వచ్చి, వీటి సిలబస్సు గణనీయంగా పెరిగింది కదా. మరి ఇలాటి పరిస్థితులలో, తెలుగుని మాధ్యమంగా చేస్తే, అటు ఇంగ్లీషుభాషా, ఇటు ఈ విషయాలు చదవగలిగే సామర్థ్యం పిల్లలకి ఉంటుందా? అది వాళ్ళమీద మరింత భారాన్ని పెంచదా?
శ్రీకాకుళం లో, ఇరవైయ్యేళ్ళ కిందట, నేదునూరి గారి గాత్రం విన్నాను.అదే మొదటి సారి ఆయన కచేరీ వినడం. త్యాగరాజ కీర్తనలు ఏవీ సాహిత్యం అర్ధం కాలేదు. మంగళం ముందు పాడిన “ముద్దు గారే యశోద..” అన్నమయ్య కీర్తన మాత్రం అద్భుతవనిపించింది. ఇప్పటికీ, బాలమురళీ గాత్రం తప్ప ఇంకోటి తెలీదు. ఎందుకంటే, సాహిత్యం లేకుండా సంగీతం విని అనుభవించే అద్రుష్టం లేక కాబోలు.
సంగీతరావు గారి అభిప్రాయం అర్థం కాలేదు. బాలమురళీ ప్రయత్నం ఎందుకు సఫలీకృతం అవదు? శరశర సమరైక శూర విషయం మాత్రం నూరుపాళ్ళూ రైటు. ఆఖరికి బాలమురళీ కూడా “….సమరై..” అనే ఆపేస్తాడు. బాలమురళీ సఫలీక్రుతమవుతాడని నా నమ్మకం ఎందుకంటే. మా అమ్మయి కోసం “నను గన్న తల్లీ నా భాగ్యమా” ని, మా అబ్బయి కోసం “నా పాలీ శ్రీరామా, భూపాలక స్తోమా..” ని, సంగీతం రాకపోయినా, జోల పాటలుగా ఎన్నుకోని పాడీసీ నాలాటివాళ్ళు చాలా మంది వున్నరు. రోహిణీ ప్రసాదు గారు, ఇంకొంచెం, ఎలాగయినా విస్తారంగా రాస్తే బాగుంటుంది. దానికి మనమేం చేయలి? మరి మన వాళ్ళ సంగీతం, వాళ్ళు పాడీ పధ్ధతి ఎలా దొరుకుతాయి? ఘంటసాల, మనం అద్రుష్టవంతులం. ఘంటసాల కానీ పినాకపాణి గారి శిష్యరికం చేసుంటే? దేవుడున్నాడేమో నని ఇలాటివి విన్నపుడనిపిస్తుంది. మా చిన్నాన్నగారు నేదునూరి వారి మీద జోక్ చేస్తుండేవారు. ఫులుసు కూడా సాంప్రదాయం ప్రకారం సాంబారు లా వండించుకునీ వారుట ఇంట్లో. అప్పట్లో బాలమురళీ భక్తుడు కాబట్టి అలా అంటున్నారు అనుకునీ వాడిని. రోహిణీ ప్రసాదు గారూ మీలాటి వాళ్ళే ఏదయినా మొదలెట్టాలి.
ఇదీ, కొంచెం వెటకారంగా, ఇప్పటి వాళ్ళకి సులువుగా అర్థవయ్యేట్టు చెప్పాలంటే వర్గీకరణ. మూడు రకాల్లోనూ బోరింగ్ మేచులుండొచ్చు. థ్రిల్లింగ్ వీ ఉంటాయి.
ఇది బోరింగ్ కవిత నాకు. కవిత్వం ఎలా వుండాలో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. కవిత చూసిన లేక చదివిన తరవాత దాంట్లో కవిత్వం వుందొ లేదో చెప్పడం చలా సులువు. “ఛిలక జొస్యం” లో కవిత్వం వుందో లేదొ చెప్పడానికి “రారా” కానీ, “కాంతారావు” కానీ, “చేరా” కానీ అఖ్ఖర్లేదు. అయితే ఉదయకళ గారి సిన్సియారిటీ కనపడుతోంది ఇందులో. కష్టపడితే, మంచి కవిత్వం రాయగలరేమో?
జ్యోతిషం గురించి తేలికపాటి అభిప్రాయాలే గానీ, ఇంత లోతుగా పరిశోధన జరిగిందని నాకు తెలియదు. జ్యోతిషంలో ఇంత కాంప్లెక్సిటీ ఉందనీ తెలియదు.
