పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. హిందూస్తానీ గాత్ర సంగీతంలో ఘరానాలు గురించి baabjeelu అభిప్రాయం:

    07/11/2008 7:09 am

    రోహిణీప్రసాదు గారూ,
    మీ వ్యాసాలు చదువుతున్నంతసేపూ, మధ్యలో ఉన్న ఆడియో వినడం కష్టమే. అంత రీడబిలిటీ వుంది. కర్ణాటక సంగీతం గురించి కూడా రాయండీ. రాసీసేరా? మీ వ్యాసాల్లో చచ్చిన వాళ్ళ కళ్ళు చారడేసి అన్న ఏటిట్ట్యూడ్ లేకపోవడం ఈమాట అదృష్టం. విలాయత్ ఖాన్ గారి వ్యాసం చదివేను. అద్భుతం.

  2. సార్థక నామధేయుడు సంగీతరావు గురించి baabjeelu అభిప్రాయం:

    07/11/2008 6:16 am

    అయ్యా, రోహిణీ ప్రసాదు గారూ,
    ఆగ్రహించకండి. తెలిసిన వాళ్ళు మీరు.తెలిసీ తెలీని వాళ్ళం, మాలో చాలా మంది. ఎందరో మహనుభావులు, త్యాగరాజు గురించి తెలీని వాళ్ళకి కూడా తెలిసిన కీర్తన.
    తెలిసిన అంటే, పరిచయం మాత్రమే సుమండీ, కీర్తన.దాంట్లో కిట్టించడం సమస్య తెచ్చిన సమస్య ఇది. …..నిజమార్గముతో……ను పాడుచు…. ఎడ్జస్ట్‌మెంటు. కిట్టించడం అనకండి. అయినా రోహిణీప్రసాదు గారూ, సాహిత్యం కన్నా సంగీతాంశాల్నే అస్వాదించాలంటే అంత కష్టపడి సాహిత్యం ఎందుకు సృష్టించేరు ముగ్గురూ?
    అన్నమయ్య తరవాత అన్నేళ్ళకి పుట్టిన త్యాగరాజు సంగీతానికి చిన్నయసూరి ఎలా అయిపోయేడు? దయచేసి జవాబు రాయండి.

  3. సంగీతరస పానశాల ఘంటసాల గురించి baabjeelu అభిప్రాయం:

    07/11/2008 1:59 am

    రమేష్ నాయుడు గారు కూడా “…పాత ఘంటసాల అయితే, అన్నీ ఆయన చేతే పాడిద్దుం…” అని అభిప్రాయపడ్డారు.

    మహదేవన్ గారి అసంతృప్తి గురించి ఈవ్యాసంలో రాయడం మీ బేలన్స్ చూపిస్తుంది. ఎవరేం రాసినా, రాయకపోయినా ఘంటసాల ఘంటసాలే. ధన్యులు మీరు. ధన్యోస్మి.

  4. తుపాకి గురించి నెటిజన్ అభిప్రాయం:

    07/10/2008 10:53 pm

    ఇది వరకు వ్యాఖ్యలో చెప్పదలుచుకున్నది ఇది: (ఈ వ్యాఖ్యని లేఖినిలో వ్రాయబడింది.)
    తుపాకి కధ చదవగానే, Gus Van Sant సినిమా Finding Forrester గుర్తు వచ్చింది. ఆ సినిమా కధకు ఈ కధకు ఏ మాత్రపు సమీపపు సాపత్యం కూడ లేదు.
    తుపాకి గురించి వ్రాయలసింది ఉంది.
    త్వరలో..

  5. తుపాకి గురించి కె.మహేష్ కుమార్ అభిప్రాయం:

    07/10/2008 7:56 pm

    కథ గుండెని తాకింది. కొన్ని ఆలోచనల్ని కొన్ని, ప్రశ్నల్ని మనసులో రేపింది.

  6. సార్థక నామధేయుడు సంగీతరావు గురించి baabjeelu అభిప్రాయం:

    07/10/2008 6:46 pm

    రోహిణీ ప్రసాదు గారూ, మీ “కిట్టించడం” అన్నపదప్రయోగం వల్ల ఇంత చర్చ.
    త్యాగరాజ కీర్తనల్లో సాహిత్యం శాతం తక్కువే. సంగీతానికే పెద్దపీట. అయినా మంచి సాహిత్యం సృష్టించేడు. త్యాగరాజుని సాహితీకారుడుగా ఎవరూ, మిగిలిన సాహితీస్రష్టలతో కంపేర్ చేయరు. కీర్తనలు రాసిన వాళ్ళలో త్యాగరాజు నెం.2.

  7. తుపాకి గురించి నెటిజన్ అభిప్రాయం:

    07/10/2008 6:07 pm

    ఎందుకో ఇది చదవడం మొదలుబెట్టగానే ఘుస్ వన్ శంత్ సినిమా, Fఇందింగ్ Fఒర్రెస్తెర్ గుర్తొచ్చింది. దానికి, మీ కధకి ఎలాంటి పోలికా లేదు! గుర్తొచ్చింది అంతే!
    మీరు చూసారా ఆ సినిమాని?

  8. సార్థక నామధేయుడు సంగీతరావు గురించి Rohiniprasad అభిప్రాయం:

    07/10/2008 5:34 pm

    ఇక ఈ విషయం గురించి నేను చర్చించదలుచుకోలేదు. సంగీతం ఎటువంటిదో, సాహిత్యం ఎటువంటిదో ఎవరిష్టం వచ్చినట్టు వారు అర్థం చేసుకోగలరు.

  9. పూర్వజన్మ వాసన గురించి ప్రసాద్ అభిప్రాయం:

    07/10/2008 1:52 pm

    ఇంతకీ ఆ పూర్వజన్మ వాసన ఏంటో, ఇప్పుడు చూసిన వాసన ఏంటొ స్పష్టంగా నా మొద్దు బుర్రకు అర్థం కావటం లేదండి.

    –ప్రసాద్
    http://blog.charasala.com

  10. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3 గురించి నాగమురళి అభిప్రాయం:

    07/10/2008 1:15 pm

    అవును మోహన గారూ. గోక్ లా పరిశోధనల్ని సైంటిస్టులు గానీ, హేతువాదులు గానీ ఎవరూ ఒప్పుకోరు, సీరియస్ గా తీసుకోరు. కానీ జ్యోతిష్కులకే అది కొంత ఆశాజనకంగా కనిపిస్తుంది. గోక్ లా పరిశోధన ఒక చిన్న ముందడుగు మాత్రమే అనీ, అతని పరిశోధనల్లాంటివే ఇంకా ఖచ్చితంగా చేస్తే (గోక్ లా తన డేటా లో జన్మ సమయాలకి గంటని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నాడు, నిమిషాల్ని లెక్కలోకి తీసుకోలేదు), లేదా వేరే విధంగా చేస్తే ఫలితాలు ఇంకా బాగా వస్తాయి అని చాలామంది జ్యోతిష్కులు భావిస్తారు. అయితే ఇంతవరకు ఎవరూ అంత పెద్దయెత్తున పరిశోధనలు చెయ్యలేదు.