మీ వ్యాసాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. కానీ మీరు చెప్పదలచుకున్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. నమ్మకాల గురించిన చర్చ చాలా బాగుంది.
మన యూనివర్శిటీల్లో జ్యోతిషం కోర్సులు ప్రవేశ పెట్టారని ఆ మధ్య చదివాము. వాటిల్లో ఊరికెనే జ్యోతిష పాఠాలు బోధించకుండా, ఇటువంటి పరిశోధనల్ని ప్రోత్సహిస్తే బాగుంటుంది.
జన సామాన్యానికి అవగాహన పెంపొందింపజేసే ఇటువంటి వ్యాసాలు ఎంతో అవసరం.
సాహిత్యాన్నీ, సాంకేతిక నైపుణ్యాన్నీ విజయవంతంగా ఏకం చేసిన మొదటి ప్రయత్నం ‘ఈమాట‘ వారిదే.
ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు మాట్లాడడం, అర్థంచేసుకోవడం మాత్రమే చేతనైన తెలుగువారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. వారి ‘నిరక్షరాస్యత’ మూలంగా తెలుగు సాహిత్యంతో వారి సంపర్కం నానాటికీ తగ్గిపోతోంది. దీనికి కళ్ళెం వెయ్యాలంటే “శ్రవణసాహిత్యం’ మంచి పద్ధతి.
ఈమాటలో ఆడియో బుక్స్ సదుపాయం కల్పించి, ఆ ఫైల్స్ ను డౌన్ లోడ్ చేసుకుని సీడీలను ‘కాల్చుకోగలిగిన’ ఏర్పాటు ఉచితంగా లభ్యమైతే కొందరయినా (వారికి తెలుగు చదవడం వచ్చినా) కారులో వెళుతున్నప్పుడో, మరొకప్పుడో కథలూ, నవలలూ విని ఆనందించగలుగుతారు.
1958కు మునుపు చనిపోయిన రచయితలకు కాపీరైట్ ఉండదు కనక వారి సాహిత్యంతో మొదలుపెట్టవచ్చు. ఈ ప్రయత్నాల్లో ఆసక్తి ఉన్న ఫణి డొక్కా తదితరులు ముందుకొచ్చి, స్వచ్ఛందంగా ఇటువంటిది చేపడితే మంచి ఫలితాలు కలుగుతాయి. వీలును బట్టి స్త్రీ, పురుషుల కంఠాలతో తగుమాత్రం నాటకీయతతో పాత రచనలను అందించగలిగితే ‘ఈమాట‘ మరొక pioneering effort కు కారణం కాగలదు.
అన్నిటికన్నా ముఖ్యవిషయం ఇలాంటిది జరిగితే దాన్ని గురించిన ప్రకటనలు ఇంగ్లీషులో తక్కిన తెలుగు వెబ్ సైట్లలో రావాలి.
తుపాకి గురించి నిషిగంధ అభిప్రాయం:
07/09/2008 6:43 am
ఎక్కడా ఆపకుండా చదివించారు! భిన్న సంస్కృతుల వల్ల పిల్లలు లోనయ్యే అయోమయం చాలా చక్కగా వివరించారు.. కిరణ్ తుపాకీ గురించి, నల్ల వాళ్ళ గురించి తన వాదన వినిపించడం చూస్తే ఒక క్షణం తమకు అంతా తెలుసన్నట్టు, ఆ మరుక్షణమే అసలేమీ తెలియనట్టు ఉండే ఇక్కడి పిల్లల మనస్తత్వం కళ్ళకి కట్టినట్లుంది..
సార్థక నామధేయుడు సంగీతరావు గురించి Rohiniprasad అభిప్రాయం:
07/09/2008 3:11 am
నేనుకూడా బాలమురళి అభిమానినే.
కర్ణాటక గాత్రసంగీతం వింటున్నప్పుడు తెలుగు సాహిత్యం ఏ కారణంవల్లనైనా చెడితే తెలుగువారికి కలిగే బాధను అర్థంచేసుకోవచ్చు. అయితే శైలి ఏదైనప్పటికీ శాస్త్రీయసంగీతంలో సాహిత్యానికుండే విలువ చాలా తక్కువ. ముఖ్యంగా హిందుస్తానీ పద్ధతిలో పదాలు ఒకంతట అర్థం కావు కూడా. రాగప్రధానంగా, గమక విన్యాసాలతో సాగే శాస్త్రీయసంగీతంలో మనం ఎక్కువగా విని ఆనందించవలసినవి సాహిత్యేతర అంశాలే. భావగీతాల్లోనూ, లలితసంగీతంలోనూ మాత్రం సాహిత్యభావం ముఖ్యమైనదిగా ఉంటుంది.
కొన్ని త్యాగరాజ కీర్తనల్లో ట్యూన్ ముందుగా చేసి తరవాత పదాలను కూర్చినట్టుగా అనిపించే ఉదాహరణలు కనిపిస్తాయి. దీన్నిబట్టి చూస్తే పెద్ద వాగ్గేయకారులు కూడా కొన్ని సందర్భాల్లో సాహిత్యానికి చిన్నపీట వేశారనిపిస్తుంది.
ఇవన్నీ వింటున్న మనవంటి పామరులు సాహిత్యం అందంగా వినిపిస్తున్నప్పుడు సంతోషిస్తూ, వినిపించనప్పుడు సంగీత అంశాలను ఆస్వాదిస్తూ ఉండాలే కాని పరిష్కారాలు వెతకడం వృథా ప్రయాస కావచ్చు.
బంధుత్వం గురించి Surya అభిప్రాయం:
07/09/2008 3:10 am
కవిత బాగుంది
తెలుగు భాషాభివృద్ధికి వ్యూహాలు గురించి Kameswara Rao అభిప్రాయం:
07/08/2008 7:15 am
ఈ వ్యాసం ఇచ్చిన ప్రేరణతో, తెలుగుభాష పరిరక్షణ గురించి ఒక బ్లాగు మొదలుపెట్టాలన్న ఆలోచన వచ్చింది. ప్రభుత్వం ఏది చెయ్యాలన్నా, ముందు ప్రజలలో దానిగురించి కదలిక రావాలని నా విశ్వాసం. ఈ సమస్య ప్రధానంగా చదువుకొని పట్టణాలలో జీవిస్తున్నవారిది కాబట్టి, దీని ప్రచారానికి ఇంటర్నెట్టు ఒక మంచి మాధ్యమం అనే నమ్మకంతో, తెలుగుభాష పరిరక్షణగురించిన ఆలోచనలకీ విస్తృత ప్రచారానికీ ఒక వేదికగా ఉంటుందనే ఆలోచనతో, “తెలుగువీర లేవరా” (http://teluguviralevara.blogspot.com) అనే బ్లాగుకి అంకురార్పణ చేసాను. ఆసక్తి ఉన్నవారందరూ తలా ఓ చెయ్యీవేస్తే, దీన్ని ముందుకు తీసుకువెళ్ళవచ్చు.
ఈ వ్యాసం చదివాక ఆలోచిస్తే కొన్ని సందేహాలు కలిగాయి. ఇది నా అవగాహనా లోపమే కావొచ్చు కానీ, నివృత్తిచేసుకోవాలనే తహతహతో ఇక్కడ పెడుతున్నాను:
సార్థక నామధేయుడు సంగీతరావు గురించి baabjeelu అభిప్రాయం:
07/08/2008 5:41 am
శ్రీకాకుళం లో, ఇరవైయ్యేళ్ళ కిందట, నేదునూరి గారి గాత్రం విన్నాను.అదే మొదటి సారి ఆయన కచేరీ వినడం. త్యాగరాజ కీర్తనలు ఏవీ సాహిత్యం అర్ధం కాలేదు. మంగళం ముందు పాడిన “ముద్దు గారే యశోద..” అన్నమయ్య కీర్తన మాత్రం అద్భుతవనిపించింది. ఇప్పటికీ, బాలమురళీ గాత్రం తప్ప ఇంకోటి తెలీదు. ఎందుకంటే, సాహిత్యం లేకుండా సంగీతం విని అనుభవించే అద్రుష్టం లేక కాబోలు.
సంగీతరావు గారి అభిప్రాయం అర్థం కాలేదు. బాలమురళీ ప్రయత్నం ఎందుకు సఫలీకృతం అవదు? శరశర సమరైక శూర విషయం మాత్రం నూరుపాళ్ళూ రైటు. ఆఖరికి బాలమురళీ కూడా “….సమరై..” అనే ఆపేస్తాడు. బాలమురళీ సఫలీక్రుతమవుతాడని నా నమ్మకం ఎందుకంటే. మా అమ్మయి కోసం “నను గన్న తల్లీ నా భాగ్యమా” ని, మా అబ్బయి కోసం “నా పాలీ శ్రీరామా, భూపాలక స్తోమా..” ని, సంగీతం రాకపోయినా, జోల పాటలుగా ఎన్నుకోని పాడీసీ నాలాటివాళ్ళు చాలా మంది వున్నరు. రోహిణీ ప్రసాదు గారు, ఇంకొంచెం, ఎలాగయినా విస్తారంగా రాస్తే బాగుంటుంది. దానికి మనమేం చేయలి? మరి మన వాళ్ళ సంగీతం, వాళ్ళు పాడీ పధ్ధతి ఎలా దొరుకుతాయి? ఘంటసాల, మనం అద్రుష్టవంతులం. ఘంటసాల కానీ పినాకపాణి గారి శిష్యరికం చేసుంటే? దేవుడున్నాడేమో నని ఇలాటివి విన్నపుడనిపిస్తుంది. మా చిన్నాన్నగారు నేదునూరి వారి మీద జోక్ చేస్తుండేవారు. ఫులుసు కూడా సాంప్రదాయం ప్రకారం సాంబారు లా వండించుకునీ వారుట ఇంట్లో. అప్పట్లో బాలమురళీ భక్తుడు కాబట్టి అలా అంటున్నారు అనుకునీ వాడిని. రోహిణీ ప్రసాదు గారూ మీలాటి వాళ్ళే ఏదయినా మొదలెట్టాలి.
ఎప్పుడు మొదలుపెడతారూ?
బంధుత్వం గురించి baabjeelu అభిప్రాయం:
07/08/2008 4:27 am
“కాబూలీ వాలా” లోని మన్నాదే పాట గుర్తొచ్చింది.
“మల్లినాథ్” గారి అభిప్రాయం అంత బాగుంది ఈ కవిత.
మంచి కవిత.
చిలక జోస్యం గురించి baabjeelu అభిప్రాయం:
07/08/2008 4:15 am
టి ట్వంటీ లాటిది కవిత.
వండే లాటిది కథ.
టెస్టు మేచ్ లాటిది నవల.
ఇదీ, కొంచెం వెటకారంగా, ఇప్పటి వాళ్ళకి సులువుగా అర్థవయ్యేట్టు చెప్పాలంటే వర్గీకరణ. మూడు రకాల్లోనూ బోరింగ్ మేచులుండొచ్చు. థ్రిల్లింగ్ వీ ఉంటాయి.
ఇది బోరింగ్ కవిత నాకు. కవిత్వం ఎలా వుండాలో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. కవిత చూసిన లేక చదివిన తరవాత దాంట్లో కవిత్వం వుందొ లేదో చెప్పడం చలా సులువు. “ఛిలక జొస్యం” లో కవిత్వం వుందో లేదొ చెప్పడానికి “రారా” కానీ, “కాంతారావు” కానీ, “చేరా” కానీ అఖ్ఖర్లేదు. అయితే ఉదయకళ గారి సిన్సియారిటీ కనపడుతోంది ఇందులో. కష్టపడితే, మంచి కవిత్వం రాయగలరేమో?
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3 గురించి రామకృష్ణ M.V అభిప్రాయం:
07/08/2008 2:32 am
జ్యోతిషం గురించి తేలికపాటి అభిప్రాయాలే గానీ, ఇంత లోతుగా పరిశోధన జరిగిందని నాకు తెలియదు. జ్యోతిషంలో ఇంత కాంప్లెక్సిటీ ఉందనీ తెలియదు.
మీ వ్యాసాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. కానీ మీరు చెప్పదలచుకున్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. నమ్మకాల గురించిన చర్చ చాలా బాగుంది.
మన యూనివర్శిటీల్లో జ్యోతిషం కోర్సులు ప్రవేశ పెట్టారని ఆ మధ్య చదివాము. వాటిల్లో ఊరికెనే జ్యోతిష పాఠాలు బోధించకుండా, ఇటువంటి పరిశోధనల్ని ప్రోత్సహిస్తే బాగుంటుంది.
జన సామాన్యానికి అవగాహన పెంపొందింపజేసే ఇటువంటి వ్యాసాలు ఎంతో అవసరం.
రాంగోపాల్ వర్మ చిత్రాల్లో కథానాయకుడి పరిణామక్రమం – ఒక సామాజిక విశ్లేషణ గురించి sasank అభిప్రాయం:
07/08/2008 2:14 am
మహేష్ గారూ, మీ విశ్లేషణ చాలా బాగుంధి. కాని ఇంత క్లిష్టంగా రాయడం అవసరమా అని నా అభిప్రాయం.
ఈమాట కొత్త వేషం గురించి Rohiniprasad అభిప్రాయం:
07/07/2008 7:11 pm